Telangana History & Culture | ఆరోగ్య బ్రాహ్మణులు అని ఎవరికి పేరుంది?
Groups Special
439. 1947 ఆగస్టు 15న నిజాం నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి హైదరాబాద్ సుల్తాన్‌బజార్ కూడలిలో జాతీయ జెండాను ఆవిష్కరించింది ఎవరు?
a) మాడపాటి హనుమంతరావు
b) సురవరం ప్రతాపరెడ్డి
c) స్వామి రామానంద తీర్థ
d) మర్రి చెన్నారెడ్డి జవాబు: (c)
వివరణ: ఈ పతాకాన్ని అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వయంగా స్వామి రామానంద తీర్థకు ఇచ్చాడు.
440. జాయిన్ ఇండియా ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ను సందర్శించి, ఉద్యమానికి నైతిక మద్దతు తెలిపిన ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు?
a) జవహర్లాల్ నెహ్రూ
b) జయప్రకాశ్ నారాయణ్
c) సర్దార్ వల్లభాయ్ పటేల్
d) మహాత్మా గాంధీ జవాబు: (b)
441. ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారతదేశ రక్షణ మంత్రిగా ఎవరు ఉన్నారు?
a) సర్దార్ బల్దేవ్ సింగ్
b) సర్దార్ వల్లభాయ్ పటేల్
c) రాజాజీ
d) శ్యామాప్రసాద్ ముఖర్జీ
జవాబు: (a)
442. ఏ తెగవారి నృత్యాన్ని ‘బైసన్ హార్న్ డ్యాన్స్’ అని పిలుస్తారు?
a) గోండు b) కోయ
c) లంబాడీ d) కొండరెడ్లు
జవాబు: (b)
వివరణ: కోయ నృత్యంలో మగవాళ్లు ఎద్దు కొమ్ములను తలమీద ధరిస్తారు. అందుకే దీనికి ‘బైసన్ హార్న్ డ్యాన్స్’ అనే పేరు వచ్చింది.
443. గోండుల సంస్కృతికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. గుస్సాడి నృత్యంలో స్త్రీలు, పురుషులు ఇద్దరూ పాల్గొంటారు.
2. థింసా నృత్యం గోండుల్లో ఒక వర్గమైన రాజగోండులకు సంబంధించింది.
పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి?
a) 1 b) 2 c) 1, 2 సరైనవే
d) 1, 2 సరైనవి కావు జవాబు: (b)
వివరణ: గుస్సాడిని కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. 2021లో గుస్సాడి కళాకారుడు కనకరాజు పద్మశ్రీ అందుకున్నారు.
444. నిజాం రాజుల కాలంలో వలస వచ్చి, హైదరాబాద్‌లో స్థిరపడిన ఆఫ్రికా ఖండం వాళ్లు ప్రదర్శించే ప్రత్యేకమైన నృత్యం ఏది?
a) ఖవ్వాలి b) తీన్మార్
c) సిద్ది d) గిద్దా
జవాబు: (c)
వివరణ: ఇది ఖడ్గ నృత్యం.
445. దండారి నృత్యం ఏ గిరిజన తెగకు సంబంధించింది?
a) గోండులు b) కొండరెడ్లు
c) నాయక్‌పోడ్‌లు d) చెంచులు
జవాబు: (a)
వివరణ: దండారి ఉత్సవం సందర్భంగా గోండులు చేసే నృత్యం దండారి.
446. విరాటరాజు గడ్డగా పిలిచే పెద్ద మట్టిదిబ్బ నిర్మాణం దేనికి సంబంధించింది?
a) ధూళికట్ట బౌద్ధ స్థూపం
b) కొండాపురం బౌద్ధక్షేత్రం
c) గాజులబండ బౌద్ధక్షేత్రం
d) నేలకొండపల్లి బౌద్ధ సంఘారామం
జవాబు: (d)
447. జైన మునుల కోసం ‘కడలాలయ బసది’ని ఎవరు నిర్మించారు?
a) గణపతిదేవుడు b) రెండో ప్రోలరాజు
c) మైలమ d) నాగాంబిక
జవాబు: (c)
వివరణ: కాకతీయ రెండో ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండలో జైన మునుల కోసం ‘కడలాలయ బసది’ని
నిర్మించింది.
448. పండితారాధ్య చరిత్ర నుంచి ఏ ఊళ్లో 500 జైన బసదులు ఉన్నట్లు తెలుస్తున్నది?
a) బోధన్ b) కొండాపురం
c) కొలనుపాక d) పటాన్చెరువు
జవాబు: (d)
వివరణ: ‘పొసపరి వట్రిల్లు పొట్లచెర్వునను/ వసదులేణ్ణూరును’ అనే పాదాల నుంచి ఈ విషయం నిర్ధారణ అవుతుంది. ‘పండితారాధ్య చరిత్ర’ను ద్విపద ఛందస్సులో పాల్కురికి సోమనాథుడు రచించాడు. ఇది వీరశైవ మత ప్రచారకుడు మల్లికార్జున పండితారాధ్యుడి జీవితచరిత్ర.
449. కింది ఆశ్రిత కులాల వివరాలను పరిశీలించండి.
బ్రాహ్మణులు: విప్రవినోదులు
కోమట్లు: వరుసభట్టులు
పద్మశాలీలు: సాధనాశూరులు
పెరికలు: పిచ్చుకగుంట్లు
పై వాటిలో సరైనవి ఎన్ని?
a) 1, 3 b) 1, 2
c) 1, 2, 3, 4 d) 4
జవాబు: (a)
వివరణ: కోమట్లను ఆశ్రయించి భిక్షాటన చేసేవాళ్లు వీరముష్టులు, మైలారులు.
వరుసభట్టులు పెరికల దగ్గర ఆశ్రితులుగా ఉంటారు. పిచ్చుకగుంట్లు కమ్మవారిని ఆశ్రయిస్తారు.
450. తెలంగాణలో పగటి వేషగాళ్లను ఏమని పిలుస్తారు?
a) మందెచ్చులు b) బహురూపులు
c) కాటిపాపలు d) విప్రవినోదులు
జవాబు: (b)
వివరణ: వీళ్లనే బైరూపులు అని కూడా పిలుస్తారు. అరవై నాలుగు కళల్లో చిత్రయోగాన్ని బహురూపుల కళగా పరిగణిస్తారు.
451. కాపు, కమ్మ, రెడ్లు, వెలమ, గొల్ల కులాల వారి గోత్రాలను చెబుతూ, ఆయా కులాలకు ఆశ్రితులుగా ఉండేవాళ్లు ఎవరు?
a) భట్రాజులు b) వీరముష్టులు
c) పిచ్చుకగుంట్లు d) రుంజవాళ్లు
జవాబు: (c)
452. ముదిరాజులకు ఆశ్రిత కులంగా ఎవరిని పేర్కొంటారు?
a) రుంజవారు
b) పాండవుల వాళ్లు
c) పెక్కర్లు
d) చిందు భాగవతులు
జవాబు: (b)
వివరణ: పాండవుల వాళ్లు ముదిరాజు కులానికి ఆశ్రితులు. మహాభారతంలోని పాండవుల కథలు గానం చేస్తారు. అందువల్ల పాండవుల వాళ్లు అనే పేరు వచ్చింది.
453. రుంజవారు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు?
a) బ్రాహ్మణులు b) పద్మశాలీలు
c) విశ్వబ్రాహ్మణులు d) రజకులు
జవాబు: (c)
వివరణ: విశ్వబ్రాహ్మణులను పంచాణం వారు అని కూడా అంటారు. కంసాలి, కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి ఈ ఐదు కులాలవారిని పంచాణం వారు అంటారు. రుంజ వాయిస్తూ కథాగానం చేస్తారు కాబట్టి వీరి ఆశ్రిత కులానికి రుంజవారు అనే పేరు వచ్చింది.
454. పాండవుల వాళ్లు కాకుండా ముదిరాజులను ఆశ్రయించుకుని, వారిని వినోదింప చేసి యాచించే ఆశ్రిత కులం ఏది?
a) కూనపులివారు b) పటంవారు
c) డక్కలివారు d) కాకిపడిగెలవారు
జవాబు: (d)
వివరణ: కాకిపడిగెలవారు సంచార జీవనం చేస్తారు. రెండు మూడేండ్లకు ఓసారి ముదిరాజు కులస్థులను యాచిస్తారు. ముదిరాజు కులం పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తారు.
455. రజకులకు ఆశ్రిత కులం ఏది?
a) పటంవారు b) కూనపులివారు
c) సాధనాశూరులు d) గొరవయ్యలు
జవాబు: (a)
వివరణ: పటంవారికే పటం చాకళ్లు, ఆరోగ్య బ్రాహ్మణులు అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి. వీరు బసవ విజయంగా పిలిచే
‘రజక పురాణం’ గానం చేస్తారు. ఇది ప్రధానంగా రజక కుల మూల పురుషుడైన మడివాలు మాచయ్య కథ. పాల్కురికి సోమనాథుడి ‘బసవపురాణం’లో మడివాలు మాచయ్య కథ ఒకటి.
456. భావనా రుషి మాహాత్మ్యం చెప్పి, పద్మశాలీలకు ఆశ్రితులుగా ఉండే కులం ఏది?
a) సాధనాశూరులు b) కూనపులివారు
c) పెక్కర్లు d) పటంవారు
జవాబు: (b)
వివరణ: కూనపులివారు మూడేండ్లకు ఒకసారి పద్మశాలీల ఇండ్లకు వెళ్తారు. పద్మపురాణం లేదా భావనా రుషి మాహాత్మ్యాన్ని గానం చేస్తారు. సంచార జీవితం గడిపే వీరికి పడిగిద్దెరాజులు, సైనువాళ్లు, పులిజెండావాళ్లు అనే మారుపేర్లు కూడా వ్యవహారంలో ఉన్నాయి. సాధనాశూరులు కూడా పద్మశాలీల ఆశ్రితులే. కానీ వీళ్లు ఇంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు.
457. పెక్కర్లు లేదా పెక్కరోళ్లు ఎవరికి ఆశ్రితకులంగా ఉన్నారు?
a) రెడ్లు b) కమ్మవారు
c) కుమ్మర్లు d) కమ్మర్లు
జవాబు: (c)
వివరణ: వీరు గుండబ్రహ్మ పురాణం, శాలివాహన చరిత్ర గానం చేస్తారు. యక్షగాన పద్ధతిలో కథాగానం ఉంటుంది.
458. చిందుభాగవతులు, డక్కలివారు ఎవరికి ఆశ్రిత కులంగా మనుగడ సాగిస్తారు?
a) మాదిగలు b) మాలలు
c) లంబాడీలు d) బైండ్లవారు
జవాబు: (a)
వివరణ: చిందుభాగవతులు, డక్కలి వారు మాదిగలకు ఆశ్రిత కులం. వీరు ప్రధానంగా ‘జాంబపురాణం’ ప్రదర్శిస్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతానికి చెందిన చిందు బృందం ప్రసిద్ధి చెందింది. చిందు ఎల్లమ్మ ప్రసిద్ధి చెందిన చిందు యక్షగాన కళాకారిణి. డక్కలివారు జాంబపురాణంతో పాటు మాదిగ కులస్థుల గోత్రాలను
చెబుతారు.
459. కింది వారిలో ఎవరు యాదవులకు ఆశ్రిత కులం?
a) రుంజవారు b) పటంవారు
c) సాధనాశూరులు d) మందెచ్చులు
జవాబు: (d)
వివరణ: మందెచ్చులు (మందహెచ్చులు) యాదవ కులానికి ఆశ్రితులు. రెండు, మూడేండ్లకు ఒకసారి యాదవుల ఇండ్లకు వెళ్లి వారి గోత్రాలు, పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తారు. కాటమరాజు కథను గానం చేస్తారు. ఈ కథకు సంబంధించిన బొమ్మలను ఓ పెట్టెలో ఉంచుతారు. దాన్ని దేవస్థలం పెట్టె అని పిలుస్తారు.
460. శివుడు మన్మథుడిని భస్మం చేయగా వచ్చిన బూడిద నుంచి ఆవిర్భవించిన వారుగా పేర్కొనే ఇంద్రజాల ప్రదర్శకుల కులం ఏది?
a) విప్రవినోదులు
b) కాటిపాపలు
c) బహురూపులు
d) గంగిరెద్దులవారు
జవాబు: (b)
వివరణ: కాటిపాపలను కాటికాపర్లు అని కూడా పిలుస్తారు. వీరు హరిశ్చంద్రుడి సంతతి అని కూడా పేర్కొంటారు. ఇంటింటికీ
తిరిగి భిక్షాటన చేస్తారు. ఆ సమయంలో
ఇంద్రజాల విద్యను (కనికట్టు) ప్రదర్శిస్తారు.
461. వినాయకుడి పుట్టుక కథతో సంబంధం ఉన్న జానపద కళారూపం ఉన్న కులం ఏది?
a) దొమ్మరి ఆటగాళ్లు b) విప్రవినోదులు
c) గంగిరెద్దులవాళ్లు d) పిచ్చుకగుంట్లు
జవాబు: (c)
462. 1950, జనవరి 26న ఆమోదించిన రాజ్యాంగంలో హైదరాబాద్‌ను ఏ వర్గం (కేటగిరీ)లో చేర్చారు?
a) ఎ b) బి c) సి d) డి
జవాబు: (b)
వివరణ: కేటగిరీ ‘ఎ’లో బ్రిటిష్ ఇండియా ప్రావిన్సులు, ‘బి’లో స్వదేశీ సంస్థానాలు, ‘సి’లో చీఫ్ కమిషనర్ పాలిత ప్రాంతాలు, ‘డి’లో అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి.
463. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1952 ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు?
a) మహబూబ్‌నగర్ b) కల్వకుర్తి
c) జడ్చర్ల d) షాద్‌నగర్
జవాబు: (d)
464. బూర్గుల మంత్రి వర్గానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
పండిట్ వినాయక్ రావు విద్యాలంకార్: వాణిజ్యం, పరిశ్రమలు
వల్లూరి బసవరాజు: ఆర్థిక శాఖ
దిగంబరరావు బిందు: హోం శాఖ
జగన్నాథ రావు: సాంఘిక సంక్షేమం
పై జతల్లో సరైనవి ఎన్ని?
a) 1, 2 b) 1, 3
c) 1, 2, 3, 4 d) 4
జవాబు: (b)
వివరణ: వల్లూరి బసవరాజు కార్మిక, పునరావాస మంత్రిగా ఉన్నారు. జగన్నాథ రావు న్యాయ వ్యవహారాలు చూసుకున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా దేవీసింగ్ చౌహాన్ ఉన్నారు.
465. బూర్గుల మంత్రివర్గంలో ఆర్థిక శాఖను ఎవరు చేపట్టారు?
a) భగవంతరావు గాధే
b) దిగంబరరావు బిందు
c) జీఎస్ మేల్కోటే
d) కొండా వెంకటరంగారెడ్డి జవాబు: (c)
466. బూర్గుల మంత్రివర్గానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. హరిజన అభ్యుదయ వ్యవహారాల శాఖను అన్నారావు నిర్వహించాడు.
2. ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా చెన్నారెడ్డి ఉన్నాడు.
పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
a) 1 b) 2 c) 1, 2
d) ఏదీకాదు
జవాబు: (b)
వివరణ: హరిజన అభ్యుదయ శాఖను శంకర్రావ్ దేవ్ చూసుకున్నారు. అన్నారావు స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రిగా ఉన్నారు.
- కింది వాటిని జతపరచండి: (గ్రూప్ 4, 2023)
ఆశ్రితకులం కులం
A. సాధనశూరులు I. యాదవులు
B. కాకిపడిగెలవారు II. పద్మశాలీలు
C. విప్రవినోదులు III. ముదిరాజులు
D. మందెచ్చువారు IV. బ్రాహ్మణులు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
1) A-II, B-III, C-IV, D-I
2) A-II, B-IV, C-I, D-III
3) A-III, B-I, C-IV, D-II
4) A-I, B-II, C-III, D-IV
జవాబు: (1) - తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తిగా కిందివాటిలో ఏది పరిగణింపబడింది? (గ్రూప్ 1, 2023)
1) పోడు సాగు 2) వేట
3) యాచించడం
4) చాపలు, బుట్టల అల్లిక
జవాబు: (3)
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు