Economy – Groups Special | సర్వ మత సమ్మేళనం.. సామరస్యానికి నిలయం
- భారతదేశంలోని మతం విభిన్న మత విశ్వాసాలు, అభ్యాసాల ద్వారా వర్గీకరించబడుతుంది. భారతదేశ చరిత్రలో మతం దేశ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం.
- రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ భారతదేశ జనాభా గణన 2011 మత పరమైన కమ్యూనిటీల వారీగా జనాభాపై డేటాను విడుదల చేసింది.
- హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, సిక్కు, బౌద్ధ జైన అనే ఆరు ప్రధానమైన మత వర్గాల ద్వారా మొత్తం జనాభా పంపిణీ చేయబడింది. వీటిని సమష్టిగా స్థానిక భారతీయ మతాలు, లేదా ధార్మికంగా పిలుస్తారు.
- 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ మొత్తం జనాభా 121.09 కోట్లు.
భారతదేశంలో హిందూ జనాభా
- హిందూ మతానికి భారతదేశం నిలయం
- భారతదేశంలో హిందువులు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక మెజారిటీని కలిగి ఉన్నారు.
- భారతదేశంలోని మొత్తం జనాభా 121.09 కోట్లలో 96.63 కోట్లు (79.8%) హిందువులు ఉన్నారు.
- దేశ విభజనకు ముందు అంటే 1941లో మొత్తం జనాభాలో హిందువులు 66 శాతం, 1951 నాటికి 84 శాతానికి పెరిగి 2001 నాటికి 80.45 శాతం, 2011లో 79.8 శాతానికి తగ్గింది.
- గత దశాబ్దంలో 2001-2011 హిందువుల జనాభా వృద్ధి రేటు 19.92 శాతం నుంచి 16.8 శాతానికి తగ్గింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అల్పంగా ఉన్న రాష్ట్రం మిజోరం
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందూ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (95.1%), అల్ప శాతంగా ఉన్న రాష్ట్రం-మిజోరం (2.75%)
- పట్టణ హిందూ జనాభా శాతం కంటే (74.82%), గ్రామీణ హిందూ జనాభా శాతం(82%) అధికంగా ఉంది.
ముస్లిం జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా 17.22 కోట్లు అంటే 14.2 శాతం ఉన్నారు.
- ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో దాదాపు 11 శాతం మంది భారత్లో ఉన్నారు.
- ప్రపంచంలో అధిక ముస్లిం జనాభా గల ఇండోనేషియా, పాకిస్థాన్ తర్వాత భారతదేశం మూడో అత్యధిక జనాభా కలిగి ఉంది.
- భారతదేశ రాష్ర్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షదీవులు (96.58 శాతం) జమ్మూకశ్మీర్ (63.31 శాతం)లలో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.
- గత దశాబ్దంలో (2001-2011) ముస్లిం జనాభా వృద్ధిరేటు 29.52శాతం నుంచి 24.60 కి తగ్గింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ముస్లిం జనాభా అధికంగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (3.84 కోట్లు)
- ముస్లిం జనాభా అల్పంగా గల రాష్ట్రం సిక్కిం (9,867)
- భారతదేశంలో అధిక ముస్లిం జనాభా శాతం గల రాష్ట్రం జమ్మూకశ్మీర్ (68.3శాతం) అల్ప ముస్లిం జనాభా శాతం గల రాష్ట్రం మిజోరం (1.35 శాతం)
క్రైస్తవ జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో క్రైస్తవ జనాభా 2.78 కోట్లు అంటే 2.3 శాతం ఉన్నారు.
- గత దశాబ్ద కాలం లో (2001 -11) క్రైస్తవ జనాభా వృద్ధిరేటు 22.52 శాతం నుంచి 15.5 శాతానికి పడిపోయింది.
- భారతదేశంలోని ఈశాన్య రాష్ర్టాల్లో నాగాలాండ్, జోరం, మేఘాలయ, మణిపూర్ల్లో క్రైస్తవ మతం ఆదిపత్య మతంగా ఉంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రైస్తవ జనాభా అధికంగా గల రాష్ట్రం కేరళ (3,34, 06061) 3.34కోట్లు.
- క్రైస్తవ జనాభా అల్పంగా గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (12,646)
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రైస్తవ జనాభా అధిక శాతం గల రాష్ట్రం నాగాలాండ్ (87.9శాతం).
- క్రైస్తవ జనాభా శాతం అల్పంగా గల రాష్ట్రం బీహార్ (0.12 శాతం)
- లింగ నిష్పత్తి (సెక్స్ రేషియో) అధికంగా ఉన్న మతం క్రైస్తవ మతం
సిక్కులు
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో సిక్కుల జనాభా 2.08 కోట్లు అంటే 1.7 శాతం ఉన్నారు.
- గత దశాబ్దకాలంలో (2001-11) సిక్కుల జనాభా వృద్ధిరేటు 16.98 శాతం నుంచి 8.4 శాతానికి పడిపోయింది.
- సిక్కు జనాభా, శాతం పరంగా అధికంగా గల రాష్ట్రం పంజాబ్.
- సిక్కులు మెజారిటీ ప్రజలు పంజాబ్లో ఉన్నారు.
- సిక్కుల జనాభా రుణాత్మకంగా 7 రాష్ర్టాలు ఉన్నాయి. అవి పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్, అసోం, త్రిపుర, మిజోరం, జార్ఖండ్.
బౌద్ధులు
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో బౌద్ధుల జనాభా 84 లక్షలు మాత్రమే అంటే 0.7 శాతం ఉన్నారు.
- గత దశాబ్ద కాలంలో (2001-11) బౌద్ధుల జనాభా వృద్ధి రేటు 22.83 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బౌద్ధులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర
- బౌద్ధుల జనాభా అల్పంగా ఉన్న రాష్ట్రం గోవా
- భారతదేశ మొత్తం బౌద్ధ జనాభాలో 75 శాతం, మొత్తం మహారాష్ట్ర జనాభాలో 6 శాతం మహారాష్ట్రలో ఉన్నారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బౌద్ధుల శాతం అధికంగా గల రాష్ట్రం సిక్కిం (27.39 శాతం)
- బౌద్ధుల్లో 6 రాష్ర్టాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రుణాత్మక వృద్ధి నమోదైనది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో జైనుల జనాభా 45 లక్షలు అంటే 0.4 శాతం మాత్రమే ఉన్నారు.
జైనులు
- గత దశాబ్ద కాలంలో (2001-11) జైనుల జనాభా వృద్ధి రేటు 26.0 నుంచి 5.4 శాతానికి తగ్గింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అధిక జైనుల సంఖ్య, శాతంలో మహారాష్ట్రదే ప్రథమ స్థానం
- బౌద్దులు జైనులు దేశంలోని ఏ రాష్ట్రంలోను మెజారిటీ కాదు.
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రపంచంలో విభిన్న మత విశ్వాసాల కలయిక గల ఏకైక దేశం ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) భారతదేశం డి) ఇంగ్లండ్
2. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో హిందూ జనాభా ఎంత?
1) 96.63 కోట్లు 2) 88.63 కోట్లు
3) 93.63 కోట్లు 4) 89.63 కోట్లు
3. 2011 జనాభా లెక్కల ప్రకారం దశాబ్దపు (2001-11) జనాభా వృద్ధి రేటు ఎంత?
ఎ) 15 శాతం బి) 17.7 శాతం
సి) 18.3 శాతం డి) 19.4 శాతం
4. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో ముస్లిం జనాభా శాతం ఎంత?
ఎ) 10.2 శాతం బి) 12.1 శాతం
సి) 14.2 శాతం డి) 16.8 శాతం
5. 1951 నాటికి భారతదేశ మొత్తం జనాభాలో హిందూ జనాభా శాతం ఎంత ఉండేది?
ఎ) 80 శాతం బి) 82 శాతం
సి) 84 శాతం డి) 86 శాతం
6. ప్రపంచంలోని ముస్లిం జనాభాలో భారతదేశలోని ముస్లిం జనాభా శాతం ఎంత?
ఎ) 10 శాతం బి) 11 శాతం
సి) 12 శాతం డి) 14 శాతం
7. లింగ నిష్పత్తిలో అధికం గల మతం ఏది?
ఎ) హిందూ మతం బి) ముస్లిం మతం
సి) క్రిస్టియన్ మతం డి) సిక్కుమతం
8. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ముస్లింలు అధికంగా గల రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ట్ర బి) ఉత్తర ప్రదేశ్
సి) మధ్య ప్రదేశ్ డి) అరుణాచల్ ప్రదేశ్
9. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో క్రైస్తవ జనాభా ఎంత?
ఎ) 2.12 కోట్లు బి) 2.51 కోట్లు
సి) 2.78 కోట్లు డి) 2.3 కోట్లు
10. 2011 జనాభా లెక్కల ప్రకారం సిక్కు జనాభా శాతం పరంగా అధికంగా గల రాష్ట్రం ఏది?
ఎ) పంజాబ్ బి) హర్యానా
సి) సిక్కిం డి) మేఘాలయ
11. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం భౌద్ధుల జనాభా ఎంత?
ఎ) 1.2 కోట్లు బి) 95 లక్షలు
సి) 84 లక్షలు డి) 75 లక్షలు
12. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం జైనుల జనాభా ఎంత?
ఎ) 32 లక్షలు బి) 35 లక్షలు
సి) 40 లక్షలు డి) 45 లక్షలు
13. భారతదేశంలోని మొత్తం బౌద్ధ జనాభాలో 75 శాతం మహారాష్ట్రలో ఉంటే మహారాష్ట్రలోని మొత్తం జనాభాలో బౌద్ధులు ఎంత శాతం ఉన్నారు?
ఎ) 5 శాతం బి) 6 శాతం
సి) 7 శాతం డి) 8 శాతం
14. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జైన జనాభా, శాతం పరంగా అధికంగా గల రాష్ట్రం?
ఎ) మహారాష్ట్ర బి) కర్ణాటక
సి) సిక్కిం డి) మధ్యప్రదేశ్
15. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జైనుల జనాభా బౌద్ధుల జనాభా కంటే ?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) దాదాపు సమానం డి) ఏదీకాదు
16. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు అధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
ఎ) పాండిచ్చేరి బి) ఢిల్లీ
సి) లక్షదీవులు డి) డామన్ డయ్యూ
17. ప్రపంచంలో అధిక ముస్లింలు
గల దేశం ఏది?
ఎ) పాకిస్థాన్ బి) భారతదేశం
సి ఇండోనేషియా డి) ఇరాన్
18. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో హిందూ జనాభా ఎంత శాతం?
ఎ) 82 శాతం బి) 77.5 శాతం
సి) 85 శాతం డి) 79.8 శాతం
19. 2011 జనాభా లెక్కల ప్రకారం దశాబ్దపు (2001-11) జనాభా వృద్ధి రేటును జతపరచండి?
ఎ) హిందువులు 1) 16.8 శాతం
బి) ముస్లింలు 2) 24.6 శాతం
సి) క్రైస్తవులు 3) 15.5 శాతం
డి) సిక్కులు 4) 8.4 శాతం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-1, బి-3, సి-2, డి-4
20. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ మతానికి చెందని వారు అంటే మత రహితులు ఎంత జనాభా ఉన్నారు?
ఎ) 25 లక్షలు బి) 29 లక్షలు
సి) 32 లక్షలు డి) 35 లక్షలు
21. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక మెజారిటీ గల మతం ఏది?
ఎ) హిందూ మతం బి) ముస్లిం మతం
సి) క్రిస్టియన్ మతం డి) సిక్కు మతం
22. ప్రపంచంలోని మూడో అత్యధిక ముస్లిం జనాభా గల దేశం ఏది?
ఎ) పాకిస్థాన్ బి) ఇరాన్
సి) కువైట్ డి) భారతదేశం
23. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో వివిధ మతాల జనాభా శాతాన్ని జతపరచండి?
ఎ) హిందువులు 1) 79.8 %
బి) ముస్లింలు 2) 14.2 %
సి) క్రైస్తవులు 3) 2.3 %
డి) సిక్కులు 4) 1.7 %
ఇ) బౌద్ధులు 5) 0.7 %
ఎఫ్) జైనులు 6) 0.4 %
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
బి) ఎ-1, బి-2, సి-4, డి-3, ఇ-5, ఎఫ్-6
సి) ఎ-1, బి-2, సి-4, డి-3, ఇ-6, ఎఫ్-5
డి) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5, ఎఫ్-6
సమాధానాలు
1-సి 2-ఎ 3-బి 4-సి
5-సి 6-బి 7-సి 8-బి
9-సి 10-ఎ 11-సి 12-డి
13-బి 14-ఎ 15-బి 16-సి
17-సి 18-డి 19-ఎ 20-బి
21-ఎ 22-డి 23-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు