Sports Current Affairs | క్రీడలు
నాగల్
భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ టాంపెరె ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఫిన్లాండ్లో జూలై 23న జరిగిన టాంపెరె టోర్నీలో నాగల్ ఐదో సీడ్ డాలిబోర్ స్వర్సినా (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. దీంతో యూరప్‌లో రెండు ఏటీపీ చాలెంజర్ టోర్నీలు గెలుచుకున్న మొదటి ఆటగాడిగా నాగల్ నిలిచాడు. మొత్తంమీద నాగల్‌కు ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ ట్రోఫీ.
సాత్విక్ – చిరాగ్ శెట్టి
భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కొరియన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచారు. జూలై 23న జరిగిన కొరియా ఓపెన్ సూపర్ 500 పురుషుల డబుల్స్ ఫైనల్లో అల్ఫియాన్-ఆర్డియాంతో (ఇండోనేషియా)పై విజయం సాధించారు. దీంతో కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను గెలిచిన తొలి భారత జోడీగా వారు నిలిచారు. ఇప్పటికే వారు స్విస్ ఓపెన్ 300, ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీల్లో విజయం సాధించారు.
కర్మన్ కౌర్
భారత యువ టెన్నిస్ క్రీడాకారిణి కర్మన్‌కౌర్ థండి ఐటీఎఫ్ టైటిల్‌ను గెలుచుకుంది. అమెరికాలో జూలై 24న జరిగిన డబ్ల్యూటీఏ 60 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో యులియా (ఉక్రెయిన్)ను ఓడించింది. సానియా మీర్జా తర్వాత యూఎస్‌లో ప్రొ టెన్నిస్ టైటిల్‌ను గెలిచిన ఘనత కర్మన్దే. గతేడాది తొలి ఐటీఎఫ్ టోర్నీని గెలిచింది. విజేతకు రూ.49 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు.
Sports Current Affairs, TSPSC, Karman Kaur, Satwik – chirag
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు