TSPSC Group-2 Paper-2, Section 3 | సామాజిక అంశాలు – ప్రభుత్వ విధానాలు
1. సమాజం
ఎ. సమాజం అంటే సామాజిక సంబంధాల సొంత గూడు
బి. సమాజానికి మౌలిక ఆధారం వ్యక్తులు మాత్రమే
సి. సమాజ శాస్త్ర పితామహుడు మెకైవర్
డి. ప్రతి సమాజంలో సమూహాలు, సముదాయాలు, సంస్థలు ఉంటాయి
ఇ. భారతీయ సమాజం ఏకరూప సమాజం
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, సి 2) బి, సి, డి, ఇ
3) ఎ, సి, డి, ఇ 4) ఎ, బి, సి, డి, ఇ
2. సమాజ లక్షణం కానిది?
ఎ. శ్రమ విభన బి. విశిష్టమైన సంస్కృతి
సి. విశాలమైన భూభాగం
డి. పరస్పర ఆశ్రయత
ఇ. ఒకే విధమైన సంస్కృతి, సంప్రదాయాలు
ఎఫ్. నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, సి, డి 2) సి, డి, ఇ, ఎఫ్
3) బి, డి, ఎఫ్ 4) ఎ, బి, డి, ఎఫ్
3. సమాజం విధి కానిది?
1) సామాజిక నియంత్రణ
2) సామాజిక అస్థిరత్వం
3) సాంఘికీకరణం
4) సభ్యులకు శిక్షణ అందించడం
4. జతపర్చండి.
శాస్త్రవేత్త అంశం
ఎ. గోవింద్ సదాశివ ఘర్యే 1. సమాజం అనే గ్రంథం
బి. ఆగస్ట్ కామ్టే 2. భారతదేశంలో సమాజ శాస్త్ర పితామహుడు
సి. కారల్ మార్క్స్ 3. మతం మత్తు మందు లాంటిది
డి. మెకైవర్ 4. సమాజ శాస్త్ర పితామహుడు
ఇ. జవహర్లాల్ నెహ్రూ 5. డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం
1) ఎ-2, బి-1, సి-4, డి-3, ఇ-5
2) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
3) ఎ-2, బి-4, సి-3, డి-1, ఇ-5
4) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5
5. మెగస్తనీస్ వివరణ ప్రకారం భారతీయ సమాజం ఎన్ని వర్గాలుగా విభజించబడింది?
1) ఐదు 2) ఆరు 3) ఏడు 4) ఎనిమిది
6. ప్రాచీన భారతదేశ హిందూ సమాజానికి ఆధారం కానిది?
1) ఆశ్రమ వ్యవస్థ 2) పురుషార్థాలు
3) మత సంప్రదాయాలు 4) వర్గ వ్యవస్థ
7. భారతీయ సమాజాన్ని జాతుల ప్రదర్శనశాల అని పేర్కొన్నది?
1) జేహెచ్ హట్టన్ 2) పీఏ స్మిత్
3) జీఎస్ ఘర్యే 4) విలియం వైజర్
8. సరైన స్టేట్మెంట్స్ను గుర్తించండి?
ఎ. సర్ హెర్బర్ట్ రిస్లే భారతదేశంలో 7 రకాల జాతులు ఉన్నట్లు గుర్తించాడు
బి. బీఎస్ గుహ భారతదేశంలో 6 రకాల జాతులున్నట్లు గుర్తించాడు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి తప్పు 4) ఎ, బి సరైనవి
9. ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత?
1) బీఎస్ గుహ 2) సర్ హెర్బర్ట్ రిస్లే
3) గ్రిమోర్సన్ 4) జీఎస్ ఘర్యే
10. భారతీయ సమాజ విశిష్ట లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వానికి ఆధారం కానిది?
1) జాతీయ గీతం, జాతీయ జెండా, జాతీయ భాష
2) రాజ్యాంగం, ఉమ్మడి న్యాయవ్యవస్థ, పార్లమెంట్
3) రవాణా సదుపాయాలు, ప్రసార సాధనాలు
4) భౌగోళిక సంపద, అడవులు, సహజ వాతావరణం
12. ఎంఎన్ శ్రీనివాస్ రచన కానిది?
1) ఆధునిక భారతదేశంలో సామాజిక మార్పు
2) భారతదేశంలో కులవ్యవస్థ
3) రాంపూర్‌లో ఆధిక్య కులం
4) వొక్కలిగ కులంలో మతం, సమాజం
13. డీఎన్ మజుందార్ వివరణ ప్రకారం ఉన్నత, నిమ్న కులాల జీవన విధానాన్ని అనుకరించడాన్ని ఏమని పేర్కొంటారు?
1) సంస్కృతీకరణం 2) విసంస్కృతీకరణం
3) పాశ్చాత్యీకరణం 4) ఆధునికీకరణం
14. స్టేట్మెంట్స్
ఎ. ముస్లింల ఆహార అలవాట్లు, వేషధారణ, పరదా పద్ధతిని ఇతర మతస్థులు అనుకరించడాన్ని ఇస్లామీకరణ అంటారు
బి. ఇస్లామీకరణ, సంస్కృతీకరణ రెండూ సంప్రదాయ భారతీయ సమాజ ప్రధాన లక్షణమైన క్రమానుగత శ్రేణి సూత్రాన్ని సవాలు చేసిన రాజకీయ, సాంస్కృతిక ప్రక్రియలు
సి. సంస్కృతీకరణం వల్ల కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ప్రయోజనం పొందాయి సరైన సమాధానం ఎంచుకోండి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి, సి
15. స్టేట్మెంట్స్
ఎ. భారతదేశంలో కులం అనే గ్రంథాన్ని రచించింది హట్టన్
బి. భారతదేశంలో కులం, వర్గం అనే గ్రంథాన్ని రచించింది జీఎస్ ఘర్యే
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
16. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం?
1) ఏప్రిల్ 15 2) మే 15
3) జూన్ 15 4) జూలై 15
17. పాశ్చాత్యీకరణ లక్షణం కానిది?
1) హేతుబద్ధత 2) వ్యక్తిగతవాదం
3) సాముదాయకవాదం
4) ప్రజాస్వామ్యవాదం
18. స్టేట్మెంట్స్
ఎ. భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై ఐరావతి కార్వే పరిశోధన చేశారు
బి. దక్షిణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలపై ఎంఎన్ శ్రీనివాస్ పరిశోధన చేశారు
సి. భారతీయ సమాజ మౌలిక నిర్మాణంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రియాశీల పాత్ర పోషించిందని సర్ హెన్రీ మెయిన్ పేర్కొన్నాడు
డి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో కుటుంబ ప్రాథమిక ఉత్పత్తి విభాగంగా కొనసాగలేకపోతుంది
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
19. కేంద్రక కుటుంబంలోని సభ్యులు?
1) తల్లిదండ్రులు
2) తల్లిదండ్రులు, అవివాహ సంతానం
3) తల్లిదండ్రులు, వివాహ సంతానం
4) తల్లిదండ్రులు, రెండు తరాలకు చెందిన సంతానం
20. మానవ వివాహాల చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది?
1) మలినోవ్స్కీ 2) వెస్టర్ మార్క్
3) సెల్జీమన్ 4) మాక్స్ ముల్లర్
21. ఒక వ్యక్తి తన సోదరుడు చనిపోయినప్పుడు, అతడి భార్యను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?
1) అనులోమ వివాహం
2) ప్రతిలోమ వివాహం
3) దేవర వివాహం 4) అంతర్వివాహం
22. చర్చి కోర్టులు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత ఉండదని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది?
1) 2015 2) 2016
3) 2017 4) 2018
23. ఏ చట్టం ప్రకారం హిందువుల్లో బహు వివాహాలు నిషేధం?
1) భారతీయ వివాహ చట్టం- 1954
2) హిందూ వివాహ చట్టం- 1955
3) బహు వివాహ నిషేధ చట్టం- 1956
4) వివాహ నియంత్రణ చట్టం- 1957
24. భారతదేశంలో పార్శీ వివాహ, విడాకుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 1935 2) 1936
3) 1937 4) 1938
25. కింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి.
ఎ. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, వారి సంతానం మధ్య ఉండే బంధుత్వం ప్రాథమిక బంధుత్వం
బి. ప్రాథమిక బంధువుకు ప్రాథమిక బంధువు ద్వితీయ బంధువు
సి. ద్వితీయ బంధువుకు ప్రాథమిక బంధువు తృతీయ బంధువు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
26. ఒక వ్యక్తి జీవిత విశేషాలన్నింటినీ మేనమామ (తల్లి సోదరుడు) శాసించడాన్ని ఏమని పిలుస్తారు?
1) పితృశ్వాధికారం 2) మాతులాధికారం
3) కుహనా ప్రసూతి
4) బంధుత్వ నియంత్రణ
27. తరతరాలుగా పితృ లేదా మాతృ దేవతలను ఆరాధిస్తూ ఒక మూలపురుషుడు లేదా స్త్రీ సంతతిగా భావించే ఏక వంశానుక్రమ సమూహం?
1) మిశ్రమ వంశానుక్రమం
2) ద్వంద్వ వంశానుక్రమం
3) గోత్రం 4) గోత్ర కూటమి
28. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వివిధ మతాల జనాభాను సంబంధించి సరికానిది?
1) హిందూ- 79.80 శాతం
2) ఇస్లాం- 16.20 శాతం
3) క్రిస్టియన్- 2.29 శాతం
4) సిక్కు- 1.70 శాతం
29. సీఎన్ ప్రభు రచించిన హిందూ సామాజిక వ్యవస్థాపన అనే గ్రంథంలో ఏ అంశానికి ప్రాముఖ్యం ఇచ్చారు?
1) ఆశ్రమ వ్యవస్థ 2) వర్ణ వ్యవస్థ
3) వేదాలు 4) కర్మ సిద్ధాంతం
30. జైన మత త్రిరత్నాలకు సంబంధం లేని అంశం?
1) సత్ విశ్వాసం 2) సత్ ప్రవర్తన
3) సత్ కర్మ 4) సత్ జ్ఞానం
31. సిక్కు మత సంప్రదాయంలో దశ్వంత్ అంటే?
1) సిక్కులు సిక్కు మత వ్యాప్తి కోసం కనీసం దశాబ్ద కాలం కృషి చేయాలి
2) సిక్కులు తమ మత గ్రంథాలను దశాబ్ద కాలం పాటు చదవాలి
3) సిక్కులు తమ జీవిత కాలంలో కనీసం దశాబ్ద కాలం నిష్టతో జీవించాలి
4) సిక్కులు తమ ఆదాయంలో 1/10వ వంతును పేదలకు దానం చేయాలి
32. ఇస్లాంలోని ఆధ్యాత్మిక వాదాన్ని ప్రచారం చేసిన ఉద్యమం?
1) భక్తి ఉద్యమం 2) సూఫీ ఉద్యమం
3) ఇస్లాం ఉద్యమం
4) జైంశియా ఉద్యమం
33. కింది స్టేట్మెంట్స్ను గమనించండి.
ఎ. లూయిస్ హెన్రీ మోర్గాన్ రచించిన ప్రాచీన సమాజం అనే గ్రంథంలో గిరిజనుల గురించి వివరించారు
బి. భారత రాజ్యాంగంలోని నిబంధన 341 గిరిజనుల గుర్తింపునకు సంబంధించింది
పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి తప్పు 4) ఎ, బి సరైనవి
34. 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభాకు సంబంధించి సరైన అంశం?
1) భారతదేశంలో గిరిన జనాభా 10.43 కోట్లు
2) భారతదేశ గిరిజనుల్లో అక్షరాస్యత 59.96 శాతం
3) భారతదేశ గిరిజనుల్లో స్త్రీపురుష నిష్పత్తి 1000:998
4) భారతదేశంలో గిరిజన జనాభా ఎక్కువ గల రాష్ట్రం మహారాష్ట్ర
35. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ చట్టం ప్రకారం బంజారాలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించారు?
1) యాక్ట్ 108 ఆఫ్ 1976
2) యాక్ట్ 118 ఆఫ్ 1976
3) యాక్ట్ 128 ఆఫ్ 1976
4) యాక్ట్ 138 ఆఫ్ 1976
36. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభాలో గిరిజన జనాభా శాతం?
1) 9.24 2) 9.34
3) 9.44 4) 9.54
37. దేశంలో మహిళలకు సంబంధించిన అంశాలను జతపర్చండి?
ఎ. లార్డ్ డల్హౌసీ, హంటర్ 1. నేషనల్ కాన్ఫరెన్స్ సంస్థ ద్వారా సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం
బి. జస్టిస్ రణడే 2. మహిళల కోసం మహారాష్ట్రలో విశ్వవిద్యాలయం స్థాపన
సి. మహర్షి కార్వే 3. మహిళలకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పించడం
డి. రాజా రామ్మోహన్ రాయ్ 4. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడటం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
11. జతపర్చండి.
కులం శాస్త్రవేత్త
ఎ. అంతర్వివాహాల సముదాయాలు సమాహారం 1. మదన్, మజుందార్
బి. వ్యవస్థీకృతమైన సామాజిక సముదాయం 2. ఎంఎన్ శ్రీనివాస్
సి. సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న పరిమిత సంఖ్యగల సమూహం 3. ఎడ్వర్డ్ బ్లంట్
డి. ఒకే పేరుగల కుటుంబాల సముదాయం 4. సర్ హెర్బర్ట్ రిస్లే
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-2, బి-4, సి-1, డి-3
సమాధానాలు
1-3, 2-4, 3-2, 4-3, 5-3, 6-4, 7-2, 8-4, 9-2, 10-4, 11-2, 12-4,
13-2, 14-3, 15-3, 16-2, 17-3, 18-4, 19-2, 20-2, 21-3, 22-3, 23-2, 24-2, 25-3, 26-2, 27-3, 28-2, 29-2, 30-3, 31-4, 32-2, 33-1, 34-1, 35-1, 36-2,
37-3
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు