TET Study Material – Science | పరిరక్షణే.. మానవ మనుగడకు రక్షణ
- ప్రకృతిలో సహజంగా లభించే వనరులను సహజ వనరులు అని అంటారు. సహజ వనరుల్లో గాలి, నీరు ముఖ్యమైనవి.
- జీవరాశి మనుగడకు అత్యంత అవసరమైన జీవనాధారం నీరు.
- భూమిపై దాదాపు 70% నీరు ఆవరించి ఉంది. ఈ నీరు దాదాపు 97% సముద్రాలు, మహాసముద్రాల్లోనే ఉంది.
- నీటిలోనికి క్లోరిన్ వాయువు పంపి సూక్ష్మ జీవులను చంపివేసే విధానాన్ని క్లోరినేషన్ అంటారు.
- కొన్ని ప్రదేశాల్లో సూక్ష్మ జీవులను నిర్మూలించడానికి ఏరేషన్ అనే విధానాన్ని కూడా ఉపయోగిస్తారు.
- ఏరేషన్ పద్ధతిలో నీటిని తుషార రూపంలో గాలిలోనికి పంపిస్తారు. నీటిలోని సూక్ష్మ జీవులు సూర్యరశ్మికి చనిపోతాయి.
నీటిని శుభ్రపరచడం
నీటిని శుభ్రపరిచే పద్ధతులు
1) వడపోత 2) మూడంచెల పద్ధతి - నీటిని మూడంచెలుగా శుభ్రపరిచే పద్ధతిని ‘సంప్రదాయక విధానం’ అంటారు.
రక్షిత మంచినీటి పథకంలో దశలు
1) తేర్చుట 2) వడపోయడం
3) క్లోరినేషన్ 4) పంపుచేయడం
నీటిని శుభ్రపరిచే ఆధునిక పద్ధతులు
1) UV కిరణాల పద్ధతి
2) రివర్స్ ఆస్మాసిస్
నీటి కాలుష్యం - నీటిలో హానికారక పదార్థాలు చేరటాన్ని నీటికాలుష్యం అంటారు.
- నీరు రెండు రకాలుగా కలుషితమవుతుంది. అవి i) సహజం ii) కృత్రిమం
- నీటిలో ఫ్లోరైడ్ సాంద్రత ఎక్కువ గల నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది.
నీటి కాలుష్య కారకాలు
1. స్వాభావికమైనవి
2. మానవులు చేసే పనుల వల్ల కలిగేవి
3. అణుశక్తి ఉత్పాదన కేంద్రకాలు
4. వ్యవసాయం నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు - రసాయనిక లేదా జీవ రసాయనిక పదార్థాలు నీటిలో కలిసి ఉండటాన్ని “నీటి కాలుష్యం” అంటారు.
- గృహ వ్యర్థాలు, నీటి కాలుష్యం, పరిశ్రమ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు
- పరిశ్రమ వ్యర్థాల్లో పాదరసం, ఆక్సిజన్, సీసం వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
- కలుషిత నీటిని తాగటం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లు, పోలియో, నీటి విరేచనాలు, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి.
- పరిశ్రమల వ్యర్థాల వల్ల, ఎరువులు, క్రిమిసంహారక రసాయనాల వల్ల, ముడి చమురు వల్ల, కళేబరాలు, అణుశక్తి వల్ల నీరు కృత్రిమంగా కలుషితమవుతుంది.
నీటి వనరుల ఉపయోగం - నీరు లభించే స్థలాలను ‘నీటి వనరులు’ అంటారు. ఉదా: నదులు, చెరువులు, బావులు, కాలువలు, సరస్సులు.
- చెరువులు, నదులు, వాగుల్లో నీటి పారుదల ఆగిపోయిన తరువాత నేలపై పొరలను తొలగించడం ద్వారా నీరు బయటకు వస్తుంది. వీటినే చెలమలు, ఊటలు అంటారు.
- ఎడారి ప్రాంతంలో నీరు ఒయాసిస్‌లో మాత్రమే దొరుకుతుంది.
- మన అవసరాలకు నీరు ఎక్కడి నుంచి వస్తుందో వాటిని ‘స్థానిక వనరులు’ అంటారు.
- భూమిపై 3/4వ వంతు నీరు ఉంది. దీనిలో 97% నీరు ఉప్పునీరు 2% నీరు మంచు రూపంలో ధృవాల వద్ద ఉంది. 1% మాత్రమే మనకు ఉపయోగపడేలా ఉంది.
- నీరు గాలిలో నీటి ఆవిరి, భూ గర్భ జలం, భూ ఉపరితల జలం రూపంలో ఉంటుంది.
ఉప్పు నీరు ఉదా : సముద్రాలు
మంచినీటికి ఉదా: చెరువులు, నదులు, బావులు - భూమి లోపల అంటే బావులు, బోరు పంపులు, చెలమల నుంచి లభించే నీటిని భూగర్భ జలం అంటారు.
- నదీ పరీవాహక ప్రాంతాల్లోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాయి.
ఉదా: యమునా నది ఒడ్డున ఢిల్లీ
హుగ్లీ నది ఒడ్డున కోల్‌కతా
దాల్ సరస్సు ఒడ్డున శ్రీనగర్
గంగానది ఒడ్డున కాశీ, అలహాబాద్
మూసీ నది ఒడ్డున హైదరాబాద్ - బావుల్లోని నీరు ఎక్కువగా ఉపయోగిస్తారు.
- ఊటనీరు నేల పొరను చీల్చుకుని పైకి చేరడాన్ని ‘బుగ్గ’ (లేదా) ‘స్ప్రింగ్’అంటారు.
- ఒయాసిస్ వద్ద ఖర్జూర చెట్లు ఎక్కువగా పెరుగుతాయి.
- సముద్రం అలల శక్తిని లేదా నదుల నీటి ప్రవాహ వేగాన్ని ఉపయోగించుకొని టర్బైన్లు తిరిగేట్లు చేసి విద్యుత్తును తయారు చేస్తారు. వీటినే హైడ్రల్ పవర్ స్టేషన్స్ అని పిలుస్తారు.
- నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లోలభిస్తుంది.
- నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు.
- ఒక సెకనులో ఆవిరిగా మారిన ద్రవ పరిమాణాన్ని బాష్పీభవన రేటు అంటారు. వేర్వేరు ద్రవాలకు బాష్పీభవన రేటు వేర్వేరుగా ఉంటుంది.
- మంచు కరిగి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటారు.
- నీరు మంచుగా మారడాన్ని ఘనీభవనం అంటారు.
- భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్లి, మేఘాలుగా మారి చల్లబడి తిరిగి వర్ణరూపంలో భూమిని చేరడాన్ని ‘నీటి చక్రం’ అంటారు.
జల కాఠిన్యత - సబ్బుతో నీటి చర్యను బట్టి నీటిని
1. కఠిన జలం
2. సాదు జలం/ మృదు జలం అని రెండు రకాలుగా విభజించవచ్చు. - ఏ నీటిలో సబ్బు బాగా కరిగి వెంటనే నురగఇచ్చునో ఆ నీటిని సాదు జలం అంటారు.
- నీటిలో సబ్బు వెంటనే నురగనివ్వక విరిగి అవక్షేపంగా నీటి నుంచి విడిపోయిన ఆ నీరు కఠిన జలం.
జల కఠినత్వం రెండు రకాలు. అవి
1. తాత్కాలిక కఠినత్వం
2. శాశ్వత కఠినత్వం - నీటిలో కాల్షియం, మెగ్నీషియం బైకార్బోనేట్లు కరిగి ఉండటం వల్ల తాత్కాలిక కాఠిన్యత సంభవిస్తుంది.
- నీటిలో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, క్లోరైడ్ లవణాలు కరిగి ఉండటం వల్ల శాశ్వత కాఠిన్యం సంభవిస్తుంది.
- నీటిని మరిగించి తాత్కాలిక కాఠిన్యతను తొలగించవచ్చు.
- పెర్మిట్యూబ్ పద్ధతి అయాన్ మార్పిడి పద్ధతుల ద్వారా నీటి కాఠిన్యత తొలగించవచ్చు.
నీటి పీడనం - నీరు కలిగించే పీడనాన్ని “నీటి పీడనం” అంటారు.
- నీటి పీడనాలు మూడు రకాలు అవి
1) అధోఃపీడనం 2) ఊర్థ పీడనం
3) పార్శ పీడనం
1) అధోఃపీడనం : నీరు అది ఉన్న ప్రదేశం లేదా నిల్వ ఉంచిన పాత్ర అడుగుతలంపై కలుగజేసే పీడనాన్ని ‘అధోఃపీడనం’ అంటారు.
2. ఊర్థ పీడనం : నీరు భూ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి కలుగజేసే పీడనాన్ని ‘అధోఃపీడనం అంటారు
3) పార్శ పీడనం : నీరు, అది నిల్వ ఉన్న పాత్రల గోడలపై కలుగజేసే పీడనాన్ని ‘పార్శ పీడనం’ అంటారు.
ఉదా: నీటితో నింపిన పాత్ర గోడకు రంధ్రం చేసినపుడు నీరు పాత్ర గోడ వెంబడి జారకుండా కొంత దూరంలో పడటం.
గాలి
- భూమి ఉపరితలం నుంచి దాదాపు 1000 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. భూమి చుట్టూ ఆవరించుకొని ఉన్న గాలిని ‘వాతావరణం’ అంటారు.
- గాలి అనేక వాయువుల మిశ్రమం, గాలికి బరువు ఉంది.
- భూమిని ఆవరించి ఉన్న గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ 1:4 నిష్పత్తిలో ఉన్నాయి.
- గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, హీలియం, నియాన్ మొదలైన వాయువులు నీటి ఆవిరి మొదలైనవి స్వల్ప పరిమాణంలో ఉన్న అంశీ భూతాలు.
- భూమిపై కొన్ని ప్రదేశాల్లో కార్బన్ డై ఆక్సైడ్ వెలువడుతుంది. ఉదాహరణకు జావాలోని మృత్యులోయ (Death valley) , నేపుల్స్ వద్ద ఉన్న ‘గ్రొటెడెల్ కేవ్’ మొదలైనవి.
- లెగ్యుమినస్ మొక్కలున్న ప్రాంతంలో గాలిలో నైట్రోజన్ పరిమాణం తక్కువ ఉంటుందని చెప్పవచ్చు.
- లెగ్యుమినస్ మొక్కల బుడిపెల్లో ఉన్న బ్యాక్టీరియా గాలిలో నైట్రోజన్‌ను మొక్కలకు ఉపయోగపడే నైట్రేట్ రూపం లోనికి మారుస్తాయి.
- గాలిలో నీటి ఆవిరి సముద్రతీర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. పీఠభూమి ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.
- ఉష్ణోగ్రత పెరిగినపుడు గాలిలో నీటిఆవిరి ఎక్కువగా ఉంటుంది.
- శీతాకాలంలో గాలిలో నీటి ఆవిరి అధికంగా ఉండి నీటిమంచు, పొగ మంచు ఎక్కువగా ఏర్పడతాయి.
గాలి కాలుష్యం - వాతావరణ పరిసరాల్లో స్థాయికి మించిన హానికరమైన పదార్థాలు చేరి ఉండటాన్ని కాలుష్యం అంటారు.
- గాలి కాలుష్యానికి కారణాలు
1) ఇంధనాలు మండటం వల్ల
2) అడవుల నరికివేత
3) వాహనాల నుంచి వెలువడే వాయువులు 4) పారిశ్రామికీకరణ,
5) వ్యవసాయ పద్ధతులు,
6) అణు పరీక్షలు, దుర్ఘటనలు
7) శబ్దకాలుష్యం - గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, ఓజోన్ లాంటి వాయువులు ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహించడం వల్ల భూమి ఎక్కువ వేడెక్కుతుంది. దీన్నే “గ్లోబల్ వార్మింగ్” అంటారు.
- అడవుల నరికివేతను ఆపడం, అడవులను పెంచడం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు నివారించవచ్చు.
వాతావరణ పీడనం: - మానవులు 300 కి.మీ లోతున్న గాలి సముద్రంలో పూర్తిగా మునిగి ఉన్నారు.
- ద్రవ్యరాశి, ఘనపరిమాణం, సాంద్రత పీడనం అనే భౌతిక రాశులన్నీ కలిగిన ప్రవాహి, భూమి అంతటినీ చుట్టి ఉండే ఈ గాలిని వాతావరణం (Atmosphere) అంటారు.
- గాలి ద్రవ్యరాశిని, బరువును కలిగి ఉంది కాబట్టి అది భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మీద పీడనం కలుగ చేస్తుంది. దానినే
వాతావరణ పీడనం అంటారు.
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
Previous article
Biotechnology | గ్రీన్ బయోటెక్నాలజీ ఏ రంగానికి సంబంధించినది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు