Indian Polity – Groups Special | రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లేని రాష్ట్రం?
సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు
1. దేశంలో ప్రభుత్వ విధానాలకు ఆధారం కానిది?
1) ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న సామాజిక, ఆర్థికాభివృద్ధి భావనలు
2) కాలానుగుణంగా అమలు చేసిన ప్రణాళికలు
3) న్యాయవ్యవస్థ వివిధ సందర్భాల్లో వెల్లడించిన తీర్పులు, ఆదేశాలు
4) వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు చేసిన సూచనలు
2. స్టేట్మెంట్స్.
ఎ. జాతీయ జనాభా విధానం- కేంద్ర ప్రభుత్వ విధానం
బి. వ్యవసాయ విధానం- రాష్ట్ర ప్రభుత్వ విధానం
సి. రక్షణ విధానం- కేంద్ర ప్రభుత్వ విధానం
డి. ప్రజా పంపిణీ విధానం- రాష్ట్ర ప్రభుత్వం విధానం
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
3. ఇంగ్లండ్‌లో సాంఘిక సంక్షేమానికి జీవత్వాన్ని కల్పించిన ‘పూర్ లా’ రూపొందించిన సంవత్సరం?
1) 1834 2) 1838
3) 1842 4) 1846
4. అమెరికాలో సాంఘిక సంక్షేమ రంగాన్ని మలుపు తిప్పిన సంఘటన?
1) మొదటి ప్రపంచ యుద్ధం
2) రెండో ప్రపంచ యుద్ధం
3) మహా ఆర్థిక మాంద్యం
4) పారిశ్రామికీకరణ
5. ఏ చట్టం ఆధారంగా అంటరాని, అస్పృశ్య కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పేర్కొన్నారు?
1) 1935 భారత ప్రభుత్వ చట్టం
2) భారత స్వాతంత్య్ర చట్టం- 1947
3) భారత ప్రభుత్వ చట్టం- 1950
4) భారత ప్రభుత్వ చట్టం- 1951
6. జతపర్చండి.
ఎ. అంటరానితనం నిషేధ చట్టం 1. 1990
బి. పౌర హక్కుల రక్షణ చట్టం 2. 1989
సి. షెడ్యూల్డ్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టం 3. 1955
డి. 65వ రాజ్యాంగ సవరణ చట్టం 4. 1976
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
7. అస్పృశ్యత, సాంఘిక రుగ్మత వంటి సమస్యల్లో ఉన్న కులాలను షెడ్యూల్డ్ కులాలుగా రాష్ట్రపతి గుర్తించడానికి ఆధారమైన రాజ్యాంగనిబంధన?
1) 340 2) 341
3) 342 4) 343
8. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డ్ కులాల జనాభా?
1) 16.60 శాతం 2) 15.60 శాతం
3) 15.35 శాతం 4) 16.35 శాతం
9. జీవన్‌ధార ఫౌండేషన్..
1) దళితులు, వెనుకబడిన తరగతులు, వితంతువులు, నిరుద్యోగులు, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం ముంబైలో నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ
2) దళితులు, గిరిజనులు, మహిళల సంక్షేమానికి ఢిల్లీలో నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ
3) అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన రాజకీయేతర సంస్థ
4) దేశంలో నిరాశ్రయులుగా మారిన నిమ్న కులాల సంక్షేమానికి బెంగళూరులో నెలకొల్పిన సాంఘిక సంక్షేమ సంస్థ
10. షెడ్యూల్డ్ కులాల జనాభా 50 శాతం పైన ఉన్న గ్రామాల్లో వారి సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమం?
1) ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన
2) బాబు జగ్జీవన్ రామ్ ఛాత్ర ఆవాస్ యోజన
3) షెడ్యూల్డ్ కులాలకు క్రెడిట్ పెంపుదల గ్యారెంటీ స్కీమ్
4) షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం
11. జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల హబ్ (2016) లక్ష్యం?
1) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వ్యవసాయదారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరికరాలను అందించడం
2) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వృత్తిదారులకు సబ్సిడీకి పనిముట్లను అందించండం
3) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన సహకారాన్ని అందించడం
4) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన నిరక్షరాస్య మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడం
12. స్టేట్మెంట్స్..
ఎ. 2011 జనాభా లెక్కల ప్రకారం 2001-11 మధ్య కాలంలో దేశంలో గిరిజన జనాభా పెరుగుదల రేటు 23.66 శాతం
బి. దేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మొదటి మూడు రాష్ర్టాలు వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా
సి. దేశంలో గుర్తింపు పొందిన ప్రాచీన గిరిజన సమూహాలు 75
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
13. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లేని రాష్ట్రం?
1) అసోం 2) మేఘాలయ
3) మణిపూర్ 4) త్రిపుర
14. దేశంలో గిరిజనులను ఏకాంతంగా (జాతీయ పార్కు మాదిరిగా) అభివృద్ధి చెందించాలని పేర్కొన్నవారు?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) వెరియర్ ఎల్విన్
3) హైమన్ డార్ఫ్ 4) కుమ్రం భీం
15. పదివేల కంటే ఎక్కువ గిరిజన జనాభా గల ప్రాంతాల్లో గిరిజనాభివృద్ధి కోసం అమలు చేస్తున్న వ్యూహం?
1) సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు
2) గిరిజన వికాస ప్రాజెక్టులు
3) పరివర్తిత ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులు
4) గిరిజన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు
16. దేశంలోని గిరిజనుల సామాజిక విద్య, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేయడానికి 2013లో ఏర్పాటు చేసిన కమిటీ
1) రాయ్ బర్మన్ కమిటీ
2) ఎన్ దేబర్ కమిటీ
3) వర్జీనియస్ జాక్సా కమిటీ
4) మహదేవరాయన్ కమిటీ
17. స్టేట్మెంట్స్
ఎ. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 1997లో ప్రత్యేకంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు
బి. 88వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకంగా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను ఏర్పాటు చేశారు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
18. భారత రాజ్యాంగంలోని 164 నిబంధన ప్రకారం గిరిజన మంత్రిత్వ శాఖను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాష్ర్టాలు?
1) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్
2) గుజరాత్, జార్ఖండ్, బీహార్, మణిపూర్
3) జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
4) జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా
19. తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో సౌర, జల, వాయు, బయోమాస్ కేంద్రాల ఏర్పాటు ద్వారా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం 2015లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ?
1) తెలంగాణ స్టేట్ ట్రైబల్ ఎనర్జీ లిమిటెడ్
2) తెలంగాణ స్టేట్ హిల్ ఏరియాస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
3) తెలంగాణ స్టేట్ ట్రైబల్ నాన్ కన్వెన్షనల్ పవర్ లిమిటెడ్
4) తెలంగాణ స్టేట్ ట్రైబల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
20. రోష్నీ పథకం (2013) లక్ష్యం?
1) మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పన
2) షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పన
3) నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో గిరిజన యువతకు శిక్షణ అందించి ఉపాధిని కల్పించడం
4) గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం
21. తెలంగాణలో మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాసంబంధిత స్థితిగతులను అధ్యయనం చేయడానికి 2015లో ఏర్పాటు చేసిన కమిటీ?
1) వీ హన్మంతరావు కమిటీ
2) జీ సుధీర్ కమిటీ
3) జీ అనంతరామన్ కమిటీ
4) ఎం జయధీర్ కమిటీ
23. తెలంగాణలో గిరిజన రైతులకు ప్రయోజనం కల్పిస్తున్న కార్యక్రమం?
1) సీఎం గిరిపుత్ర యోజన
2) సీఎం గిరివికాసం
3) సీఎం ఆత్మనిర్భర్ యోజన
4) సీఎం పరియోజన
24. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిపోషణ కార్యక్రమం లక్ష్యం?
1) గిరిజన బాలింతలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించండం
2) ఆదిమ గిరిజన జాతులకు చెందిన బాలింతలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించండం
3) ఐటీడీఏ పరిధిలోని గిరిజన, గిరిజనేతర బాలలకు పౌష్టికాహారాన్ని అందించడం
4) మైదాన ప్రాంతాల్లోని పేద గిరిజన మహిళలకు పౌష్టికాహారాన్ని అందించడం
25. వెనుకబడిన తరగతుల కమిషన్, సంవత్సరాలను జతపర్చండి.
ఎ. కుమార పిైళ్లె కమిషన్ 1. 1990
బి. అనంతరామన్ కమిషన్ 2. 1980
సి. వెంకటస్వామి కమిషన్ 3. 1964
డి. జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ 4. 1970
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
26. స్టేట్మెంట్స్
ఎ. దేశంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్‌ను 1953లో కాకా కాలేల్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు
బి. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం బీపీ మండల్ అధ్యక్షతన రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
27. మండల్ కమిషన్ వెనుకబడిన తరగుతుల గుర్తింపునకు సంబంధించి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు?
1) సామాజిక పరమైన
2) విద్యాపరమైన
3) ఉపాధి పరమైన
4) ఆర్థిక పరమైన
28. రామ్నందన్ కమిటీ ఏ అంశానికి సంబంధించింది?
1) వెనుకబడిన తరగతులకు ఆర్థిక సహాయం అందించడం
2) ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడం
3) వెనుకబడిన తరగతుల్లో క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని నిర్ణయించడం
4) వెనుకబడిన తరగతుల కులవృత్తులకు సబ్సిడీకి పనిముట్లను అందించడం
29. దేశంలో జైనులకు మతపరమైన మైనారిటీ హోదాను ఎప్పుడు కల్పించారు?
1) 2014, జనవరి 27
2) 2015, జనవరి 27
3) 2014, జనవరి 30
4) 2015, జనవరి 31
30. పథకం, వాటి లక్ష్యాలను జతపర్చండి.
ఎ. సీఖో ఔర్ కమావో 1. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును తెలుసుకోవడం
బి. మిషన్ ఎంపవర్మెంట్ 2. మైనారిటీల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం
సి. ఉస్తాద్ 3. మైనారిటీల నైపుణ్యాన్ని పెంపొందించడం
డి. హమారి ధరోహర్ 4. మైనారిటీల సంప్రదాయ, ప్రాచీన, కళలు, చేతివృత్తుల పరిరక్షణ
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
22. జతపర్చండి.
ఎ. వనబంధు కల్యాణ్ యోజన 1. గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం
బి. గిరిబాల వికాస్ పథకం 2. మానవాభివృద్ధి సూచీలో గిరిజనుల స్థానాన్ని మెరుగుపర్చడం
సి. గిరి వికాస్ పథకం 3. అత్యాచారానికి గురైన గిరిజన మహిళలకు ఆర్థిక, న్యాయ సహాయం
డి. మానిటరీ రిలీఫ్, లీగల్ ఎయిడ్ కార్యక్రమం 4. గిరిజనుల భూమి అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాభివృద్ధి
1) ఎ-1, బి-4, సి-2, డి-3 2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-2, బి-1, సి-4, డి-3 4) ఎ-3, బి-2, సి-4, డి-1
సమాధానాలు
1-4, 2-4, 3-1, 4-3, 5-1, 6-3, 7-2, 8-1, 9-1, 10-1, 11-3, 12-4, 13-3, 14-2, 15-3, 16-3, 17-4, 18-4, 19-4, 20-3, 21-2, 22-3, 23-2, 24-2, 25-4, 26-1, 27-3, 28-3, 29-1, 30-2
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు