GROUP-I Mains Special | ఎస్సీల రాజ్యాంగ పరిరక్షణలు ఎన్సీబీసీ ఎదుర్కొనే సవాళ్లు
1.షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) దయనీయ పరిస్థితుల వెనుక గల ప్రధాన కారణాలు తెలియజేయండి? ఎస్సీల అభ్యున్నతి కోసం ఉన్న రాజ్యాంగ పరిరక్షణలు ఏమిటి?
ఎస్సీల దయనీయ పరిస్థితికి కారణాలు
1) అంటరానితనం.
2) దళిత ఉద్యమాలు కేవలం అసమానతలను అణచివేయడానికి జరుగుతున్నాయి. కానీ సాధికారత, రాజకీయ ప్రాతినిథ్యం కోసం జరుగడం లేదు.
3) వ్యవసాయ ఆదాయంలో స్తబ్దత.
4) దళితుల ఓట్లను తాత్కాలికంగా ప్రలోభ పెట్టి రాబట్టుకుంటున్నారు.
5) దళితులపై ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించిన అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
6) NFHS సర్వే ప్రకారం 15 సంవత్సరాల్లోపు దళిత బాలికలు శారీరక హింసకు గురవుతున్నారు. ఇది 33.2 శాతం ఉంది (ఇతరులు 19.7%).
7) దళితులపై నేరాలకు గల కేసులను విచారించడంలో జాప్యం.
రాజ్యాంగ పరిరక్షణలు
1) ఆర్టికల్ 17
2) ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీల ఆర్థిక, విద్య, సామాజిక
అన్యాయం, దోపిడీల నుంచి రక్షణ.
3) ఆర్టికల్ 15 (4)
4) ఆర్టికల్ 16 (4A) పదోన్నతి, రిజర్వేషన్
5) 243 డి, 243 టి
6) ఆర్టికల్ 330, 332. పార్లమెంట్, శాసన సభల్లో సీట్ల కేటాయింపు.
7) 338 ఆర్టికల్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC)
8) సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
2.భారతదేశంలోని హిందువులు ‘మైనారిటీలుగా ఉన్న రాష్ర్టాల్లో వారి ప్రయోజనాలను ఏ విధంగా రక్షిస్తున్నారు?
1) దేశంలోని కింది 6 రాష్ర్టాలు, యూటీల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. (జనాభా 2011 లెక్కల ప్రకారం)
1) లక్షద్వీప్ 2.5 % 2) మిజోరం 2.75%
3) నాగాలాండ్ 8.75% 4) మేఘాలయ 11.53%
5) జమ్మూకశ్మీర్ 28.4% 6) అరుణాచల్ ప్రదేశ్ 29%
7) మణిపూర్ 31.39% 8) పంజాబ్ 38.40%
2) 2002లో TMA PAI ఫౌండేషన్, 2005లో బాల్ పాటిల్ కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా వీరికి మైనారిటీ హోదా ఇవ్వాలని తీర్పునిచ్చింది.
3) TMA PAI కేసులో ఆర్టికల్- 30 ప్రకారం రాష్ర్టాల వారీగా మతపరమైన, భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించాలి.
4) 2005లో బాల్ పాటిల్ కేసులో మైనారిటీల స్థితిని నిర్ణయించేందుకు రాష్ర్టాలకు చట్టపరంగా హక్కులున్నాయని తీర్పు ఇచ్చింది.
5) NCMEI (National Commission for Minority Education Institution) చట్టం-2004 కేంద్రానికి రాష్ట్రంలో మైనారిటీలను గుర్తించేందుకు హద్దులు లేని అధికారాన్ని ఇచ్చింది.
6) 2016లో మహారాష్ట్రలోని యూదులను మైనారిటీ కమ్యూనిటీగా, కర్ణాటకలో ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, తుళు, లమాని, హిందీ, కొంకణి, గుజరాతీలను మైనారిటీ భాషలుగా నోటిఫై చేసింది.
7) మణిపూర్ హిందూమతం, బహయిజం, జుడాయిజం వారు మైనారిటీలుగా ప్రకటించబడ్డారు. కాబట్టి వీరు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించవచ్చు.
8) ఆర్టికల్ 246 ప్రకారం రాజ్యాంగం మైనారిటీల ప్రయోజనాలు కాపాడేందుకు ఆర్థిక, సామాజిక ప్రణాళికలను పార్లమెంటు రూపొందించుకోవచ్చు.
9) NCM-1992 చట్టంలోని సెక్షన్ 2 (C) ప్రకారం మైనారిటీల గురించి చర్చించడానికి అధికారాలు ఇచ్చారు.
10) ఆర్టికల్ 350-B ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956లో మైనారిటీల కోసం భాషాపరమైన అధికారిని నియమించుకోవచ్చు.
11) దేవికానందన్ ఠాకూర్ కేసు- 2022: హిందువులను కొన్ని రాష్ర్టాల్లో మైనారిటీలుగా గుర్తించి ప్రయోజనాలను అందించాలని కోరింది. (ఈశాన్య రాష్ర్టాల్లో జుడాయిజం, బహయిజం, హిందూమతం వారు)
12) దేశంలో నోటిఫైడ్ మైనారిటీలు 19% ఉన్నారు.
3,షెడ్యూల్డ్ కులాలు వివిధ రాష్ర్టాల్లో ఏ రకమైన హోదాను కలిగి ఉన్నారు? మత మార్పిడి జరిగితే వీరికి ఏ మత హోదా కల్పిస్తారు?
1) షెడ్యూల్డ్ కులాల స్థితి (అమరిక)ని రాజ్యాంగం- 1950 ఉత్తర్వుల ద్వారా తెలియజేసింది. దీని ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాల సభ్యులను మాత్రమే ఎస్సీలుగా గుర్తిస్తారు.1956లో సిక్కు మతంలోకి మారిన దళితులను, 1990లో బౌద్ధ మతంలోకి మారిన దళితులను చేర్చారు.
2) దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా చేర్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో తిరస్కరించింది.
3) భారతీయ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం- కేవలం హిందూ, సిక్కు కమ్యూనిటీల్లో ఉన్న వివక్ష అని పేర్కొన్నది.
4) ఒక వేళ ముస్లింలు, క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తే అంతర్జాతీయంగా కూడా ఈ సమాజాల్లో వారి మతాల వారి ఆచరణలు, నియమాలు అనే అంశాలపై అనర్థాలు వస్తాయి.
5) 2000లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ల అభిప్రాయాన్ని వాజ్పేయి ప్రభుత్వం కోరింది. కానీ ఈ కమిషన్లు వ్యతిరేకించాయి.
- పంజాబ్ అత్యధిక శాతం- SC (32%)
- మిజోరం, లక్షదీప్లో అధిక శాతం- ST (95%)
- STలు పంజాబ్, హర్యానాల్లో- 0% ఉన్నారు
- 22 ఏండ్ల యదు కృష్ణన్ అనే ఎస్సీకి చెందిన వ్యక్తి (కేరళ, పతనంతిట్ట జిల్లాలోని వలంజపట్టలో మణప్పురం మహాదేవ ఆలయం) పూజలు చేసేందుకు అర్హత సాధించారు.
4. జాతీయ ఇతర వెనుకబడిన వర్గాల కమిషన్ (NCBC)కు ఆర్టికల్ ‘338 B’ ద్వారా ఏ విధమైన రాజ్యాంగ హెూదా కల్పించారు? నూతన NCBC ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? OBC ఉప వర్గీకరణ కోసం నియమించిన కమిటీ ఏది?
పరిచయం
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను, వారి వెనుకబాటుకు గల పరిస్థితులను గుర్తించడం, అర్థం చేసుకోవడం, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి సిఫారసులు అవసరం అని తెలియజేస్తుంది.
- బీపీ మండల్ కేసు తీర్పులో (1992) OBC జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించేందుకు శాశ్వత, చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి అనుగుణంగా 1993లో NCBC చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది.
- OBCల ప్రయోజనాలను మరింత పటిష్ఠం చేసి, సమర్థవంతంగా పరిరక్షించేందుకు 2017లో 123వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
- 1993 NCBC చట్టాన్ని రద్దు చేశారు. దీని స్థానంలో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2018లో రాజ్యాంగంలో ఆర్టికల్ 338 B చేర్చారు.
నూతన NCBCలోని అంశాలు
1) ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కులను అతిక్రమించదు. రాష్ర్టాలకు సొంతంగా కమిషన్లను ఏర్పాటు చేసుకొనే అధికారం ఉంటుంది.
2) NCBC కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సిఫారసు చేస్తుంది.
3) BCల సంక్షేమం, చట్టాలు, దర్యాప్తు, పర్యవేక్షణలు, సలహాలు, నివేదికలను అందజేయడం లాంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
4) సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
విధులు
1) ఫిర్యాదుల విచారణ
2) ప్రణాళికలు, సలహాలు
3) రక్షణ, అభివృద్ధి, సంక్షేమం
4) వార్షిక నివేదిక రాష్ట్రపతికి అందజేస్తుంది
5) రిజర్వేషన్లతో పాటు అన్ని పరిమితుల్లో సమగ్ర అభివృద్ధి, సమానత్వం అవసరమని గుర్తించింది.
6) Civil Court Powers
7) SC, ST కమిషన్లతో సమానంగా హోదా
8) 312 A పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. కాబట్టి ఎక్కువ పారదర్శకత ఉంటుంది.
9) సభ్యులు కనీసం ఇద్దరు OBCలు, 1 మహిళ ఉండటం అనేది మరింత ప్రజాస్వామ్యంగా, ప్రభావవంతంగా పని చేయడానికి దోహదం చేస్తుంది.
10) సుమోటో అధికారం, సాక్షుల రికార్డులు కోరడం.
సవాళ్లు
1) సభ్యులను ప్రభుత్వం ఇష్టానుసారంగా నియమించుకోవచ్చు.
2) OBCల జాబితా విషయంలో సొంత నిర్ణయాధికారం లేదు. పార్లమెంట్ ఆమోదం అవసరం.
3) కొత్తగా SC, STలతో OBCలను సమానం చేయడం వల్ల చారిత్రక వాస్తవానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
4) కేంద్ర జాబితా మాత్రమే ఉండటం వల్ల ఫెడరలిజం స్ఫూర్తికి ఇది వ్యతిరేకం.
5) ప్రస్తుత OBCల స్థితిగతులపై స్పష్టత ఇవ్వలేదు.
6) వెనుకబాటుతనాన్ని నిర్వచించలేదు. నూతన బీసీలుగా చేర్చాలన్న డిమాండ్లను పరిష్కరించదు.
OBCల ఉప వర్గీకరణ కోసం నియమించిన కమిటీ - ఓబీసీల ఉప వర్గీకరణ కోసం పరిశీలన చేసి, సలహాలు ఇవ్వమని జస్టిస్ జీ రోహిణి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీరి సూచనల ద్వారా తక్కువ హెూదా/ఆధిపత్యం గల వారికి విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి ప్రయోజనాలను పెంచే అవకాశం లభిస్తుంది. ఈ కమిటీని 2017, అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ముగింపు - సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా నిపుణుల సంస్థను NCBCలో భాగంగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కులగణన NCBC సిఫారసులను ప్రజలకు అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్లో ప్రచురించాలి. ఈ సిఫారసుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. కమిషన్లో సభ్యులు నిరంతరం రాష్ర్టాల్లోకి వెళ్లి ప్రజలతో విస్తృత సంప్రదింపులు జరపాలి. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా విలువలతో కూడిన పరిపాలన అందించాలి.
అదనపు సమాచారం - 1953- కాకా కాలేల్కర్ కమిటీ ప్రకారం OBC జనాభా 52%
- 1980- మండల్ కమిషన్ 1,257 సమూహాలు ఉన్నట్లు గుర్తించింది.
- 342-A ఆర్టికల్ OBCలను కేంద్ర జాబితాలో చేర్చడం, మినహాయించడం కోసం పార్లమెంటుకు సూచనలు, ఆమోదాన్ని గురించి తెలియజేస్తుంది.
మైనారిటీల సమాచారం
1) దేశంలోని ప్రతి వ్యక్తి ఒక రాష్ట్రంలో లేదా మరొక రాష్ట్రంలో మైనారిటీగా ఉండవచ్చు. వీరి మత, భాషా పరమైన మైనారిటీ హోదా అనేది ‘రాష్ట్రం ఆధారితమైంది’ అని 2022, జూలై 18న సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ U.U. లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
2) ఆర్టికల్ 29, 30 ప్రకారం తన సొంత విద్యాసంస్థలను నిర్వహించే హక్కును ‘అంతర్గతంగా’ వారి రాష్ట్రంలో కలిగి ఉండవచ్చు.
3) భాషా పరమైన మైనారిటీల గురించి TMA Pai కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ తీర్పును ధిక్కరిస్తూ కేంద్రానికి అపరిమిత అధికారం ఇచ్చింది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం-1992లోని సెక్షన్ 2(సి)ను సవాలు చేశారు. కేంద్రం కాకుండా రాష్ర్టాలకు అధికారం ఇవ్వాలని కోరింది.
భారతదేశంలో వృద్ధాప్య జనాభా స్థితిని వివరించండి?
1) జాతీయ జనాభా కమిషన్ ప్రకారం 2011లో వృద్ధుల జనాభా 9% ఉంది. 2036 నాటికి 18% చేరుకోవచ్చు.
2) దేశంలో ఆయుర్దాయం పెరిగింది. అత్యధికంగా మూడింట రెండింతల మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. దాదాపు సగం మంది పేదరికంలో ఉన్నారు. ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. (మహిళలు 3.49%, పురుషులు 1.42%)
3) దక్షిణ రాష్ర్టాలు- ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంది. ఉత్తరాది రాష్ర్టాలైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్లో కూడా వృద్ధులు ఎక్కువగా ఉన్నారు.
- కేరళలో అత్యధిక వృద్ధుల జనాభా 16.5% ఉంది. కేరళ (1), తమిళనాడు (2), హిమాచల్ ప్రదేశ్ (3)
- బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాంలో అతి తక్కువగా ఉన్నారు.
- దేశంలో ప్రస్తుతం 138 మిలియన్ల మంది వృద్ధులున్నారు. (2021)
- 2031 నాటికి వీరి జనాభా 194 మిలియన్లకు చేరుకోవచ్చు. (దాదాపు 41 % పెరుగుదల ఉండవచ్చు)
ముగింపు - దేశంలో పెరుగుతున్న పట్టణీకరణ, కుటుంబాలు చిన్న యూనిట్లుగా విడిపోవడంతో వృద్ధుల కోసం గృహాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేటలో వృద్ధ సదనం ఏర్పాటు చేసింది. ఈ ఆశ్రమాలు వీరికి భద్రతా భావాన్ని అందిస్తాయి. ఇటీవల వృద్ధుల కోసం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండ లంలో రాష్ట్రంలోనే తొలి డే కేర్ సెంటర్ను 2023, ఫిబ్రవరి 27న ప్రారంభించారు.
- Sourse: ది హిందూ పత్రికలో THE Future of Old Time In India పేరుతో 2022, సెప్టెంబర్ 15న ఆర్టికల్ ప్రచురితమైంది.
బి. పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ,
లా ఎక్సలెన్స్
ఐఏఎస్ అకాడమీ
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు