Indian History | సంగమ యుగంలో రచించిన తమిళ నీతి కావ్యం?
భారతదేశ చరిత్ర
1. ఏ వంశాల రాజులను, రాజ్యాలను సంగం సాహిత్యం వర్ణించింది?
1) ఉత్తర భారత 2) పశ్చిమ భారత
3) దక్షిణ భారత 4) తూర్పు భారత
2. జత పరచండి.
1. మొదటి సంగమ పరిషత్తు ఎ. మధురై, నక్కిరార్
2. రెండో సంగమ పరిషత్తు బి. కపటపురం, తోల్ కప్పియార్
3. మూడో సంగమ పరిషత్తు సి. తిమధురై అగస్త్యుడు
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి
3. సంగమ యుగంలో రోమ్కు తమిళ ప్రాంతానికి మధ్య వాణిజ్య సంబంధం ఉంది. తమిళ ప్రాంతం నుంచి ఎన్నో వస్తువులు రోమ్కు ఎగుమతి అయ్యేవి. కింది వాటిలో అలాంటి ఎగుమతి వస్తువుల్లో చేరనిది ఏది?
1) దంతపు సామగ్రి 2) మద్యం
3) సుగంధ ద్రవ్యాలు
4) వింత జంతువులు
4. జతపరచండి.
1. నాథముని ఎ. నక్కిరార్
2. మురుగరప్ప బి. నలయిరా దివ్య ప్రబంధం
3. పలిమోలి సి. మాల్గుడి మారుదీన్
4. మధురై కంజి డి. మురురామ్ అరియార్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
5. సంగమ అనే ప్రాచీన తమిళ పదం దేనితో ముడిపడి ఉంది?
1) ఒక సమాజం
2) బౌద్ధమతంలో ఒక శాఖ
3) కవుల సమూహం
4) వ్యాపారుల కూటమి
6. కింది వాటిలో సరైన జత ఏది?
రాజ్యాలు ముఖ్య పట్టణాలు
1. పాండ్యులు ఎ. ఉరయూర్
2. పల్లవులు బి. కాంచిపురం
3. చోళులు సి. కురువూరు
4. చేరులు డి. మధురై
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
7. పాండ్య రాజ్యం ఎంతో సంపన్నమైంది. పాండ్య రాజ్యానికి చెందిన చక్రవర్తులు ఏ సామ్రాజ్యంలో వర్తకం చేయడం ద్వారా లాభాలు ఆర్జించేవారు?
1) చైనా సామ్రాజ్యం
2) రోమన్ సామ్రాజ్యం
3) ఈజిప్టు సామ్రాజ్యం 4) పైవన్నీ
8. చోళ రాజుల సమయంలో ‘కడగం’ అంటే ఏంటి?
1) రెవెన్యూ శాఖ 2) ఓడరేవు టౌన్
3) ఆర్మీ కంటోన్మెంట్ (సైనిక స్థావరం)
4) బజారు స్థలం
9. జతపరచండి.
1. పెరుందేవనార్ ఎ. తమిళ మహాభారతం
2. ఇన్గురునూర్ బి. గిడలూరుకిలార్
3. అగననూరు సి. రుద్రశర్మన్
4. తోల్ కప్పియార్ డి. తోల్ కప్పియం
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
10. ప్రాచీన తమిళ దేశంలో సారవంతమైన వ్యవసాయ భూమిని ఏ పదంతో సూచించేవారు?
1) నెతాల్ 2) ముల్లాయి
3) పళయ్ 4) మరుదమ్
11. భారతదేశం- రోమన్ సామ్రాజ్యం మధ్య జరిగిన వ్యాపారం గురించి వివరించిన గ్రంథం ఏది?
1) ది నేచురల్ హిస్టరీ
2) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ ఆఫ్ ది సీ
3) మెగస్తనీస్ రచనలు
4) ఏదీకాదు
12. కింది వాటిలో సరైన వ్యాఖ్య కానిదేదో గుర్తించండి.
1) వేద సాహిత్యం ఆర్యుల సాహిత్యం కాగా, సంగమ సాహిత్యం ద్రావిడుల సాహిత్యం
2) వేద సాహిత్యం, సంగమ సాహిత్యం ఒకే కాలానికి చెందినవి
3) వేద సాహిత్యం ప్రధానంగా మతపరమైనది, సంగమ సాహిత్యం లౌకిక సాహిత్యం
4) వేద సాహిత్య రచయితల గురించి సమాచారం లేదు, సంగమ సాహిత్య రచయితల గురించి సంపూర్ణ సమాచారముంది
13. జతపరచండి.
1. 18 ప్రధాన పుస్తకాలు ఎ. కల్కినక్కు
2. 18 చిన్న పుస్తకాలు బి. మెల్కినక్కు
3. 10 పుస్తకాలు సి. పట్టుపట్టు
4. 8 పుస్తకాలు డి. ఎట్టుతొగై
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
14. సంగమ యుగంలో రచించిన ప్రముఖ తమిళ నీతి కావ్యం?
1) మణిమేఖలై 2) తిరుక్కురల్
3) జీవక చింతామణి 4) ఇండికా
15. గాంధార, మధుర శిల్పకళలకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించండి?
1) ఈ రెండు శిల్పకళలను వేర్వేరు రాజవంశాలు ఆదరించాయి
2) గాంధార శిల్పకళ బౌద్ధమతానికి పరిమితమైతే మధుర శిల్పకళ అన్ని మతాల విగ్రహాలను రూపొందించింది
3) గాంధార శిల్పకళ స్వదేశీయమైతే మధుర శిల్పకళపైన విదేశీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది
4) గాంధార శిల్పకళ ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందితే, మధుర శిల్పకళ దక్షిణ భారతదేశంలోని మధురై కేంద్రంగా అభివృద్ధి చెందింది
16. రోమన్ రాజు ఆగస్టీన్ ఆస్థానానికి ఎవరు తమ రాయబారులను పంపించారు?
1) పాండ్య రాజు 2) చోళ రాజు
3) చేర రాజు 4) పై వారందరూ
17. జతపరచండి.
1. పాండ్యుల రాజ చిహ్నం ఎ. ధనస్సు
2. చేర రాజ చిహ్నం బి. చేప
3. చోళ రాజుల చిహ్నం సి. పులి
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
18. దేశంలోని ఇతర స్థూపాలతో పోలిస్తే అమరావతి స్థూపం భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నత్వాన్ని గుర్తించండి.
ఎ. ఆయకపతములతో అలంకరణ
బి. నాలుగు వైపులా ఆయక స్తంభాలు
సి. తోరణాలు లేకపోవడం
డి. గర్భగుడి ఉండటం
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
19. కింది వారిలో కేరళ పుత్రులని ఎవరిని అంటారు?
1) చోళ 2) పాండ్య
3) చేర 4) ఎవరూ కాదు
20. జతపరచండి.
1. తిరువళ్లూర్ ఎ. తిరుకురల్ (తమిళ బైబిల్)
2. ఇలంగో అడిగల్ బి. శిలప్పధికారం
3. సత్తినార్ సి. మణిమేఖలై
4. తిరుటక్కర్ తేవర్ డి. జీవక చింథామణి
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 2-ఎ, 2-బి, 3-సి, 4-డి
21. చోళ సామ్రాజ్య స్థాపకుడు?
1) వినయాదిత్య-1 2) విక్రమాదిత్య-2
3) రాజ రాజ-1 4) రాజేంద్ర-3
22. ‘పుహర్’ పట్టణం ఇప్పటి పేరు ఏంటి?
1) కన్యాకుమారి 2) తంజావూర్
3) కంచి 4) కావేరి పట్నం
23. మధురై ఎవరి రాజధాని?
1) పాండ్యుల 2) చోళుల
3) చేరల 4) పై వారెవరూ కాదు
24. కింది వాటిలో ఏది చోళుల సైనిక బలానికి చెందినది కాదు?
1) నౌకా బలం 2) గజ దళం
3) రథ బలం 4) పదాతి దళం
25. సంగమ కాలంలో ముఖ్య ఆరాధ్య దేవుడు ఎవరు?
1) శివుడు 2) ఇంద్రుడు
3) సుబ్రహ్మణ్యం 4) విష్ణువు
26. ప్రతిపాదన ఎ: చోళులు ఆగ్నేయ ఆసియాలో భారతీయ సంస్కృతి, వారసత్వ సంపదను వ్యాప్తి చేయడానికి విదేశీ గడ్డపై ఒక బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు.
కారణం ఆర్: చోళ పాలకులు భారతీయ సంస్కృతి, మతం, వారసత్వ సంపద వంటి వాటిపై అత్యంత మక్కువ కలిగినవారు.
1) ఎ, ఆర్ రెండూ నిజం, కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
2) ఎ నిజం, కానీ ఆర్ తప్పు
3) ఎ తప్పు, కానీ ఆర్ నిజం
4) ఎ, ఆర్ రెండూ నిజం, ఆర్ ఎ కు సరైన వివరణ
27. ప్రాచీన కాలం నాటి ఆరికమేడు ఓడరేవు ఏ ప్రాంత సమీపంలో ఉంది?
1) గుజరాత్ 2) మహారాష్ట్ర
3) కలకత్తా 4) పుదుచ్చేరి
28. రోమన్ సామ్రాజ్యంతో మొదటి వర్తక సంబంధాలు పెట్టుకొన్నవారు ఎవరు?
1) కుషాణులు 2) శాతవాహనులు
3) గ్రీకులు
4) సంగమ యుగంలో తమిళ రాజ్యాలు
29. క్రీ.పూ. 200- క్రీ.శ. 300 సంవత్సరాల మధ్య విదేశీ వాణిజ్య అభివృద్ధికి దోహదపడని అంశాన్ని గుర్తించండి.
1) హిప్పాలస్ రుతుపవనాలను కనుగొనడం
2) నాణేలు అధిక సంఖ్యలో వినియోగించడం
3) సిల్క్ రూట్ భారతదేశం వైపునకు మరలడం
4) భారతదేశంలో రాజకీయ ఐక్యత ఉండటం
30. సంగమ పాలనా యుగానికి సంబంధించిన ప్రముఖ గ్రంథం?
1) తొల్కప్పియం
2) జీవిక చింతామణి
3) కురళ్ 4) పైవన్నీ
31. పాండ్య రాజ్య ముఖ్య పట్టణం?
1) మధురై 2) శ్రీరంగం
3) నాగ పట్టణం 4) పుదుకే
32. వైదిక మతాన్ని అనుసరించి పలు వేద బలులు నిర్వహించిన చోళరాజు ఎవరు?
1) 1-పరాంతకుడు 2) కరికాలుడు
3) ఇలాంజెడ్సిని 4) ఎవరూ కాదు
33. శ్రీలంకను జయించిన చోళ రాజు ఎవరు?
1) కరికాలుడు 2) మొదటి రాజరాజు
3) 2-రాజరాజ చోళుడు
4) ఎవరూ కాదు
34. జతపరచండి.
1. పాండ్యుల రాజధాని
ఎ. వంజి (కరూర్)
2. చేర రాజధాని బి. మధురై
3. చోళ రాజధాని సి. ఉరైయూర్, పుహర్ (కావేరి పట్నం)
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
35. దక్షిణ భారత రాజ్యాల గురించి మొదటిసారి సవివరంగా పేర్కొన్నది?
1) హాథిగుంఫా శిలా శాసనం
2) మెగస్తనీస్ రచనలు
3) సంగమ సాహిత్యం
4) పైవన్నీ
36. కింది వాటిని జత పరచండి.
ఎ. పల్లవులు 1.హంపి
బి. చోళులు 2.బేలురు
సి. విజయనగర్ 3.మహాబలిపురం
డి. హోయసలులు 4. తంజావూరు
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
37. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
ఎ. పాణిని రాసిన అష్టాధ్యాయి సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం
బి. తొల్కప్పియార్ రాసిన తొల్కప్పియం తమిళంలోని తొలి వ్యాకరణ గ్రంథం
సి. అమోఘవర్షుడు రాసిన కవిరాజ మార్గ కన్నడలోని తొలి వ్యాకరణ గ్రంథం
డి. కేతన రాసిన ఆంధ్రభాష భూషణం తెలుగులో రాసిన తొలి వ్యాకరణ గ్రంథం
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
38. మొదటి తమిళ సంగాన్ని నెలకొల్పిన వారెవరు?
1) తిరువళ్లువర్ 2) మూములనార్
3) అగస్త్యుడు 4) పరశురాముడు
39. సంగమ సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?
1) కన్యాకుమారి 2) కాంచీపురం
3) మధురై 4) వజ్రకరూర్
40. సంగమ సాహిత్య సభలను ఏర్పాటు చేసినవారు ఎవరు?
1) చోళ 2) పాండ్య
3) చేర 4) పైవారందరు
సమాధానాలు
1. 3. 2. 1 3. 2 4. 2
5. 3 6. 4 7. 2 8. 3
9. 2 10. 4 11. 2 12. 2
13. 1 14. 2 15. 2 16. 1
17. 1 18. 2 19. 3 20. 4
21. 3 22. 4 23. 1 24. 3
25. 3 26. 4 27. 4 28. 3
29. 4 30. 4 31. 1 32. 2
33. 1 34. 1 35. 3 36. 1
37. 4 38. 3 39. 3 40. 2
హంటర్ కమిషన్
- జలియన్‌వాలా బాగ్ దురంతాలను గురించి విచారణ జరపడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఐదుగురు బ్రిటిష్ వారు, ముగ్గురు భారతీయులతో హంటర్ కమిషన్‌ను నియమించింది.
- పంజాబ్ దురంతాలను పరిశీలించడా నికి కాంగ్రెస్ కూడా ఒక స్వతంత్ర కమిటీని నియమించింది. ఈ కమిటీ కార్యదర్శి కె.శాంతారామ్.
- హంటర్ కమిషన్ డయ్యర్ తప్పిదాన్ని తన విధులను అవగాహన చేసుకోవడం లో జరిగిన పొరపాటు అని, లేకపోతే (An error of judgement) నిర్ణయానికి రావడంలో జరిగిన తప్పిదం అని పేర్కొన్నది.
- జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఠాగూర్ ‘అమానుష యుద్ధానికి పుట్టిన అమానుష బిడ్డ’ అని వ్యాఖ్యానించగా, గాంధీ బ్రిటిష్ ప్రభుత్వ స్థాపన జరిగింది ప్లాసీలో అయితే బీటలు విచ్చింది అమృత్‌సర్‌లో అన్నాడు.
- భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జలియన్ వాలా బాగ్‌లో గ్రానైట్‌తో జాతీయ స్మృతి చిహ్నం నిర్మించారు.
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు