General Studies – Group 2 Special | మెదడులోని ఏ భాగం ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు?
31. విపత్తులను తగ్గించుటకు, పునరావాస కార్యక్రమాలకు కమ్యూనిటీ భాగస్వామ్యం వల్ల కలిగే ముఖ్య లాభాలేవి?
ఎ) ధరల తగ్గింపు బి) సామర్థ్యత
సి) నిలిపి ఉంచటం
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
32. ప్రకృతిలో జరిగే మార్పలు వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. వాటికి ప్రధాన కారణాలు?
ఎ. అడవులను నిర్మూలించడం
బి. కాలుష్యం పెరిగిపోవడం, వాతావరణం వేడెక్కడం
సి. జీవ వైవిధ్యం దెబ్బతినడం
1) ఎ 2) బి
3) ఎ, బి, సి 4) ఎ, బి
33. రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా 1956 నాటికి ఏర్పడిన రాష్ర్టాలు -కేంద్రపాలిత ప్రాంతాలు?
1) 25-7 2) 23-6
3) 14-6 4) 20-7
34. ఆంధ్రప్రదేశ్‌లో గల ఓడరేవులు సంబంధిత అంశాలు సరిగా జతపరచండి.
1) విశాఖ ఇనుము ఉక్కు ఎ) కృష్ణపట్నం రేవు కర్మాగారం సమీపంలో ఉంది
2) చమురు రిగ్గుల ద్వారా బి) గంగవరం రేవు ముడి చమురు రవాణా చేయటానికి నిర్మించింది
3) రాష్ట్రంలో మొదటి గ్రీన్ సి) రవ్వ ఓడరేవు ఫీల్డ్ ఓడరేవు
4) హోప్ ఐలాండ్ ఆధారంగా డి) కాకినాడ రవాణా నిర్వహిస్తున్న రేవు ఆంకరేజ్ ఓడరేవు
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ 2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి 4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
35. భారత పౌరుని ప్రాథమిక విధులు?
1) వాస్తవ రాజ్యాంగంలో పొందుపరిచినవి
2) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినవి
3) 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినవి
4) సుప్రీంకోర్టు తీర్పుతో కేశవానంద భారతి కేసు తర్వాత కొన్ని పార్టీల ఆమోదంతో రాజ్యాంగంలో చేర్చినవి
36. ఆదాయపు పన్నుకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది?
1) కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర, రాష్ర్టాల మధ్య పంచుతుంది
2) కేంద్రమే విధించి, వసూలు చేసి మొత్తం కేంద్రమే అనుభవిస్తుంది
3) కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ర్టాల మధ్య పంపిణీ చేస్తుంది
4) కేవలం ఆదాయపు పన్నుపై విధించిన సర్‌చార్జీని మాత్రమే కేంద్ర, రాష్ర్టాలు పంచుకుంటాయి
37. విపత్తుల నిర్వహణ కోసం జాతీయ విధానానికి సంబంధించి కింది వాక్యాలు పరిశీలించండి.
ఎ) విపత్తుల నిర్వహణ కోసం జాతీయ విధానాన్ని భారత ప్రభుత్వం 2009, అక్టోబర్ 22న ప్రకటించింది
బి) 2018 చివరి నాటికి మానవ కారక విపత్తులను 40% కి తగ్గించటం దీని లక్ష్యం
1) ఎ సరైనది 2) బి సరైనది
3) ఎ, బి రెండూ సరికావు
4) ఎ,బి రెండూ సరైనవే
38. భారతదేశంలో అడవులను గురించి తెలిపే కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ) భారతదేశంలో అడవులు అధికంగా శుష్క సతత హరితారణ్యాల వర్గానికి చెందినవి
బి) సుందర వనాలు, కోరింగ అడవులు మడ అడవుల వర్గానికి చెందినవి
సి) ఉత్తరాఖండ్‌లో 1970లలో అడవులు నరకటాన్ని నిరసిస్తూ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది
డి) ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్‌లో ఉంది
1) బి, సి, డి సరైనవి 2) ఎ, బి, డి సరైనవి
3) ఎ, బి, సి సరైనవి
4) ఎ, బి, సి, డి సరైనవి
39. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. కుక్కలు 50,000 Hz, గబ్బిలాలు లక్ష Hz వరకు ధ్వనిని వినగలుగుతాయి
2. డాల్ఫిన్లు లక్ష Hz పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి, గుర్తిస్తాయి
1) 1 సరైంది, 2 తప్పు
2) పై రెండూ సరైనవే
3) రెండూ తప్పు
4) 2 సరైంది, 1 తప్పు
40. ఆంధ్రరాష్ట్ర స్థాపన కోసం జరిగిన ఉద్యమంలోని సంఘటనలను తెలిపే కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ) ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం 1953లో బాపట్లలో జరిగింది
బి) ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో విజయవాడ వద్ద స్థాపించారు
సి) ఆంధ్ర విశ్వ విద్యాలయం మొదటి వైస్ ఛాన్స్లర్ – సీఆర్ రెడ్డి
డి) శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేదా హైకోర్ట్ తప్పనిసరిగా రాయలసీమలో ఏర్పాటు చేయాలి
1) ఎ, బి, సి సరైనవి 2) బి, సి, డి సరైనవి
3) ఎ, సి, డి సరైనవి
4) ఎ, బి, సి, డి సరైనవి
41. మెరుగు పెట్టిన వజ్రం మెరవడానికి కారణం?
1) సంపూర్ణాంతర పరావర్తనం
2) వివర్తనం
3) ధృవణం 4) పైవన్నీ
42. అత్యుత్తమ ఉష్ణ వాహకం?
1) పాదరసం 2) నీరు
3) తోలు 4) బెంజీన్
43. ఒక బుల్లెట్‌ను చెక్క దిమ్మెలోనికి పేల్చినపుడు కింది వాటిలో ఏది నిత్యత్వం?
1) రేఖీయ ద్రవ్య వేగం 2) వేగం
3) స్థితిజ శక్తి 4) గతిజ శక్తి
44. హిమాలయాలు ఏ తరగతికి చెందినవి?
1) అగ్ని పర్వతాలు
2) నవీన ముడత పర్వతాలు
3) ఖండ పర్వతాలు
4) ప్రాచీన ముడత పర్వతాలు
45. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పక్రియలో జరిగిన కింది సంఘటనలను వరుస కాలక్రమంలో అమర్చండి.
ఎ) పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష
బి) J.V.P.కమిటీ ఏర్పాటు
సి) స్వామి సీతారాం నిరాహార దీక్ష
డి) కైలాసనాథ్ వాంఛూ కమిటీ ఏర్పాటు
1) బి, ఎ, డి, సి 2) బి, సి, ఎ, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి, బి
46. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం షెడ్యూల్ II లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కింది సాగునీటి ప్రాజెక్టుకు గతంలోని ఒప్పందం ఆధారంగా నీటి పంపిణీ కొనసాగించాలి?
ఎ) హంద్రీనీవా బి) తెలుగు గంగా
సి) గాలేరు నగరి డి) వెలుగోడు
1. బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
47. రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలు అయినప్పుడు వాటి మధ్య విశ్వ గురుత్వాకర్షణ బలం?
1) రెండు రెట్లు తగ్గుతుంది
2) రెండు రెట్లు పెరుగుతుంది
3) నాలుగు రెట్లు పెరుగుతుంది
4) నాలుగు రెట్లు తగ్గుతుంది
48. భార జలం అంటే?
1) హైడ్రోజన్ పెరాక్సైడ్
2) డ్యుటీరియం ఆక్సైడ్
3) లవణాలు కలిగిన నీరు
4) శుద్ధి చేసిన నీరు
49. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే థర్మోస్టాట్‌ను దేనితో తయారు చేస్తారు?
1) ఇనుము, ఇత్తడి 2) ఇనుము, రాగి
3) రాగి, ఉక్కు 4) ఇత్తడి, రాగి
50. భారతదేశంలోని వ్యవసాయ విప్లవాలతో సంబంధం గల వివిధ వ్యక్తులకు సంబంధించి సరికానిది?
1) శ్వేత విప్లవం – వర్గీస్ కురియన్
2) ఎల్లో రివల్యూషన్ – శ్యాం పిట్రోడో
3) ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ- హిరాలాల్ చౌదరి
4) గ్రీన్ రివల్యూషన్ – ఎం.ఎస్.స్వామినాథన్
51. భారతదేశంలోని కింది నదులను వాటి ఉపనదులతో సరిగా జతపర్చండి.
1) బ్రహ్మపుత్ర ఎ) జయమంగళి, చిత్రావతి, పాపాగ్ని
2) కృష్ణా బి) హేరంగి, హేమావతి
3) కావేరి సి) తీస్తా, సంకోష్
4) పెన్నా డి) రామిలేరు, బుడమేరు
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
52. లాలాజలంలోని ఎంజైమ్?
1) ట్రిప్సిన్ 2) పెప్సిన్
3) లైపేజ్ 4) టయలిన్
53. ఇన్సులిన్ ఒక?
1) కొవ్వు పదార్థం 2) హార్మోన్
3) రంగు పదార్థం 4) ఎక్సో ఎంజైమ్
54. దిగువన పేర్కొన్న వ్యవసాయ పరిశోధన సంస్థలు అవి ఉన్న ప్రదేశాలను తెలిపే జతల్లో అసత్యమైనది గుర్తించండి.
1) కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం – నాగపూర్ (మహారాష్ట్ర)
2) భారత చెరకు పరిశోధన సంస్థ – లక్నో (ఉత్తర ప్రదేశ్)
3) తేయాకు పరిశోధన కేంద్రం – జోర్హట్ (అసోం)
4) జాతీయ వేరుశనగ పరిశోధన కేంద్రం – కాలికట్ (కేరళ)
55. ఎర్త్ అవర్ (Earth Hour)కు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ) ఈ కార్యక్రమాన్ని WWF (World Wild Fund for Nature) అనే సంస్థ మొదటిసారిగా ‘2007, మార్చి 31’న సిడ్నీ (ఆస్ట్రేలియా)లో నిర్వహించింది
బి) ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట దినంలో ఒక గంట పాటు లైట్లను స్విచ్ ఆఫ్ చేస్తారు
సి) ఇది వాతావరణం మార్పుపై అవగాహన కలిగించేందుకు ఉద్దేశించినది
1) ఎ, బి, సి 2) బి, సి
3) బి 4) ఎ, సి
56. ఫాసియా అంటే?
1) స్థూపాకార కండర తంతువులు
2) ఫాసికిల్స్ను కప్పి ఉంచుతూ కొల్లాజెన్‌తో నిర్మితమైన సంయోజక కణజాలపు త్వచం
3) కండర మధ్యస్తచం నుంచి ఏర్పడిన ప్రత్యేకమైన కణజాలం
4) 1, 2
57. మెదడులోని ఏ భాగం ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు?
1) ఘ్రాణ లశునం 2) పూర్వ మెదడు
3) 1, 2 4) హైపోథలామస్
58. పర్యావరణానికి సంబంధించి dirty dozen అంటే?
1) 12 మొండి సేంద్రియ వ్యర్థాలు
2) 12 నైట్రోజన్ సల్ఫర్ ఆక్సైడ్
3) 12 ఓజోన్ హానికారక పదార్థాలు
4) 12 హానికారక హరిత గృహ వాయువులు
59. పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగం?
1) తల్లి మొక్క లక్షణాలు ఏర్పడతాయి
2) తండ్రి మొక్క లక్షణాలు ఏర్పడతాయి
3) వ్యాధులకు నిరోధకత పెరుగుతుంది
4) కొత్త లక్షణాలు ఏర్పడతాయి, దిగుబడి పెరుగుతుంది
60. పుష్పాల అధ్యయన శాస్త్రం?
1) ఇథాలజీ 2) అగ్రోనమీ
3) అగ్రోస్టోలజీ 4) ఆంథాలజీ
61. ఎలక్ట్రో కార్డియో గ్రాఫ్ అంటే?
1) గుండె కండరం విద్యుత్ క్రియాశీలత
2) గుండె కండరం విధ్రువణాలు, పునఃధ్రువణాలు
3) 1, 2
4) పైవేవీ కావు
62. కింద ఇచ్చిన వాటి నుంచి సరైన జతలను ఎన్నుకోండి.
ఎ) వెలుతురు చూడలేకపోవడం – రైబోఫ్లావిన్
బి) మానసిక వ్యాకులత – పాంటోథెనిక్ ఆమ్లం
సి) లూకోసైట్ల సంఖ్య తగ్గడం – ఫోలిక్ ఆమ్లం
డి) మూర్ఛ- పైరిడాక్సిన్
1) బి, సి, డి, 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
63. మానవ శరీరంలోని వివిధ భాగాలకు వచ్చే వ్యాధులను సరిగా జతపరచండి.
1) పయేరియా ఎ) అధిక ఆల్కహాలు వినియోగం వల్ల కాలేయం కుంచించుకుపోవటం
2) సిర్రోసిస్ బి) తెల్ల రక్తకణాల కేన్సర్
3) గౌట్ సి) దంతాలు, చిగుర్లకు వచ్చే వ్యాధి
4) లుకేమియా డి) రక్తంలో, కీళ్లలో యూరికామ్ల స్ఫటికాలు చేరటం వల్ల కీళ్ల నొప్పులు రావడం
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి 4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
64. వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి?
1) ఎరువులు
2) పురుగు మందులు
3) హెర్బిసైడ్లు 4) ఏదీకాదు
65. నీటిని తొలగిస్తే తొలగిపోయేది?
1) తాత్కాలిక కాఠిన్యత
2) శాశ్వత కాఠిన్యత
3) 1,2 4) ఏదీకాదు
సమాధానాలు
31. 4 32. 3 33. 3 34. 2
35. 2 36. 1 37. 4 38. 1
39. 2 40. 4 41. 1 42. 1
43. 1 44. 2 45. 2 46. 4
47. 4 48. 2 49. 1 50. 3
51. 3 52. 4 53. 2 54. 4
55. 1 56. 2 57. 4 58. 1
59. 4 60. 4 61. 3 62. 4
63. 4 64. 1 65. 1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు