TET Geography Special | సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రదేశం?
భారతదేశ శీతోష్ణస్థితి
1. ఒక విశాల భూభాగంలో కొన్ని సంవత్సరాలపాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు?
1) వాతావరణ స్థితి
2) శీతోష్ణ స్థితి
3) ఉష్ణోగ్రత 4) అవపాతం
2. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను వేటి సహాయంతో సూచిస్తారు?
1) సమోష్ణోగ్రత రేఖలు
2) సమభార రేఖలు
3) ైక్లెమాటోగ్రాఫ్ 4) పైవన్నీ
3. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమవుతుంది?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) తటస్థంగా ఉంటుంది
4) క్రమ రహితంగా ఉంటుంది
4. ఒకే అక్షాంశంపై ఉన్నప్పటికీ లూథియానా కంటే సిమ్లా చల్లగా ఉండటానికి కారణం?
1) సముద్రానికి సమీపంగా ఉండటం
2) భూమధ్య రేఖకు దూరంగా ఉండటం
3) శీతల స్థానిక పవనాల వల్ల
4) సముద్ర మట్టం కంటే బాగా ఎత్తులో ఉండటం వల్ల
5. భారతదేశ ఉపరితలం నుంచి 12000 మీ. ఎత్తులోని మేఖలలో వేగంగా ప్రవహించే ఉపరితల వాయు ప్రవాహాలను ఏమంటారు
1) జెట్ ప్రవాహం 2) డ్రిప్ట్ ప్రవాహం
3) ట్రేడ్ విండ్ 4) గల్ఫ్ స్ట్రీమ్
6. భారతదేశపు అత్యంత శీతల మాసం?
1) నవంబర్ 2) డిసెంబర్
3) జనవరి 4) ఫిబ్రవరి
7. ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో కురిసే ఒక మోస్తరు వర్షాలకు కారణం?
1) మ్యాంగో షవర్స్
2) పశ్చిమ విక్షోభాలు
3) లూ పవనాలు
4) ఈశాన్య వ్యాపార పవనాలు
8. దేశంలో అధిక వర్షపాతం ఏ పవనాల వల్ల సంభవిస్తుంది?
1) లూ పవనాలు
2) పశ్చిమ విక్షోభాలు
3) ఈశాన్య వ్యాపార పవనాలు
4) నైరుతి వ్యాపార పవనాలు
9. అక్టోబర్ వేడిమి అనే ఉక్కపోత కాలం దేశంలో ఏ కాలంలో సంభవిస్తుంది?
1) వేసవి కాలం 2) శీతాకాలం
3) నైరుతి రుతుపవన కాలం
4) ఈశాన్య రుతుపవన కాలం
10. శ్రావణ, భాద్రపద మాసాల్లో వచ్చే రుతువు?
1) వసంత రుతువు 2) గ్రీష్మ రుతువు
3) వర్షరుతువు 4) శరదృతువు
11. శిశిర రుతువు ఏ నెలలో వస్తుంది?
1) జనవరి ఫిబ్రవరి
2) మార్చి-ఏప్రిల్
3) మే-జూన్
4) జూలై -ఆగస్టు
12. కింది వాటిలో హరిత గృహవాయువు?
1) ఆక్సిజన్ 2) నైట్రోజన్
3) ఆర్గాన్ 4) మీథేన్
13. వార్సా ఒప్పందం జరిగిన సంవత్సరం?
1) 1998 2) 2003
3) 2013 4) 2009
14. 2009లో సుందర్బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన తుఫాను?
1) నీలం తుఫాను 2) ఐలా తుఫాను
3) కత్రినా హరికేన్
4) హుదూద్ తుఫాన్
సమాధానాలు
1-2 2-3 3-2 4-4
5-1 6-3 7-3 8-4
9-4 10-3 11-1 12-4
13-4 14-2
భారతదేశ నదులు-నీటివనరులు
1. భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో కలుషిత నీరు ఎంతశాతం ఉంది?
1) 5 శాతం 2) 10 శాతం
3) 63 శాతం 4) 70 శాతం
2. సింధూనది ఏ పర్వత వ్యవస్థలో జన్మిస్తుంది?
1) కున్లూన్ పర్వతం
2) హిందూకుష్ పర్వతాలు
3) టిబెట్ 4) కైలాస పర్వతాలు
3. గంగానది ఏ ప్రాంతంలో పర్వతాలు వదిలి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది?
1) దేవ ప్రయాగ 2) అలహాబాద్
3) వారణాసి 4) హరిద్వార్
4. నాసిక్ త్రయంబకం వద్ద జన్మించే ద్వీపకల్ప నది?
1) గోదావరి 2) కృష్ణా
3) నర్మద 4) మహానది
5. మహానది జన్మస్థలం?
1) మహాబలేశ్వరం 2) సిహావా
3) అమర్ కంఠక్
4) బ్రహ్మగిరి కొండలు
6. సంవత్సర కాలంలో ఎంత నీరు అందు బాటులో ఉంటుందో దేని ద్వారా అంచనా వేస్తారు?
1) అంతర్గత ప్రవాహాలు
2) బాహ్య ప్రవాహాలు
3) అంతర్గత, బాహ్య ప్రవాహాలు
4) ఏదీకాదు
7. కింది వాటిలో అంతర్గత ప్రవాహం?
1) బాష్పోత్సేకం 2) బాష్పీభవనం
3) నిశ్వాసం 4) వాగులు
8. తుంగభద్రానది జన్మించే పర్వతాలు?
1) మానస సరోవరం
2) వరాహ పర్వతాలు
3) బ్రహ్మగిరి కొండలు
4) అమర్కంఠక్
9. తుంగభద్రానది దిగువ పరీవాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో అధికంగా ఉంటుంది?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
10. గ్రామ పరీవాహక, సమగ్రాభివృద్ధికి ఆదర్శగ్రామ పథకం కింద మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామం?
1) అహ్మద్నగర్ 2) హివారే బజార్
3) నదిముల్లాయి బజార్
4) చౌరిచౌక్
సమాధానాలు
1-4 2-4 3-4 4-1
5-2 6-3 7-4 8-2
9-3 10-2
భారతదేశంలో వ్యవసాయం-జనాభా
1) మనదేశంలో అత్యధికులు ఉపయోగించే ముఖ్య ఆహారం?
1) వరి 2) గోధుమ
3) జొన్న 4) సజ్జ
2. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మనదేశం ఏ స్థానంలో ఉంది?
1) 2 2) 3 3) 4 4) 5
3. అయన, ఉపరేఖా ప్రాంతపు పంట?
1) చెరకు 2) నారింజ
3) పప్పుధాన్యాలు 4) గోధుమ
4. జీవనాధార వ్యవసాయంలో ఎన్ని రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి?
1) 2 2) 3 3) 4 4) 5
5. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో ఎంత శాతం పండిస్తున్నారు?
1) 10 శాతం 2) 11 శాతం
3) 13 శాతం 4) 14 శాతం
6. బంగారు పీచుగా ప్రసిద్ధి చెందిన పంట?
1) పత్తి 2) ఇనుము
3) గోగునార 4) తేయాకు
7. దేశంలో మొదటిసారి జనాభా గణన జరిగిన సంవత్సరం?
1) 1871 2) 1872
3) 1818 4) 1882
8. పనిచేసే సమూహం వయస్సు జనాభా లెక్కల ప్రకారం?
1) 14-45 సంవత్సరాలు
2) 15-59 సంవత్సరాలు
3) 14-60 సంవత్సరాలు
4) 15-58 సంవత్సరాలు
9. కింది వాటిలో లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రం?
1) అమెరికా 2) తెలంగాణ
3) హర్యానా 4) కేరళ
10. జనాభా గణన ప్రకారం అక్షరాస్యత అంచనా వేయడానికి పరిగణించే వయస్సు?
1) 5 సంవత్సరాల పైన
2) 7 సంవత్సరాల పైన
3) 9 సంవత్సరాల పైన
4) 10 సంవత్సరాల పైన
11. భారతదేశంలో జనాభా క్షీణించిన సంవత్సరం?
1) 1911 2) 1921
3) 1931 4) 1941
12. దేశంలో అత్యధిక, అత్యల్ప జనసాంద్రత గల రాష్ర్టాలు?
1) పశ్చిమబెంగాల్, సిక్కిం
2) బీహార్, అరుణాచల్ ప్రదేశ్
3) గోవా, హిమాచల్ ప్రదేశ్
4) కేరళ, మేఘాలయ
13. ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు, చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను గురించి తెలిపేది?
1) స్త్రీ, పురుష నిష్పత్తి
2) జనసాంద్రత
3) కుటుంబమార్పు రేటు
4) ఫెర్టిలిటీ రేటు
14. భారతదేశంలో జనాభా రీత్యా పెద్ద నగరం?
1) ముంబై 2) ఢిల్లీ
3) కోల్కతా 4) చెన్నై
15. కింది వాటిలో మెట్రోపాలిటన్ నగరం కానిది?
1) కోల్కతా 2) చెన్నై
3) హైదరాబాద్
4) అహ్మదాబాద్
16. క్లాస్-1 నగరాల జనాభా పరిమితి?
1) లక్ష-10 లక్షలు
2) లక్ష-5 లక్షలు
3) లక్ష-3 లక్షలు
4) లక్ష-20 లక్షలు
17. పట్టణాలు, నగరాల్లో జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం?
1) సహజవృద్ధి
2) గ్రామీణ ప్రాంతాలకు కలపటం
3) వలసలు 4) ప్రభుత్వ గుర్తింపు
18. సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం గల ప్రదేశం?
1) దుబాయి 2) బ్యాంకాక్
3) సింగపూర్ 4) కైరో
19. భారతీయులు విదేశాలకు వలస వెళ్లడానికి, పనిచేయడానికి పర్యవేక్షించే చట్టం?
1) వలసల చట్టం -1963
2) వలసల చట్టం -1973
3) వలసల చట్టం -1983
4) వలసల చట్టం -1993
సమాధానాలు
1-1 2-4 3-1 4-1
5-3 6-2 7-2 8-2
9-3 10-2 11-2 12-2
13-4 14-1 15-4 16-1
17-1 18-2 19-3
తెలంగాణ-భూ స్వరూపాలు
1. అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) మహబూబ్నగర్ 2) వికారాబాద్
3) నల్లగొండ 4) కరీంనగర్
2. జగిత్యాల జిల్లాలోని కొండలను గుర్తించండి?
1) రాఖీ
2) బాలాఘాట్, నల్లమల
3) సాత్మల, నిర్మల్
4) సిర్నపల్లి దేవరకొండ
3. తెలంగాణ పర్వతాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి?
1) సాత్మల – ఆదిలాబాద్, నిర్మల్
2) బాలాఘాట్ – మహబూబ్నగర్, నాగర్కర్నూల్
3) దేవరకొండ కొండలు – ఖమ్మం
4) నిర్మల్ కొండలు – నిర్మల్ జిల్లా
4. భారతదేశంలో అతి పెద్ద పీఠభూమి?
1) దక్కన్ పీఠభూమి
2) తెలంగాణ పీఠభూమి
3) మాల్వా పీఠభూమి
4) చోటానాగపూర్ పీఠభూమి
5. తెలంగాణ ఏ పీఠభూమిలో అంతర్భాగం?
1) చోటానాగపూర్ పీఠభూమి
2) మాల్వా పీఠభూమి
3) బస్తర్ పీఠభూమి
4) దక్కన్ పీఠభూమి
6. పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచిన నదీ వ్యవస్థ ఏది?
1) గంగా 2) సింధూ
3) బ్రహ్మపుత్ర 4) యమున
7. వరంగల్ కరీంగనర్ పట్టణాలు ఏ పీఠభూమిలో ఉన్నాయి?
1) ఎగువ తెలంగాణ పీఠభూమి
2) దిగువ తెలంగాణ పీఠభూమి
3) మధ్య తెలంగాణ పీఠభూమి
4) ఉత్తర తెలంగాణ పీఠభూమి
8. కింది వాటిలో ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్న నగరాలను గుర్తించండి?
ఎ) సంగారెడ్డి బి) నల్లగొండ
సి) కొత్తగూడెం డి) మహబూబ్నగర్
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
9. కింది వాటిలో ఎగువ తెలంగాణ పీఠభూమిలో లేని పర్వతాలను గుర్తించండి?
1) అనంతగిరి కొండలు
2) కందికల్ కొండలు
3) రాఖీ కొండలు
4) సాత్మల కొండలు
10. నదులు, డెల్టాలు ఏర్పరిచే ప్రదేశాలు?
1) పర్వత ప్రాంతాలు
2) తీరమైదానాలు
3) పీఠభూములు
4) నదీ ప్రారంభ దశలో
11. సాధారణంగా డెల్టాల ఆకారం?
1) వృత్తం 2) పక్షిపాదం
3) త్రిభుజాకారం
4) దీర్ఘచతురస్రాకారం
12. దక్కన్ పీఠభూమికి పశ్చిమ వైపున ఎత్తైన వాలుతో కూడిన పర్వతాలు?
1) ఆరావళి
2) వింధ్య సాత్పూరా
3) పశ్చిమ కనుమలు
4) నల్లమల శ్రేణులు
సమాధానాలు
1-2 2-1 3-3 4-1
5-4 6-2 7-2 8-1
9-2 10-2 11-3 12-3
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు