Current Affairs National | జాతీయం
హెలీ సమ్మిట్
5వ హెలీ సమ్మిట్-2023 మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జూలై 25న నిర్వహించారు. దీన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మిట్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా ఉడాన్ 5.2, హెలిసేవ యాప్‌ను ఆవిష్కరించారు. రీచింగ్ ది లాస్ట్ మైల్: రీజినల్ కనెక్టివిటీ త్రూ హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్ థీమ్‌తో దీన్ని చేపట్టారు.
జాతీయ సదస్సు
భారత టెక్నికల్ టైక్స్టైల్స్లోని ప్రమాణాలు, నిబంధనలపై 6వ జాతీయ సదస్సు జూలై 25న నిర్వహించారు. జౌళి శాఖకు చెందిన నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ (ఎన్‌టీటీఎం) కింద ఫిక్కీ, బీఐఎస్ ఈ సమావేశాన్ని చేపట్టింది. ఈవెంట్ ప్రొటెక్టివ్ టెక్స్టైల్స్, జియో టెక్స్టైల్స్, బిల్డ్ టెక్, ఓకో టెక్, మెడికల్ టెక్స్టైల్స్, ఇతర ఎమర్జింగ్ ప్రాంతాల్లోని టెక్నికల్ టెక్స్‌టైల్స్‌పై చర్చించారు.
మహిళా పోలీస్ స్టేషన్
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌లో మొదటి మహిళా పోలీస్ స్టేషన్‌ను జూలై 26న ప్రారంభించారు. మహిళా సాధికారత, వారి భద్రతకు భరోసా ఇవ్వడంలో ఇది ఉపయోగపడుతుందని ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన లడఖ్ అడిషనల్ డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ అన్నారు. ఇది 24 గంటలూ పనిచేయడంతో పాటు ఒక రిసోర్స్ సెంటర్‌గా పనిచేస్తుంది. మహిళలకు మార్గదర్శకత్వం ఇస్తుంది.
భారత్ మండపం
న్యూఢిల్లీలో ‘భారత్ మండపం’గా మార్చి నూతనంగా నిర్మించిన ‘ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ)’ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ జూలై 26న ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఐఈసీసీని సుమారు రూ.2,700 కోట్లతో కొత్త హంగులతో అభివృద్ధి చేశారు. మరమ్మతులు చేపట్టి ఆధునీకరించారు. ప్రగతి మైదాన్ దాదాపు 123 ఎకరాల్లో విస్తరించి ఉంది.
బెంగళూరు
వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం (డబ్ల్యూసీసీఎఫ్)లో బెంగళూరు నగరాన్ని చేర్చినట్లు డబ్ల్యూసీసీఎఫ్ వ్యవస్థాపక చైర్మన్ సిమన్స్ ఒబే జూలై 27న వెల్లడించారు. ఈ డబ్ల్యూసీసీఎఫ్లో చేరిన భారదేశానికి చెందిన మొదటి నగరం బెంగళూరు. దీనిలోని నగరాలు విధాన రూపకర్తల పరిశోధన, మేధస్సును పరస్పరం పంచుకోవడంతో పాటు భవిష్యత్తు శ్రేయస్సులో సంస్కృతి కీలక పాత్రను అన్వేషిస్తాయి. డబ్ల్యూసీసీఎఫ్ను 2021లో లండన్ మేయర్ కార్యాలయం ద్వారా స్థాపించారు. దీనిలో ఆరు ఖండాల్లోని 40 నగరాలున్నాయి. బెంగళూరు చేరికతో ఈ సంఖ్య 41 కి చేరింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు