EMRS Recruitment 2023 | ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 6329 పోస్టులు
EMRS Recruitment 2023 | దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (EMRS) పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), హాస్టల్ వార్డెన్ (Hostel Warden) తదితర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ (Union Ministry of Tribal Affairs) ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, ఉర్దూ, మిజో, సంస్కృతం తదితర సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీతో పాటు సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.. టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష(ESSE-2023), డాక్యూమెంట్ వెరిఫికేషన్ (Document Verification), మెడికల్ ఎగ్జామ్ (Medical Examination) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 6239
పోస్టులు : 1.ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), (5660) పోస్టులు
2. ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ మేల్ (335) పోస్టులు
3.ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ఫిమేల్ (334) పోస్టులు
విభాగాలు : బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, ఉర్దూ, మిజో, సంస్కృతం తదితరాలు.
అర్హతలు : టీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీతో పాటు సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.. టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 35 ఏండ్లు మించకుడదు.
జీతం : 1. టీజీటీ (ఇంగ్లీష్ / హిందీ / గణితం / సైన్స్ / సోషల్ స్టడీస్ / 3వ భాష/ లైబ్రేరియన్) స్థాయి పోస్టులకు నెలకు రూ.44900 – రూ. 142400.
2. ఇతర టీజీటీ (సంగీతం/కళ/పీఈటీ (మేల్)/పీఈటీ (ఫిమేల్) స్థాయి పోస్టులకు నెలకు రూ. 35400- రూ. 112400.
3. హాస్టల్ వార్డెన్ పోస్టులకు నెలకు రూ. 29200 రూ. 92300.
ఎంపిక : ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష (ESSE-2023), డాక్యూమెంట్ వెరిఫికేషన్ (Document Verification), మెడికల్ ఎగ్జామ్ (Medical Examination) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: 1. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు (టీజీటీ పోస్టులకు) రూ.1500.
2 .జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు (హాస్టల్ వార్డెన్ పోస్టులకు) రూ.1000.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 18
వెబ్సైట్ : emrs.tribal.gov.in.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు