Current Affairs | జాతీయం
జాతీయం
పీఎస్ఎల్వీ సీ-56
ఇస్రో జూలై 30న చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఈ ఏడు ఉపగ్రహాల్లో డీఎస్-పార్ ప్రధానమైంది. ఇది సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను తీసి పంపిస్తుంది.
జీఐ ట్యాగ్
దేశంలోని ఏడు ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నైలోని జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ప్రధాన కార్యాలయం ఈ ట్యాగ్‌ను ఆగస్టు 2న అందజేసింది. రాజస్థాన్‌లోని 4, గోవాలోని 2, ఉత్తరప్రదేశ్‌లోని 1 ఉత్పత్తులకు ఈ జీఐ ట్యాగ్ దక్కింది. అవి.. 1) ఉత్తరప్రదేశ్‌లోని జలేసర్ ధాతు శిల్ప్. ఇది ఎటా జిల్లాలోని జలేసర్ పట్టణంలో ఇత్తడి వస్తువులు తయారు చేసే కళ. ఈ హ్యాండీక్రాఫ్ట్ 16వ శతాబ్దానికి చెందింది. 2) గోవా మంకురాడ్ మామిడి. ఇది బర్దేజ్ తాలూకాలో పండే మామిడి. దీన్ని గోవా మంకురాడ్ లేడా గోవా అల్ఫోన్సో అని అంటారు. 3) గోవా బెబింకా. గోవాలో తయారుచేసే సంప్రదాయ తీపి వంటకం. దీన్ని పిండి, గుడ్లు, కొబ్బరి పాలు, చక్కెరలతో తయారు చేస్తారు. 4) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోఫ్ట్గారి మెటల్ క్రాఫ్ట్. వీటిని ఉదయ్‌పూర్‌లో తయారు చేస్తారు. వీటిని దమాసెనింగ్ లేదా ఇన్లేయింగ్ అంటారు. 5) రాజస్థాన్‌లోని బికనీర్ కాషిదాకరి క్రాఫ్ట్. ఇది సిల్క్, వెల్వెట్, శాటిన్, బ్రోకేడ్ వంటి బట్టలపై ఎంబ్రాయిడరీతో చేసే కళ. 6) జోధ్‌పూర్ బంధేజ్ క్రాఫ్ట్. బట్టలపై వేసే టై-డై క్రాఫ్ట్. దీన్ని బంధని లేదా బంధ్ని అంటారు. 7) బికనీర్ ఉస్తా కలా క్రాఫ్ట్. ఇది చెక్క, లోహం, పాలరాయి, దంతాలు, తోలు వంటి వాటిపై బంగారం, వెండి రేకుతో డిజైన్లు వేసే కళ.
ఆయుష్ వీసా
హోం మంత్రిత్వ శాఖ కొత్త వీసా కేటగిరీ ‘ఆయుష్ వీసా’ను ప్రవేశపెట్టిందని ఆయుష్ శాఖ ఆగస్టు 2న ప్రకటించింది. భారత్‌లో మెడికల్ టూరిజంను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వీసాను ప్రవేశపెట్టారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి వంటి వైద్య విధానాల్లో విదేశీ పౌరులకు ప్రవేశం కల్పించడంలో ఆయుష్ వీసా ఉపయోగపడుతుంది. 2025 నాటికి గ్లోబల్ వెల్నెస్ ఎకానమీ 70 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
పీహెచ్‌వో
కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ (పీహెచ్‌వో) మాడ్యూల్‌ను ఆగస్టు 3న ప్రారంభించారు. దీన్ని సాగర్ సేతు-నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ (మెరైన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఎకోసిస్టమ్ (పర్యావరణ వ్యవస్థ)ను ప్రమోట్ చేయడంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. పౌరులు, పోర్ట్ కార్మికులను రక్షించడానికి ఆరోగ్య తనిఖీలు, వ్యాధి పర్యవేక్షణ వంటి చర్యలను పీహెచ్‌వో నిర్వహిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు