Study Abroad – Career Guidence | ఏ దేశం వెళదాం.. ఏం చదువుదాం
నేటి తరం యూత్ విదేశాల్లో చదువు, కొలువు కోరుకుంటుంది. బీఎస్, ఎంఎస్ లేదా డిప్లొమా ఏదైనా ఫారిన్లోనే
చదవాలనుకుంటున్నారు. ముందు ఏదో ఓ కోర్సులో చేరాలి. తర్వాత ఉద్యోగం సంపాదించాలి. డాలర్లు సంపాదించాలన్న ఆశతో విదేశాలకు క్యూ కడుతున్నారు. అంతేకాదు అన్నీ కుదిరితే అక్కడే స్థిరపడాలనుకుంటున్నారు. స్టార్టప్‌లలో రాణించడమే కాదు కంపెనీలు కూడా పెడుతున్నారు. యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఇలా ఎక్కడ అవకాశముంటే అక్కడికి
వెళ్తున్నారు. సీటు రావడమే ఆలస్యం అప్పో సప్పో చేసి పయనమవుతున్నారు. ఈ ప్రయత్నంలో ఏ దేశం వెళ్లాలి, ఏం చదవాలన్న అన్వేషణ అతి ముఖ్యం. నిబంధనలు, ఫీజు, జీవన వ్యయం వంటి సమాచారం ముందే తెలుసుకుంటే చదువులు సాఫీగా సాగుతాయి. లేదంటే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో 16 దేశాల్లో మాస్టర్స్ చేసేందుకు గల అర్హతలు, నిబంధనలు, ఫీజు, పార్ట్ టైమ్ జాబ్ వంటి వివరాలను మీ కోసం అందిస్తున్నాం.
16 దేశాల విద్యావివరాలు
అమెరికా
- కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు.
- విద్యార్హతలు: జీఆర్ఈ/ జీమ్యాట్ + ఐఈఎల్టీఎస్/ టోఫెల్, 55 శాతం పర్సంటేజీ
- ఖర్చు (ఏటా): రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలు.
- జీవన వ్యయం: రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు.
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు.
- ప్రాసెసింగ్ సమయం: 9-12 నెలలు
- పార్ట్ టైమ్ జాబ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: అందరికి 12 నెలలు, స్టెమ్ కోర్సుల వారికి 12 నెలలతో పాటు అదనంగా మరో 24 నెలలు.
యూకే
- కోర్సు వ్యవధి: సంవత్సరం
- అర్హతలు: ఐఈఎల్టీఎస్, డిగ్రీలో 50 నుంచి 55 శాతం మార్కులు
- వ్యయం (ఏటా): రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలు
- జీవన వ్యయం: రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 3 నుంచి 6 నెలలు
- పార్ట్ టైమ్ జాబ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 24 నెలలు
కెనడా
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు రెండేండ్లు, పీజీ డిప్లొమాకు సంవత్సరం
- అర్హతలు: ఐఈఎల్టీఎస్/ టోఫెల్, డిగ్రీలో 60 శాతం మార్కులు, పీజీ డిప్లొమాకు ఐఈఎల్‌టీఎస్‌తో పాటు డిగ్రీలో 50 శాతం మార్కులు
- వ్యయం (ఏటా): రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలు
- జీవన వ్యయం: రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్ సంపాదన: రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: మాస్టర్స్‌కు 9 నుంచి 12 నెలలు, పీజీ డిప్లొమాకు 6 నెలలు
- పార్ట్ టైమ్ జాబ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: మాస్టర్స్ వారికి 36 నెలలు, పీజీ డిప్లొమా వారికి 12 నెలలు
ఆస్ట్రేలియా
- కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు
- అర్హతలు: ఐఈఎల్టీఎస్/ టోఫెల్/ పీటీఈ, డిగ్రీలో 50 నుంచి 55 శాతం మార్కులు
- వ్యయం (ఏటా): రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు
- జీవన వ్యయం: రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 4 నుంచి 6 నెలలు
- పార్ట్ టైమ్ జాబ్ వర్క్: వారానికి 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 24 నెలలు
న్యూజిలాండ్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు రెండేండ్లు, డిప్లొమాకు ఏడాది
- అర్హతలు: ఐఈఎల్టీఎస్/ టోఫెల్/ పీటీఈ, డిగ్రీలో 65 పర్సంటేజీ, డిప్లొమాకు ఐఈఎల్టీఎస్/ టోఫెల్/ పీటీఈతో పాటు డిగ్రీలో 50 శాతం మార్కులు
- వ్యయం (ఏటా): రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలు
- జీవన వ్యయం: రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 6 నెలలు
- పార్ట్ టైమ్ జాబ్ వర్క్: వారానికి 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 12+24 నెలలు
జర్మనీ
- కోర్సు వ్యవధి: టెక్నికల్, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లకు రెండేండ్లు
- అర్హతలు: జర్మన్ భాషపై అవగాహనతో పాటు జీఆర్ఈ+ ఐఈఎల్టీఎస్/ టోఫెల్, డిగ్రీలో 70 పర్సంటేజీ
- వ్యయం (ఏటా): టెక్నికల్ ప్రోగ్రామ్‌లకు ఉచితం, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- జీవన వ్యయం: రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 9 నుంచి 12 నెలలు
- పార్ట్ టైమ్ జాబ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 18 నెలలు
ఫ్రాన్స్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు రెండేండ్లు
- అర్హతలు: ఐఈఎల్టీఎస్ అవసరం లేదు, డిగ్రీలో 60 శాతం పర్సంటేజీ
- వ్యయం (ఏటా): రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- జీవన వ్యయం: రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 3 – 6 నెలలు
- పార్ట్ టైమ్ జాబ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 24 నెలలు
సింగపూర్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు సంవత్సరం
- అర్హతలు: డిగ్రీలో 50 శాతం మార్కులు
- వ్యయం (ఏటా): రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- జీవన వ్యయం: రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 3 నెలలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 3 నెలలు
ఐర్లాండ్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు ఏడాది
- అర్హతలు: ఐఈఎల్టీఎస్/ టోఫెల్/ పీటీఈ, డిగ్రీలో 55 నుంచి 60 శాతానికి పైగా మార్కులు
- వ్యయం (ఏటా): రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు
- జీవన వ్యయం: రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- పార్ట్ టైమ్జాబ్తో సంపాదన: రూ.5 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 3 నుంచి 6 నెలలు
- పార్ట్ టైమ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 24 నెలలు
స్వీడన్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు రెండేండ్లు
- అర్హతలు: ఐఈఎల్టీఎస్ అవసరం లేదు. డిగ్రీలో 60 శాతం మార్కులు
- వ్యయం (ఏటా): రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు
- జీవన వ్యయం: రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.10 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 6 నుంచి 9 నెలలు
- పార్ట్ టైమ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 6 నెలలు
నెదర్లాండ్స్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు ఒకటి లేదా రెండేండ్లు
- అర్హతలు: ఐఈఎల్టీఎస్ స్కోర్ 6.5, డిగ్రీలో 60 పర్సంటేజీ తప్పనిసరి
- వ్యయం (ఏటా): రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- జీవన వ్యయం: రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 4 నుంచి 6 నెలలు
- పార్ట్ టైమ్ వర్క్: వారంలో 10 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 12 నెలలు
ఇటలీ
- కోర్సు వ్యవధి: సంవత్సరం (మాస్టర్స్)
- అర్హతలు: ఐఈఎల్టీఎస్ అవసరం లేదు. డిగ్రీలో 55 శాతం మార్కులుండాలి
- వ్యయం (ఏటా): రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షలు
- జీవన వ్యయం: రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.5 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 4 నుంచి 6 నెలలు
- పార్ట్ టైమ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 6 నెలలు
స్పెయిన్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు ఏడాది లేదా రెండేండ్లు
- అర్హతలు: ఐఈఎల్టీఎస్ అవసరం లేదు. డిగ్రీలో 65 పర్సంటేజీ మించిన మార్కులు పొంది ఉండాలి.
- వ్యయం (ఏటా): రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు
- జీవన వ్యయం: రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.5 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 4 నుంచి 6 నెలలు
- పార్ట్ టైమ్ వర్క్: వారంలో 20 గంటలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసా: 6 మాసాలు
స్విట్జర్లాండ్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు ఏడాది లేదా రెండేండ్లు, డిప్లొమాకు ఏడాది
- అర్హతలు: వీసాకు ఐఈఎల్టీఎస్ తప్పనిసరి, డిగ్రీలో 50 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి.
- వ్యయం (ఏటా): రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలు
- జీవన వ్యయం: రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.10 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 3 నుంచి 6 నెలలు
- 6 నెలలు వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ చేయవచ్చు
దుబాయ్
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు ఏడాది లేదా రెండేండ్లు
- అర్హతలు: ఐఈఎల్టీఎస్ స్కోర్ 6.5 ఉండాలి, డిగ్రీలో 50 శాతం మార్కులకు పైగా
- వ్యయం (ఏటా): రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షలు
- జీవన వ్యయం: రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 3 నెలలు
- ముందస్తు అనుమతితో మాత్రమే పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చు.
మలేషియా
- కోర్సు వ్యవధి: మాస్టర్స్‌కు ఏడాది నుంచి రెండేండ్లు
- అర్హతలు: ఐఈఎల్టీఎస్ అవసరం లేదు, కానీ డిగ్రీలో 50 శాతానికి మించి మార్కులు
- వ్యయం (ఏటా): రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షలు
- జీవన వ్యయం: రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు
- పార్ట్ టైమ్ జాబ్‌తో సంపాదన: రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు
- ప్రాసెసింగ్ సమయం: 3 నెలలు
- సెలవుల్లో మాత్రమే పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చు. మిగతా రోజుల్లో అనుమతివ్వరు.
మల్లేశం కొంటు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు