Current Affairs | అంతర్జాతీయం
వరల్డ్‌కాయిన్
ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలో వరల్డ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ ప్రాజెక్టును జూలై 24న ప్రారంభించారు. వరల్డ్‌కాయిన్ ప్రాజెక్ట్ వ్యక్తిత్వానికి రుజువు అనే సంచలనాత్మక భావన చుట్టూ తిరుతుందని, డిజిటల్ గుర్తింపులను ధ్రువీకరించడం కోసం ఒక బలమైన కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆల్ట్మాన్ వెల్లడించారు.
యూకే-ఇండియా
యూకే-ఇండియా డిఫెన్స్ అండ్ మిలిటరీ టెక్నాలజీ కో ఆపరేషన్ వర్క్‌షాప్ కోసం భారత్దేశం, లండన్ సీనియర్ అధికారులు, పలు రంగాల నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులతో లండన్‌లో జూలై 25న వర్క్‌షాప్‌ను నిర్వహించారు. భారత్ శక్తి డిఫెన్స్ ప్లాట్‌ఫాంతో కలిసి లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) దీన్ని చేపట్టింది. ఇరుదేశాల రక్షణ పరిశోధన, పారిశ్రామిక ఉత్పత్తి భాగస్వామ్యాలను పెంపొందించే విషయాలపై చర్చించారు. భారత్-యూకే 2030 రోడ్‌మ్యాప్‌నకు అనుగుణంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
మానెట్
కంబోడియా ఎన్నికల్లో గెలిచిన, ఇప్పటివరకు ప్రధానమంత్రిగా ఉన్న హున్ సేన్ తన కుమారుడు హున్ మానెట్ (45)ను ప్రధానిగా జూలై 26న ప్రకటించారు. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా కంబోడియన్ పీపుల్స్ పార్టీ పాలిస్తుంది. ఈ పాలక పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేషనల్ రెస్క్యూ పార్టీ విదేశీ శక్తుల తోడ్పాటుతో తిరుగుబాటుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలతో సుప్రీంకోర్టుల ఆ పార్టీని రద్దు చేసింది. దీంతో హున్ సేన్ పాలనకు ఎదురులేకుండా పోయింది. హున్ మానెట్ ఆగస్టు 22న ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.
హెపటైటిస్ డే
వరల్డ్ హెపటైటిస్ డేని జూలై 28న నిర్వహించారు. క్యాన్సర్‌కు దారితీసే కాలేయ సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డేని ఏటా నిర్వహిస్తున్నారు. నోబెల్ పొందిన శాస్త్రవేత్త డాక్టర్ బరుచ్ బ్లూమ్‌బర్గ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ డేని చేపడుతున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘వన్ లైఫ్, వన్ లివర్’. – అదేవిధంగా జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని (వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే) కూడా నిర్వహిస్తున్నారు. ప్రకృతి సంరక్షణ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని చేపడుతున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ఫారెస్ట్స్ అండ్ లైవ్లీహుడ్: సస్టెయినబుల్ పీపుల్ అండ్ ప్లానెట్’.
టైగర్ డే
ప్రపంచ పులుల దినోత్సవం జూలై 29న నిర్వహించారు. పులుల సహజ ఆవాసాలను రక్షించడానికి, అంతరించిపోతున్న పులులను కాపాడుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్‌లో పులుల రక్షణ ప్రకటనపై 13 దేశాలు సంతకం చేశాయి. దీనికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు