Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
వ్యాధులు
శరీర విధులన్నీ సక్రమంగా జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. సంతులిత ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిసరాలు శరీర ఆరోగ్యానికి అవసరం. సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని కల్లోలపరిచే పరిస్థితిని వ్యాధి అంటారు.
- వ్యాధిజనక జీవులు శరీరంలో ప్రవేశించింది మొదలు, ఆ వ్యక్తి అస్వస్థతకు గురయ్యే వ్యవధిలో అనేక దశలుంటాయి. ఈ దశలన్నింటినీ కలిపి వ్యాధి పద్ధతి అంటారు. వ్యాధి పద్ధతిలో నాలుగు దశలుంటాయి. అవి.
1. వ్యాధి సంక్రమణ దశ 2. పొదిగే కాలం
3. వ్యక్తమయ్యే దశ 4. అంత్యదశ.
సంక్రమణ దశ
- వ్యాధిజనక జీవి మన శరీరంలోకి ప్రవేశించడాన్ని వ్యాధి సంక్రమణ అంటారు. ఇది వ్యాధికి మొదటి మెట్టు.
- ప్రత్యక్షంగా తాకడం వల్ల, సంక్రమిక వస్తువులను తాకినప్పుడుగానీ, ఆహారం, నీరు, గాలి, ఈగలు, దోమలు, ఎలుకలు వంటి జంతువుల ద్వారా గానీ వ్యాధి కారకం శరీరంలోకి ప్రవేశించవచ్చు.
- వ్యాధిజనక జీవి శరీరంలోకి ప్రవేశించక ముందు ఉండే ఆవాసాన్ని సంక్రమిక కారక ఆశ్రయం అంటారు.
- ఆశ్రయాలు మూడు రకాలు అవి: ఎ. మానవ ఆశ్రయాలు బి. జంతు ఆశ్రయాలు సి. నిర్జీవ పదార్థపు ఆశ్రయాలు.
- వ్యాధిజనక జీవులు అధిక సంఖ్యలో ఉంటూ, ఏవిధమైన అస్వస్థత కలుగజేయకుండా ఉండే ఆశ్రయ జీవులను వాహక జీవులు అంటారు.
- వ్యాధిజనక జీవులు వాటి ఆశ్రయ జీవుల్లో వ్యాధిని కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు.
- ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలను ఎలుకలు, ఎల్లో జ్వరం కలిగించే వాటికి కోతులు, మలేరియా జ్వరానికి దోమలు, హెపటైటిస్ వంటి వైరస్ జ్వరానికి వాహకాలుగా మానవులు వ్యవహరిస్తారు.
- వ్యాధికారక ఆశ్రయం నుంచి అతిథేయి దగ్గరకు రవాణా చేసే పద్ధతిని వ్యాధి వ్యాప్తి అంటారు.
- ప్రత్యక్ష తాకిడి: చర్మం, కంటి అంటు వ్యాధులు ప్రత్యక్షంగా శరీర తాకిడి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ధనుర్వాతం కలుగజేసే బ్యాక్టీరియాలు నేల నుంచి గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
- గవద బిళ్లలు, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, పడిశం, కోరింత దగ్గు, క్షయ మొదలైన వ్యాధులు సూక్ష్మ బిందువుల ద్వారా సంక్రమణ చెందుతాయి.
- క్షయ, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, తట్టు, న్యుమోనియా వంటి వ్యాధులు గాలి వల్ల సంక్రమణ చెందుతాయి.
- బ్రిటన్‌లో వ్యాధి కారక సూక్ష్మజీవులతో కలుషితమైన మేత పశువులు తినడం వల్ల మ్యాడ్-కౌ అనే వ్యాధి ప్రబలి చాలా సంచలనం కలిగించింది.
పొదిగే కాలం
- ఇది వ్యాధి పద్ధతిలో రెండో దశ.
- వ్యాధి జనక క్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి అస్వస్థత కనబడే వరకు గల కాలాన్ని పొదిగేకాలం అంటారు.
- పొదిగే కాలంలో సూక్ష్మజీవులు అతి త్వరగా విభజన చెంది అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.
- వివిధ వ్యాధులకు పొదిగే కాల పరిమితులు వేరుగా ఉంటాయి.
- ఆటలమ్మ, తట్టు, గవదబిళ్లలు వంటి వ్యాధులకు ఈ పొదిగే కాలం 10 రోజుల నుంచి 3 వారాల పాటు ఉంటుంది.
- హెపటైటిస్, రేబిస్, కుష్ఠు వ్యాధులకు ఈ కాల పరిమితి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
- అతినిద్ర వ్యాధిలో పొదిగే కాలం 20-30 సంవత్సరాల వ్యవధి ఉంటుంది.
వ్యక్తమయ్యే దశ
- వ్యాధి క్రమంలో ఇది మూడో దశ.
- అతిథేయి కణజాలాలకు హాని, మార్గాలను అడ్డుకోవడం, మామూలు క్రియలకు అవరోధం వల్ల అతిథేయిలో రోగ లక్షణాలు కనబడతాయి.
- కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, లేక శరీరంలో మారిన జీవ క్రియలను తెలియజేసే లక్షణాల వల్ల వ్యాధిని పోల్చవచ్చు. ఇటువంటి సూచనలను రోగ లక్షణాలు అంటారు.
- రోగ లక్షణాలను పరిశీలించి వైద్యులు వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఇలా లక్షణాలు కనిపించడాన్ని వ్యక్తమయ్యే దశ అంటారు.
వ్యాధి అంత్యదశ
- వ్యాధి పద్ధతిలో ఇది చివరి దశ. ఈదశలో వ్యాధి పద్ధతి తాత్కాలికంగానో లేక శాశ్వతంగానో ఆగిపోతుంది.
- వ్యాధి అంతమవడానికి మూడు మార్గాలున్నాయి. అవి
1. రోగిలోని వ్యాధినిరోధక వ్యవస్థ ద్వారా
2. వైద్యుడు ఇచ్చే మందులు తీసుకోవడం వల్ల
3. వ్యాధి వల్ల రోగి మరణించడం (సహజంగా అంతమవడం) - వ్యాధి తగ్గిన వెంటనే రోగి స్వస్థత చెందడు. మామూలు ఆరోగ్యస్థితికి రావడానికి కొంతకాలం పడుతుంది. ఈ కాల వ్యవధిని పునరారోగ్య ప్రాప్తి వ్యవధి అంటారు.
మలేరియా
- మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుంది.
- ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రొటోజోవా జీవి వ్యాధికారకం.
- మలేరియా ముఖ్య లక్షణం- తీవ్రమైన చలి జ్వరం
- మలేరియా వచ్చిన వారిలో ఎర్రరక్త కణాలు నాశనం అవుతాయి.
- మలేరియాకు మందు కనుగొన్న శాస్త్రవేత్త- సర్ రోనాల్డ్ రాస్.
- రోనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20వ తేదీన సికింద్రాబాద్‌లో మలేరియాకు క్వినైన్ అనే మందును కనుగొన్నాడు.
సర్ రోనాల్డ్ రాస్ మలేరియా వ్యాధిపై 1881-1897 వరకు ప్రయోగాలు చేశాడు. మలేరియాకు మందు కనుగొన్నందుకు రాస్కు 1902లో నోబెల్ బహుమతి లభించింది. - క్వినైన్ అనే మందును సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క బెరడు నుంచి తీస్తారు.
- మలేరియా వ్యాధి నివారణకు ఆధునిక కాలంలో వాడుతున్న మందు- క్లోరోక్విన్
- దోమ లార్వాను తినే చేప- గంబూసియా
- మలేరియా వ్యాధి రాకుండా ఉండటానికి మురుగు నీటి గుంటల్లో ఉండే దోమ లార్వాలను చంపేయాలి. దీని కోసం కిరోసిన్‌ను చల్లితే నీటిపై తెట్టులాగా పేరుకుంటుంది. దీంతో దోమ లార్వాలకు ఆక్సిజన్ అందక చనిపోతాయి.
బోదకాలు (ఫైలేరియా)
- బోదకాలు వ్యాధిని ఫైలేరియా లేదా ఎలిఫెంటియాసిస్ అంటారు.
- బోదకాలు వ్యాధి ఆడ క్యులెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది.
- కొక్కెం ఆకారంలో ఉన్న ఉకరేరియా బాంక్రాప్టి అనే ప్రొటోజోవన్ వల్ల వస్తుంది.
- ఫైలేరియాసిస్ లక్షణం- కాళ్లలో ఉండే శోషరస గ్రంథులు వాపునకు గురవుతాయి
- ఈ వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడు ‘డై మిథైల్ కార్బోజెన్’ అనే మందును వాడతారు. క్రమం తప్పకుండా రెండేళ్లు వాడితే పూర్తిగా నయం అవుతుంది.
టైఫాయిడ్
- ఈ వ్యాధి సాల్మోనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది.
- ఇది కూడా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల వస్తుంది.
- దీనికి ఈగలు వాహకులుగా ఉంటాయి.
- టైఫాయిడ్ లక్షణం- విడువని జ్వరం, పొట్ట పచ్చి చేయడం (కడుపు నొప్పి)
- ఈ వ్యాధి చిన్న పేగును ప్రభావితం చేస్తుంది.
- టైఫాయిడ్ నిర్ధారణకు చేసే పరీక్ష- వైడల్ పరీక్ష
- టైఫాయిడ్ నివారణకు వాడే మందు- సల్ఫా డ్రగ్
క్షయ (టీబీ)
- క్షయ వ్యాధి మైకో బ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
- ఈ వ్యాధి లక్షణాలు- తేమతో కూడిన దగ్గుతో పాటు రక్తం పడటం, ఛాతీ నొప్పి, శరీర బరువు కోల్పోవడం
- టీబీ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
- ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది.
- క్షయ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు- ఎక్స్‌రే, మాంటెక్స్, డీఓటీ
- టీబీ నివారణకు వాడే మందు- స్ట్రెప్టోమైసిన్
- క్షయ చిన్న పిల్లలకు రాకుండా ఉండటానికి బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు.
- BGC- బాసిలిస్ కాలిమెంటిక్ గ్యూరిన్
- టీబీ వంశపారంపర్యంగా కూడా సంభవిస్తుంది.
- వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు- క్షయ, కుష్ఠు
ఎయిడ్స్
- ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిసియన్సీ సిండ్రోమ్.
- ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసే వైరస్- హెచ్ఐవీ
- హెచ్ఐవీ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్.
- హైచ్ఐవీ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త మాంటెగ్నర్. ఈయన 1983వ సంవత్సరంలో కనుగొన్నాడు.
- మొట్టమొదటిసారి ఎయిడ్స్ వ్యాధిని ఆఫ్రికా ఖండానికి చెందిన చింపాంజీలో గుర్తించారు.
- మొట్టమొదట ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్ని 1981వ సంత్సరంలో లాస్ఏంజెల్స్ నగరంలో గుర్తించారు.
- భారతదేశంలో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్ని 1986వ సంవత్సరంలో చెన్నైలో గుర్తించారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్ని 1987వ సంవత్సరంలో హైదరాబాద్‌లో గుర్తించారు.
- ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కలిగి ఉన్న దేశాలు- సౌతాఫ్రికా, నైజీరియా, భారత్
ఎయిడ్స్ వ్యాధి సోకడానికి ప్రధాన కారణాలు - అక్రమ లైంగిక సంబంధాలు
- అరక్షిత రక్త మార్పిడి
- ఒకరికి వాడిన సిరంజీలు మరొకరికి వాడటం
- తల్లి నుంచి బిడ్డకు పాలద్వారా
- ఎయిడ్స్ వ్యాధి ముఖ్య లక్షణాలు
- రాత్రి వేళల్లో చెమటలు రావడం
జ్వరం l శరీర బరువును కోల్పోవడం - తల వెంట్రుకలు రాలిపోవడం
వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షలు - ELISA l Westran-blat
- PCR l Troidot
ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రవేశపెట్టిన పథకాలు
NACO (National Aids Control Organisation-1992)
AASHA(AIDS Awarnes Sustainable Holistic Action-2005)
Red-Ribbon-2007 - హెచ్ఐవీ వైరస్‌ను గుర్తించడానికి రెండు వారాల సమయం పడుతుంది.
- హెచ్ఐవీ వైరస్ శరీరం మొత్తం వ్యాపించడానికి ఆరు నెలల నుంచి ఐదేళ్లు పడుతుంది.
- హెచ్ఐవీలో ఉండే జన్యుపదార్థం- ఆర్ఎన్ఏ
- హెచ్ఐవీలో ఉండే ఎంజైమ్- రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్
- రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ ఎంజైమ్ హెచ్ఐవీ వైరస్ తన రూపాలను మార్చుకోవడానికి సహాయపడుతుంది.
- హెచ్ఐవీ వైరస్ తెల్లరక్త కణాల్లో ఉండే లింఫోసైట్స్పై దాడి చేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి, శరీర బరువును కోల్పోతుంది.
- భారత ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం
ART ద్వారా చికిత్స అందిస్తుంది. - ART- Anti Retro Theoropy
- హెచ్ఐవీ వైరస్ మానవుడి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత 15-30 సెకన్లు మాత్రమే బతకగలుగుతుంది. కానీ వాతావరణం చల్లగా ఉంటే 15-50 సెకన్లు బతుకుతుంది.
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
Biology,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు