Telangana History – Groups Special | అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర సేనాని ఎవరు?
గతవారం తరువాయి..
558. దేవగిరి రాజుల నాణేలు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ లభించాయి?
a) రాచపట్నం b) నర్సీపట్నం
c) విజయవాడ d) అమరావతి
జవాబు: (a)
559. కింది వివరాలను పరిశీలించండి.
1. యాదవుల మీద విజయం సాధించిన రుద్రమ ‘రాయగజకేసరి’ బిరుదు స్వీకరించింది
2. ఈ విజయం నేపథ్యంలో వరంగల్లు స్వయంభూ దేవాలయానికి రంగ మండపం నిర్మించింది
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2 d) ఏదీ కాదు
జవాబు: (c)
560. కింది వివరాలను పరిశీలించండి.
1. కాయస్థ అంబదేవుడు రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు
2. దీన్ని అణచివేసేందుకు రుద్రమదేవితో పాటు రేచర్ల ప్రసాదిత్యుడు త్రిపురాంతకం వెళ్లాడు
3. ఈ యుద్ధంలో రుద్రమ మరణించినట్లు చందుపట్ల శాసనం పేర్కొంటుంది
పై వాటిలో సరైన వాటిని గుర్తించండి?
a) 1 b) 1, 2 c) 1, 3
d) పైవన్నీ సరైనవే జవాబు: (c)
వివరణ: రుద్రమదేవి త్రిపురాంతకం దగ్గర కాయస్థ అంబదేవుడితో జరిగిన యుద్ధంలో మరణించినట్లు చందుపట్ల శాసనంలో ఉంది. ఈ యుద్ధానికి రుద్రమతోపాటు సైన్యాధిపతి మల్లికార్జున నాయకుడు త్రిపురాంతకం వెళ్లాడు. 1289 నవంబర్ 27న మరణించినట్లు చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాన్ని కాకతీయ సైనికుడు పువ్వుల ముమ్మడి వేయించాడు.
561. కింది వివరాలను పరిశీలించండి.
1. రుద్రమదేవి నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది
2. రుద్రమదేవి కాలంలో మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు
పై వాటిలో సరైన వాటిని గుర్తించండి?
a) 1 b) 2 c) 1, 2 d) ఏదీ కాదు
జవాబు: (c)
562. 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలను ఉప్పరిపల్లి యుద్ధంలో వెనక్కి తరిమివేసిన కాకతీయ సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు?
a) గోన గన్నారెడ్డి, రేచర్ల రుద్రుడు
b) మల్యాల చౌండరాయలు, గోన గన్నారెడ్డి
c) వెన్నమ నాయకుడు, పోతుగంటి మైలి
d) కాయస్థ అంబదేవుడు, రేచర్ల ప్రసాదిత్యుడు
జవాబు: (c)
వివరణ: దీనికి సంబంధించిన వివరాలు వెలుగోటివారి వంశావళిలో ఉన్నాయి.
563. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసినప్పుడు ఎవరు నాయకత్వం వహించారు?
a) జఫర్ ఖాన్
b) మాలిక్ కాఫర్ హజార్ దీనారి
c) ఘాజీమాలిక్ d) జునాఖాన్
జవాబు: (b)
వివరణ: ఈ దాడిలో కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి సైన్యాలు ఓడిపోయాయి. అల్లావుద్దీన్ ఖిల్జీతో సంధి చేసుకున్నాయి. భారీ మొత్తంలో కప్పం చెల్లించాడు.
564. 1323లో ఢిల్లీ సుల్తాన్ సైన్యాలు ఎవరి నాయకత్వంలో కాకతీయ ప్రతాపరుద్రుడి మీదికి దండెత్తాయి?
a) జునాఖాన్ b) ఘాజీమాలిక్
c) మాలిక్ కాఫర్ d) ఫిరోజ్ షా తుగ్లక్
జవాబు: (a)
వివరణ: ఈ యుద్ధంలో రెండో ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. బందీగా ఢిల్లీకి వెళ్తుండగా మార్గమధ్యలో నర్మదా నదిలో (సోమోద్భవ) ప్రాణత్యాగం చేసినట్లు ముసునూరి ప్రోలయ నాయకుడి విలాస తామ్ర శాసనం, రెడ్డి రాణి అనితల్లి కలువచేరు తామ్ర శాసనంలో పేర్కొన్నారు. జునాఖాన్ తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించాడు. ప్రతాపరుద్రుడి ప్రాణత్యాగంతో తెలుగు నాట కాకతీయుల పాలన ముగిసిపోయింది.
565. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లుకు ఏ పేరును పెట్టాడు?
a) ఘాజపుర్ b) మహమ్మద్ నగర్
c) దౌలతాబాద్ d) సుల్తాన్‌పుర్
జవాబు: (d)
566. కాకతీయుల కాలంలో అంతఃపుర రక్షకుడిని ఏమని పిలిచేవారు?
a) పాడి కావలి b) నగరశ్రీ కావలి
c) అంతఃపుర కావలి d) లెంక
జవాబు: (b)
567. కాకతీయుల పాలనా విభాగాలకు సంబంధించి సరైన అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
a) రాజ్యం, గ్రామం, స్థలం, నాడు
b) రాజ్యం, స్థలం, నాడు, గ్రామం
c) రాజ్యం, నాడు, స్థలం, గ్రామం
d) గ్రామం, స్థలం, నాడు, రాజ్యం
జవాబు: (c)
568. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన ఎవరి చేతుల్లో ఉండేది?
a) నాయంకరులు b) ప్రాడ్వివాకులు
c) ప్రెగ్గడలు d) ఆయగార్లు
జవాబు: (d)
వివరణ: కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, రజక, నాయీబ్రాహ్మణ, చర్మకార, వెట్టి మొత్తం 12 మంది ఆయగార్లుగా ఉండేవారు. వీరిలో కరణం, రెడ్డి, తలారి ప్రభుత్వ ఉద్యోగులు. కరణం భూములు, పన్నుల లెక్కలు చూసేవాడు. రెడ్డి శిస్తు వసూలు చేసేవాడు. తలారి శాంతిభద్రతలు పర్యవేక్షించేవాడు.
569. కాకతీయుల పాలనకు సంబంధించి ‘జయపత్రాలు’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) ధర్మాసనాల తీర్పులు
b) రాజులు యుద్ధాల్లో సాధించిన విజయాలు
c) కవులకు సన్మాన పత్రాలు
d) సైనికులకు పురస్కారాలు
జవాబు: (a)
వివరణ: ఈ జయపత్రాల మీద ముద్రలు వేయడానికి ముద్రవర్తులు అనే ఉద్యోగులు ఉండేవారు.
570. కాకతీయుల కాలంలో భూమిశిస్తు చెల్లించేవారిని ఏమని పిలిచేవారు?
a) కాపులు b) అరిగాపులు
c) సుంకరులు d) శిస్తురైతులు
జవాబు: (b)
వివరణ: అరి అంటే భూమిశిస్తు. అరిగాపులు అంటే శిస్తు చెల్లించేవారు.
571. కాకతీయుల కాలానికి సంబంధించి ‘కేసరి పాటిగడ’ అనేది దేన్ని సూచిస్తుంది?
a) భూమిని కొలిచే సాధనం
b) పంటను కొలిచే సాధనం
c) సింహాలను లెక్కించే విధానం
d) రాజుల చేతిలో ఉండే దండం
జవాబు: (a)
వివరణ: ఇది 32 జానలు ఉండేది.
572. కాకతీయుల కాలంలో రాజు సొంత పొలానికి ఉన్న పేరేంటి?
a) వెలిపొలం b) నీరుపొలం
c) తోటపొలం d) రాచదొడ్డి
జవాబు: (d)
వివరణ: దీన్ని రైతులకు సగం ఆదాయం ఇచ్చే ఒప్పందంపై ‘కోరు’ పేరుతో కౌలుకు ఇచ్చేవాళ్లు. సగం ఆదాయం ఇవ్వాల్సి వచ్చేది కాబట్టి ఈ విధానానికి ‘అర్ధశీరి’ అని పేరు.
573. లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణపతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి?
a) 1896 b) 1897
c) 1895 d) 1893
జవాబు: (c)
574. కాకతీయుల పాలనకు సంబంధించి ‘ఘట్టాలు’ అంటే ఏమిటి?
a) విద్యాలయాలు
b) సుంకాలు వసూలు చేసే స్థలాలు
c) కొన్ని ప్రత్యేకమైన వస్తువులు
అమ్మే స్థలాలు
d) నాటకాలు ప్రదర్శించే వేదికలు
జవాబు: (b)
575. కాకతీయుల కాలపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్వదేశీ, నానాదేశీ పెక్కండ్రు, ఉభయదేశీ, నకరం, పరదేశీ అనే పదాలు వేటిని సూచిస్తాయి?
a) వర్తక సంఘాలు
b) విదేశీ వలసలు
c) విదేశీయుల నౌకలు
d) కాకతీయులు విదేశీయుల కోసం ఏర్పాటుచేసిన వసతులు జవాబు: (a)
576. కాకతీయుల సమకాలీన సమాజంలో ‘చాపకూడు’ విధానంతో సామాజిక సమానత్వానికి ఎవరు కృషిచేశారు?
a) గణపతిదేవుడు
b) పాల్కురికి సోమనాథుడు
c) పల్నాటి బ్రహ్మదేవుడు
d) ఆరవెల్లి నాగమ్మ జవాబు: (c)
577. కింది వారిలో ఎవరిని కాకతీయుల కాలంలో యుద్ధ దేవుడిగా ఆరాధించేవాళ్లు?
a) విష్ణుమూర్తి b) ఇంద్రుడు
c) కుమారస్వామి d) మైలారుదేవుడు
జవాబు: (d)
578. కాకతీయులు తొలినాళ్లలో ఆచరించిన మతం ఏది?
a) దిగంబర జైనం
b) శ్వేతాంబర జైనం
c) కాలాముఖ శైవం d) పాశుపత శైవం
జవాబు: (a)
579. కాకతీయుల కాలపు సాహిత్యంలో దశకుమార చరిత్ర, ఆంధ్రభాషా భూషణం, కాదంబరి అనే రచనలు ఎవరివి?
a) మారన
b) మూలఘటిక కేతన
c) నంది మల్లయ, ఘంట సింగయ
d) పిడుపర్తి సోమనాథుడు జవాబు: (b)
వివరణ: కేతన సంస్కృత విజ్ఞానేశ్వరీయంలోని వ్యవహార కాండను తెలుగులోకి అనువదించాడు.
580. కాకతీయు కాలం నాటి సంగీత వాద్యాలకు సంబంధించి ‘జలకరండం’ ప్రస్తావన ఏ శాసనంలో వస్తుంది?
a) హనుమకొండ శాసనం
b) కాజీపేట దర్గా శాసనం
c) బయ్యారం చెరువు శాసనం
d) ధర్మసాగర్ శాసనం జవాబు: (d)
581. కాకతీయుల అనంతర కాలంలో యుద్ధంలో మరణించిన వారి రక్తమాంసాలను భూతప్రేతాలకు నివేదించే ఆచారానికి ఏమని పేరు?
a) రణాహారం b) రణముకుడుపు
c) రణముకొలుపు d) భూతబలి
జవాబు: (b)
582. మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఆస్థానానికి మొగల్ చక్రవర్తి అక్బర్ ఎవరిని రాయబారిగా పంపించాడు?
a) జహంగీర్ b) అబుల్ ఫజల్
c) మసూద్ బేగ్ d) బీర్బల్
జవాబు: (c)
583. గోల్కొండ సామ్రాజ్యం సకల సంపదలతో తులతూగుతూ ఎవరి కాలంలో ‘రెండో ఈజిప్టు’గా ప్రసిద్ధిచెందింది?
a) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
b) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
c) అబ్దుల్లా కుతుబ్‌షా
d) అబుల్ హసన్ తానీషా జవాబు: (a)
584. గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన వెనీస్ యాత్రికుడు ఎవరు?
a) నికోలో డి కాంటి
b) జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్
c) కెప్టెన్ థామస్ రో
d) నికోలో మానుక్సి
జవాబు: (d)
585. బ్రిటిష్ వారికి వర్తకానికి అనుమతినిస్తూ బంగారు ఫర్మానాను జారీచేసిన గోల్కొండ పాలకుడు ఎవరు?
a) మహమ్మద్ కులీకుతుబ్‌షా
b) అబుల్ హసన్ తానీషా
c) అబ్దుల్లా కుతుబ్‌షా
d) హయత్బక్షీ బేగం జవాబు: (c)
వివరణ: అబ్దుల్లా కుతుబ్‌షా 1636లో బ్రిటిష్ వారికి వర్తకానికి అనుమతిని ఇస్తూ బంగారు ఫర్మానా జారీచేశాడు.
586. 1883లో చాందా రైల్వే ఆందోళన సమయంలో నిజాం రాజ్యంలో తొలిసారిగా బహిష్కరణ శిక్షకు గురైన విద్యావేత్త ఎవరు?
a) సరోజినీ నాయుడు
b) అఘోరనాథ ఛటోపాధ్యాయ
c) సయ్యద్ బద్రుల్ హసన్ తిర్మయిజీ
d) బారిస్టర్ రుద్ర జవాబు: (b)
వివరణ: ఆధునిక హైదరాబాద్ చరిత్రలో ఇదే చాందా రైల్వే పథకంగా ప్రసిద్ధి చెందింది. ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేసేందుకు అఘోరనాథ ఛటోపాధ్యాయతో పాటు ముల్లా అబ్దుల్ ఖయ్యూం, దస్తూర్ జీ జాసాజీ హోసంగ్ కృషిచేశారు. దస్తూర్జీని పుణే తరలించారు.
587. హైదరాబాద్ సంస్థానం నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరిన తొలి వ్యక్తి ఎవరు?
a) అఘోరనాథ ఛటోపాధ్యాయ
b) కేశవరావు కోరాట్కర్
c) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
d) పండిట్ నరేంద్రజీ జవాబు: (c)
588. 1888 అక్టోబర్ 19న సికింద్రాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
a) కృష్ణ అయ్యంగార్
b) అఘోరనాథ ఛటోపాధ్యాయ
c) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
d) రామచంద్ర పిైళ్లె జవాబు: (c)
* 19వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్‌లో జొరాస్ట్రియన్ ఇరానీ వలసదారులు ఏ వంటకాన్ని పరిచయం చేశారు? (గ్రూప్-1 ప్రిలిమ్స్ 2023)
1) కుబానీ కా మీఠా 2) చాయ్
3) బిర్యానీ 4) హలీమ్
జవాబు: (2)
వివరణ: ఇరానీ చాయ్ హైదరాబాద్ నగర ఆహార విధానాల్లో ప్రత్యేకమైనది. దీన్ని 19వ శతాబ్దంలో ఇరాన్‌కు చెందిన జొరాస్ట్రియన్ (పార్సీ) వలసదారులు హైదరాబాద్‌కు పరిచయం చేశారు. పార్సీలు మొదట ఇరాన్ నుంచి ముంబై వచ్చారు. అక్కడినుంచి పుణె, హైదరాబాద్ నగరాలకు చేరుకున్నారు.
** ఏ కాకతీయ సామంత పరిపాలకుల కుటుంబ చరిత్ర గురించి ‘శివయోగసారము’ వివరిస్తున్నది? (గ్రూప్-1 ప్రిలిమ్స్ 2023)
1) కోట నాయకులు
2) మల్యాల నాయకులు
3) ఇందులూరి నాయకులు
4) చెరకు నాయకులు
జవాబు: (3)
వివరణ: శివయోగసారమును కాకతీయుల కాలానికి చెందిన కొలని గణపతిదేవుడు రచించాడు. ఇందులో కాకతీయుల సామంతులైన ఇందులూరి నాయకుల చరిత్ర వివరాలు ఉన్నాయి.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు