General Studies | సామాజిక అసమానతలు – బహిష్కరణ
వ్యవసాయ రంగంలో స్త్రీలీకరణ/ స్త్రీల భాగస్వామ్యం/ ఫెమినైజేషన్ అనేది గ్రామీణ భారతదేశంలో మహిళల సాధికారతకు దారి తీస్తుందని విమర్శనాత్మకంగా విశ్లేషించండి?
వ్యవసాయం స్త్రీలీకరణ (Feminisation of Agriculture)
1. Definition Feminisation of Labours Poverty Related to Indain Agriculture
2. వ్యవసాయంలో మహిళ పాత్ర – పితృ స్వామిక సమాజానికి ఉదా: పితృస్వామిక సమాజాల్లో పురుషులు, స్త్రీల మధ్య శారీరక విభజన చేయడం సంప్రదాయబద్ధంగా వస్తూనే ఉంది. ముఖ్యంగా గృహ సంబంధ/ ఇంటి పనులు చేయించి వీరి పనులకు విలువ/ ఆర్థిక విలువ కట్టడం లేదు. సేవా మూల్యం చెల్లించని పనిలాగే స్త్రీలతో పని చేయిస్తున్నారు.
- స్త్రీలు వ్యవసాయరంగంలో ప్రస్తుత శ్రామిక మార్కెట్లో ఎక్కువగా వెళ్తున్నారు. దీనికి కారణం పురుషులు పట్టణవాదం, పారిశ్రామికీకరణల ఫలితంగా ఎక్కువ కూలీ రేటుకు పని చేస్తున్నారు. కాబట్టి గత్యంతరం లేక స్త్రీలు గ్రామాల్లోనే వారి సొంత లేదా ఇతరుల క్షేత్రాల్లోకి వెళ్లి తక్కువ దినసరి కూలీకే పని చేస్తున్నారు.
- వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులు ఫలదాయకంగా ఉండటం లేదు. పురుషులు పక్కనే ఉన్న పట్టణాల్లోని నిర్మాణ రంగంలోకి నెట్టబడుతున్నారు. ఈ ధోరణులు ముఖ్యంగా 1999-2005లో వ్యవసాయ రంగంలో తగ్గుదల కారణంగా సంభవించింది. ఈ సందర్భంలో 17 మిలియన్ల స్త్రీలు వ్యవసాయ రంగంలోకి వెళ్లి శ్రామికులుగా పని చేస్తున్నారు.
- స్త్రీలు పనిచేసే ప్రదేశాల్లో తక్కువ వేతనాలు తక్కువ హక్కులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, లైంగిక వేధింపుల సమస్యలతో బాధపడుతున్నారు. వీరికోసం ప్రత్యేక సామర్థ్య పెంపు (Capacity Building)తో కూడిన పాలసీ విధానాలు రూపొందించాలి.
- స్త్రీ ఇంటి పెద్ద/ యజమానిగా ఉన్న గృహ సముదాయాల్లో తక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. వీరికి మార్కెట్, సాంకేతికత పై అవగాహన లేదు. పని ఒత్తిడి, తక్కువ వేతనంతో వ్యవసాయ రంగంలో విధులు నిర్వహిస్తున్నారు.
- ఇది Distress Employment కు ఉదాహరణగా చెప్పవచ్చు. (నెట్టివేయబడిన/ బాధతో/ ఇబ్బంది పడుతున్న ఉద్యోగితకు ఉదాహరణ)
- 2005-09 కాలంలో మహిళల భాగస్వామ్యం వ్యవసాయ రంగంలో తగ్గింది. ఈ సమయంలో వచ్చిన MGNR EGA రాష్ట్రీయ కృషి వికాస్ కార్యక్రమాలు మహిళలకు ఉపాధి మార్గాలను పెంచాయి. ఈ కాలంలో 19 మిలియన్ల మహిళలు ఈ రంగం నుంచి బయటకు వచ్చారు.
ముగింపు - ఈ విధంగా స్త్రీల శ్రామిక శక్తి భాగస్వామ్యం, వారి కుటుంబం, సమాజాలను అభివృద్ధి పథంలో తీసుకెళుతుంది. ప్రభుత్వాలు కూడా లింగ సున్నితత్వంతో కూడిన పథకాలకు ప్రాధాన్యమిస్తూ వీరికి ప్రాధాన్యం ఇవ్వాలి. పితృస్వామ్య విధానాలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం, పౌర సంఘాలు పాత్ర వహించి పితృస్వామ్య పోకడలను పూర్తిగా ఆపాలి.
‘హీ ఫర్ షీ HE FOR SHE’ అంటే ఏమిటి? - లింగ సమానత్వం కోసం మహిళలు ధైర్యంగా, ఐక్యమైన శక్తిని సృష్టించడానికి మహిళలకు సంఘీభావంగా నిలబడి, వారు అభివృద్ధి చెందడానికి పురుషుల భాగస్వామ్య అవసరాన్ని HE FOR SHE అంటారు. ఇది 2014 నుంచి ప్రారంభమయ్యింది. ఇది SDG 5వ లక్ష్యాన్ని సూచిస్తుంది.
- వారి కుటుంబాలు, కమ్యూనిటీలను అభివృద్ధి చేయడానికి మహిళలతో కలిసి పని చేయాలి.
HE FOR SHE Report: UNO
ప్రపంచ నివేదిక అంశాలు
1) ఎవరి ప్రయత్నం లేకుండా సమానత్వం సాధించాలంటే 300 సంవత్సరాలు పడుతుంది. 2022లో 14 % మంది మహిళలు మాత్రమే దేశాల అధినేతలుగా ఉన్నారు. కేవలం 15 % CEOలుగా ఉన్నారు. Fortune 500 జాబితాలో చోటు సంపాదించారు.
2) UNO ‘Women Stratigic Plan‘ 2022-25 తయారు చేసింది. దీని ద్వారా పురుషులు, బాలుర భాగస్వామ్యంతో స్త్రీలు, బాలికల జీవితాల్లో శాశ్వత మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
3) WEF (World Economic Forum) నివేదిక ప్రకారం ఆర్థిక సమానత్వం సాధించడానికి 132 సంవత్సరాలు పడుతుంది.
4) ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు భౌతిక, లైగింక హింస వల్ల వారి జీవిత కాలంలో ఒక్కసారైనా బాధపడుతున్నారు.
5) 50% స్త్రీలు పట్టణాల్లో ఒంటరిగా రాత్రుల్లో నడిచి వెళ్లలేకపోతున్నారు.
6) 2.4 బిలియన్ మహిళలు సమాన అవకాశాలు పొందలేకపోతున్నారు. మహిళలు పురుషుల కంటే 20% తక్కువ వేతనం పొందుతున్నారు.
యూఎన్వో హీ ఫర్ షీ ద్వారా సాధించిన ప్రగతి
1) Just Say Bro- అనే నినాదం ద్వారా సెక్సిస్ట్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చర్య తీసుకోండి అని పిలుపునిచ్చారు.
2) స్కౌట్స్ శిక్షణ ద్వారా ఉగాండాలో లింగ సమానత్వం సాధించారు.
3) UN- Women South Africa Multi Country Office ను Eswatini
పట్టణంలో ప్రారంభించారు.
4) పాకిస్థాన్‌లో పోలీస్ రంగంలో మార్గదర్శకుడిగా Dr. ఖురేషి అనేక సేవలు అందిస్తున్నారు.
5) ఎమ్మా వాట్సన్ (Harry Potter సినిమాలోని కథానాయకుడు) UN- Women Global Goodwill Ambassadorగా సేవలందిస్తున్నారు.
కర్ణాటక హిజాబ్ వివాదం, ఇరాన్‌లోని మొరాలిటీ పోలీసుల చర్య గురించి తెలియజేయండి?
హిజాబ్ వివాదం: 2022, ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వ కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- హిజాబ్ ధరించడం తమ రాజ్యాంగ హక్కు అని ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీ విద్యార్థినులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా 2022, మార్చి 15న హైకోర్టు విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంటూ, విద్యార్థులు ప్రొటోకాల్ పాటించాలని తీర్పునిచ్చింది.
- ఈ వివాదం పై సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. హేమంత్ గుప్తా కర్ణాటక తీర్పును సమర్థించారు. సుధాన్షి ధులియా తోసిపుచ్చారు. సెప్టెంబర్ 22న వారి తీర్పును రిజర్వ్ చేశారు.
- కర్ణాటక హైకోర్టు ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన, మతపరమైన ఆచారంలో హిజాబ్ భాగం కాదని తీర్పు చెప్పింది.
హేమంత్ గుప్తా తీర్పు: ‘స్కూల్’ ‘మతం’ రెండు వేర్వేరు. ‘లౌకిక’ పాఠశాల అనేది రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. యూనిఫాం సమానత్వాన్ని కలిగిస్తాయి.
సుధాన్షు ధులియా: ఇది వారి విశ్వాసం, అంతరాత్మకు సంబంధించింది. వారి సంస్కృతి వ్యక్తీకరణ అన్నారు. పాఠశాలలు అనేవి జైలు, మిలిటరీ సంస్థల లాగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. - హిజాబ్ ధరించి రావడం అనేది పాఠశాలకు టికెట్ తీసుకొని వచ్చినట్లు అని అన్నారు. ఎందుకంటే హిజాబ్ లేకపోతే వారి తల్లిదండ్రులు వారిని పాఠశాలకు వెళ్లడానికి నిరాకరిస్తారు.
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసఫ్ జాయ్ మలాల కూడా ఈ సందర్భంలో ట్వీట్ చేశారు. చదువా? హిజాబా? అని కాలేజీలు బలవంతపెడుతున్నాయి. కాబట్టి భారతదేశ నేతలు దీన్ని ఆపాలని ఆమె అభిప్రాయం వ్యక్తపరిచారు.
గత తీర్పు: 2015 All India Pre Medical Entranceలో దుస్తుల కోడ్ పాటించాలని తీర్పు వెలువరించారు. దీనివల్ల విద్యార్థులను తనిఖీ చేయడానికి అదనపు చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. సాంకేతికతను దుర్వినియోగపరిచే అవకాశం ఉంది. కాబట్టి దుస్తుల కోడ్ అందరికీ వర్తిస్తుందని చెప్పారు.
ఇరాన్లో మోరల్ పోలీసింగ్ - 2022 సెప్టెంబర్ 17న మొరాలిటీ పోలీసులు మహ్స అమినీ (22 ఏండ్లు) అనే మహిళను తలను పూర్తిగా కప్పుకోవాలన్న నియమాన్ని పాటించలేదన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. టెహ్రాన్ నగరంలో ఆమెను పోలీసులు వ్యాన్ ఎక్కించి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో ఆమె మరణించారు.
- దీనికి నిరసనగా ఆక్లాండ్ (లండన్), మెల్బోర్న్లో ‘మహిళలు – జీవితం – స్వేచ్ఛ అనే బ్యానర్లు ప్రదర్శించారు. ఇరాన్‌లోని ఖుర్దిష్ నగరాలు జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. పన్నులు చెల్లించకూడని నిర్ణయించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ దేశంలో దుస్తుల కోడ్ విధించారు. నైతిక పోలీసులు అనే పోలీసు విభాగాన్ని అధికారికంగా గాప్ట్-ఇ-ఎర్షాద్ (గైడెన్స్ పెట్రోల్స్) అని పిలుస్తారు. 2014లో మై స్టెల్తీ ఫ్రీడం అనే ఆన్లైన్లో నిరసన ప్రారంభమైంది. ఈ నిరసనలో హిజాబ్ చట్టాలను ఉల్లంఘించి వారు దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ఇరాన్ హిజాబ్ ధరించడం తప్పనిసరి అని ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఆదేశించారు.
దళితుల ప్రస్తుత స్థితిగతులను తెలియజేయండి?
దళితులపై నేరాలకు సంబంధించిన నివేదికను గురించి చర్చించండి? లేదా
షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న సామాజిక అసమానతల నివారణ కోసం సలహాలు తెలియజేయండి?
షెడ్యూల్డ్ కులాల ప్రస్తుత స్థితిగతులు
1) Art-341- Scheduled Caste నోటిఫై చేయబడ్డాయి. వీరు హిందూ కుల వ్యవస్థ చట్రంలో ఉన్న ఉప కమ్యూనిటీలు. వీరు భారతదేశంలో తమ తక్కువ స్థితి కారణంగా లేమి, అణచివేత, తీవ్రమైన సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు.
2) రాజ్యాంగం ఆర్డర్- (షెడ్యూల్డ్ కులాలు) 1950 ప్రకారం అట్టడుగున ఉన్న హిందూ సంఘాలు మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడతాయి.
3) 2011 జనాభా లెక్కల ప్రకారం 16.6%, 16,66,35,700 మంది ఉన్నారు.
4) NCRB – 2017 వార్షిక నివేదికలో SC, STలపై 40,801 నేరాలు కేవలం 2016లోనే జరిగాయని పేర్కొంది.
5) ప్రతి 15 నెలలకు ఒక దళితుడిపై నేరం జరుగుతుంది. రోజూ సుమారు 6 మంది దళిత స్త్రీలు అత్యాచారానికి గురి కావడానికి కుల వ్యవస్థ కారణమని చెప్పవచ్చు.
దళితులపై నేరాలు
1) NCRB నివేదిక ప్రకారం నేరాలు చాలా వేగంగా పెరుతున్నాయి. 2001-11 మధ్య 50 కంటే తక్కువ, కానీ 2015 నాటికి 223కి పెరిగాయి (ప్రతి మిలియన్ ప్రజలకు లెక్కిస్తారు).
2) దళితులపై నేరాల విషయంలో బీహార్ మొదటి 5 రాష్ర్టాల్లో ప్రతిసారీ ఉంటుంది. అలాగే రాజస్థాన్‌లో వివక్ష చాలా ఉంది.
3) 2020లో విడుదల చేసిన NDMJ National Dalit Movement for Justice, National Campaign for Dalit Human Rights ద్వారా ‘Quest for Justice’ నివేదిక నేరాల డేటాను అంచనా వేసింది.
4) NCRB – డేటా 2009-18 వరకు గల దత్తాంశాలు, గణాంకాలు పరిశీలిస్తే నేరాల తీవ్రత తెలుస్తుంది. అవి..
అ) నేరాలు 6% పెరిగాయి.
ఆ) 3.91 లక్షల అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
ఇ) SC, ST అట్రాసిటీ చట్టం నియమాలు 1995లో రూపొందించారు. సరిగా అమలు చేయడం లేదు.
5) ST (తెగలు)లపై నేరాల రేటు దాదాపు 1.6% తగ్గింది. 2009-18 మధ్య కాలంలో మొత్తం 72,367 నేరాలు నమోదయ్యాయి. 88.5 % కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
- దళితుల అక్షరాస్యత, మధ్యాహ్న భోజన పథకం విషయంలో కుల వివక్ష, అణచివేత తక్కువ విద్యాస్థాయి, బడిలో నమోదు రేటు, ఉన్నత అధికారులు కూడా కులం పేరుతో దూషించబడుతున్నారు.
సలహాలు – కమిటీలు
1) ప్రతాప్ భాను మెహతా ప్రకారం ఆర్థిక పురోగతి ఒక్కటే కులం మానసిక బాధలను తగ్గించదు. న్యాయ పరమైన సాధికారం, అధికారాన్ని కోల్పోవడం వంటివి కనిపిస్తున్నాయి.
2) త్రివేది సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా అశోక విశ్వవిద్యాలయం 2004 నుంచి జరిగిన 63 అసెంబ్లీ స్థానాల్లో గమనించగా SCలకు రిజర్వ్ చేయని స్థానాల నుంచి ఎస్సీలు గెలవడం కష్టంగా ఉందని తెలిపింది.
3) HCU విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత, ఉన్నత విద్యావ్యవస్థల్లో కుల, సామాజిక వివక్ష తొలగించడానికి మార్గదర్శకాలు వచ్చాయి. - సాంఘిక బహిష్కరణ అనేది ఒక బహు మితీయ ప్రక్రియ. దీంట్లో వివిధ బహిష్కరణ రూపాలు మిళితమై ఉంటాయి. అవి.. నిర్ణయాధికారం, ఉపాధి, రాజకీయ ప్రక్రియల్లో సహభాగత, భౌతిక వనరులు అందుబాటులో ఉండటం, సమష్టి సాంస్కృతిక ప్రక్రియల సమైక్యం. ఇవన్నీ కలిస్తే బహిష్కరణ తీవ్ర రూపాన్ని ఏర్పరుస్తాయి.
- ‘రెనె లియోనిర్’ అనే ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారి ఈ సాంఘిక బహిష్కరణ అనే పదాన్ని రూపొందించారు. 1974లో సింగిల్ పేరెంట్లు, అసామాజిక వ్యక్తులు, ఉపాంత వ్యక్తులు, పనికిరాని వారు, వికలాంగులు, వృద్ధులు, బాలలు, మానసిక, శారీరక అంగవైకల్యం గల వారిని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు.
- అమర్త్యసేన్ కింది అంశాలను బహిష్కరణకు సంబంధించినవిగా పేర్కొన్నారు. అవి.. 1) జీవనోపాధి 2) స్థిరమైన ఉపాధి, 3) ఆదాయాలు 4) పరపతి/భూమి 5) గృహవసతి 6) కనిష్ట వినియోగ స్థాయిలు 7) విద్య 8) నైపుణ్యాలు 9) సాంస్కృతిక పెట్టుబడి 10) సంక్షేమరాజ్యం 11) పౌరసత్వం 12) న్యాయపరమైన సమానత్వం 13) ప్రజాస్వామిక సహభాగిత 14) ప్రజా వస్తువులు 15) ప్రాబల్య/జాతి, 16) కుటుంబం సామాజికత 17) మానవత్వం 18) మర్యాద 19) సంతృప్తిపరచడం 20) అవగాహన.
సామాజిక చేర్పు (Inclusion): ఇది సహభాగితతో కూడుకొన్నది. సాధికారతను ఏర్పరుస్తుంది. దీనికి వివిధ రకాల నిశ్చయాత్మక పథకాలు కూడా అవసరం బహిష్కరణకు పరస్పర విరుద్ధమైంది.
బి. పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ,
లా ఎక్సలెన్స్
ఐఏఎస్ అకాడమీ
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు