Telangana History | ఎర్రబాడు భూస్వామిపై తిరగబడిన రైతు ఎవరు?
467. బూర్గుల మంత్రివర్గంలో కస్టమ్స్, ఆబ్కారీ, అడవుల శాఖను ఎవరు చూసుకున్నారు?
a) కొండా వెంకటరంగారెడ్డి
b) చెన్నారెడ్డి c) జగన్నాథరావు
d) ఫూల్‌చంద్ గాంధీ
జవాబు: (a)
వివరణ: బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవితో పాటు సాధారణ పరిపాలన, ల్యాండ్ రెవెన్యూ శాఖలు కూడా తన దగ్గరే ఉంచుకున్నారు. కొంతకాలం తర్వాత ల్యాండ్ రెవెన్యూను కొండా వెంకటరంగా రెడ్డికి అప్పగించారు. ఫూల్‌చంద్ గాంధీ విద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
468. పోలీసు చర్య తర్వాత తెలంగాణలో ఇతర ప్రాంతాల ఉద్యోగుల నియామకాన్ని, ఆధిపత్యాన్ని నిరసిస్తూ ముల్కీ (స్థానికత్వం) ఆందోళన ఎప్పుడు మొదలైంది?
a) 1952 b) 1953
c) 1954 d) 1955
జవాబు: (a)
469. సిటీ కాలేజీ దగ్గర ముల్కీ ఉద్యమకారులపై పోలీసు కాల్పులు ఏ రోజున జరిగాయి?
a) 1952, ఆగస్టు 3
b) 1952, సెప్టెంబర్ 3
c) 1952, ఆగస్టు 15
d) 1952, సెప్టెంబర్ 15
జవాబు: (b)
వివరణ: సిటీ కాలేజీ దగ్గర ముల్కీ ఆందోళనను విద్యార్థి నాయకుడు ఆనందరావు తోట ముందుకు తీసుకెళ్లారు. 1952, సెప్టెంబర్ 3న విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కాల్పులు జరపడంతో మొదటి కాల్పుల్లో మహ్మద్ ఖాసిం, రెండోసారి కాల్పుల్లో షేక్ మహబూబ్ మరణించారు.
470. తొలిదశ ముల్కీ ఉద్యమం, అనంతర పరిణామాలపై విచారణ చేసేందుకు ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన విచారణ సంఘాన్ని నియమించింది?
a) జస్టిస్ కోకా సుబ్బారావు కమిషన్
b) జగన్నాథరావు కమిషన్
c) పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్
d) వశిష్ఠ భార్గవ కమిషన్
జవాబు: (c)
471. భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు సంబంధించి స్వాతంత్య్రం అనంతరం భారత ప్రభుత్వం నియమించిన తొలి సంఘం ఏది?
a) ఎస్కే ధార్ సంఘం b) జేవీపీ సంఘం
c) ఫజల్ అలీ సంఘం
d) కైలాసనాథ వాంఛూ సంఘం
జవాబు: (a)
వివరణ: భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు సంబంధించి భారత ప్రభుత్వం తొలుత 1948లో ఎస్కే ధార్ అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించింది. ఇందులో పన్నాలాల్, జగత్నారాయణ్ లాల్ ఇతర సభ్యులు. భాషా ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటును ధార్ కమిషన్ తోసిపుచ్చింది.
472. 1921, నవంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర సాంఘిక సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
a) మాడపాటి హనుమంతరావు
b) సురవరం ప్రతాపరెడ్డి
c) మహర్షి ధొండో కేశవ్ కార్వే
d) ఆలంపల్లి వెంకటరావు
జవాబు: (c)
వివరణ: మహర్షి ధొండో కేశవ్ కార్వే మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. పుణెలో భారతదేశపు తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
473. హైదరాబాద్ సాంఘిక సమావేశం (1921)లో తెలుగులో మాట్లాడాలనుకున్న ఒక ప్రతినిధిని మరాఠీ భాషీయులు అడ్డుకున్నారు. ఆయన ఎవరు?
a) మాడపాటి హనుమంతరావు
b) ఆలంపల్లి వెంకటరామారావు
c) సురవరం ప్రతాపరెడ్డి
d) రావిచెట్టు రంగారావు
జవాబు: (b)
వివరణ: ఈ సంఘటనతో తెలంగాణ ప్రతినిధులకు అవమానంగా అనిపించింది. ఫలితంగా మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైన వారు కలిసి ‘ఆంధ్ర జనసంఘం’ను స్థాపించారు.
474. 1922, ఫిబ్రవరి 14న జరిగిన ‘ఆంధ్ర జనసంఘం’ తొలి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
a) కొండా వెంకటరంగారెడ్డి
b) సురవరం ప్రతాపరెడ్డి
c) బారిస్టర్ రాజగోపాల రెడ్డి
d) ఆదిరాజు వీరభద్రరావు
జవాబు: (c)
వివరణ: ఈ సమావేశంలోనే ఆంధ్ర జనసంఘం పేరును ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం’గా మార్చారు. ఈ సభకు కార్యదర్శిగా మాడపాటి ఉన్నారు. ఆయన ‘వెట్టిచాకిరీ’, ‘వర్తకసంఘం’ అనే కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో వెట్టిచాకిరీని రద్దుచేయాలని తీర్మానించారు.
475. నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
a) 1935 b) 1936
c) 1938 d) 1939
జవాబు: (d)
476. హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్తలు కమ్యూనిస్టు భావజాలాన్ని చర్చించుకునేందుకు 1939లో ఏర్పాటు చేసుకున్న వేదిక ఏది?
a) కామ్రేడ్స్ అసోసియేషన్ b) సోషలిస్ట్ అసోసియేషన్
c) కమ్యూనిస్ట్ అసోసియేషన్ d) రెవల్యూషనరీ ఫోరం
జవాబు: (a)
వివరణ: కామ్రేడ్స్ అసోసియేషన్ రాజకీయ పార్టీ కాదని, సామ్రాజ్యవాదానికి, ఫాసిజానికి, నిజాం వ్యతిరేక పోరాటం చేస్తున్న వారి స్వేచ్ఛ కోసం పనిచేస్తుందని అసోసియేషన్ సభ్యుల్లో ఒకరైన జవ్వాద్ రజ్వీ పేర్కొన్నారు. డా. రాజబహదూర్ గౌర్, సయ్యద్ ఇబ్రహీం, ఆలం ఖొంద్మీర్ తదితరులు ఇందులో చురుగ్గా పనిచేశారు.
477. 1946, జూలై 4న విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్డి జరిపించిన కాల్పుల్లో అమరుడైన పేదరైతు ఎవరు?
a) బందగీ
b) గొట్టం కొమురయ్య
c) దొడ్డి కొమురయ్య d) దొడ్డి మల్లయ్య
జవాబు: (c)
వివరణ: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరుడైన తొలి రైతు దొడ్డి కొమురయ్య. ఆయనది కడవెండి గ్రామం. ఆయనపై విసునూరు దొర ప్రోద్బలంతో మిస్కిన్ అలీ అనే పోలీసు కాల్పులు జరిపాడు.
478. ధర్మాపురం గ్రామంలో ఎవరికి వ్యతిరేకంగా లంబాడీ రైతులు తిరుగుబాటు చేశారు?
a) విసునూరు దొర రామచంద్రారెడ్డి
b) వెదిరె రామచంద్రారెడ్డి
c) కడారి నరసింహారావు
d) పూసుకూరు రాఘవరావు
జవాబు: (d)
వివరణ: ధర్మాపురం పడమటి తండాకు చెందిన జాఠావత్ ఠాను నాయకత్వంలో పూసుకూరు రాఘవరావుకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఈ క్రమంలో జరిగిన హింసలో ఠాను ప్రాణాలు కోల్పోయాడు.
479. జనగామ తాలూకా మొండ్రాయి గ్రామంలో లంబాడీలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు?
a) విసునూరు రామచంద్రారెడ్డి
b) కడారి నరసింహారావు
c) పూసుకూరు రాఘవరావు
d) వెదిరె రామచంద్రారెడ్డి
జవాబు: (b)
వివరణ: నరసింహారావు మీద లంబాడీలు తిరగబడ్డారు. పోలీసుల మద్దతు ఉందని, ఆయనతో నేరుగా తలపడలేరని ఆంధ్ర మహాసభ నాయకులు చెప్పడంతో వెనక్కితగ్గారు.
480. సూర్యాపేట జిల్లా ఎర్రబాడు భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అకృత్యాల మీద తిరగబడిన రైతు ఎవరు?
a) చిట్యాల ఐలమ్మ b) దొడ్డి కొమురయ్య
c) బందగీ d) రామచంద్రయ్య
జవాబు: (d)
వివరణ: రామచంద్రయ్య తన పోరాటానికి ఆంధ్ర మహాసభ సహకారం తీసుకున్నాడు.
481. తన భర్త, ఇద్దరు కొడుకుల్ని జైలులో పెట్టించినా చిట్యాల ఐలమ్మ ఎవరికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయింది?
a) కడారి నరసింహారావు
b) పూసుకూరి రాఘవరావు
c) విసునూరు రామచంద్రారెడ్డి
d) వెదిరె రామచంద్రా రెడ్డి
జవాబు: (c)
వివరణ: ఐలమ్మ పోరాటానికి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు మద్దతుగా పాలకుర్తికి వెళ్లాడు.
482. తన జాగీర్దారీ ప్రజలను వెట్టిచాకిరీతో సహా అన్ని రకాల ఇబ్బందులకు గురిచేసి, ప్రజాగ్రహానికి గురైన తడకమళ్ల సీతారామచంద్రరావు ఏ ప్రాంతానికి మఖ్తదారు?
a) జనగామ b) బేతవోలు
c) పోచంపల్లి d) మునగాల
జవాబు: (b)
483. తెలంగాణ జలియన్ వాలాబాగ్ సంఘటనగా పేర్కొనే సందర్భం 1947 సెప్టెంబర్ 2న పరకాలలో జరిగింది. ఇది దేనికి సంబంధించింది?
a) విసునూరు దొరకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం
b) తమపై దాడికి వచ్చిన రజాకార్లను తరిమివేయడం
c) ప్రభుత్వ పాఠశాలలో వందేమాతరం ఆలపించడం
d) త్రివర్ణ పతాకం ఎగరవేయడం
జవాబు: (d)
వివరణ: హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడానికి స్టేట్ కాంగ్రెస్ 1947 సెప్టెంబర్ 2న జెండా దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పరకాలలో కట్టంగూరు కేశవరెడ్డి, మురళీమనోహర రావు నేతృత్వంలో జెండా ఆవిష్కరణ సభ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో 15 మంది మరణించారు. దీన్ని తెలంగాణ జలియన్‌వాలా బాగ్గా పేర్కొంటారు.
484. 1948, ఆగస్టులో బైరాన్‌పల్లి దాడిలో పోలీసులకు నాయకత్వం వహించింది ఎవరు?
a) కాశీం రజ్వీ
b) ఇక్బాల్ హుస్సేన్
c) విసునూరు రామచంద్రారెడ్డి
d) కడారి నరసింహారావు
జవాబు: (b)
485. బైరాన్‌పల్లిలో 96 మంది మరణించిన సంఘటన ఏ రోజున జరిగింది?
a) 1948, ఆగస్టు 27
b) 1948, ఆగస్టు 10
c) 1948, ఆగస్టు 6
d) 1948, ఆగస్టు 5 జవాబు: (a)
వివరణ: ఈ దాడికి కూడా డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హుస్సేన్ వ్యూహకర్తగా ఉన్నాడు. ఇందులో 96 మంది గ్రామప్రజలు మరణించారు.
486. హైదరాబాద్‌పై పోలీస్ చర్యకు జవహర్లాల్ నెహ్రూను ఒప్పించిన జాతీయ నాయకుడు ఎవరు?
a) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
b) చక్రవర్తుల రాజగోపాలాచారి
c) సర్దార్ బల్దేవ్ సింగ్
d) శ్యామాప్రసాద్ ముఖర్జీ
జవాబు: (b)
వివరణ: హైదరాబాద్‌పై సైనిక చర్య జరిగినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) ఉన్నారు.
487. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన గొట్టిముక్కల గోపాలరెడ్డి గురించి ‘సై సై గోపాలరెడ్డి, నీవు నిలిచావు ప్రాణాలొడ్డి’ అనే పాటను రచించింది ఎవరు?
a) రావెళ్ల వెంకటరామారావు
b) సుద్దాల హనుమంతు
c) బండి యాదగిరి
d) తిరునగరి రామాంజనేయులు
జవాబు: (d)
488. ‘ఆపరేషన్ పోలో’లో జనరల్ జేఎన్ చౌదరితో పాటు దాడుల్లో పాల్గొన్న సైనిక అధికారులు ఎవరు?
a) లెఫ్టినెంట్ జనరల్ మహరాజ్ సింగ్, మేజర్ జనరల్ రుద్ర
b) లెఫ్టినెంట్ జనరల్ మహరాజ్ సింగ్, జనరల్ కరియప్ప
c) మేజర్ జనరల్ రుద్ర, జనరల్ శాం మానెక్ షా
d) జనరల్ కరియప్ప, జనరల్ శాం మానెక్ షా
జవాబు: (a)
489. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం ఎప్పుడు ముగిసిపోయింది?
a) 1952 b) 1950
c) 1953 d) 1951
జవాబు: (d)
490. 1952 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడు ఎవరు?
a) జవహర్లాల్ నెహ్రూ
b) రావి నారాయణ రెడ్డి
c) ఆరుట్ల రామచంద్రారెడ్డి
d) ఇందిరాగాంధీ జవాబు: (b)
వివరణ: రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ తరఫున నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందులో 3 లక్షల భారీ మెజారిటీ సాధించారు. భువనగిరి నుంచి హైదరాబాద్ శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. లోక్‌సభ సభ్యుడిగా ఉండాలనుకుని, శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు.
491. ‘వీర తెలంగాణ – నా అనుభవాలు, జ్ఞాపకాలు’ పుస్తకం ఎవరి రచన?
a) పుచ్చలపల్లి సుందరయ్య
b) చండ్ర రాజేశ్వరరావు
c) రావి నారాయణ రెడ్డి
d) దేవులపల్లి వెంకటేశ్వరరావు
జవాబు: (c)
492. తెలంగాణ సాయుధ పోరాటం గురించి ‘తెలంగాణ ప్రజల పోరాటం-గుణపాఠాలు’ అనే పుస్తకం ఎవరి రచన?
a) రావి నారాయణ రెడ్డి
b) పుచ్చలపల్లి సుందరయ్య
c) మాకినేని బసవపున్నయ్య
d) వట్టికోట ఆళ్వారుస్వామి
జవాబు: (b)
వివరణ: పుచ్చలపల్లి సుందరయ్య మరో రచన ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






