Telugu – TET Special | నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన సాధనాలు?
1. ‘ఖలం’ అనే పదానికి అర్థం?
1) మోక్షం 2) దర్శనం
3) పాపం 4) పుణ్యం
2. కింది వాటిలో జంట పదం కానిది?
1) అప్పుసప్పు 2) శ్రద్ధాభక్తులు
3) పరువుప్రతిష్ఠ 4) వింతమనిషి
3. కింది వాటిలో జాతీయం కాని పదం ఏది?
1) మనసుంటే మార్గం ఉంటుంది.
2) కడుపుమంట
3) గడ్డిపెట్టు
4) పప్పులో కాలు వేయడం
4. కింది వాటిలో సామెత కానిది?
1) పుండుమీద కారం చల్లినట్లు
2) కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు
3) అందె వేసిన చెయ్యి
4) ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం
5. ‘వక్త్రం’ అంటే?
1) మధువు 2) ముప్పు
3) మంకు 4) ముఖం
6. ‘ద్విత్వం’ అంటే?
1) ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా రావడం
2) ఒక హల్లును ఒకసారి రాయడం
3) ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడం
4) ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం
7. కింది వాటిలో ‘విశేషణ’ పదం ఏది?
1) చుక్కాని 2) చేలము
3) చుక్కలు 4) చిక్కని
8. కింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం?
1) పథకం 2) పతాకం
3) పతనం 4) పతకం
9. కింది వాటిలో అసమాపక క్రియ పదం?
1) ఎగురలేదు 2) ఎగురరాదు
3) ఎగిరి 4) ఎగిరింది
10. ‘ఎవరిని’ అనే పదం సమాధానంగా వచ్చే పదాన్ని ఏమంటారు?
1. క్రియ 2. ప్రత్యయం
3. కర్త 4. కర్మ
11. కింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది?
1) పి 2) కు 3) గా 4) చి
12. ఉభయాక్షరాలు అంటే?
1) ఁ, ం, ః 2) , ృ, ః
3) చ, జ ఱ 4) చ, జ ఱ
13. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఏమంటారు?
1) సమాసాలు 2) అర్థాలు
3) విభక్తులు 4) సంధులు
14. ‘సమాసం’ అంటే?
1) వ్యర్థ పదాలతో రెండు కలిపి రాయడం.
2) ఏవైనా రెండు పదాలు కలిపినా నూతన పదంగా ఏర్పడకపోవడం
3) అర్థం లేని రెండు పదాలు కలిపి నూతన పదంగా ఏర్పడటం
4) సమర్థాలైన రెండు పదాలు కలిపి నూతన పదంగా ఏర్పడటం
15. ప్రామాణిక భాషారూపం అంటే?
1) గ్రాంథిక భాషారూపం
2) ఉన్నత వర్గాల వారు వినియోగించే భాషారూపం
3) అధిక సంఖ్యాకులు వినియోగించే భాషారూపం
4) పండితులు వినియోగించే భాషారూపం
16. భాష పోషించే కీలక పాత్ర ఏమిటి?
1) జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది.
2) మానవ సంబంధాల్లో పెంపొందిస్తుంది.
3) మనుషుల మధ్య ఐక్యత భావనలను పెంపొందిస్తుంది.
4) పైవన్నీ
17. భాషా నైపుణ్యాల్లో మూడోది?
1) భాషణం 2) పఠనం
3) శ్రవణం 4) లేఖనం
18. వినడం, మాట్లాడటం సామర్థ్యాల అభివృద్దికి కృత్యాలను ఏ విధంగా నిర్వహించాలి.
1) జతలుగా
2) పూర్తి తరగతి కృత్యంగా
3) వ్యక్తిగత కృత్యాలుగా
4) జట్టు కృత్యాలుగా
19. భాషా బోధన ప్రధాన లక్ష్యం?
1) పరీక్షల్లో ఉత్తమ గ్రేడులు పొందేలా చూడటం
2) తప్పులు లేకుండా రాయగలగడం
3) నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం
4) స్పష్టోచ్ఛారణను పెంపొందించడం
20. “గేయాలను పొడిగించగలగడం’ అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది?
1) సృజనాత్మకత
2) పదజాలం
3) బాష గురించి తెలుసుకోవడం
4) భాషణం
కింది పద్యం చదవండి. ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించండి?
కమలములు నీట బాసిన
గమలాప్తుని రశ్మిజోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ!
21. ‘కమలాప్తుడు’ అనే పదానికి అర్థం?
1) ఇంద్రుడు 2) రుద్రుడు
3) చంద్రుడు 4) సూర్యుడు
22. ‘బాసిన’ అంటే
1) మెరిసిన 2) విరిసిన
3) తొలగిన 4) నిండిన
23. ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారతారని చెప్పబడింది.
1) స్థానం మారినప్పుడు
2) ఏడిపించినప్పుడు
3) ఆపదలో ఆదుకోనప్పుడు
4) నమ్మకం పోయినప్పుడు
24. ఈ పద్యాన్ని రాసిన కవి?
1) వేమన 2) మారన
3) బద్దెన 4) తిక్కన
25. కింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు?
1) మల్లాది చంద్రశేఖరశాస్త్రి
2) నటరాజ రామకృష్ణ
3) మిద్దెరాములు
4) కొండపల్లి శేషగిరిరావు
26. ‘గిల్లిదండ’ ఆటను ఏమంటారు?
1) చెడుగుడు 2) చిత్తుబొత్తు
3) చిర్రగోనె 4) తొక్కుడుబిళ్ల
27. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు?
1) సప్తగిరి 2) భువనగిరి
3) భద్రగిరి 4) యాదగిరి
28. ‘గంగిరెద్దు’ ను రచించిన కవి?
1) పల్లా దుర్గయ్య
2) వానమామలై వరదాచార్యులు
3) అచ్చి వెంకటాచార్యులు
4) శేషం లక్ష్మీనారాయణాచార్య
29. నరసింహ శతకాన్ని రాసిన కవి?
1) అన్నమయ్య 2) రామదాసు
3) సిద్ధప్ప 4) శేషప్ప కవి
30. ‘ఎలిమి’ అంటే?
1) ఆశ్చర్యం 2) విచారం
3) సంతోషం 4) దుఃఖం
సమాధానాలు
1-3 2-4 3-1 4-3
5-4 6-4 7-4 8-1
9-3 10-4 11-2 12-1
13-3 14-4 15-3 16-4
17-2 18-2 19-3 20-1
21-4 22-3 23-1 24-3
25-4 26-3 27-4 28-1
29-4 30-3
1. చామ్ స్కీ ప్రతిపాదించిన భాషావాదం?
1) కారణవాదం
2) అనుకరణవాదం
3) అనుభవాత్మకవాదం
4) స్వతస్సిద్ధవాదం
2. నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన సాధనాలు?
1) 1 2) 4 3) 3 4) 2
3. “నగర గీతం”అనే పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలచుకున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు రాయడం ఏభాషా సామర్థ్యానికి చెందినది అవుతుంది?
1) వ్యాకరణాంశాలు
2) అవగాహన – ప్రతిస్పందనలు
3) స్వీయరచన 4) పదజాలం
4. ‘వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలను రాసుకోవడం’లోని సామర్థ్యాలు ?
1) వినడం, చదవడం
2) వినడం, రాసుకోవడం
3) చదవడం, రాసుకోవడం
4) మాట్లాడటం, వినడం
5. పాఠ్యాంశ బోధన ప్రధాన లక్ష్యం?
1) పిల్లల్లో ఉత్సాహం నింపడం
2) భాషా సామర్థ్యాలను సాధించడం
3) పరీక్షలో మంచిగ్రేడు వచ్చేలా చూడటం
4) పాఠంలోని విషయాన్ని జ్ఞాపకం చేయించడం
కింది పేరాను చదవండి. పేరా ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించండి?
జనపదం అంటే పల్లెటూరు. జనపదాల్లో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలను, గేయాలను జానపద గేయాలు అంటారు. వీటిని ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’ అంటారు. ఉత్తర భారతదేశంలో జానపదగేయాలను ‘లోక్ గీత్’ లేదా ‘లోక్సాహిత్యం’ అంటారు. జానపద సాహిత్యం సమష్టి సంపద. శిష్ట సాహిత్యం వలె కాకుండా జానపద సాహిత్యం పలువురి చేతిలో పెరగడం దాని మొదటి లక్షణంగా చెప్పవచ్చు. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం. నదీనదాలు, వాగులూ, వంకల్లోని నీరు ఎక్కువ భాగం మనకు అందనట్లే, జానపద గేయ స్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు.
6. జానపద సాహిత్యం మొదటి లక్షణం ?
1) శిష్ట సాహిత్యం వలె ఉండటం
2) పలువురి చేతిలో పెరగడం
3) రచనాకాలం స్పష్టంగా ఉండకపోవడం
4) సాహిత్యం స్పష్టంగా
అందకపోవడం
7. ‘సమష్టి సంపద’ అనదగినది?
1) సముద్రం 2) శిష్ట సాహిత్యం
3) జానపద సాహిత్యం
4) స్రవంతి
8. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను ఏమంటారు?
1) గేయ స్రవంతి 2) ఫోక్ సాంగ్స్
3) జనపదాలు 4. లోక్గీత్
కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించండి?
తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ!
9. రక్షణ ఇచ్చేది?
1) శాంతము 2) శత్రువు
3) స్వర్గం 4) కోపం
10. పై పద్యంలో ‘నిమం’ అనే అర్థాన్నిచ్చే పదం?
1) చుట్టంబౌ 2) తథ్యం
3) అండ్రు 4) సుమతీ
11. కోపం…
1) బంధువు వంటిది
2) స్నేహితుని వంటిది
3) పగవాని వంటిది
4) నరకం వంటిది
12. ‘ఆనందం’ దీనితో సమానం
1) స్వర్గం 2) చుట్టం
3) నరకం 4) దుఃఖం
13. పై పద్యంలోని మకుటం
1) ఏదీ లేదు 2) తథ్యం
3) నరకమండ్రు 4) సుమతీ
14. కింది వాటిలో సంగెం లక్ష్మీబాయి ‘ఆత్మకథ’
1) తులసీదళాలు
2) నా ప్రథమ విదేశీయాత్ర
3) నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు
4) యాత్రాస్మృతి
15. ‘కాపుబిడ్డ’ కావ్య రచయిత?
1) కట్టమంచి రామలింగారెడ్డి
2) గంగుల శాయిరెడ్డి
3) ముకురాల రామారెడ్డి
4) డా.సి.నారాయణరెడ్డి
16. కింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది?
1) అగ్నిధార 2) తిమిరంలో సమరం
3) రుద్రవీణ 4) జనపదం
17. ‘గోలకొండ పట్టణము’ అనే పాఠం దేని నుంచి గ్రహించబడింది?
1) మన తెలంగాణము
2) ప్రాచీనాంధ్ర నగరములు
3) షితాబు ఖాన్ చరిత్ర
4) స్వర కమలాలు
18. ‘ఆజ్ఞ’ అనే అర్థాన్నిచ్చే పదం?
1) ఆలోచన 2) ఆదేశం
3) ఆదర్శం 4) ఆకాంక్ష
19. పతాకం, ధ్వజం- వీటికి సమానార్థం కలిగిన మరొక పదం?
1) కేతనం 2) పతకం
3) ధవజం 4) కీర్తనం
20. చెరువు నీరే మా ఊరికి ఆదరవు ‘ఆదరవు’కు ప్రకృతి పదం ఏమిటి?
1) ఆధారం 2) అబ్బురం
3) అచ్చెరవు 4) అందం
21. ‘శరీరం నుంచి పుట్టినవాడు’ అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదం?
1) ధార్మికుడు 2) శరీరుడు
3) తనూజుడు 4) పాషండుడు
22. సూర్యుడు తూర్పు దిశన ఉదయిస్తాడు. ‘దిశ’ కు వికృతి పదం?
1) దిక్కు 2) దెస
3) దీన 4) వైపు
23. కింది వాటిలో భార్యకు సమానార్థం కాని పదం
1) మగువ 2) పత్ని
3) అర్థాంగి 4) దయిత
24. కింది వాటిలో ‘గుణసంధి’ కానిది?
1) లక్షాధికారి 2) గంగోదకం
3) రాజర్షి 4) దశేంద్రియాలు
25. వ్యాకరణంలో ‘వృద్ధులు’ అంటే?
1) ఐ,ఔ 2) ఏ, ఓ, ఆర్
3) ఆ, ఈ, ఏ 4) య, వ, ర, ల
26. ‘గుణహీనుడు’ – ఏ సమాసం?
1) కర్మధారయం 2) బహువ్రీహి
3) తృతీయా తత్పురుషం
4) షష్ఠీత్పురుషం
27. ‘నీకంటెన్’ – ఇది ఏ గణం?
1) న గణం 2) మ గణం
3) ర గణం 4) భ గణం
28. వరుసగా ‘సభరనమయవ’ అనే గణాలు వచ్చే పద్యం?
1) మత్తేభం 2) శార్దూలం
3) ఉత్పలమాల 4) చంపకమాల
29. హల్లుల జంట అర్థ భేదంతో అవ్యవధానంగా రావడం?
1) స్వభావోక్తి 2) ఛేకానుప్రాసం
3) వృత్త్యనుప్రాసం 4) అత్యానుప్రాసం
30. పిల్లల భాషా వికాసానికి తోడ్పడేవి?
1) పాఠశాలలో బోధన, పరీక్షలు
2) పిల్లల అంతర్గత శక్తులు,
పరిసరాల ప్రభావం
3) పిల్లలకున్న పూర్వభాషా సామర్థ్యం
4) కేవలం తల్లిదండ్రులు మాట్లాడటం
సమాధానాలు
1- 4 2-2 3-3 4-2
5-2 6-2 7-3 8-4
9-1 10-2 11-3 12-1
13-4 14-3 15-2 16-4
17-1 18-2 19-1 20-1
21-3 22-2 23-1 24-1
25-1 26-3 27-2 28-1
29-2 30-2
ఆంజనేయులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు