IBPS PO/MT 2023 Notification | ఐబీపీఎస్లో 3049 పీవో, మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులు
IBPS PO/MT 2023 Notification 2023 | సంవత్సరానికి గానూ ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులలో ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 3049
పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీ
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 20-30 ఏండ్ల మధ్య ఉండాలి.
పోస్టులను భర్తీ చేయనున్న బ్యాంకులు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితరాలు.
ఎంపిక : ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 21
దరఖాస్తు ఫీజు : రూ. 850. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ. 175)
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: నవంబర్, 2023లో ఉంటుంది.
వెబ్సైట్: https://www.ibps.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు