Current Affairs | తెలంగాణ
కవిత
రాష్ర్టానికి చెందిన మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీవో) కవితకు జాతీయస్థాయి అవార్డు లభించింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా జూలై 29న ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అశ్వినికుమార్ చౌబే నుంచి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. విధుల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు దక్కింది.
వండర్‌కిడ్ ఉదయ
రెండేండ్ల అర్హయ ఉదయ చైతన్య ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జూలై 31న చోటు సంపాదించింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఈమె రెండు నిమిషాల్లో 60 బొమ్మల పేర్లు తడబడకుండా చెప్పేస్తుంది. ఇప్పటివరకు 111 ఆర్ట్ ఫామ్స్ పూర్తి చేసింది. 30 సెకండ్లలోనే తెలుగు, ఇంగ్లిష్ రైమ్స్ చెప్పింది. దీంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడమే కాకుండా సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ ఆర్ట్ ప్రాడిగీ అవార్డులు లభించాయి.
వెంకట్‌రెడ్డి
రాష్ర్టానికి చెందిన నేపూరి వెంకట్‌రెడ్డి ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డును జూలై 31న ఢిల్లీలో అందుకున్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్‌గా పని చేస్తున్నారు. 18 ఏండ్లుగా ఆయన చేస్తున్న సామాజిక సేవలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెక్టార్ న్యూఢిల్లీవారు ‘భారత్ కే అన్మోల్’ అవార్డు అందజేశారు.
నంబర్ వన్ తెలంగాణ
అవయవదానంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. 2022లో మరణించిన (బ్రెయిన్ డెడ్) వారి అవయవాలను దానం చేయడంలో మొదటి స్థానంలో నిలిచింది. దీనికి గుర్తింపుగా కేంద్ర రాష్ర్టానికి ‘స్టేట్ విత్ హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ డిసీజ్డ్ డోనర్స్’ అవార్డును ప్రకటించింది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఆధ్వర్యంలో ఆగస్టు 3న జరిగిన 13వ జాతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. రాష్ట్రంలో 2022లో 194 బ్రెయిన్‌డెడ్ డొనేషన్లు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (156), కర్ణాటక (151), గుజరాత్ (148), మహారాష్ట్ర (105) ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు