Irrigation System | నీటి పారుదల
- ఆర్థికంగా అన్ని విధాలా నిలదొక్కుకోగలిగిన రీతిలో వ్యవసాయరంగంలో వృద్ధిని సాధించడం అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలకు కీలకమైన అజెండా, వ్యవసాయ రంగం ప్రధానంగా వర్షాధారమైంది. నానాటికీ తరిగిపోతున్న భూగర్భ జలాల మీద గణనీయంగా ఆధారపడింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 55.49 శాతం మంది తమ జీవనోపాధి కోసం ఏదో విధంగా వ్యవసాయ కార్యకలాపాల మీదనే ఆధారపడి ఉన్నారు. పేదరికాన్ని తగ్గించడానికి తెలంగాణలో సంపద వృద్ధిని నికరంగా సాగించడానికి వ్యవసాయ ఆదాయాలను పెంచడం కీలకమైంది.
- వర్షపాతం ప్రధానంగా నాలుగు నెలలకే పరిమితం కావడంతో మిగిలిన కాలంలో పంటలు పండించడానికి ఇతర నీటి వనరులపై ఆధారపడాల్సి వస్తుంది.
- అందుబాటులో ఉన్న నీటిని కృత్రిమ పద్ధతుల ద్వారా అవసరమైన సమయంలో పంటలకు అందించడాన్ని నీటి పారుదల అంటారు.
నీటి పారుదల అభివృద్ధి - తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు పూర్వకాలంలో ప్రధానంగా నీటిపారుదలను బావులు, చెరువుల ద్వారా అందించి పంటలను సాగు చేసేవారు. గొలుసుకట్టు చెరువులను నిర్మించి వ్యవసాయానికి నీటిపారుదల వసతులు కల్పించారు. 12వ, 13వ శతాబ్దాల కాలంలో చిన్న నదులకు అడ్డుకట్టలు కట్టి, నీటిపారుదల సౌకర్యాన్ని అందించారు. విశాలమైన ప్రాంతాలకు సరిపడే నీటిని సరఫరా చేయగల పెద్ద పెద్ద చెరువులను నిర్మించడం కాకతీయుల కాలంలోనే ప్రారంభమైంది. ఈ చెరువులు నీటి పారుదలకే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి రమణీయతను కలిగి ఉండి కొన్ని చెరువులు విహార యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉదా: రామప్ప, లక్నవరం, ఘనపురం, పాకాల చెరువులు.
రామప్ప సరస్సు: ఇది మధ్యతరహా ప్రాజెక్టు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పాలంపేట వద్ద కలదు.
పాకాల సరస్సు: పంపలవాగు, ఇసుకవాగుల జలధారలను పాకాల సరస్సులోకి మళ్లించే పథకం. ఇది వరంగల్లు జిల్లాలోని కొత్తగూడ మండలంలోని తిరుమలగండి వద్ద కలదు. దీన్ని క్రీ.శ.13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. చెరువు దగ్గర ఉన్న శిలాఫలకం ప్రకారం కాకతీయ సైన్యానికి చెందిన జనరల్ జగదల మమ్మడి దీని నిర్మాణం పూర్తి చేశాడు.
లక్నవరం సరస్సు: ఇది ములుగు జల్లాలోని గోవిందరావుపేట మండలంలో చల్వాయి వద్ద కలదు. దీని నిర్మాణంలో సహజ సిద్ధంగా ఉన్న చిన్న గుట్టలను కలుపుతూ మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. ప్రకృతి రమణీయతతో కూడి ఉన్న లక్నవరం చెరువు విహారయాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇది కాకతీయుల కాలం నాటిది.
నిజాం కాలంలో నీటి పారుదల - నిజాం రాజుల కాలంలో వ్యవసాయం కోసం నీటిపారుదల నిర్మాణాలు చేపట్టారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టులను హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించారు. అవి కూడా 19వ శతాబ్దంలో భారతదేశ స్వాతంత్య్రానికి కొన్ని సంవత్సరాల ముందు నిర్మాణాలను చేపట్టారు. పెద్ద నదులైన కృష్ణా, గోదావరి నదులపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, పోచారం చెరువు, నిజాంసాగర్, డిండి, పాలేరు, వైరా మొదలైన ప్రాజెక్టులు నిర్మించారు.
Telangana irrigation, Irrigation System, TSPSC, competitive exams
Previous article
English | What is the passagemainly about?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు