TET Physics Special | ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
1. ప్రతిపాదన (ఎ): ఓ రేడియో పని చేయడానికి అనునాద ధర్మం ఉపయోగపడుతుంది.
కారణం (ఆర్): సమాన పౌనఃపున్యం గల రెండు వస్తువుల్లో ఒక వస్తువు కంపిస్తే రెండోది కంపిస్తుంది.
1) ఎ, ‘ఆర్’లు సరైనవి, ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ
2) ఎ, ‘ఆర్’లు సరైనవి, ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ కాదు
3) ‘ఎ’ మాత్రమే సరైనది
4) ‘ఆర్’ మాత్రమే సరైనది
2. ప్రతిపాదన (ఎ): స్థిర తరంగాలు శక్తిని ఒక బిందువు నుంచి మరొక బిందువుకు తీసుకొని వెళ్లలేవు.
కారణం (ఆర్): అవరుద్ధ తరంగాలు కొంతదూరం ప్రయాణించిన పిమ్మట క్షీణిస్తాయి.
1) ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ
2) ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ కాదు
3) ‘ఎ’ ‘ఆర్’ లు సరైనవి
4) ‘ఎ’, ‘ఆర్’ లు సరైనవి కావు
3. కింద పేర్కొన్న ఏ యానకంలో ధ్వనివేగం అధికంగా ఉంటుంది?
ఎ) గాలి బి) నీరు
సి) పాదరసం డి) ప్లాస్టిక్
4. కింద వాటిలో సరైనది ఏది?
ఎ) స్టెతస్కోప్ బహుళ పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తుంది
బి) ప్రతిధ్వని వినిపించడానికి ధ్వని జనకానికి పరావర్తన తలానికి మధ్య ఉండాల్సిన కనీస దూరం 16.5 మీ.
సి) రేడియో పని చేయడం అనునాదం ధర్మం ఆధారంగా పనిచేస్తుంది.
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
5. రెలు కూత పెడుతూ స్టేషన్ నుంచి దూరంగా వెళ్లేటప్పుడు, ప్లాట్‌ఫారంపై నిలుచున్న వ్యక్తికి వినబడే కూత పౌనఃపున్యం?
1) కూత వాస్తవ పౌనఃపున్యం కంటే ఎక్కువ
2) కూత వాస్తవ పౌనఃపున్యం కంటే తక్కువ
3) కూత వాస్తవ పౌనఃపున్యానికి సమానం
4) 1, 2
6. సూపర్ సోనిక్ విమానం గంటకు కనీసం ఎన్ని కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది?
1) 1200 కి.మీ 2) 1000 కి.మీ
3) 8000 కి.మీ 4) 7000 కి.మీ
7. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో ధ్వని వేగం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు
4) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
8. ఎ) ధ్వని తరంగంలోని ఒక నిర్దిష్ట స్థానం వద్ద యానకం సాంద్రత ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు?
బి) ధ్వని తరంగం ఆవర్తన కాలపు ఎస్ఐ ప్రమాణం సెకను
సి) కీచు స్వరం, బొంగురు స్వరాల మధ్య తేడాను తెలిపేది పిచ్
పైవాటిలో సరైనవి ఏవి?
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) సి మాత్రమే
9. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) శబ్ద స్పర్శ 0.1 సెకన్లు ఉంటే దాన్ని ధ్వని స్థిరత్వం అంటాం
బి) 0.1 సెకన్ల కంటే తక్కువ కాలంలో పరావర్తనం చెందిన ప్రతి ధ్వని వినలేం
సి) 0.1 సెకన్ల కంటే తక్కువ కాలంలో పరావర్తనం ధ్వని వినిపిస్తే దాన్ని ప్రతినాదం అంటారు
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) సి మాత్రమే
10. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు?
1) డెస్సీ మీటర్స్ 2) డెసిబెల్
3) డెసిజౌళ్లు 4) డెసిక్రోమ్స్
11. కింది వాటిని జతపరచండి? తరంగధైర్ఘ్యం మీటర్లలో
ఎ) గామా కిరణాలు 1) 10-10 నుంచి 10-16
బి) X కిరణాలు 2) 10-10 నుంచి 10-12
సి) అతినీలలోహిత 3) 4×10-7 నుంచి 10-8
డి) రేడియో తరంగాలు 4) 102 నుంచి 1.5
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
12. ఒక వ్యక్తి పక్క గదిలోని మాటలను వినడానికి కారణం?
1) ధ్వని పరావర్తనం
2) ధ్వని వివర్తనం
3) ధ్వని వక్రీభవనం 4) అతిధ్వని
13. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) కంపించే వస్తువు సమీపించే కొద్ది ధ్వని పెరగడం దూరం పెరిగిన కొద్ది తగ్గడాన్ని డాప్లర్ ఫలితం అంటారు.
బి) సముద్రాల లోతును కనుగొనడానికి ప్రతిధ్వనిని ఉపయోగిస్తారు
సి) నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ప్రాథమిక రంగులు
1) ఎ, బి, 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
14. అనుదైర్ఘ్య తరంగం కిందివాటిని కలిగి ఉంటుంది?
1) శృంగాలు, ద్రోణులు
2) సంపీడన, విరళీకరణాలు
3) ప్రస్పందన, అస్పందనాలు
4) పైవేవీకావు
15. కింది వాటిని జతపరచండి?
ఎ) శ్రవ్య అవధి 1) 20,000Hz ల కన్న అధికం
బి) పరశ్రావ్యాలు 2) 20Hz ల కన్న తక్కువ
సి) అతి ధ్వనులు 3) 20Hz – 20,000Hz ల మధ్య
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-2, బి-1, సి-3
16. పాటల రికార్డింగ్‌ను ప్రత్యేక గదుల్లో నిర్వహించడానికి కారణం?
1) బయటి ధ్వనులు రికార్డు కాకూడదని
2) ఆ గదిలోని ధ్వనుల ప్రతినాదం తగ్గించడానికి
3) పాడే వ్యక్తి ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానికి
4) 1, 2
17. గబ్బిలాలు తమ ప్రయాణ మార్గంలో అవరోధాలను గుర్తించే ప్రక్రియ?
1) అతిధ్వనుల పరావర్తనం
2) అతిధ్వనుల వక్రీభవనం
3) అతిధ్వనుల వివర్తనం
4) అతిధ్వనుల ధ్రువణం
18. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) అనుధైర్ఘ్య తరంగాలు ఎల్లప్పుడు శృంగాలు, ద్రోణుల రూపంలో ప్రయాణిస్తాయి.
బి) తిర్యక్ తరంగాలు ఎల్లప్పుడు సంపీడ్యాలు, విరళీకరణాల రూపంలో ప్రయాణిస్తాయి.
1) ఎ 2) బి
3) ఎ, బి సరైనవి
4) ఎ, బి సరికావు
19. కింది వాటిలో సరైనవి?
ఎ) సోనార్ అనేది అతిధ్వనుల ఆధారంగా పనిచేస్తుంది.
బి) స్కానింగ్ ప్రక్రియలో అతిధ్వనులు ఉపయోగిస్తారు.
సి) కిడ్నీలో రాళ్లను కరిగించడంలో అతిధ్వనులు ఉపయోగిస్తారు.
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి
20. పిల్లన గ్రోవి విజిల్, రేడియో పనిచేసే ధర్మం?
1) ప్రతిధ్వని 2) అనునాదం
3) డాప్లర్ ప్రభావం 4) సోనార్
21. కింది వాటిని జతపరచండి.
ఎ) వస్తువు వేగం ధ్వని వేగం కంటే తక్కువ 1) సోనిక్ వేగం
బి) వస్తువు వేగం ధ్వని 2) సబ్ సోనిక్ వేగంతో సమానం వేగం
సి) వస్తువు వేగం ధ్వని 3) సూపర్ వేగం కంటే ఎక్కువ సోనిక్ వేగం
డి) వస్తువు వేగం ధ్వని 4) హైపర్ వేగానికి 5 రెట్లు సోనిక్ వేగం కన్నా ఎక్కువ
22. కింది వాటిని జతపరచండి?
ధ్వని తీవ్రత
ఎ) టెలిఫోన్ 1) 60 డిబి
మోగుతున్నప్పుడు
బి) ట్రాఫిక్ 2) 90 డిబి
ఉన్నప్పుడు
సి) మామూలు 3) 40 డిబి
సంభాషణ
డి) రాక్ సంగీతం 4) 120 డిబి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-3, సి-2, డి-4
23. మేఘం ఒకసారి ఉరిమితే నాలుగైదుసార్లు వినిపించడానికి కారణం?
1) ఒక ఉరుము మరో మేఘం ఉరమడానికి కారణమవుతుంది
2) ఒక ఉరుము అదే మేఘం మరోసారి ఉరమడానికి కారణమవుతుంది
3) ఉరుము భూమికి, మేఘానికి మధ్య బహుళ పరావర్తనం చెందుతుంది
4) పైవన్నీ సరైనవే
24. మనిషి వినగల తరంగాల పౌనఃపున్యం వ్యాప్తి?
1) 20Hz – 20,000Hz
2) 30Hz – 30,000Hz
3) 20Hz – 2000Hz
4) 30Hz – 3000Hz
25. ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) పౌనఃపున్యం 2) తరంగ దైర్ఘ్యం
3) యానకం 4) ధ్వని జనకం
26. కిందివాటిలో సరికానిది ఏది?
1) ధ్వని తీవ్రత పౌనఃపున్యంపై ఆధారపడదు
2) ధ్వని స్థాయిత్వాన్ని కొలవడానికి ‘టోనోమీటర్’ ఉపయోగిస్తారు
3) ధ్వని స్థాయిత్వం కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది
4) ధ్వని తీవ్రత ప్రమాణాలు డెసిబెల్స్
27. ఆడవాళ్ల గొంతు మగవాళ్ల కంటే కీచుగా ఉండటానికి కారణం ఏమిటి?
1) తక్కువ పౌనఃపున్యం
2) తక్కువ తరచుదనం
3) ఎక్కువ పౌనఃపున్యం
4) ఎక్కువ తరచుదనం
28. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ) అతిధ్వనులు 1) మానవుడు
బి) పరశ్రావ్యాలు 2) తేనెటీగలు
సి) సాధారణ ధ్వనులు 3) గబ్బిలాలు
డి) అతినీలలోహిత 4) పాములు
కిరణాలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-2, సి-3, డి-2
29. ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం?
1) ఈసీజీ 2) రాడార్
3) స్టెతస్కోప్ 4) అల్ట్రాసోనోగ్రఫీ
30. ఎ) డాక్టర్లు ఉపయోగించే స్టెతస్కోప్ ధ్వని బహుళ పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది
బి) లోతైన బావులు, లోయల లోతులను కనుగొనడానికి అతి ధ్వనులను ఉపయోగిస్తారు
పైవాటిలో సరైనది ఏది?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
31. కింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి?
ఎ) అతిధ్వనుల పౌనఃపున్యం 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువగా ఉంటుంది
బి) కుక్కల్లో శృతిగ్రాహత ఎక్కువగా ఉండటం వల్ల అవి అతి ధ్వనులను వినగలుగుతాయి
సి) అతి ధ్వనులను రాడార్‌లో ఉపయోగిస్తారు
డి) అతి ధ్వనుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) డి మాత్రమే
32. మాక్నెంబర్ దేనికి సంబంధించింది?
1) ధ్వని 2) విద్యుత్
3) అయస్కాంతం 4) కాంతి
33. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది?
1) టెలిఫోన్ 2) హైడ్రోఫోన్
3) మైక్రోఫోన్ 4) రేడియో
34. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
1) ఫొటోమెట్రి 2) సెలినాలజీ
3) కెలోరిమెట్రీ 4) ఎకోస్టిక్
35. టీవీ ఆన్ చేసినప్పుడు?
1) మొదట బొమ్మ కనిపిస్తుంది
2) మొదట మాటలు వినిపిస్తాయి
3) బొమ్మ, మాటలు ఒకేసారి వస్తాయి
4) పెట్టిన ఛానల్‌పై ఆధారపడి బొమ్మ, మాటలు వస్తాయి
36. ప్రతిపాదన (ఎ): ఎత్తు తక్కువ ఉన్న పర్వతాలపై గాలిలో ధ్వని వేగంలో ఎటువంటి మార్పు ఉండదు.
కారణం (ఆర్): గాలిలో ధ్వని వేగం అనేది దాని పీడనంపై ఆధారపడి ఉండదు.
1) ఎ, ‘ఆర్’లు సరైనవి, ‘ఎ’ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ‘ఆర్’లు సరైనవి, ‘ఎ’ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ‘ఎ’ మాత్రమే సరైనది
4) ‘ఆర్’ మాత్రమే సరైనది
37. ఖాళీగా ఉన్న గదిలో ధ్వని పలుమార్లు వినబడటానికి కారణం?
1) అనునాదం 2) ప్రతినాదం
3) విస్పందనాలు 4) ప్రతిధ్వని
38. మనిషి చెవి ఒక సెకనులో స్పష్టంగా వినగల ధ్వని మాత్రల సంఖ్య గరిష్ఠంగా?
1) 5 2) 10 3) 15 4) 20
39. కిందివాటిలో సరికానిది ఏది?
1) పాలలోని బ్యాక్టీరియాను 62o నుంచి 67o C వరకు వేడి చేసి నశింపజేస్తారు
2) 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు అతి ధ్వనులు
3) చిన్న పిల్లలు వినే శ్రవ్య అవధి 30,000 Hz
4) 20Hz కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను శ్రావ్యఅవధి అంటారు
40. సంగీత వాయిద్య పరికరాలను శృతి చేయడంలో ఉపయోగపడే ప్రక్రియ?
1) ప్రతి ధ్వనులను గుర్తించడం
2) ప్రతినాద కాలాన్ని గుర్తించడం
3) విస్పందనాలను గుర్తించడం
4) అనునాదాన్ని గుర్తించడం
ANS
1-1 2-3 3-3 4-4
5-2 6-1 7-1 8-3
9-3 10-2 11-1 12-2
13-3 14-2 15-2 16-4
17-1 18-4 19-3 20-2
21-2 22-1 23-3 24-1
25-3 26-3 27-3 28-2
29-3 30-3 31-3 32-1
33-3 34-4 35-2 36-1
37-2 38-2 39-4 40-3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు