Society QNS & ANSWERS | ‘షెడ్యూల్డ్ తెగ’ అనే పదాన్ని ఏ ఆర్టికల్‌ద్వారా చేర్చారు?
27 ఆగస్టు తరువాయి
- 20. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన ఆరోగ్యం, పౌష్టికత కోసం స్వాస్థ్య పోర్టల్స్‌ను ప్రారంభించింది.
2. అలేఖ్ (ALEKH) అనేది గిరిజనుల ఆరోగ్యం, పౌష్టికతపై ఈ – సమాచార పత్రం (న్యూస్ లెటర్)
సరైన జవాబును గుర్తించండి?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు : c
వివరణ : గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజర ఆరోగ్యం, పౌష్టికత కోసం స్వాస్థ్య పోర్టల్‌ను ప్రారంభించింది. అలేఖ్ (ALEKH) అనేది గిరిజనుల ఆరోగ్యం, పౌష్టికతపై ఈ – సమాచార పత్రం (న్యూస్ లెటర్). అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ ఉన్నాయి.
21. సరోగసీ (నియంత్రణ) నిబంధనలు, 2022కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. అద్దె తల్లి (సరోగసీ మదర్)పై ఏ సరోగసీ ప్రక్రియకైనా నాలుగు సార్లకు మించి అవకాశం లేదు.
2. అద్దె తల్లి (సరోగసీ మదర్) పిల్లలపై తనకు ఉన్న అన్ని హక్కులనూ వదులుకోవడానికి ఆమె సమ్మతి తెలపాలి.
పైన పేర్కొన్న అంశాల్లో సరికాని అంశాలు ఏవి?
a.1 b.2 c.1,2 d. ఏదీ కాదు
జవాబు : a
వివరణ: సరోగసీ క్లినిక్ కోసం రిజేస్ట్రేషన్ రుసుము, నియమాలు, ఫారం, పద్ధతిని ఈ నిబంధనలు అందిస్తాయి. నమోదై ఉన్న సరోగసి క్లినిక్ ఉద్యోగుల ఆవశ్యకత, అర్హతలనూ వివరిస్తున్నాయి.
నిబంధనల్లోని ముఖ్యాంశాలు - అద్దె తల్లి (సరోగసీ మదర్) పై ఏ సరోగసీ ప్రక్రియకైనా మూడుసార్లకు మించి
ఆవకాశం లేదు. - మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971 ప్రకారం సరోగసీ సమయంలో వైద్యుల సలహా మేరకు అద్దెతల్లి (సరోగసీ మదర్) గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఉంటుంది.
- పిల్లలపై తమకున్న అన్ని హక్కులను వదులుకోడానికి సరోగసీ తల్లి ఒప్పందం ద్వారా తన సమ్మతిని తెలపాలి. బిడ్డ/బిడ్డలను వారికి అప్పగించాలి.
a. సంబంధిత జంట లేదా
b. ఆ జంట నియమించిన వ్యక్తికి (గర్భధారణ సమయంలో వారు విడిపోయినా, లేదా ఇద్దరూ మృతి చెందినా), లేదా
c. గర్భధారణ సమయంలో ఆ జంటలో ఒకరు మరణిస్తే, ప్రాణాలతో ఉన్న వ్యక్తికి,
d. సంబంధిత జంట అద్దె తల్లి (సరోగసి మదర్) పేరిట 36 నెలలకు ఇన్సూరెన్స్ కంపెనీ/ఐఆర్డీఏఐ గుర్తించిన ఏజెంటు నుంచి సాధారణ ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
22. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. 2020-2030 ఆరోగ్యకరమైన వృద్ధాప్య దశాబ్దంగా ప్రకటించబడింది. 2020 ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ దీన్ని ఆమోదించింది.
2. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం కింద పింఛను రూపంలో కేంద్ర సహాయం అందుతుంది.
సరైన జవాబును గుర్తించండి :
a. 1 b. 2
c. 1,2 d. ఏదీ కాదు
జవాబు : c
వివరణ : వృద్ధాప్యంలో శ్రేయస్సుకు అవకాశాన్నిచ్చే క్రియాత్మక సామర్థ్యాల అభివృద్ధి, నిర్వహణ ప్రక్రియను ఆరోగ్యమైన వృద్ధాప్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 2020-2030ని ఆరోగ్యకరమైన వృద్ధాప్య
దశాబ్దంగా ప్రకటించింది. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం కింద కేంద్రం ఆర్థిక చేయూతను అందిస్తుంది.
23. కింది వ్యాఖ్యలను పరిశీలించండి
1. భారత్ ప్రపంచ కార్మిక సంస్థ వ్యవస్థాపక సభ్య దేశం.
2. జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు కార్మిక, ఉద్యోగ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర రంగ పథకం
సరైన జవాబును గుర్తించండి :
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు : c
వివరణ : అంతర్జాతీయ కార్మిక సంస్థ 1919 లో ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి త్రైపాక్షిక సంస్థ. ఇది దాని సభ్య దేశాల ప్రభుత్వాలు, యజమానులు, కార్మికులను ఒకచోటుకు చేరుస్తుంది. భారత్ ప్రపంచ కార్మిక సంస్థ వ్యవస్థాపక సభ్యదేశం. జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు కార్మిక, ఉద్యోగ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర రంగ పథకం.
24. కింది అంశాలను పరిశీలించండి
1.రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనను
చర్చిస్తుంది.
2. లోకూర్ కమిటీ షెడ్యూల్డ్ తెగల ముఖ్య లక్షణాలను చర్చిస్తుంది.
సరైన జవాబును గుర్తించండి :
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు : c
వివరణ : రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, రాష్ర్టాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనను చర్చిస్తుంది. - లోకూర్ కమిటీ షెడూల్డ్ తెగల ముఖ్య లక్షణాలను చర్చిస్తుంది. అవి – ఆదిమ లక్షణాల సూచనలుండటం విలక్షణమైన సంస్కృతి, ప్రధాన స్రవంతి సమాజంలో అంతగా సంబంధాలు లేకపోవడం,
భౌగోళిక ఏకాంతం/ నిర్బంధం, ఆర్థికంగా వెనుకబడి ఉండటం.
25. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. భారత రాజ్యాంగం ‘తెగ’ అనే పదాన్ని నిర్వచించలేదు.
2. షెడ్యూల్డ్ తెగ అనే పదాన్ని ఆర్టికల్ 342 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
3. రాష్ట్రపతి ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా తెగ లేదా గిరిజనులను గుర్తించవచ్చు.
సరైన జవాబును గుర్తించండి :
a. 1 b. 2, 3 c. 1, 3 d. 1, 2, 3
జవాబు : d
వివరణ : భారత రాజ్యాంగం ‘తెగ’ అనే పదాన్ని నిర్వచించడానికి ప్రయత్నించలేదు. షెడ్యూల్డ్ తెగ అనే పదాన్ని ఆర్టికల్ 342 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. రాష్ట్రపతి ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా తెగ లేదా గిరిజనులను గుర్తించవచ్చు.
25. నిర్దేశం (26-28) కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు తగిన జవాబులను గుర్తించండి?
ఎనిమిది మంది వ్యక్తులు – A, B, C, D, E, F, G, H ఒక గుండ్రని టేబుల్ చుట్టూ మధ్యలో కూర్చున్నారు. Fకి కుడివైపున G నాలుగో స్థానంలో ఉన్నాడు. C, B మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. Bకి కుడివైపున మూడో స్థానంలో C కూర్చున్నాడు. C, D మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. Aకి కుడివైపున మూడో స్థానంలో E కూర్చున్నాడు. అతడు C సమీపంలో లేడు.
26. కింది వాటిలో సరైనది ఏది?
a. H. D పక్కపక్కనే ఉన్నారు.
b. D వెంటనే ఎడమవైపున A కూర్చున్నాడు.
c. F, H ఎదురెదురుగా కూర్చున్నారు.
d. Eకి కుడివైపు రెండో స్థానంలో H కూర్చున్నాడు. జవాబు : D
27. D, E మధ్య ఎంత మంది వ్యక్తులు కూర్చున్నారు.
a. ఒకరు b. నలుగురు
c. ముగ్గురు d. ఇద్దరు
జవాబు : c
28. కింది వాటిలో B, C స్థానంలో ఉన్నవారు ఎవరు?
a. C, A b. B, C
c. D, E d. G, F
జవాబు : b
29. కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు తగిన జవాబులివ్వండి. ఒక కుటుంబంలో మూడు తరాలకు చెందిన ఏడుగురు వ్యక్తులున్నారు. W అనే వ్యక్తి Z కు సోదరి. R అనే వ్యక్తి S కు తండ్రి. Vఅనే వ్యక్తి Sకు సోదరుడు. Xఅనే వ్యక్తి Wతండ్రి. Xఅనే వ్యక్తి Yకి అల్లుడు. Vకి ఇంకా పెళ్లికాలేదు. Wఅనే వ్యక్తి Vకి మేనకోడలు. అయితే Zకి Xకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
a. సోదరి b. సోదరుడు
c. కుమారుడు/కుమార్తె
d. నిర్ణయించడం సాధ్యం కాదు.
జవాబు : c
30. ఒక నిర్దిష్ట కోడ్‌లో TERMINAL అన్న పదాన్ని NSFUMBOJగా రాస్తారు. TOWERS అన్న పదాన్ని XPUTSF గా రాస్తారు. అయితే ఆ కోడ్‌లో MATE అన్న పదాన్ని ఎలా రాస్తారు?
a. FUBN b. UFNB
c. BNDS d. BNFU
జవాబు : d
31. శర్మ ఒక వస్తువును రూ. 300కు కొని 20 శాతం లాభానికి విక్రయించాడు. అతడు ఆ వస్తువును రూ. 380కు అమ్మితే లాభం శాతం ఎంత పెరిగి ఉండేది?
a. 6.66% b. 9%
c. 10% d. 5.5%
జవాబు : a32.ఒక వ్యక్తి 12% వార్షిక రేటుతో నిర్దిష్ట మొత్తంలో 33.33% అప్పుగా ఇచ్చాడు. మిగతా దాంట్లో 50% రుణాన్ని అతడు 15% వార్షిక రేటుతో ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని 25% వార్షిక రేటుతో ఇచ్చాడు. అయితే మొత్తం వార్షిక రేటు ఎంత?
a. 18.7% b. 17.33%
c. 19.2% d. 20.7%
జవాబు : b
33. సీఎన్జీ, ఎరువుల ఉత్పాదక ధరలను తగ్గించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఉత్పత్తిదారుల వారసత్వ క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయిన సహజ వాయువుకు కనిష్ఠ, గరిష్ఠ ధరలను కమిటీ సిఫారసు చేసింది; దీంతోపాటు పాత క్షేత్రాల నుంచి కొత్తగా చేసే ఏదైనా గ్యాస్ ఉత్పత్తిపై ఓఎన్జీసీ, ఓఐఎల్ లకు 20 శాతం ప్రీమియం చెల్లించడానికి మొగ్గుచూపింది. సహజ వాయువుకు సంబంధించి పై నిబంధనలను ఏ కమిటీ సిఫారసు చేసింది?
a. కిరీట్ పరీఖ్ కమిటీ
b. ఎన్.ఎస్.విశ్వనాథన్ కమిటీ
c. కిరీట్ ప్రేంజీభాయ్ సోలంకి కమిటీ
d. డా. మార్తాండ వర్మ శంకరన్ కమిటీ
జవాబు : a
వివరణ : కిరీట్ పరీఖ్ కమిటీ : ఈ కమిటీ సీఎన్జీ, ఎరువుల ఉత్పాదక ధరలను తగ్గించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఉత్పత్తిదారుల వారసత్వ క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయిన సహజ వాయువుకు కనిష్ఠ, గరిష్ఠ ధరలను కమిటీ సిఫార్సు చేసింది. దీంతోపాటు పాత క్షేత్రాల నుంచి కొత్తగా చేసే ఏదైనా గ్యాస్ ఉత్పత్తిపై ఓఎన్జీసీ, ఓఐఎల్లకు 20 శాతం ప్రీమియం చెల్లించడానికి మొగ్గు చూపింది.
34. కింది వ్యాఖ్యలను పరిశీలించండి
1. అయి మండపం
2. శ్రీ గంగై వరాఘ నాథేశ్వర ఆలయం
3. తిరునాళ్లార్ కరైకాల్
4. చిన్న వీరపట్టినం
పైన తెలిపిన వాటిలో స్వదేశ్ దర్శన్ పథకం కింద ఇటీవల వేటిని చేరుస్తున్నారు?
a. 1.2 b. 2, 3, 4
c. 1, 2, 4 d. 1, 2, 3, 4
జవాబు : d
వివరణ : పర్యాటక మంత్రి పుదుచ్చేరిలో స్వదేశ్ దర్శన్ పథకం కింద నాలుగు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రారంభించిన ప్రాజెక్టులలో – అయి మండపం పునరుద్ధరణ, భారతి పార్క్ వద్ద డైనమిక్ లైటింగ్, తిరుకంచిలోని శ్రీ గంగై వరాఘ నాథేశ్వర ఆలయం వద్ద పవిత్ర నది వెంబడే యాత్రికులకు సౌకర్యాలు, ఘాట్ అభివృద్ధి, తిరునాళ్లార్ కరైకాల్ వద్ద ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధి, చిన్న వీరంపట్టినం వద్ద ఈడెన్ బీచ్ అభివృద్ధి ఉన్నాయి.
35. జికా వైరస్ గురించి ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. ‘జికా’నీటి ద్వారా సంక్రమించే వైరస్.
2. జికాను మొదట జాంబియాలోని రీసన్ మకాక్ కోతిలో గుర్తించారు.
3.గులియన్ బారే సిండ్రోమ్ వృద్ధి,
ఇందులో వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ నాడులపై దాడి చేస్తుంది.
4. జికా వైరస్ ప్లావివిరిడె అనే వైరస్ కుటుంబానికి చెందినది.
5. ఈ వైరస్లు గర్భిణిలో పిండం దెబ్బతీసి, పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతాయి.
పైన పేర్కొన్న అంశాలలో ఏవీ సరైనవి కావు.
a. 1, 3, 4 b. 1, 2
c. 2, 3, 5 d. 3, 5
జవాబు : b
వివరణ : జికా వైరస్ దోమల ద్వారా సంక్రమించే వైరస్, ప్రధానంగా పగలి సమయంలో కుట్టే ఎడిస్ దోమద్వారా వ్యాప్తి చెందుతుంది. జికాను మొదటిసారి 1947లో ఉగాండాలోని రీసన్ మకాక్ కోతిలో గుర్తించారు. ఈ వైరస్లు గర్భిణిలో పిండం వృద్ధిని దెబ్బతీసి, పిల్లల్లో పుట్టకతో వచ్చే లోపాలకు కారణమవుతాయి. గులియన్ బారే సిండ్రోమ్ వృద్ధి చెంది వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ నాడులపై దాడి చేస్తుంది. జిలా వైరస్ ఫ్లావివిరిడె అనే వైరస్ కుటుంబానికి చెందినది.
36. చిరుధన్యాల గురించి ఈ కింది అంశాలను పరిశీలించండి.
1.రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాల నుంచి మొత్తం చిరుధాన్యాల ఉత్పత్తులలో 81 శాతం కన్నా ఎక్కువ లభిస్తున్నాయి.
2. 2020లో 41 శాతం వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చిరుధాన్యాల ఉత్పతిదారుగా ఉంది.
3. చిరుధాన్యాల ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది.
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
a. 1 b. 2, 3
c. 3 d. 1, 2
జవాబు : d
వివరణ : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా 81 శాతానికి పైగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నాయి. భారతదేశంలోని మొత్తం చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ సగం ఉత్పత్తిని అందిస్తుంది. 2020లో 41 శాతం వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చిరుధాన్యాల ఉత్పత్తిదారుగా ఉంది. భారత్ చిరుధాన్యాల ఎగుమ
తుల్లో ఐదో అతిపెద్ద దేశంగా ఉంది.
ఎం. క్రాంతి కుమార్ రెడ్డి
ఫ్యాకల్టీ
విష్ణు ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?