Current Affairs | తెలంగాణ
జస్టిస్ అలోక్ అరాధే
రాష్ట్ర హైకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే జూలై 23న ప్రమాణ స్వీకారం చేశారు. గత సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అరాధే నియమితులయ్యారు. జస్టిస్ అరాధే మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్‌లో 1964, ఏప్రిల్ 14న జన్మించారు. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. జమ్మూకశ్మీర్, కర్ణాటక రాష్ర్టాల హైకోర్టుల్లో తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా పని చేశారు. కర్ణాటక నుంచి పదోన్నతిపై రాష్ట్ర హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
ముగ్గురు న్యాయమూర్తులు
రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ జూలై 28న ప్రకటించారు. సీనియర్ న్యాయవాదులైన లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనీల్‌కుమార్ జూకంటి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుజన కలసికం లను అదనపు జడ్జిలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన సుజన 2010లో జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా పని చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరాకు చెందిన అలిశెట్టి లక్ష్మీనారాయణ పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. అనీల్‌కుమార్ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
current affairs telangana, competitive exams, TSPSC, telangana chief justice alok aradhe
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు