TET – Methodology | ‘ఆన్లైన్’ వినియోగించడం వల్ల విద్యార్థుల్లో పెంపొందే విలువ?
1. కింది లక్షణం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల నుంచి వేరు చేస్తుంది?
1) విధుల పట్ల అంకిత భావం
2) వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానం, పటనైపుణ్యాలు
3) సహనం, ఓర్పు
4) విశ్వాసం కలిగి ఉండటం
2. ‘గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం’ అని పేర్కొన్నది?
1) ఎ.డబ్ల్యూ. గ్రీన్ 2) రాల్ఫ్ టేలర్
3) హెరిడోటస్ 4) అమర్త్యసేన్
3. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక ,భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నవారు?
1) జేమ్స్ హెమ్మింగ్స్ 2) జె.ఎమ్. ఫారెస్టర్
3) ఇ.బి. వెస్లీ 4) జె.వి. మైఖేల్స్
4. సాంఘిక శాస్త్రమంటే మానవుని గురించి, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో అతని చుట్టూ గల సాంఘిక, భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్యల గురించి అధ్యయనం చేసేది’ అని పేర్కొన్నవారు?
1) జె.ఎఫ్. ఫారెస్టర్ 2) సి.డబ్ల్యూ హారీస్
3) జె.యు.మైకేల్స్ 4) ఇ.బి.వెస్లీ
5. ‘సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మస్థాయిలో బోధించాలి’ అని సూచించినది?
1) యశ్పాల్ కమిటీ
2) మొదలియార్ కమిషన్
3) కొఠారి కమిషన్
4) ఎన్.సి.ఎఫ్-2005
6. సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ సామాజిక శాస్ర్తాల్లోని ఒక ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమంగా రూపొందించాలి’ అని సూచించినది?
1) పది సంవత్సరాల పాఠశాల విద్యా
ప్రణాళిక -1975
2) సెకండరీ విద్యా కమిషన్-1952
3) కొఠారి కమిషన్ -1964-66
4) జాతీయ విద్యావిధానం -1986
7. సాంఘిక శాస్ర్తాలు, సాంఘిక అధ్యయనం అనే పదాలు సెకండరీ పాఠశాలల్లో బోధించే సాంఘిక విషయాల్లో ఒక దానికి బదులు మరొకటిగా వాడతాయి అని పేర్కొన్నవారు?
1) ఇ.బి. వెస్లీ
2) జె.యు. మైఖేలిస్
3) జె.ఎఫ్ ఫారెస్టర్
4) ఆర్థర్ సి. బైనింగ్& డేవిడ్ హెచ్. బైనింగ్
8. మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో మానవ సమాజ వ్యవస్థీకరణ, అభివృద్ధిని గురించి అధ్యయనం చేసేది?
1) మానవీయ శాస్ర్తాలు
2) భౌతిక శాస్త్రాలు
3) సాంఘిక శాస్ర్తాలు 4) జీవశాస్ర్తాలు
9. ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10 సం.ల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా
గుర్తించబడినది?
1) యశ్పాల్ కమిటీ
2) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
3) రామమూర్తి కమిటీ
4) చతుర్వేది కమిటీ
10. మొదటిసారిగా దేశం మొత్తానికి పది (10) సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది?
1) జాతీయ విద్యా విధానం – 1986
2) జాతీయ విధ్యావిదానం – 1968
3) జాతీయ ప్రణాళికా చట్రం – 2000
4) పది సం.ల పాఠశాల విద్యా
ప్రణాళిక 1975
11. మొక్కలు, జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం ఈ అంశాన్ని జీవ శాస్త్రంలో ఏ సబ్జెక్టుకు సహసంబంధం ఏర్పరిచి బోధించవచ్చు?
1) భూగర్భ శాస్త్రం 2) చరిత్ర
3) భూగోళ శాస్త్రం 4) భౌతిక శాస్ర్తాలు
12. ‘ప్రకృతిని, పరిసరాలను గురించి తెలుసుకోవడం అభ్యాసాన్ని పటిష్టపరచడం సాంఘికశాస్త్రం ముఖ్య ఉద్దేశం’ అని తెలిపినది ఎవరు?
1) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
2) కొఠారీ కమిషన్
3) సెకండరీ ఎడ్యురేషన్
4) ఎన్సీఎఫ్ -2005
13. విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్ర్తాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు?
1) జాతీయ విద్యా ప్రణాళికా చట్రం -2005
2) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
3) కొఠారీ కమిషన్ 1964-66
4) 1986 జాతీయ విద్యా విధానం
సమాధానాలు
1-2 2-1 3-1 4-3
5-1 6-1 7-4 8-3
9-2 10-1 11-3 12-1
13-1
1. యుద్ధ సమయంలో సైన్యానికి పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? అనేది ఏ విద్యా ప్రమాణం?
1) విషయ అవగాహన
2) కారణాలు తెలపడం
3) పఠన నైపుణ్యాలు
4) సమాచార నైపుణ్యాలు
2. చట్టాలను గౌరవించటం, పన్నులను సకాలంలో చెల్లించటం, ఓర్పు మొదలైన భావనలను ఏడో తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా కింది విలువలను పెంపొందించవచ్చు?
1) సౌందర్యాత్మక విలువలు
2) ఉపయోగితా విలువలు
3) వృత్తి విలువలు
4) నైతిక విలువలు
3. విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకోవ డావడానికి వడ్రంగి చేనేత, కుమ్మరి వారిని పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థుల్లో ఏ విలువలను పెంపొందించవచ్చు?
1) సాంస్కృతిక విలువలు
2) వృత్తి విలువలు
3) సౌందర్యాత్మక విలువలు
4) సాహిత్య విలువలు
4. కింది వాక్యాల్లో సాంఘిక శాస్త్ర బోధనా ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది?
1) లక్ష్యాలకు తాత్కాలిక విలువలుంటాయి. ఆశయాలు సుదూరం వర్తించనిది
2) లక్ష్యాలు ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి. లక్ష్యాలు ఆశయాల సాధనకు సోపానాలు
3) ఆశయాలు దగ్గరి గమ్యాలు లక్ష్యాలు సార్వత్రికాలు
4) ఆశయాలు నిర్దిష్ట విషయానికి పరిమితం కాదు, లక్ష్యాలు విషయాలను బట్టి
మారతాయి
5. సాంఘిక శాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ ఆన్లైన్ సేవల వంటి వనరులను ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఏ విలువను పెంపొందించవచ్చు?
1) సాంస్కృతిక విలువలు
2) సౌందర్యాత్మక విలువలు
3) సృజనాత్మక విలువ
4) ప్రయోగాత్మక విలువ
6. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు ‘మన పండుగలు’ అనే అంశంపై నాటక పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ
1) ప్రజాస్వామిక విలువ
2) సాంస్కృతిక విలువ
3) క్రమశిక్షణ విలువ 4) వృత్తిపర విలువ
7. ఒక విద్యార్థి, ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్‌నోట్ తయారు చేయగలిగాడు. ఇది ఏ లక్ష్య సాధనను సూచిస్తుంది?
1) జ్ఞానం 2) వైఖరి
3) అవగాహన 4) వినియోగం
8. బోధనాభ్యసనలో భాగంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడు కలిగి ఉన్న నైపుణ్యం?
1) బోధనా నైపుణ్యం
2) భావవ్యక్తీకరణ నైపుణ్యం
3) కార్యనిర్వహణ నైపుణ్యం
4) బోధనాభ్యసన సామగ్రి
తయారీ నైపుణ్యం
9. ద్వీపకల్పం, ద్వీపం మధ్యగల భేదమేమిటి? అనే ప్రశ్న ఏ లక్ష్యసాధనకు ఉద్దేశించినది?
1) జ్ఞానం 2) వినియోగం
3) అవగాహన 4) వైఖరి
10. ‘పని-ఆటలు’ అనే పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొనడం ఇతర విద్యార్థులతో కలిసిపోవడం చేస్తున్నారు. ఇది అతనిలో ఏ విలువను పెంపొందించడానికి దారి తీసింది?
1) సాంఘిక విలువ
2) విద్యా విషయక విలువ
3) నైతిక విలువ
4) ఉపయోగిత విలువ
11. ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని కచ్చితంగా, చక్కగా గీసి అందులో చిహ్నాలు, పదాలు మొదలైన వాటిని కచ్చితంగా, స్పష్టంగా పేర్కొన్నాడుఇది అతనిలో మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యం అభివృద్ధి చెందినదని సూచిస్తుంది?
1) అనుకరణ 2) ప్రతిస్పందన
3) సమన్వయం 4) సహజీకరణ
12. విద్యార్థి రెడ్‌క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది ఒక?
1) అభిరుచి 2) వైఖరి
3) అభినందన 4) పైవేవీకావు
13. 6వ తరగతి విద్యార్థుల్లోని ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వారిలో ఏ విలువ అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం?
1) రాజకీయ విలువ
2) కళాత్మక, వినోదాత్మక విలువ
3) సాంఘిక విలువ
4) వృత్తిపర విలువ
14. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ‘మాక్ పార్లమెంట్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పెంపొందించిన విలువ?
1) సాంఘిక విలువ 2) రాజకీయ విలువ
3) వృత్తి విలువ
4) సమాచార విలువ
15. ఆన్లైన్ సేవలను వినియోగించడం అనేది విద్యార్థుల్లో ఆ విలువను పెంపొందించడానికి సంబంధించినది?
1) సృజనాత్మక విలువ
2) అంతర్జాతీయ విలువ
3) వృత్తిపద విలువ 4) నైతిక విలువ
16. నిర్ధ్దారణ చేయడం ‘ప్రాగుక్తీకరించుట’ అనే మానసిక సామర్థ్యాలు ఆర్.సి.ఇ.ఎమ్ ఉపగమంలోని ఏ లక్ష్యానికి సంబంధించినది?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) సృజనాత్మకత
17. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవినీతి నిర్మూలన దినోత్సవం నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఏ విలువ పెంపొందుతుంది?
1) సాంఘిక విలువ 2) నైతిక విలువ
3) వృత్తి విలువ 4) సమాచార విలువ
18. ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు?
1) సాధించేవి, కొలిచేవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలించేవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి
2) నిశ్చితంగా ఉండేవి, సాధించేవి
3) పరిశీలించేవి, కొలిచేవి
4) సాధించేవి, కొలిచేవి, పరిశీలించేవి
19. వర్గీకరణ, ఉదాహరణలను పేర్కొవడం అనే స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి?
1) అవగాహన 2) వినియోగం
3) జ్ఞానం 4) నైపుణ్యం
20. ఆశయాలు, లక్ష్యాలు వరుసగా?
1) రెండు సుదూర గమ్యాలు
2) రెండు దగ్గర గమ్యాలు
3) సుదూర గమ్యాలు, దగ్గరి గమ్యాలు
4) దగ్గరి గమ్యాలు, సుదూర గమ్యాలు
21. ‘ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్యగల భేదాలను రాయండి?’ ఈ ప్రశ్న ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించినది?
1) నైపుణ్యం 2) జ్ఞానం
3) వినియోగం 4) అవగాహన
22. ఒక విద్యార్థి సంప్రదాయ వృత్తుల నుంచి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలగటం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది?
1) అవగాహన 2) జ్ఞానం
3) నైపుణ్యం 4) వైఖరి
23. కింది వాటిలో సాంఘిక శాస్త్ర అవశ్యకతకు సంబంధించని దాన్ని గుర్తించండి?
1) సాంఘిక శాస్త్రం ప్రకృతిలోని అనేక సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడింది
2) సాంఘిక శాస్త్రం ఒక సమైక్య అంశంగా, అవసరాన్ని బట్టి విలీన అంశంగా కూడా సరళత్వాన్ని కలిగి ఉందని తెలియజేస్తుంది
3) పై రెండూ ఎ కు బి సరైంది
4) సాంఘిక శాస్త్రం భౌతిక జైవిక సాంఘిక పరిసరాలను గుర్తించదు, వివరించదు
24. ఎవరి అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఒక శాస్త్రం ఉదా: గణితం/ రసాయన శాస్త్రంలో మంచి దిట్టగా రూపొందించగలడేమో గాని అతనికి తనతోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన దృక్పథం లేకపోతే అతను అ సమాజంలో మనుగడ కొనసాగించడం కష్టం.
1) ఐన్‌స్టీన్ 2) మఫట్
3) ఎం.ఫట్ 4) హంఫట్
25. నీవు ఒక సాంఘిక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో పరిపూర్ణతను ఏర్పరచడానికి నీవంతు కృషిగా ఏమి చేస్తావు?
1) భాషలు, భాషేతర అంశాలు బోధిస్తాను
2) సహపాఠ్య కార్యక్రమాలు తగుపాళ్లలో బోధించాలి
3) ‘ఎ’ సరైంది, ‘బి’ సరైంది కాదు
4) ఎ, బి సరైంది
26. అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించిన సంవత్సరం?
1) క్రీ.పూ.1916-17
2) క్రీ.శ.1917-18
3) క్రీ.శ.1916-17
4) క్రీ.పూ.1919-18
27. సాంఘిక శాస్త్రం ఆవశ్యకతను భారతదేశంలో ఏ విధ్యా విధానంలో గాంధీ ప్రవేశ పెట్టాడు ?
1) బేసిక్ విద్యా విధానం 1937
2) వార్థా పద్ధతి 1937
3) నయీ తాలిమ్ 1937
4) ప్రాతిపదిక విద్య 1936-37
28. సాంఘిక శాస్త్ర స్వభావానికి సంబంధించిన దాన్ని గుర్తించండి?
1) సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం
2) మానవాభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రమనే భావన కలుగుతుంది
3) ‘1’ సమాధానానికి ‘2’ సరైంది
4) ‘2’ సమాధానానికి ‘2’ సరైంది కాదు
29. సాంఘిక శాస్త్రం అంటే సమాజ అధ్యయనం. ఆ సంఘం రూపొందించిన విధం. సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయడం దీని ముఖ్య లక్షణం?
1) జె.ఎఫ్. ఫారెస్టర్ 2) ఇ.వి. వెస్లీ
3) జాన్మైకేల్స్ 4) జేమ్స్ హమ్మింగ్
సమాధానాలు
1-1 2-4 3-2 4-3
5-1 6-2 7-3 8-2
9-3 10-1 11-3 12-1
13-2 14-2 15-1 16-3
17-2 18-1 19-1 20-3
21-4 22-1 23-4 24-2
24-4 26-3 27-1 28-3
29-1
రవి కుమార్
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు