Biology | గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటస్టైన్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1. కింది వాటిని జతపరచండి.
వ్యాధి పేరు వ్యాధికారక బ్యాక్టీరియా
ఎ. ధనుర్వాతం 1. క్లాస్ట్రీడియమ్ టెటాని
బి. కోరింత దగ్గు 2. హిమోఫిల్లస్ పెర్టుసిస్
సి. గొంతు వాపు 3. స్ట్రెప్టోకోకస్
డి. సిఫిలిస్ 4. ట్రిపోనిమా పల్లిడమ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
2. ప్రతిపాదన(ఎ): కలుషిత ఆహారం వల్ల బొట్యులిజం వ్యాధి సంభవిస్తుంది
కారణం(ఆర్): క్లాస్ట్రీడియమ్ టెటాని అనేది బొట్యులిజం వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా
1) ఎ సరైంది. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ సరైంది. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఆర్ సరైంది
4) ఎ, ఆర్ రెండూ సరైనవి కావు
3. కింది వాటిలో భిన్నమైనది ఏది?
1) మశూచి 2) డిఫ్తీరియా
3) కలరా 4) న్యుమోనియా
4. కింది వాటిని జతపరచండి.
వ్యాధి పేరు వ్యాధి కారకం
ఎ. డిఫ్తీరియా 1. కార్ని
బి. గనేరియా 2. డిప్లోకోకస్
సి. సిఫిలిస్ 3. ట్రిపోనిమా పల్లిడమ్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-1, బి-3, సి-2
5. ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?
1) మశూచి 2) కలరా
3) పోలియో 4) క్షయ
6. ప్లాస్మోడియం వల్ల కలిగే మలేరియా దేని వల్ల వ్యాప్తి చెందుతుంది?
1) గాలి 2) స్పర్శ
3) ఆహారంపై ఈగలు 4) దోమ కాటు
7. పెరుగు తయారు కావడానికి ఉపయోగపడేది?
1) రైజోబియం 2) లాక్టోబాసిల్లస్
3) స్టెఫైలోకోకస్ 4) స్ట్రెప్టోకోకస్
8. కింది వేటి తయారీలో ఈస్ట్‌లు ఉపయోగిస్తారు?
1) చక్కెర 2) సిట్రిక్ ఆమ్లం
3) ఆల్కహాల్ 4) పెరుగు
9. వెస్ట్రన్ బ్లాట్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని నిర్ధారిస్తారు?
1) టైఫాయిడ్ 2) సిఫిలిస్
3) గనేరియా 4) ఎయిడ్స్
10. ఎబోలా వ్యాధి కారకం?
1) వైరస్ 2) బ్యాక్టీరియా
3) శిలీంధ్రం 4) ప్రొటోజోవా
11. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) వ్యాధి కారకం?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) ప్రొటోజోవా 4) శిలీంధ్రం
12. తామర వేటి వల్ల కలుగుతుంది?
1) శిలీంధ్రం 2) వైరస్
3) బ్యాక్టీరియా 4) ప్రొటోజోవా
13. కింది వాటిని జతపరచండి.
ఎ. ప్లాస్మోడియం 1. అమీబియాసిస్
బి. ఎంటామీబా 2. బోదకాలు
సి. టీనియా 3. మలేరియా
డి. ఉకరేరియా 4. సిస్టోసోమియాసిస్
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
14. వీటిలో విభిన్నమైంది ఏది?
1) మశూచి 2) తట్టు
3) కలరా 4) క్షయ
15. మశూచి:వైరస్:మలేరియా: ?
1) శిలీంధ్రం 2) ప్రొటోజోవా
3) బ్యాక్టీరియా 4) వైరస్
16. కింద తెలిపిన వ్యాధుల్లో శిలీంధ్రం వల్ల కలిగేది?
1) పసుపు పచ్చ ఈనెల వ్యాధి
2) టొబాకో మొజాయిక్
3) గోధుమ కుంకుమ తెగులు
4) వడలడం
17. సిట్రస్ కాంకర్ ఏ జీవుల్లో ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది?
1) పశువుల్లో, వైరస్ వల్ల
2) మొక్కల్లో, బ్యాక్టీరియా వల్ల
3) మానవుల్లో, బ్యాక్టీరియా వల్ల
4) మొక్కల్లో, వైరస్ వల్ల
18. ఆంత్రాక్స్ వ్యాధి కారకం?
1) వైరస్ 2) బ్యాక్టీరియా
3) ప్రొటోజోవా 4) శిలీంధ్రం
19. పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి కారకం?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) ప్రియాన్ 4) శిలీంధ్రం
20. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. శాండ్ ఈగ కాటు వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
బి. సీసీ ఈగ కాటు వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
21. లాక్‌జా అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) న్యుమోనియా 2) ధనుర్వాతం
3) ప్లేగు 4) గనేరియా
22. డీపీటీ టీకా ఏ వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తారు?
1) కుష్టు
2) డిఫ్తీరియా (కోరింత దగ్గు)
3) క్షయ
4) టైఫాయిడ్
23. కింది వాటిని జతపరచండి.
వ్యాధి పేరు వ్యాధి కారకం
ఎ. మెదడు 1. ఆర్బో వైరస్ వాపు వ్యాధి
బి. మశూచి 2. వరియోల
సి. పోలియో 3. ఎంటిరో
డి. చికున్ గున్యా 4. ఆల్ఫా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
24. కింది వాటిలో భిన్నమైనది?
1) తట్టు 2) పోలియో
3) చికున్ గున్యా 4) క్షయ
25. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ట్రిపనోసోమా గాంబియెన్సీ వ్యాధి కారకం వల్ల అతి నిద్ర వ్యాధి కలుగుతుంది
బి. బ్లాక్ సిక్నెస్ వ్యాధి కారకం లీష్మానియా డోనోవాని
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీ కాదు
26. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. రాణిఖేట్ అనే వ్యాధి పశువుల్లో వైరస్ ద్వారా సంభవించే వ్యాధి
బి. రింగ్వార్మ్ అనేది ఒక శిలీంధ్రపు వ్యాధి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కావు
27. కింది వాటిని జతపరచండి.
ఎ. టీనియాసిస్ అనేది హెల్మింథిస్ వ్యాధి
బి. ట్రిపనోసోమా అనే వ్యాధి కారకం వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
సి. ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఒక వైరస్
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) సి
28. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. హాన్సన్ పేరు గల వ్యాధి కుష్టు
బి. నిశబ్ద హంతకి అని గుండెపోటును పేర్కొంటారు
సి. మెదడుకు సబంధించిన వ్యాధి మెనింజైటిసిస్
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, సి
29. కింది వాటిలో కంటామినేషన్ వ్యాధికి ఉదాహరణ ఏది?
1) ఫ్లూ 2) అమీబియాసిస్
3) తట్టు 4) డిఫ్తీరియా
30. కింది వాటిని జతపరచండి.
వ్యాధి వ్యాధి కారకం
ఎ. కలరా 1. వైరస్
బి. మలేరియా 2. బ్యాక్టీరియా
సి. చికున్ గున్యా 3. ప్రొటోజోవా
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-1, బి-3
31. సీసీ ఈగ ద్వారా ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది?
1) అమీబియాసిస్ 2) మలేరియా
3) కలరా 4) ట్రిపనోసోమియాసిస్
32. ఓరియంటల్ సోర్స్ (ఢిల్లీ బోయిల్) వ్యాధి ఏ క్రిమి వల్ల కలుగుతుంది?
1) లీష్మానియా డోనోవాని
2) లీష్మానియా ట్రోపికా
3) ట్రైకోమోనాస్ విజినాలిస్
4) ఎంటమీబా హిస్టాలిటికా
33. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటస్టైన్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) జియార్డియాసిస్ 2) విజినైటిస్
3) బ్లాక్ సిక్నెస్ 4) టీనియాసిస్
34. కింది అంశాలు అధ్యయనం చేయండి.
ఎ. ప్లాస్మోడియం వల్ల మానవుడి కాలేయ కణాలు నాశనం అవుతాయి
బి. ఎంటామీబా హిస్టాలిటికా వల్ల మలేరియా వ్యాధి కలుగుతుంది
సి. ఉకరేరియా వల్ల మానవుడిలో ఫైలేరియాసిస్ వ్యాధి కలుగుతుంది
డి. లీష్మానియా వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
పై వాటిలో సరైన అంశాలు?
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, సి
35. ఉకరేరియా సాధారణ నామం?
1) మలేరియా పరాన్నజీవి
2) కొంకి పురుగు
3) బోద పురుగు 4) నులి పురుగు
36. మలేరియా పరాన్నజీవి శాస్త్రీయనామం?
1) ఎంటామీబా 2) ప్లాస్మోడియం
3) ఉకరేరియా 4) టీనియా
37. దోమ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి?
1) అతినిద్ర వ్యాధి
2) కాలా అజార్
3) ఢిల్లీ బాయిల్స్
4) మలేరియా
38. కొంకి పురుగు ద్వారా ఏ వ్యాధి సంక్రమిస్తుంది?
1) ఆస్కారియాసిస్
2) ఎంకైలోస్టోమియాసిస్ (హుక్వార్మ్ డిసీజ్)
3) ఎంటిరోబియాసిస్ (పిన్‌వార్మ్ డిసీజ్)
4) ఫైలేరియాసిస్
39. ఎలిఫెంటియాసిస్ (బోదకాలు) ఏ జీవి వల్ల సంక్రమిస్తుంది?
1) ఎంటిరోబియస్ వర్మిక్యులారిస్
2) ఉకరేరియా బాంక్రాప్టి
3) ఎంకైలోస్టోమా డ్యుయేడినేల్
4) ఎంటామీబా హిస్టాలిటికా
40. ట్రైకో ఫైటాన్ శిలీంధ్రం ద్వారా ఏ వ్యాధి సంక్రమిస్తుంది?
1) మధుర ఫుట్ 2) దోబి ఇచ్
3) అథ్లెట్స్ ఫుట్ 4) తామర
41. జీవి (అతిథేయి) వెలుపల నిర్జీవంగా, జీవి లోపల సజీవంగా ఉండేవి?
1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రం
3) ప్రొటోజోవా 4) వైరస్
42. కింది వాటిని జతపరచండి.
మొక్కల్లో వచ్చే వ్యాధి వ్యాధి కారకం
ఎ. సిట్రస్ కాంకర్ 1. బ్యాక్టీరియా
బి. తిక్కా తెగులు 2. శిలీంధ్రం
సి. మొజాయిక్ వ్యాధి 3. వైరస్
కలగజేసే సూక్ష్మజీవి
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-2, సి-1
43. కింది వాటిని జతపరచండి.
టీకా వ్యాధి
ఎ. బీసీక్యూ 1. న్యుమోనియా
బి. వరిసెల్లా 2. ఆటలమ్మ
సి. పీసీయూ 3. క్షయ
డి. వోపీవీ 4. పోలియో
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
44. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) డెంగీ 2) చికున్ గున్యా
3) స్వైన్ ఫ్లూ 4) బర్డ్ ఫ్లూ
45. షింగిల్స్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) హెర్పిన్ సింప్లెక్స్ 2) ఎయిడ్స్
3) సార్స్ 4) మెదడు వాపు వ్యాధి
46. ఎరుపు రిబ్బన్, ఆశ అనే పదాన్ని ఏ వ్యాధి నిర్మూలనకు సూచనగా వాడతారు?
1) మశూచి 2) బర్డ్ ఫ్లూ
3) ఎయిడ్స్ 4) కుష్టు
47. కింది వ్యాధి సోకిన రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది?
1) డెంగీ జ్వరం 2) క్షయ
3) చికున్ గున్యా 4) కుష్టు
48. వైడల్ పరీక్ష ఏ వ్యాధి నిర్ధారణకు చేస్తారు?
1) క్షయ 2) కోరింత దగ్గు
3) టైఫాయిడ్ 4) కుష్టు
49. బీసీజీ టీకా ఏ వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తారు?
1) క్షయ 2) కుష్టు
3) అమీబియాసిస్ 4) టైఫాయిడ్
సమాధానాలు
1. 1 2. 2 3. 1 4. 1
5. 1 6. 4 7. 2 8. 3
9. 4 10. 1 11. 2 12. 1
13. 2 14. 4 15. 2 16. 3
17. 2 18. 2 19. 2 20. 3
21. 2 22. 2 23. 1 24. 4
25. 3 26. 2 27. 4 28. 4
29. 2 30. 2 31. 4 32. 2
33. 1 34. 4 35. 3 36. 2
37. 4 38. 2 39. 2 40. 4
41. 4 42. 1 43. 2 44. 2
45. 1 46. 3 47. 1 48. 3
49. 1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు