Sociology – Group I Mains Special | తెలంగాణ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి వివరించండి?
1.ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశ స్థితిని తెలియజేయండి? ఆకలి, పోషకాహార లోపం స్థితి ఏ విధంగా ఉంది? భారతదేశంలో పేదరికం, ఆకలిని నిర్మూలించడానికి భారతదేశ కార్యక్రమాలు, వాటి పురోగతి ఏమిటి?
1. యుద్ధం వల్ల దెబ్బతిన్న అఫ్గానిస్థాన్ మినహా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022లో దక్షిణాసియా ప్రాంతంలోని అన్ని దేశాల కంటే భారతదేశం తక్కువ స్థాయిలో ఉంది. 121 దేశాల్లో 107వ స్థానంలో ఉంది.
2. (GHI-2021లో 101/ 116 ర్యాంకు కలిగి ఉంది)
3. ఈ సూచికలో పోషకాహార లోపం, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్, శిశు మరణాల రేటు అనే అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని యూరోపియన్ NGO అయిన Concern Worldwide Welthungerhilfe రూపొందించింది.
4. 2014లో 19.1 Score, 2022లో 18.2 Score కలిగి ఉంది. కానీ ఇది మధ్యస్తంగానే ఉందని చెప్పవచ్చు.
5. వాతావరణ మార్పులు, కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల్లో పెరుగుదల కనిపించింది.
6. బెలారస్, బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా, చిలీ, చైనా, క్రొయేషియా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి.
7. చివరి 5 స్థానాల్లో ఉన్న దేశాలు చాద్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మడగాస్కర్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, యెమెన్.
8. భారతదేశం 107, సరిహద్దు దేశాలు శ్రీలంక 64, నేపాల్ 81, బంగ్లాదేశ్ 84, పాకిస్థాన్ 99వ స్థానాల్లో నిలిచాయి. 29.1 Scoreతో తీవ్రమైన (serious) జాబితా గల దేశాల్లో అఫ్గానిస్థాన్ 109వ ర్యాంకులో ఉంది.
సూచికలు – భారతదేశ స్థితి
1) వేస్టింగ్- 19.3% (Low Wight for Hight)
2) పోషకాహార లోపం 16.3%.
- 224.3 మిలియన్ల ప్రజలు భారతదేశంలో పోషకాహార లోపంతో జీవిస్తున్నారు.
- పేదరికం, ఆకలిని నిర్మూలించడానికి దేశంలో చేపట్టే కార్యక్రమాలు
1) Eat Light India Movement FSSAI నిర్వహించే కార్యక్రమం.
2) పోషణ్ అభియాన్- 2018లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పిల్లలు, కౌమార బాలికల్లో రక్తహీనత నిర్మూలన కార్యక్రమం.
3) PM మాతృవందన్ యోజన- మహిళా, శిశు మంత్రిత్వ శాఖ ప్రతి కాన్పుకు రూ.5 వేలు ఇస్తుంది. (2017, జనవరి 1)
4) Food Fortification- విటమిన్లు, Iron, Iodine, Zinc మాత్రల సరఫరా
5) ఆహార భద్రతా చట్టం (NFSA)- 2013 ద్వారా (75 % గ్రామీణ జనాభాకు, 50% పట్టణ జనాభాకు) ఆహార ధాన్యాల సరఫరా
6) మిషన్ ఇంద్ర ధనుష్ పథకం ద్వారా టీకాలు ఇవ్వడం
7) ICDS ద్వారా 6 సేవల ప్యాకేజీ
a. పోషకాహారం b. ఫ్రీ స్కూల్ విద్య c. బాలల ఆరోగ్య విద్య d. ఇమ్యూనైజేషన్
e. ఆరోగ్య చెకప్‌లు f. రెఫరల్ సేవలు (0-6 Years) - ఈ విధంగా పలు కార్యక్రమాల ద్వారా పేదరికం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని రక్షిస్తుంది.
2. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? ప్రయోజనాలు ఏంటి?
నిర్వచనం: మానవ జనాభా భూమి పరిమిత, స్థిరమైన వనరుల కంటే మించి పెరిగింది. మన గ్రహం పునరుత్పత్తి చేయగల దానికంటే ఎక్కువ వనరులను వినియోగిస్తున్నాం. మానవాళికి బిలియన్ సంఖ్యను చేరుకోవడానికి 2 లక్షల సంవత్సరాలు పట్టింది. 7 బిలియన్లకు చేరుకోవడానికి కేవలం 200 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 80 మిలియన్ల జనాభా అదనంగా పెరుగుతుంది.
డెమోగ్రఫిక్ డివిడెండ్: డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదాన్ని డేవిడ్ బ్లూమ్ వాడాడు. ఆర్థికాభివృద్ధిని/అభివృద్ధిని ప్రోత్సహించడానికి అర్హత ఉన్న జనాభా అని అర్థం. ఏ ప్రజలైతే దేశ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో తమ వంతు పాత్రను నిర్వహిస్తారో వారిని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు.
UN Fund For Population Activities
నిర్వచనం: 15-64 సంవత్సరాల వయస్సు గల సమూహం ఆర్థికాభివృద్ధిని పెంచుతుంది. దీన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు.
1) ఉత్పత్తి పెరగడం, జీవన ఆయుర్దాయం పెరగడం, మరణాల రేటు తగ్గడం అనే అంశాల్లో మార్పులు కనిపిస్తాయి.
2) శ్రామిక శక్తి జనాభా (Labour Force) పెరుగుతుంది. కాబట్టి ఉత్పత్తులు పెరుగుతాయి.
ఆదాయం పెరిగి పొదుపు చేయగలుగుతారు. ఈ పొదుపు చేసిన డబ్బులను అభివృద్ధి కార్యకలాపాలకు కేటాయిస్తారు. మూలధనంగా వినియోగిస్తారు.
3) మానవ మూలధనం: (Human Capital) మానవుడి అభివృద్ధికి అవసరమైన విద్య, వైద్యంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడాన్ని మానవ మూలధన కల్పన అంటారు. వీరు భవిష్యత్తులో ఉద్యోగాలు లేదా ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటారు. కాబట్టి తలసరి GDP పెరుగుతుంది. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది.
4) Below 15 Years జనాభా: వీరిని అనుత్పాదక జనాభా అంటారు. వీరు ప్రభుత్వంపై ఆధారపడి జీవిస్తారు. కాబట్టి వీరి జనాభా ఎంత ఎక్కువగా ఉంటే కూడా ఆర్థిక రంగంపై భారం అంత ఎక్కువవుతుంది. కానీ తరువాత వీరే ప్రభుత్వానికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఒక ఆదాయ వనరుగా మారుతారు.
5) 15-64 సంవత్సరాల మధ్య జనాభా: వీరిని ఉత్పత్తి జనాభా అంటారు. వీరు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తారు. 64.8% యువ జనాభా కలిగి ఉన్నారు. 2040 నాటికి 69 % చేరుతుంది. తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. 2018 నుంచి దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది కనిపిస్తుంది.
- ఇది 35 సంవత్సరాలు కొనసాగుతుంది.
- కాబట్టి వీరిలో సామర్థ్యాలు, నైపుణ్యం, మంచి విద్య జాతీయత పెంచాలి.
6) 65 సంవత్సరాల కంటే పై వయస్సు: వీరిని అనుత్పాదక జనాభా అంటారు. ఈ విధంగా పైన తెలిపిన మూడు రకాలైన ‘3’ వ్యత్యాసాలను డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు.
ముగింపు: ప్రధాని మోదీ ఇటీవల 3D అభివృద్ధి జరగాలనే సందేశాన్ని ఇచ్చారు. 3D అంటే మొదటిది Democratic, రెండోది Demand అధికంగా కలిగిన దేశం (వీరు వస్తువుల కొనుగోలు చేస్తారు), మూడోది Demographic Dividend గల దేశం. కాబట్టి పెరుగుతున్న జనాభాను ఒక ఆర్థిక వనరుగా మలచుకుని దేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా తీర్చిదిద్దాల్సిన అవశ్యకత ప్రభుత్వాలపై ఉంది.
3. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నీవు సూచించే సలహాలు ఏమిటి?
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
1) One Nation One Ration card ద్వారా దేశంలో ఎక్కడ నివసిస్తున్నా ఆహార ధాన్యాలు చౌకధరల దుకాణాల్లో అందిస్తున్నారు.
2) నూతన ప్రజా పంపిణీ చట్టం (New PDS)- 2013
3) ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం MDMS (Mid Day Meals scheme)
సూచనలు, సలహాలు
1) వాద్వా కమిటీ సూచనల ప్రకారం ఆహార కూపన్లు నేరుగా అత్యంత పేదరికంలో ఉన్న వారికి అందించాలి. స్టాక్లను/ఆహార నిల్వలను GPS ఆధారిత ట్రక్కుల్లో సరఫరా చేయాలి. తద్వారా మోసాలను అరికట్టవచ్చు.
2) ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే పోషక స్థాయిలను పెంచడం. విటమిన్స్, మినరల్స్ స్థాయిలను పెంచడం. గోల్డెన్ రైస్ లాంటి వంగడాల ద్వారా ఫుడ్ ఫోర్టిఫికేషన్ దేశమంతటా ప్రవేశపెట్టాలి (గోల్డెన్ రైస్ అనేది ఒరైజా సటైవా, బయోసింథసిస్, బీటా కెరోటిన్, విటమిన్-ఎ తో కూడిన జెనెటిక్ రకం). ‘పోషణ భారతమే ఆరోగ్య భారతం’ అని తలచి అందరికీ పోషణ భద్రత కల్పించాలి.
గమనిక: ప్రతి సంవత్సరం 3.1 మిలియన్ పిల్లలు మరణిస్తున్నారు. 161 మిలియన్ మంది పిల్లల ఎదుగుదల పోషకాహార లోపం వల్ల కుంటుపడింది.
4. Demographic Dividend సవాళ్లు ఏంటి?
నిర్వచనం: పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆహారం, నీరు, పారిశుద్ధ్యం, గృహాలు, ప్రజా సేవలు, సౌకర్యాలు అవసరమవుతాయి. అడవి జాతుల జనాభా క్షీణించింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సముద్రాలు ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయి. అడవులు కనుమరుగవుతున్నాయి.
సవాళ్లు
1) జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వారు నిరుపయోగంగా మారుతారు.
2) నైపుణ్యాల కొరత కారణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోవచ్చు.
3) తక్కువ ‘మానవ అభివృద్ధి సూచిక’ను కలిగి ఉండటం ఒక రకమైన ఆందోళనగా మారింది. కాబట్టి మానవ అభివృద్ధి సూచికను మెరుగుపర్చాలి.
4) అనధికారిక వ్యాపార కార్యకలాపాలు చేసేవారు వారి సొంత ప్రయోజనాలకే ఎక్కువ మొగ్గుచూపుతారు. కాబట్టి ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారు.
5) NSSO – Periodic Labour Force Survey 2017-18 ప్రకారం శ్రామికశక్తి భాగస్వామ్య రేటు 50% (53%) మాత్రమే. మిగిలిన సగం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.
సలహాలు
1) మానవ మూలధనాన్ని నిర్మించడం: అంటే ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాలు ఇది ఆర్థికవృద్ధికి దోహదపడుతుది.
2) NSDC (Natinal Skill Development Corpo ration): 2022 నాటికి దేశంలో 500 మిలియన్ల మందికి నైపుణ్యం అందించాలని లక్ష్యం నిర్దేశించుకొంది.
3) ఆయుష్మాన్ భారత్
4) ICDS ద్వారా పోషకాహారం అందించడం.
5) సంవత్సరానికి పది మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాలి.
6. వీరికోసం PMKVY, ITI లాంటి కోర్సులు అందించాలి.
7) స్త్రీ సాధికారత కార్యక్రమాల ద్వారా స్త్రీలకు ఉపాధి అవకాశాలు అందించాలి.
8) TASK ద్వారా నైపుణ్య శిక్షణ అందించి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధంగా అన్ని రాష్ర్టాల్లో ఇలాంటి నైపుణ్య శిక్షణలు అందించాలి.
అదనపు సమాచారం: దేశంలో మధ్యస్త వయస్సు కేవలం 28 సంవత్సరాలు. చైనా, అమెరికాల్లో 37, పశ్చిమ ఐరోపాలో 45, జపాన్‌లో 49 సంవత్సరాలుగా ఉంది.
5. తెలంగాణ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి వరివరించండి? జనాభా డివిడెండ్ ప్రయోజనాలను పొందడానికి గల మార్గాలను కూడా సూచించండి?
- తెలంగాణలో వయస్సుల వారి నిర్మాణం
1) 15-59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పని చేసే వారి జనాభా 2.2 కోట్ల మందితో అత్యధికంగా ఉంది. ఇది సుమారు మొత్తం జనాభాలో 62 శాతం.
2) ఇందులో గ్రామీణ జనాభా 1.3 కోట్లు, పట్టణ జనాభా 80 లక్షలు. తర్వాత పెద్ద కేటగిరీలు వరుసగా 4-14 సంవత్సరాల మధ్య వయస్కులు 67 లక్షల మంది, 60+ సంవత్సరాల వయస్కులు 32 లక్షల మంది, 0-4 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు 26 లక్షల మంది ఉన్నారు.
3) ప్రస్తుతం తెలంగాణ జనాభాలో 43.6% మంది 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఉన్నారు.
అక్షరాస్యత
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత రేటు 66.5%. అందులో పురుషుల అక్షరాస్యత రేటు 75%, స్త్రీ అక్షరాస్యత రేటు 57.9%.
లింగ నిష్పత్తి
1) రాష్ట్రంలో లింగ నిష్పత్తి 988. మొత్తం 33 జిల్లాల్లోని 13 జిల్లాల్లో 1000 మంది పురుషులకు స్త్రీలు 1000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. కానీ పిల్లల లింగ నిష్పత్తి అధ్వానంగా ఉంది.
2) మొత్తం 33 జిల్లాల్లో కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 1000 మంది అబ్బాయిలకు 950 కంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు.
3) దిగువన ఉన్న 8 జిల్లాల్లో 1000 మంది అబ్బాయిలకు 920 కంటే తక్కువ మంది బాలికలు ఉండగా, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 903గా ఉంది.
ఆయుర్దాయం - నివేదికల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పురుషుల (69.4 సంవత్సరాలు), స్త్రీల (73.2 సంవత్సరాలు) ఆయుర్దాయం జాతీయ స్థాయిలోని పురుషులు (66.9 సంవత్సరాలు), స్త్రీల (70.3 సంవత్సరాలు) ఆయుర్దాయం కంటే ఎక్కువగా ఉంది.
బి. పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ,
లా ఎక్సలెన్స్
ఐఏఎస్ అకాడమీ
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు