Biology | దండాలు, శంకువులు అనే కణాలు ఎక్కడ ఉంటాయి?
జ్ఞానేంద్రియాలు
1. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏది?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి
3) విటమిన్-సి 4) విటమిన్-డి
2. ఇంద్రియ జ్ఞానమనేది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేది?
1) జ్ఞానేంద్రియాలు
2) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
3) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
4) మెదడు, నాడీ ప్రేరణ
3. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి?
1) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు
2) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు
3) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు
4) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచిని తెలుసుకోలేడు
4. ఇంద్రియ జ్ఞానాలు అయిదింటి గురించి మొదటగా తెలిపింది ఎవరు?
1) ప్లేటో 2) అరిస్టాటిల్
3) 1, 2 4) ఆల్బర్టస్ మేగ్నస్
5. వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య?
1) అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు
2) ఏమీ వినలేదు 3) కొద్దిగా వినగలదు
4) శబ్దం పుట్టుకను, రకాన్ని తెలుసుకోలేదు
6. ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి ఏ భాగాన్ని ఫొటో ద్వారా బంధిస్తారు?
1) కంటిపాప 2) కంటి మొత్తం భాగం
3) కనుగుడ్డు 4) పైవన్నీ
7. కంటిలోని శంకువుల సంఖ్య సుమారుగా?
1) 6 మిలియన్లు 2) 7 మిలియన్లు
3) 8 మిలియన్లు 4) 9 మిలియన్లు
8. ఒక వ్యక్తి కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే తప్పనిసరిగా కలిగే ప్రభావం?
1) ఆ వ్యక్తి కళ్లు మూసుకోలేడు
2) కన్ను కదపలేడు, రంగులను బాగా చూడగలడు
3) కంటిలో నొప్పి వస్తుంది
4) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు
9. కంటి గుడ్డులో మనకు బయటకు కనబడే భాగం?
1) 1/2వ వంతు 2) 1/3వ వంతు
3) 1/4వ వంతు 4) 1/6వ వంతు
10. నేత్ర పటలంలోని సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడటాన్ని ఏమంటారు?
1) సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్
2) కండ్ల కలక
3) ఆప్టిక్ న్యూరైటిస్ 4) స్లీరైటిస్
11. ఎ: నేత్రపటలంలోని మాక్యులా ఉబ్బటం వల్ల మాక్యులార్ ఎడిమా వస్తుంది
బి: మాక్యులా లేదా పచ్చ చుక్క ఉబ్బటం వల్ల దృష్టి దోషం కలగవచ్చు
పై ప్రవచనాల్లో సరైనది?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
12. కంటిలోని దృక్‌నాడీ పెద్దదిగా మారడాన్ని ఏమంటారు?
1) ఆప్టిక్ మైక్రోమా 2) ఆప్టిక్ న్యూరైటిస్
3) స్లీరైటిస్ 4) కెరోటైటి
13. నెలలు నిండకుండానే పుట్టే పిల్లల్లో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరగడాన్ని ఏమంటారు?
1) రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ
2) గ్లకోమా
3) ట్రాకోమా 4) జిరాఫ్తాల్మియా
14. కంటిలోని దండాల సంఖ్య సుమారుగా?
1) 7 మిలియన్లు 2) 125 మిలియన్లు
3) 9 మిలియన్లు 4) 150 మిలియన్లు
15. పచ్చ చుక్కను ఏంటారు?
1) మాక్యులా 2) ఫోవియా
3) 1, 2 4) టపేటమ్
16. చర్మంలోని అంతరశ్చర్మంలో ఉండేవి?
1) స్వేద గ్రంథులు
2) సెబేషియన్ గ్రంథులు, రక్తనాళాలు
3) రోమ పుటికలు, కొవ్వులు
4) పైవన్నీ
17. విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
1) కుష్టు 2) పెల్లాగ్రా
3) బొల్లి 4) తామర
18. నాలుకలోని రుచి గుళికల సంఖ్య ఎంత?
1) 100 2) 1,000
3) 10,000 4) 1,00,000
19. నేత్రపటలంలోని ఏ భాగంలో కాంతి గ్రాహకాలు ఉండవు?
1) అంధచుక్క 2) పసుపు చుక్క
3) ఆకుపచ్చ చుక్క 4) నల్ల చుక్క
20. మధ్య చెవి అంతర చెవిలోకి దేని ద్వారా తెరుచుకుంటుంది?
1) గుండ్రని కిటికీ 2) అండాకార కిటికీ
3) వర్తులాకార కిటికీ
4) దీర్ఘ వృత్తాకార కిటికీ
21. నేత్రపటలంలోని దండాల్లో ఉండే వర్ణద్రవ్యం?
1) రొడాప్సిన్ 2) అయోడాప్సిన్
3) ఫొటాప్సిన్ 4) కీటాప్సిన్
22. మధ్య చెవి ఎముకల గొలుసులో ఉండేవి?
1) కూటకం 2) దాగిలి
3) కర్ణాంతరాస్థి 4) పైవన్నీ
23. మెటాలిక్ టేస్ట్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది?
1) సహజ ఆహార పదార్థాలు
2) కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు
3) పచ్చి ఆహార పదార్థాలు
4) వండిన ఆహార పదార్థాలు
24. యుక్త వయస్సు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం?
1) 1 1/2 చదరపు మీటర్లు
2) 2 1/2 చదరపు మీటర్లు
3) 3 1/2 చదరపు మీటర్లు
4) 4 1/2 చదరపు మీటర్లు
25. MSG అంటే?
1) మోనోసోడియం గ్లుటామేట్
2) మెగ్నీషియం సోడియం గ్లుటామేట్
3) మోనోసల్ఫర్ గ్లుటామేట్
4) మెగ్నీషియం సల్ఫర్ గ్లుటామేట్
26. హ్రస్వ దృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం?
1) నేత్రపటలానికి ముందు
2) నేత్ర పటలంపై
3) నేత్ర పటలానికి వెనుక 4) పైవేవీ కాదు
27. అప్పుడే తయారైన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలుంటాయి?
1) 500 2) 600
3) 700 4) 800
28. చర్మాన్ని కాంతి నుంచి రక్షించేది?
1) టానిన్ 2) మెలనిన్
3) టయలిన్ 4) మైలిన్
29. చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర?
1) కార్నియా పొర 2) గ్రాన్యులార్ పొర
3) మాల్ఫీజియన్ పొర
4) క్యుటేనియస్ పొర
30. శరీర సమతాస్థితి నిర్వహించే అవయవం?
1) కన్ను 2) ముక్కు
3) చెవి 4) నాలుక
31. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు?
1) 1000 2) 1500
3) 2000 4) 2500
32. స్థిరంగా చర్మంలో విభజనలు చెందుతూ ఉండే పొర?
1) కార్నియా పొర
2) గ్రాన్యులార్ పొర
3) మాల్ఫీజియన్ పొర
4) క్యుటేనియస్ పొర
33. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం?
1) మామూలుగా నిలువుగా
2) మామూలుగా తలకిందులుగా
3) ఎడమ, కుడి నిలువుగా
4) ఎడమ, కుడి తలకిందులుగా
34. భూ భ్రమణం, పరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త?
1) ఆల్బర్టస్ మేగ్నస్ 2) అరిస్టాటిల్
3) ప్లేటో 4) జోహన్సెస్ కెప్లర్
35. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం?
1) మెదడు 2) వెన్నుపాము
3) 1, 2 4) కాలేయం
36. దండాలు, శంకువులు అనే కణాలు ఎక్కడ ఉంటాయి?
1) దృఢస్తరం 2) రక్తపటలం
3) నేత్రపటలం 4) పై అన్నింటిలో
37. పేటిక ముందుభాగాన్ని ఏమంటారు?
1) యుట్రిక్యులార్ 2) సాక్యులస్
3) కాక్లియా 4) అర్ధవర్తుల కుల్యలు
38. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దేనిలో ఉంటుంది?
1) చెవి 2) నాలుక
3) ముక్కు 4) చర్మం
39. కంటిలోని ఏ భాగాన్ని సరిచేయవచ్చు?
1) కను గుడ్డు
2) ద్వికుంభాకార కటకం
3) ముక్కు 4) చర్మం
40. కంటిలో ఉండే గ్రంథులు?
1) లాక్రిమల్ గ్రంథులు
2) సెరుమినస్ గ్రంథులు
3) సెబేషియస్ గ్రంథులు
4) శ్లేష్మ గ్రంథులు
41. పిన్నా అని దేన్ని పిలుస్తారు?
1) అంతర చెవి 2) మధ్య చెవి
3) బాహ్య చెవి 4) కర్ణభేరి
42. పరిసరాల నుంచి ప్రేరణను గ్రహించే మన శరీర భాగాలు?
1) కన్ను, చెవి 2) ముక్కు, నాలుక
3) చర్మం 4) పైవన్నీ
43. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి దేనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?
1) దృఢ స్తరం 2) కనుపాప
3) తారక 4) నేత్రపటలం
44. జెల్లీ వంటి పదార్థంలో నిండి ఉండే కంటి గుడ్డు భాగం?
1) కచావత్ కక్ష్య 2) నేత్రోదయ కక్ష్య
3) రక్త పటలం 4) దృఢస్తరం
45. కంటిలో ఉండే ఏ పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి?
1) కంటి పొర 2) దృఢస్తరం
3) రక్తపటలం 4) నేత్రపటలం
46. జ్ఞానేంద్రియాల నుంచి నాడీ ప్రచోదనాలను తీసుకొని వచ్చేవి?
1) చాలకనాడులు 2) వెన్నునాడులు
3) జ్ఞాననాడులు 4) అన్నీ
47. రుచి గుళికలు లేని పాపిల్లే?
1) ఫిలిపార్మ్ పాపిల్లే 2) ఫంగిపార్మ్ పాపిల్లే
3) సర్కంవెల్లేట్ పాపిల్లే 4) 1, 3
48. ఉమామి+MSG=?
1) ఫెచింగ్ 2) హచింగ్
3) హన్నింగ్ 4) జన్నింగ్
49. కర్ణావర్తంలో ఉండే సమాంతర నాళం?
1) స్కాలా వెస్టిబ్యులా
2) స్కాలా మీడియా
3) స్కాలా టింపాని 4) పైవన్నీ
50. ఏ లిపిలో అక్షరాలు ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి?
1) బ్రెయిలీ లిపి 2) సర్పలేఖనం
3) సంస్కృత లిపి 4) పాళీ లిపి
సమాధానాలు
1. 1 2. 3 3. 4 4. 3
5. 2 6. 1 7. 2 8. 2
9. 4 10. 1 11. 3 12. 2
13. 1 14. 2 15. 3 16. 4
17. 2 18. 3 19. 1 20. 3
21. 1 22. 4 23. 2 24. 1
25. 1 26. 1 27. 2 28. 2
29. 1 30. 3 31. 2 32. 3
33. 4 34. 4 35. 3 36. 3
37. 2 38. 4 39. 2 40. 1
41. 3 42. 4 43. 4 44. 2
45. 3 46. 3 47. 1 48. 2
49. 4 50. 1
కణ శ్వాసక్రియ
- శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాల్లో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని కణ శ్వాసక్రియ అంటారు.
- ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు శ్వాసక్రియ జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాల్లో కణశ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నిజకేంద్రక జీవుల్లో శ్వాసక్రియలోని కొంతభాగం కణద్రవ్యంలోనూ, మరికొంత భాగం మైటోకాండ్రియాలోనూ జరుగుతుంది. ఈ శరీరంలో విడుదలైన శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుంది. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అంటారు.
- గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ రూపంలో నిల్వ ఉంటుంది. ఇది చిన్నమొత్తాల్లో ఉండే రసాయనిక శక్తి. దీన్ని కణం ‘ఎనర్జీ కరెన్సీ’ అంటారు. ఇలా నిల్వ ఉన్న శక్తి కణంలో అవసరమైన చోటుకు రవాణా అవుతుంది. ప్రతి ATPలో 72000 కాలరీల శక్తి ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది.
- చేపల వంటి కొన్ని జలచర జీవులు శ్వాసక్రియ కోసం మొప్పలు అనే ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చేసుకున్నాయి. మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మీయ శ్వాసక్రియ అంటారు. కప్పలు చర్మం, ఊపిరితిత్తులు, ఆస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి.
- సముద్ర మట్టం వద్ద హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్‌తో బంధాన్ని ఏర్పరచి ఆక్సీహిమోగ్లోబిన్తో మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం ఐదో వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది.
- వాయు సహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువులోని శక్తి నాలుగు ప్రధాన దశలైన ైగ్లెకాలసిస్, పైరూవికామ్ల ఆక్సీకరణం, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థల ద్వారా విడుదలవుతుంది. నిజకేంద్రక జీవుల్లో ైగ్లెకాలసిస్ మాత్రమే కణద్రవ్యంలో జరుగుతుంది. మిగిలిన మూడు దశలు మైటోకాండ్రియాలో జరుగుతాయి.
- ైగ్లెకాలసిస్ అనే పదం గ్రీకు పదాలైన ైగ్లెకిస్= చక్కెర, లైసిస్= విచ్ఛిత్తి నుంచి ఉద్భవించింది.
అవాయు శ్వాసక్రియ: ఆక్సిజన్ లభ్యం కాకపోవడం వల్ల కర్బన పదార్థాలు పాక్షికంగా ఆక్సీకరణం చెందే చర్యను అవాయు శ్వాసక్రియ అంటారు. అవాయు శ్వాసక్రియను జరిపే జీవులను అవాయు జీవులు అంటారు. ఇవి రెండు రకాలు. అవి అవికల్ప అవాయు జీవులు, వైకల్పిక అవాయు జీవులు.
ఎ. అవికల్ప అవాయు జీవులు: ఆక్సిజన్ సమక్షంలో మనుగడ సాగించలేని అవాయు జీవులను అవికల్ప అవాయు జీవులంటారు.
ఉదా: క్లాస్ట్రీడియమ్ బొట్యులినమ్
బి. వైకల్పిక అవాయు జీవులు: వాయు సహిత పరిస్థితులను కూడా తట్టుకునే అవాయు జీవులను వైకల్పిక జీవులు అంటారు.
ఉదా: ఈస్ట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు