Current Affairs | వార్తల్లో వ్యక్తులు
నూర్ షెకావత్
రాజస్థాన్‌లోని మొదటి ట్రాన్స్‌జెండర్ బర్త్ సర్టిఫికెట్‌ను అధికారులు నూర్ షెకావత్‌కు జూలై 24న అందజేశారు. జీవిత విషయాలను కొనసాగించడానికి, అందరితో నమ్మకంగా ఉండటానికి ఈ బర్త్ సర్టిఫికెట్‌ను తీసుకున్నానని నూర్ వెల్లడించింది. ఆమె పుట్టినప్పుడు జారీ చేసిన సర్టిఫికెట్లో మగ అని నమోదు చేశారు. ఇప్పుడు దాన్ని మార్చుకున్నారు. అదేవిధంగా రాజస్థాన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా నూర్ గుర్తింపు పొందారు.
వాంగ్ యి
చైనా కొత్త విదేశాంగ మంత్రిగా వాంగ్ యి జూలై 25న నియమితులయ్యారు. ఇదివరకు ఉన్న మంత్రి కిన్ గాంగ్ కనిపించకుండా పోవడంతో చైనా వాంగ్ యి ని నియమించింది. కిన్ గాంగ్ కంటే ముందు ఈ పదవిలో వాంగ్ యి నే ఉన్నారు.
ఫాంగ్నోన్ కొన్యాక్
బీజేపీకి చెందిన ఎంపీ ఎస్ ఫాంగ్నోన్ కొన్యాక్ జూలై 25న రాజ్యసభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళగా నిలిచారు. అదేవిధంగా ఈమె నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొదటి మహిళగా ఘనత వహించారు. రాజ్యసభ్య చైర్మన్ జగదీప్ ధన్కడ్ 8 మంది సభ్యుల్లో నలుగురు మహిళలను వైస్ చైర్పర్సన్ల (ఉపాధ్యక్షులు) ప్యానెల్‌కు నామినేట్ చేశారు. ఈ నలుగురు మహిళలు వైస్ చైర్పర్సన్ ప్యానెల్‌కు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు పీటీ ఉష, డా. ఫౌజియా ఖాన్ (నేషనలిస్ట్ కాంగ్రెస్), సులతా డియో (బిజూ జనతా దళ్) ఉపాధ్యక్ష ప్యానెల్‌కు ఎంపికయ్యారు.
శంకరీ చంద్రన్
శ్రీలంకకు చెందిన ఆస్ట్రేలియన్ రచయిత్రి శంకరీ చంద్రన్‌కు మైల్స్ ఫ్రాంక్లిన్ లిటరరీ అవార్డు-2023 జూలై 26న లభించింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య బహుమతుల్లో ఇది ఒకటి. ఆమె రచించిన ‘చాయ్ టైమ్ ఎట్ సినమోన్ గార్డెన్స్’ నవలకు ఈ అవార్డు దక్కింది. ఇది ఆమె రాసిన మూడో నవల. ఈ అవార్డు కింద 60,000 డాలర్ల నగదును అందజేస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు