Home
Study Material
Indian Economy – Groups Special | ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం … డిజిటల్ బ్యాంకింగ్‌కు ప్రోత్సాహం
Indian Economy – Groups Special | ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం … డిజిటల్ బ్యాంకింగ్‌కు ప్రోత్సాహం
- 1. ఆర్థిక అక్షరాస్యత వారోత్సం-2023 నేపథ్యం (థీమ్ ఏమిటి? (బి)
ఎ) క్రెడిట్ క్రమశిక్షణ
బి) మంచి ఆర్థిక ప్రవర్తన, మీ రక్షకుడు
సి) డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ
డి) ఎంఎస్ఎంఈలు వెన్నెముక
వివరణ: ఆర్థిక విద్య సందేశాలను ప్రచారం చేయడానికి రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2016 నుంచి ప్రతి సంవత్సరం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహిస్తుంది. - 2023లో ఫిబ్రవరి 13-17 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహించింది. ఈ సంవత్సర వారోత్సవ నేపథ్యం(థీమ్) ‘మంచి ఆర్థిక ప్రవర్తన, మీ రక్షకుడు’. పొదుపు, ప్రణాళిక, బడ్జెట్, డిజిటల్ ఆర్థిక సేవల వివేకవంతమైన ఉపయోగంపై ప్రాధాన్యం కల్పిస్తుంది.
2. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ప్రభుత్వం ఎంత రుణం తీసుకుంటుందని అంచనా వేశారు? (డి)
ఎ) రూ 5.55 లక్షల కోట్లు
బి) రూ, 6.66 లక్షల కోట్లు
సి) రూ. 7.77 లక్షల కోట్లు
డి) రూ. 8.88 లక్షల కోట్లు
వివరణ: 2023-24 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో అంటే ఆర్థిక సంవత్సర అర్ధభాగం కాలంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఆదాయ అసమానతకు నిధులు సమకూర్చడానికి మార్కెట్ రుణం ద్వారా రూ. 8.88 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్రం యోచిస్తుంది. ఆర్బీఐతో సంప్రదించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.
3. 100 రోజులు 100 చెల్లింపులు ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? (బి)
ఎ) ఎన్పీసీఐ బి) ఆర్బీఐ
సి) ఎస్ఈబీఐ డి) ఎస్బీఐ
వివరణ: భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల బ్యాంకుల ద్వారా 100 రోజులు 100 చెల్లింపులు అనే ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. - దేశంలోని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు కు చెందిన టాప్ 100 అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను 100 రోజుల్లోగా గుర్తించి సెటిల్ చేయడం దీని లక్ష్యం. క్లెయిమ్ చేయని డిపాజిట్లు అంటే నిధుల ఇన్సూరెన్స్ 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం డిపాజిట్ నుంచి ఉపసంహరణ వంటి కార్యకలాపాన్ని చూడరు.
4. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పుడు చలామణిలో ఉన్న కరెన్సీ పెరుగుతున్న ద్విగ్విషయాన్ని ఏ పదం సూచిస్తుంది? (బి)
ఎ) డిజిటల్ డిమాండ్ పారడాక్స్
బి) కరెన్సీ డిమాండ్ పారడాక్స్
సి) ఫైనాన్స్ పారడాక్స్
డి) బ్యాంక్ నోట్ పారడాక్స్
వివరణ: డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పుడు చలామణిలో ఉన్న కరెన్సీ పెరిగి కరెన్సీ డిమాండ్ పారడాక్స్ జరుగుతుంది. ఈ ద్విగ్విషయం భారతదేశంలో కనిపిస్తుంది. - భారతదేశంలో కరెన్సీ డిమాండ్ పారడాక్స్ గురించి ఆర్బీఐ వివరించింది. భారతదేశంలో యూపీఐ నేతృత్వంలోని రిటైల్ డిజిటల్ చెల్లింపులు పరిమాణం, విలువ పరంగా 50 శాతం, సీఏజీఆర్ పరంగా 27 శాతం వృద్ధి చెందాయి. 2016-17 నుంచి 2021-2022 మధ్యకాలంలో జీడీపీ నిష్పత్తికి చలామణిలో ఉన్న కరెన్సీ కూడా
గరిష్ఠంగా 14.4 శాతానికి చేరింది.
5. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2023ను విడుదల చేసిన సంస్థ ఏది? (బి)
ఎ) ఏడీబీ బి) ప్రపంచ బ్యాంక్
సి) ఐఎంఎఫ్ డి) ఏఐఐబీ
వివరణ: ప్రపంచ బ్యాంక్ ప్రపంచ అభివృద్ధి నివేదిక 2023ను ‘వలసదారుల, శరణార్థులు, సమాజాలు’ అని విడుదల చేసింది. - ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 184 మిలియన్ల మంది ప్రజలు తాము నివసిస్తున్న దేశాల్లో పౌరసత్వం పొందలేరు.
- ఈ నివేదిక గమ్యం, మూల దేశాలపై, సరిహద్దు కదలికల అభివృద్ధి ప్రభావాలను పెంచడానికి ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌గా ప్రతిపాదించింది.
6. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ఈవెంట్‌ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది? (సి)
ఎ) వ్యవసాయ మంత్రిత్వశాఖ
బి) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
సి) ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ
డి) గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వివరణ : ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 రెండో ఎడిషన్‌ను నవంబర్ 2023లో న్యూఢిల్లీలో నిర్వహించనుంది. - డబ్ల్యూఎఫ్ఐ-2023 భారతదేశాన్ని గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ప్రమోట్ చేయడం, పాక వైవిధ్యాన్ని హైలైట్ చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపార అవకాశాలను అన్వేషించడంపై దృష్టిసారిస్తుంది.
- డబ్ల్యూఎఫ్ఐ- 2023 ఐదు కీలక అంశాలు మిల్లెట్స్, ఇన్నోవేషన్ /సుస్థిర అభివృద్ధి, వైట్ రివల్యూషన్ 2.0, మేకిన్ ఇండియాను ఎగుమతి కేంద్రంగా సాంకేతికత, డిజిటలైజేషన్ మొదలైనవి.
7. 2023 మార్చిలో (పునర్విమర్శ) సమీక్ష నిర్వహించిన తర్వాత సుకన్య సమృద్ధి పథకం వడ్డీరేటు ఎంత? (సి)
ఎ) 7.0 శాతం బి) 7.5 శాతం
సి) 8.0 శాతం డి) 8.5 శాతం
వివరణ: 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మినహా అన్ని చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీరేట్లను పెంచింది. - సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతా కూడా అధిక వడ్డీరేటును అంటే 8 శాతం పొందుతుంది. అదే విధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీరేటును 7 శాతం నుంచి 7.7 శాతానికి పెంచింది.
8. 2023 జూలై నెలలో సేకరించిన జీఎస్టీ ఆదాయం ఎంత? (డి)
ఎ) 1.62 లక్షల కోట్లు
బి) 1.63 లక్షల కోట్లు
సి) 1.64 లక్షల కోట్లు
డి) 1.65 లక్షల కోట్లు
వివరణ:
1) 2023 ఏప్రిల్ నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయం రూ. 1.87 లక్షల కోట్లు
2) 2023 మే నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయం రూ.1.57 లక్షల కోట్లు
3) 2023 జూన్ నెలలో వసూలైన జీఎస్టీ వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లు
4) 2023 జూలై నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయం రూ.1.65 లక్షల కోట్లు - వార్షిక ప్రాతిపదికన ఇది 11 శాతం వృద్ధి రేటుగా నమోదైనది
- జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి 5వ సారి స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటాయి.
9. ఎల్ఐసీ ఇటీవల ఏ ఐటీ కంపెనీలో తన వాటాను పెంచుకుంది? (బి)
ఎ) విప్రో బి) టెక్ మహింద్ర
సి) ఇన్ఫోసిస్
డి) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
వివరణ : - భారత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐటీ కంపెనీ టెక్ మహీంద్రలో 2 శాతం పైగా వాటాను పెంచుకుంది.
- ఎల్ఐసీ అందించిన సమాచారం ప్రకారం బీమా సంస్థ టెక్ మహింద్రా లిమిటెడ్‌ల తన వాటాను కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 6.869 నుంచి 8.884 శాతానికి పెంచింది.
10. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన పీఎం వికాస్ పథకం ముఖ్య లబ్ధిదారులు ఎవరు? (సి)
ఎ) విద్యార్థులు బి) ఉపాధ్యాయులు
సి) కళాకారులు
డి) రాజకీయ నాయకులు
వివరణ: పీఎం వికాస్ (ప్రధానమంత్రి విశ్వకర్మకౌశల్ సమ్మాన్) యోజన సంప్రదాయ, నైపుణ్యం కలిగిన వృత్తుల్లో నిమగ్నమై ఉన్న విశ్వకర్మ కళాకారులకు నైపుణ్య శిక్షణ అందించడం దీని ప్రధాన ఉద్దేశం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. - 11. ఒక సంవత్సరంలో ఒక దేశం మొత్తం రాబడి, మొత్తం ఖర్చుల మధ్య తేడాను ఏమంటారు? (ఎ)
ఎ) ద్రవ్యలోటు బి) రెవెన్యూ లోటు
సి) ప్రాథమిక లోటు డి) బడ్జెట్ లోటు
వివరణ: ఒక సంవత్సరంలో ఒక దేశం మొత్తం రాబడి, మొత్తం వ్యయం, మధ్య
వ్యత్యాసాన్ని ద్రవ్యలోటు అంటారు. - ద్రవ్యలోటును ఆర్థికలోటు, విత్తలోటు, కోశలోటు, ఫిస్కల్ డెఫిసిట్ అని కూడా పిలుస్తారు.
12. క్లీన్ ప్లాంట్ సెంటర్లు అంటే ఏమిటీ? - యాపిల్స్, బాదం, ద్రాక్ష, అవకాడోలు, బ్లూ బెర్రీస్ వంటి పంటల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 10 క్లీన్ ప్లాంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది.
13. సి-కేవైసీ డేటాబేస్ అంటే ఏమిటి? - భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ డేటాబేస్‌ను అధిక రిస్క్‌గా వర్గీకరించింది. ఇది ఆర్థిక సంస్థలకు సవాళ్లను కలిగిస్తుంది. ఈ చర్య కస్టమర్ ప్రామాణీకరణ కోసం వీడియో కేవైసీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించడానికి బ్యాంకులను ప్రేరేపించింది.
14. 2022 జాతీయ విద్యా దినోత్సవం థీమ్ ఏమిటి? (బి)
ఎ) విద్య, శాస్త్రీయ పరిశోధన
బి) కోర్సును మార్చడం, విద్యను మార్చడం
సి) దేశ విద్యా వ్యవస్థను రూపొందించడం
డి) సంస్కృతి, విద్య
వివరణ: - మొదటి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని 2008 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
- ఆజాద్ దేశ విద్యా వ్యవస్థను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు. అనేక విద్యా సంస్థలను యూజీసీ, ఏఐసీటీఈ, ఇతర సంస్థల ఏర్పాటుకు దోహదపడ్డారు.
- జాతీయ విద్యా దినోత్సవం 2022 నేపథ్యం కోర్సును మార్చడం, విద్యను మార్చడం.
15. ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా ఎన్ని డిపాజిట్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించారు? (బి)
ఎ) 50 బి) 75
సి) 100 డి) 125
వివరణ: - దేశ వ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలను విస్తరించేందుకు 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 12 ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఒక ఫైనాన్స్ బ్యాంకింగ్ చొరవతో పాల్గొంటున్నాయి. వారు రోజంతా డిజిటల్ నగదు డిపాజిట్, ఉపసంహరణతో సహా బ్యాంకింగ్ సేవలను అందిస్తారు.
16. భారతదేశంలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ డే) రోజును ఎప్పుడు జరుపుకొంటారు? (సి)
ఎ) జూన్ 1 బి) జూన్ 30
సి) జూలై 1 డి) జూలై 31
వివరణ: - వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై 1న జీఎస్టీ దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఇది 2017లో ‘ఒకే దేశం- ఒక మార్కెట్ – ఒకే పన్ను’ అనే ఆలోచనలతో ప్రవేశ పెట్టబడింది.
- జీఎస్టీ అనేది బహుళ దశల పరోక్ష వినియోగ ఆధారిత పన్ను వ్యవస్థ. ఇది సేవా పన్ను, విలువ ఆధారిత పన్ను, కొనుగోలు పన్ను., ఎక్సైజ్ సుంకం వంటి దేశీయ పరోక్ష పన్నుల సమితిని ఉపసంహరించుకుంటుంది.
17. గంజాయి సాగు, వినియోగాన్ని చట్టబద్ధం చేసిన మొదటి ఆసియా దేశం ఏది? (సి)
ఎ) భారతదేశం బి) నేపాల్
సి) థాయిలాండ్ డి) బంగ్లాదేశ్
వివరణ: - వ్యవసాయం, పర్యాటక రంగాలను పెంచే లక్ష్యంతో గంజాయిని పెంచడం, ఆహారం, పానీయాల్లో దాన్ని వినియోగించడాన్ని చట్టబద్ధం చేసిన మొదటి ఆసియా దేశంగా థాయిలాండ్ అవతరించింది. నొప్పి, అలసట నుంచి ఉపశమనం పొందేందుకు గంజాయిని ఉపయోగించే సంప్రదాయాన్ని కలిగి ఉన్న థాయిలాండ్ 2018లో ఔషధ గంజాయిని చట్టబద్ధం చేసింది. రైతులు గంజాయి సాగు చేపట్టేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక మిలియన్ మొక్కలను నగదు పంటగా ఇవ్వాలని భావించింది.
18. ఇటీవల ప్రారంభించిన బారి చినబాడం-12, ఏ పంటకు చెందిన కొత్తరకం? (బి)
వివరణ : హైదరాబాద్‌కు చెందిన ఇక్రిశాట్, (ICRISAT) బంగ్లాదేశ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(BARI) బంగ్లాదేశ్‌లో మెరుగైన వేరుశనగ రకం BARI చినబాడం-12 (ICGV 07219) ని విడుదల చేసింది.
ఇది ఆకుల శిలీంద్ర వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటుంది, దాని ప్రతిరూపం కంటే నాలుగు రోజుల ముందుగానే పరిపక్వం చెందుతుంది.
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
Previous article
Current Affairs – Groups Special | అంతర్జాతీయం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు