Economy – Groups Special | అండమాన్లో అల్పం… దాద్రానగర్లో అధికం
జనన రేటు (Birth Rate)
- ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి జన్మించే పిల్లల నిష్పత్తిని జననరేటు అంటారు.
- భారత దేశంలో జనన రేటు తగ్గుతూ వస్తుంది. ఉదా 1901లో జననరేటు 45.8 ఉంటే 2011లో 21.8 ఉంది. 2018 నాటికి 20 కి తగ్గింది.
- ఈ జననరేటు గ్రామీణ పట్టణాల మధ్య వ్యత్యాసం తగ్గుతుంది. అయితే పట్టణాల్లో కంటే గ్రామాల్లో జననరేటు ఎక్కువగానే ఉంటుంది.
- 2018 నాటికి అధిక జననరేటు గల రాష్ట్రం బిహార్ (26.2), అల్ప జనన రేటు గల రాష్ట్రం గోవా (12.4)
- 2018 నాటికి జననరేటు అధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్
హవేలి (22.9) - జననరేటు అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు (11.2)
- ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి మరణించే వారి నిష్పత్తి మరణాలరేటు అంటారు.
- భారతదేశంలో మరణాలరేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది.
ఉదా: 1901లో మరణాల రేటు 44.4 ఉండే 2011 నాటికి 7.1 ఉంది. 2018 నాటికి 6.2 కి తగ్గింది. - ఈ మరణాలరేటు గ్రామాల, పట్టణాల మధ్య వ్యత్యాసం తగ్గుతుంది. అయితే పట్టణాల్లో కంటే గ్రామాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది.
- 2018 నాటికి అధిక మరణ రేటు గల రాష్ట్రం ఛత్తీస్గఢ్ (8.0)
- అల్ప మరణరేటు గల రాష్ట్రం ఢిల్లీ (3.3)
- 2018 నాటికి అధిక మరణ రేటు గల కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి (6.9)
- అల్ప మరణరేటు గల కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ (3.8)
సహజ వృద్ధి రేటు (Natural Growth Rate )
- జనన రేటు నుంచి మరణ రేటును తీసివేస్తే సహజ వృద్ధి రేటు వస్తుంది.
- భారతదేశంలో 2018 నాటికి సహజ వృద్ధి రేటు 13.8 ఉంది.
- 2018 నాటికి అధిక సహజ వృద్ధి రేటు గల రాష్ట్రం బిహార్ (20.3)
- అల్ప సహజ వృద్ధి రేటు గల రాష్ట్రం గోవా (6.4)
- 2018 నాటికి అధిక సహజ వృద్ధి రేటుగల కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ (19.1)
- అల్ప సహజవృద్ధి రేటు గల కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు (5.9)
శిశు మరణాల రేటు (IMR- Infant Mortality Rate)
- ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది శిశువుల్లో చనిపోయిన వారి నిష్పత్తిని శిశు మరణాల రేటు అంటారు.
NMR (Neonatal Mortality Rate): - పుట్టిన 28 రోజుల్లో చనిపోయే వారి సంఖ్యను తెలియజేస్తుంది.
- ఐఎంఆర్ పుట్టిన ఒక సంవత్సరంలోపు చనిపోయే వారి సంఖ్యను తెలియజేస్తుంది.
యూ5 ఎంఆర్ (Under 5 Mortality Rate):
పుట్టిన 5 సం.లలోపు చనిపోయే వారి సంఖ్యను తెలియజేస్తుంది. - భారతదేశంలో పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఐఎంఆర్ ఎక్కువగా ఉంది.
- అధిక శిశుమరణాల రేటు గల రాష్ట్రం మధ్య ప్రదేశ్ (48)
- అల్ప శిశు మరణాల గల రాష్ట్రం నాగాలాండ్ (4)
- అధిక శిశు మరణాల రేటు గల కేంద్ర పాలిత ప్రాంతం -డామన్ డయ్యూ (16)
- శిశు మరణాల రేటు అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు (9)
ప్రసూతి మరణాల రేటు (MMR – Meternal Mortality Rate)
- ఒక సంవత్సర కాలంలో ప్రసూతి సమయంలో ప్రతీ 100000 మంది స్త్రీలలో చనిపోయే వారి నిష్పత్తిని ప్రసూతి మరణాల రేటు అంటారు.
- ఒక సంవత్సర కాలంలో గర్భిణుల్లో బిడ్డను ప్రసవించిన అనంతరం 42 రోజుల్లోపు (6 వారాలు) ఎంతమంది తల్లులు మరణిస్తున్నారో తెలిపై సంఖ్యను ప్రసూతి మరణాల రేటు అంటారు.
- 2011లో భారతదేశంలో సగటు ఎంఎంఆర్ 167
- 2018 నాటికి భారతదేశంలో సగటు ఎంఎంఆర్ 113 కి తగ్గింది.
- 2018 నాటికి ఎంఎంఆర్ అధికంగా ఉన్న రాష్ట్రం అసోం (215)
- ఎంఎంఆర్ అల్పంగా గల రాష్ట్రం కేరళ (43)
సంతాన సాఫల్యతా రేటు (Total Fertility rate): - ఒక స్త్రీ జీవిత కాలంలో సంతానోత్పత్తి వయస్సులో సగటున ఎంత మంది పిల్లలకు జన్మను ఇవ్వగలదో తెలిపే దాన్ని సంతాన సాఫల్యతా రేటు అంటారు.
- పునరుత్పాదక వయసు గల స్త్రీకి సగటున జన్మించే పిల్లల సంఖ్యను చెప్పేది టీఎఫ్ఆర్.
- ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో జన్మించే మొత్తం పిల్లల సంఖ్యను టీఎఫ్ఆర్ అంటారు.
- భారతదేశంలో 1950 దశకంలో టీఎఫ్ఆర్ 6.0 ఉంటే 2017 నాటికి 2.2 కి తగ్గింది.
- టీఎఫ్ఆర్ అధికంగా గల రాష్ట్రం బిహార్ (3)
- టీఎఫ్ఆర్ అల్పంగా గల రాష్ట్రం సిక్కిం (1.1)
ఎస్సీ జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఎస్సీ జనాభా 20.14 కోట్లు (16.6 శాతం)
- పురుష జనాభా 10.35 కోట్లు (16.6 శాతం)
- మహిళా జనాభా 9.78 కోట్లు (16.7 శాతం)
- 2001లో మొత్తం ఎస్సీ జనాభా 16.66 కోట్లు ఉంటే 2011 నాటికి 20.14 కోట్లకు పెరిగింది. అంటే 3.48 కోట్లు పెరిగింది. అదే విధంగా జనాభా వృద్ధిరేటు 20.8 శాతం ఉంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా గల రాష్ర్టాలు
1) ఉత్తరప్రదేశ్ 4.14 కోట్లు,
2) పశ్చిమబెంగాల్ 2.14 కోట్లు - 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అల్పంగా గల రాష్ర్టాలు మిజోరం (1218), మేఘాలయ (17,355)
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం – చండీగఢ్ (1.99 లక్షలు)
- ఎస్సీ జనాభా అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతం – డామన్ డయ్యూ (6124)
- 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం పంజాబ్ (31.94 శాతం)
- ఎస్సీ జనాభా శాతం అల్పంగా గల రాష్ట్రం మిజోరం (0.1 శాతం)
- 2001లో ఎస్సీ జనాభా శాతం 16.2 శాతం ఉంటే 2011 నాటికి 16.6 శాతానికి పెరిగింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ (18.9శాతం)
- ఎస్సీ జనాభా శాతం అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలి (1.8 శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
- ఎస్సీ జనాభా లేని కేంద్ర పాలిత ప్రాంతాలు లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు
ఎస్టీ జనాభా
లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు
- 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఎస్టీ జనాభా 10.43 కోట్లు (8.6 శాతం)
- పురుష జనాభా 5.24 కోట్లు
- స్త్రీ జనాభా 5.19 కోట్లు
- 2001లో మొత్తం ఎస్టీ జనాభా 8.43 కోట్లు ఉంటే 2011 నాటికి 10.43 కోట్లు అంటే 2 కోట్లు పెరిగింది. జనాభా వృద్ధి రేటు 23.7 శాతం
- 2011 జనాభా లెక్కల ప్రకారం
ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ర్టాలు
1) మధ్యప్రదేశ్ (1.53 కోట్లు)
2) మహారాష్ట్ర(1.05 కోట్లు) - 2011 జనాభా లెక్కల ప్రకారం
ఎస్టీ జనాభా అల్పంగా గల రాష్ర్టాలు
1) గోవా (1.49 లక్షలు)
2) సిక్కిం (2.06 లక్షలు) - 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం –
దాద్రాగనర్ హవేలీ (1.78 లక్షలు) - ఎస్టీ జనాభా అల్పంగా కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యూ (15,363)
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం మిజోరం (94.4 శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అల్పంగా గల రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ (0.6 శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం
ఎస్టీ జనాభా అధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం –
లక్షదీవులు (94.8 శాతం) - ఎస్టీ జనాభా శాతం అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతం – డామన్ డయ్యూ
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా లేని రాష్ర్టాలు పంజాబ్, హర్యానా - ఎస్టీ జనాభా లేని కేంద్ర పాలిత ప్రాంతాలు – చండిగఢ్, ఢిల్లీ, పాండిచ్చేరి
ప్రాక్టీస్ బిట్స్
1. 2011 జనాభా లెక్కల ప్రకారం జనన రేటు ఎంత?
ఎ) 45.8 బి) 21.8
సి) 20.0 డి) 25.3
2. 2011 జనాభా లెక్కల ప్రకారం మరణ రేటు పట్టణాల కంటే గ్రామాల్లో?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) దాదాపు సమానం డి) ఏదీకాదు
3. సహజ వృద్ధి రేటు అంటే?
ఎ) జననరేటు – మరణ రేటు
బి) మరణరేటు – జననరేటు
సి) జననరేటు + మరణరేటు
డి) జననరేటు = మరణరేటు
4. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక
శిశు మరణాల రేటు గల రాష్ట్రం ఏది?
ఎ) నాగాలాండ్ బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్ డి) హర్యానా
5. ప్రసూతి మరణాల రేటును ఎంత మంది స్త్రీలను ప్రామాణికంగా తీసుకుంటారు?
ఎ) 100 బి) 1000
సి) 10,000 డి) 100000
6. సంతాన సాఫల్యతా రేటు అంటే?
ఎ) ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో జన్మించే మొత్తం పిల్లల సంఖ్య
బి) ఒక స్త్రీ తన పునరుత్పాదక వయసులో సగటున జన్మించే శిశువుల సంఖ్య
సి) ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఎంత మంది పిల్లలకు జన్మినిచ్చే పిల్లల సంఖ్య
డి) పైవన్నీ సరైనవే
7. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా లేని రాష్ర్టాలు ఏవి?
ఎ) నాగాలాండ్, మేఘాలయ
బి) పంజాబ్, హర్యానా
సి) నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
డి) పంజాబ్, మిజోరం
8. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా లేని రాష్ర్టాలు ఏవి?
ఎ) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర
బి) పంజాబ్, హర్యానా
సి) మిజోరం, ఉత్తరప్రదేశ్
డి) గోవా, సిక్కిం
9. అధిక, అల్ప జననరేటు గల రాష్ర్టాలు ఏవి?
ఎ) బిహార్, గోవా బి) ఢిల్లీ, హర్యానా
సి) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
డి) పంజాబ్, హర్యానా
10. 2011 జనాభా లెక్కల ప్రకారం మరణాల రేటు అధికంగా, అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి?
ఎ) పాండిచ్చేరి, డామన్ డయ్యూ
బి) లక్షదీవుల, డామన్ డయ్యూ
సి) పాండిచ్చేరి దాద్రానగర్ హవేలీ
డి) దాద్రానగర్ హవేలీ, అండమాన్ దీవులు
11. సహజ వృద్ధి రేటు అధికంగా, అల్పంగా గల రాష్ర్టాలు ఏవి?
ఎ) ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్
బి) బిహార్, గోవా
సి) గోవా, సిక్కిం
డి) మధ్యప్రదేశ్, హర్యానా
12. శిశుమరణాల రేటు అధికంగా, అల్పంగా గల రాష్ర్టాలు ఏవి?
ఎ) మధ్యప్రదేశ్, నాగాలాండ్
బి) ఉత్తరప్రదేశ్, నాగలాండ్
సి) ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
13. ప్రసూతి మరణాల రేటు అధికంగా, అల్పంగా గల రాష్ర్టాలు ఏవి?
ఎ) ఆంధ్రప్రదేశ్, అసోం
బి) అసోం, కేరళ
సి) కేరళ, ఆంధ్రప్రదేశ్
డి) కేరళ, మధ్యప్రదేశ్
14. సంతాన సాఫల్యతా రేటు అధికంగా,
అల్పం గా గల రాష్ర్టాలు ఏవి?
ఎ) బీహార్, సిక్కిం బి) అసోం, బిహార్
సి) సిక్కిం, అసోం డి) సిక్కిం, బిహార్
15. ఎస్సీ జనాభా అధికంగా, అల్పంగా
గల రాష్ర్టాలు ఏవి?
ఎ) మిజోరం, మేఘాలయ
బి) ఉత్తరప్రదేశ్, మిజోరం
సి) మేఘాలయ, మిజోరం
డి) అసోం, మేఘలయా
సమాధానాలు
1-బి 2-ఎ 3-ఎ 4-బి
5-డి 6-డి 7-సి 8-బి
9-ఎ 10-సి 11-బి 12-ఎ
13-బి 14-ఎ 15-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు