Current Affairs | దేశంలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు?
1. జూలై 26ను ఏ రోజుగా నిర్వహిస్తారు? (3)
ఎ. కార్గిల్ విజయ్ దివస్
బి. మడ అడవుల ఆవరణ
వ్యవస్థ పరిరక్షణ రోజు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
వివరణ: 1999లో భారత భూభాగంలోకి పాకిస్థాన్ అక్రమంగా చొరబడింది. వారిని భారత్ నుంచి నిష్క్రమింపచేసేందుకు ఆపరేషన్ విజయ్ నిర్వహించింది. జూలై 26, 1999 అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన వారందరినీ తరిమివేశారు. ఈ నేపథ్యంలో ఏటా జూలై 26న కార్గిల్ దివస్‌గా నిర్వహిస్తారు. యుద్ధం కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా జరిగింది. భారత్‌లో ఈ విధంగా ప్రసారం కావడం ఇదే తొలిసారి. అలాగే ఇదే రోజున మడ అడవుల పరిరక్షణ రోజు కూడా నిర్వహిస్తారు. పర్యావరణ మేలుకు ఆ చెట్లు చేస్తున్న మేలును తెలియజేసేందుకు ఏటా ఈ వేడుక నిర్వహించాలని 2015లో యునెస్కో తీర్మానం చేసింది. భారత దేశంలో అతి ఎక్కువగా మడ అడవులు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి.
2. ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రుల స్థాయి సమావేశం ఏ నగరంలో జరగనుంది? (4)
1) పారిస్ 2) లండన్
3) టెల్ అవీవ్ 4) అబు ధాబీ
వివరణ: ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల స్థాయి సమావేశం యూఏఈలోని అబు ధాబీలో 2024 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా యూఏఈకి చెందిన విదేశీ వాణిజ్య మంత్రి థానీ అల్ జెయౌదిని ఎన్నుకున్నారు. ఇది మాత్రమే కాదు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌కు సంబంధించిన అతిపెద్ద సమావేశం 2025 అక్టోబర్ 9 నుంచి 15 వరకు అబు ధాబీలోనే నిర్వహించనున్నారు.
3. ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డ్ పొందినది ఏది? (3)
1) లోథాల్ 2) ధోలవీర 3) బైకుల్లా రైల్వేస్టేషన్ 4) ఏదీకాదు
వివరణ: ముంబయిలోని బైకుల్లా రైల్వేస్టేషన్ ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డును పొందింది. దీన్ని 1853లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. 1857లో పలు మార్పులు చేశారు. ప్రస్తుతం ఆ రైల్వే స్టేషన్ ఉన్న రూపాన్ని 1891లో తీసుకొచ్చారు. ఈ అవార్డును యునెస్కో ఏర్పాటు చేసింది. ఎన్జీ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ఫౌండేషన్ సహాయంతో ఈ అవార్డును అందజేస్తారు. 2021 నుంచి ఈ అవార్డును ఇస్తున్నారు. సుస్థిరాభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని అవార్డుల ఎంపిక కొనసాగుతుంది. అలాగే యునెస్కో మరో అంశం రీత్యా కూడా వార్తల్లో ఉంది. అమెరికా ఇటీవల ఇందులో తిరిగి చేరింది. సంస్థ ప్రధాన కార్యాలయం పారిస్‌లో జెండా ఎగురవేసే కార్యక్రమానికి అమెరికా తొలి మహిళ జిల్ బైడెన్ హాజరయ్యారు.
4. లింగ మార్పిడి, ట్రాన్స్‌జెండర్ వివాహాలను నిషేధిస్తూ ఇటీవల చట్టం చేసిన యూరప్ దేశం ఏది? (1)
1) రష్యా 2) నెదర్లాండ్స్
3) నార్వే 4) స్లొవేనియా
వివరణ: ఎల్జీబీటీక్యూ+ హక్కులపై ఆంక్షలు విధిస్తూ రష్యా శాసనవ్యవస్థ ఆమోదించిన బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సంతకం చేశారు. లింగ మార్పిడి, స్వలింగ వివాహాలను దీని ద్వారా కట్టడి చేయనున్నారు. లింగ మార్పిడి శస్త్ర చికిత్సలపై కూడా పరిమితులు విధించారు. సంప్రదాయ విలువలను కాపాడటానికే అంటూ ప్రభుత్వం వాదనకు మద్దతుగా శానస వ్యవస్థ ఈ తరహా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబం అనే భావన పశ్చిమ దేశాల్లో అంతగా లేనందున, ఆ తరహా వ్యవస్థలకు తమ దేశంలో చోటు లేదంటూ ప్రభుత్వం అంటుంది. ఇటీవల స్వలింగ వివాహాలను అనుమతిస్తూ మధ్య యూరప్‌లోని ఎస్తోనియా దేశం నిర్ణయం తీసుకుంది.
5. పనామా కాలువ ఏ రెండు మహా సముద్రాలను కలుపుతుంది? (4)
1) అట్లాంటిక్, హిందూ మహా సముద్రం
2) హిందూ మహా సముద్రం,
పసిఫిక్ మహా సముద్రం
3) పసిఫిక్, ఆర్కిటిక్
4) పసిఫిక్, అట్లాంటిక్
వివరణ: పనామా కాలువ అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతుంది. ప్రపంచంలో కృత్రిమంగా నిర్మించిన అతి ముఖ్య వ్యూహాత్మక జల మార్గాలు రెండు ఉన్నాయి. అవి సూయజ్ కాలువ, మరొకటి పనామా కాలువ. 1904 నుంచి 1914 మధ్య దీన్ని అమెరికా నిర్మించింది. 1914 ఆగస్ట్ 15న ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కరవు రావడంతో నౌకల రవాణాపై ఆంక్షలను విధించారు. రోజుకు 32 నౌకలకు మించి అనుమతి ఇవ్వరు. అలాగే 44 అడుగుల లోతు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడతారు.
6. ఏ భవనంలో జన్‌జాతీయ దర్పణ్‌ను ప్రారంభించారు? (3)
1) పార్లమెంట్లో
2) ప్రధాన మంత్రి కార్యాలయంలో
3) రాష్ట్రపతి భవన్లో 4) ఏదీకాదు
వివరణ: రాష్ట్రపతి భవన్లో జన్‌జాతీయ దర్పణ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ దీన్ని నెలకొల్పింది. భారతదేశం నిర్మాణం, అభివృద్ధిలో గిరిజనుల పాత్రను తెలియజేయడంతో పాటు వారి సంస్కృతి, కళలను అందరికీ పరిచయం చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో స్వాతంత్య్రంలో పాల్గొన్న గిరిజన నాయకులు, అలాగే గిరిజనుల సహజ వనరుల నిర్వహణ, సంగీత పరికరాలు, చిత్రకళలు ఇందులో ఉంటాయి. రాష్ట్రపతి భవనంలో ఇటీవల నవచర అనే కళను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇంటెల్ ఇండియా సహాయంతో దీన్ని ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధతో ఇది పనిచేస్తుంది. అలాగే సూత్ర కళా దర్పణ్‌ను కూడా రాష్ట్రపతి భవన్లో అందుబాటులోకి తెచ్చారు. ఇది జౌళి రంగానికి చెందింది.
7. ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ప్రధాన కేంద్రం కింది వాటిలో ఎక్కడ ఉంది? (4)
1) జెనీవా 2) పారిస్
3) ది హేగ్ 4) జమైకా
వివరణ: ఐక్యరాజ్య సమితి సముద్రపు ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో దీని ప్రధాన కేంద్రం ఉంటుంది. సముద్రంలోని లోతుల్లో మైనింగ్‌కు అనుమతించారు. అయితే విధి విధానాలు రూపొందించేందుకు రెండు సంవత్సరాలు పట్టనుంది. దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను తీసుకురావాలని ఇటీవల సభ్యదేశాలు నిర్ణయించాయి. ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీకి సంబంధించి సాధారణ సభ ఉంటుంది. అలాగే 36 సభ్య దేశాలతో కూడిన ఒక కార్యనిర్వహణ ప్రాధికార వ్యవస్థ కూడా ఉంటుంది. ఇదే తుది నిర్ణయం తీసుకుంది
8. లీసా ఫ్రాంచెట్టి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు? (2)
1) అమెరికా ఉపాధ్యక్షురాలికి సహాయకురాలిగా నియమితులయ్యారు
2) అమెరికా నావికా దళానికి నేతృత్వం వహించనున్నారు
3) శాస్త్ర సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు 4) పైవేవీ కాదు
వివరణ: అమెరికా నావికా దళానికి లీసా ఫ్రంచెట్టి నేతృత్వం వహించనున్నారు. అయితే సెనెట్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఆమె నియమితులైతే అమెరికా నావికా దళానికి నేతృత్వం వహించనున్న తొలి మహిళగా ఘనతను దక్కించుకోనున్నారు. ప్రస్తుతం ఆమె డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా నావికా దళంలో ఫోర్ స్టార్ స్థాయిని పొందిన రెండో మహిళ కూడా ఆమె. తొలి మహిళ హోవార్డ్.
9. భారత తొలి ప్రైవేట్ హిల్ స్టేషన్ లావాసా ఏ రాష్ట్రంలో ఉంది? (3)
1) పశ్చిమబెంగాల్ 2) త్రిపుర 3) మహారాష్ట్ర 4) మేఘాలయ
వివరణ: భారతదేశపు తొలి ప్రైవేట్ హిల్‌స్టేషన్ లావాసా మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉంది. ముల్షిలోయ ప్రాంతంలో ఇది భాగం. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఆర్సిల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకులు కలిసి సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఇటీవల దీన్ని డార్విన్ ప్లాట్‌ఫాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయించారు. ఇందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. దీని కొనుగోలుకు రూ.1814 కోట్లు సంస్థ చెల్లించనుంది. ఈ హిల్స్టేషన్ను 2000లో అభివృద్ధి చేశారు.
10. దేశంలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? (1)
1) పవన్ చామ్లింగ్ 2) జ్యోతిబసు
3) నవీన్ పట్నాయక్ 4) నరేంద్రమోదీ
వివరణ: దేశంలో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత పవన్ చామ్లింగ్ది. ఆయన ఐదు దఫాలు సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఘనత పశ్చిమబెంగాల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. అయితే జూలై 22న నవీన్ పట్నాయక్ ఈ రికార్డును అధిగమించాడు. 23 సంవత్సరాల 139 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటూ సుదీర్ఘ కాలం కొనసాగిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. ఆయన తొలిసారిగా 2000 మార్చి 5న ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అప్పటి నుంచి కొనసాగుతున్నారు.
11. ఇప్పటి వరకు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఎంతమంది? (4)
1) 8 2) 6 3) 12 4) 10
వివరణ: ఇప్పటి వరకు 500 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన వారి సంఖ్య 10. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనతను దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన నాలుగో క్రికెటర్. తొలి ముగ్గురు, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మహేంద్రసింగ్ ధోనీ.
12. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 85 2) 100 3) 80 4) 50
వివరణ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. భారత్ 80వ స్థానంలో ఉంది. గతేడాది భారత్ 85వ ర్యాంకులో ఉంది. గత ఐదు సంవత్సరాలుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జపాన్ తాజాగా మూడో స్థానంలో ఉంది. భారత్‌తో పాటు 80వ స్థానంలో టోగో, సెనెగల్ దేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ వీసా లేకుండా 57 దేశాలకు వెళ్లేందుకు వీలుంది. ఈ జాబితాలో పాకిస్థాన్ 100వ ర్యాంకులో ఉంది. ఈ సూచీని గత 20 సంవత్సరాలుగా విడుదల చేస్తున్నారు.
13. ఏ కారణంతో వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్ట్ ఇటీవల తీర్పు చెప్పింది? (1)
1) ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు
2) ఎన్నికల వ్యయం అధికం చేయడం
3) పార్టీ ఫిరాయింపు 4) పైవేవీ కాదు
వివరణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఆ నియోజకవర్గానికి జలగం వెంకట్రావును శాసనసభ్యుడిగా ప్రకటించింది. అయితే తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నెల రోజుల పాటు నిలిపివేయాలని ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు.
14. గడిచిన మూడేళ్లలో ఎఫ్‌డీఐల ఆకర్షణలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? (4)
1) 4 2) 4 3) 6 4) 7
వివరణ: గడిచిన మూడేళ్లలో దేశంలోకి ప్రవహించిన పెట్టుబడుల్లో తెలంగాణకు 2.47% వచ్చాయని కేంద్రం ప్రకటించింది. ఎఫ్‌డీఐల ఆకర్షణలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. అలాగే తలసరి ఆదాయానికి సంబంధించి కూడా పలు అంశాలను కేంద్రం వెల్లడించింది. ఈ అంశంలో దక్షిణాది రాష్ర్టాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732 కాగా, స్థిర ధరల ప్రకారం రూ1,74,657.
15. దేశంలో తొలి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ ఏ రాష్ట్రంలో రానుంది? (3)
1) మహారాష్ట్ర 2) తెలంగాణ
3) గుజరాత్ 4) మధ్యప్రదేశ్
వివరణ: దేశంలో తొలి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ గుజరాత్లో రానుంది. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, వన్‌వెబ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మెహ్సానా వద్ద ఇది ఏర్పాటు కానుంది. దీనివల్ల గ్రామాలు, పంచాయతీలు, ఇతర స్థానిక ప్రభుత్వాలకు ప్రయోజనం చేకూరనుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి లభించనుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు