Groups Special | గ్రేట్ డివైడ్ ఇయర్ – స్మాల్ డివైడ్ ఇయర్
జనాభా
- ఆర్థికాభివృద్ధి అనేది సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై కూడా ఆధారపడుతుంది.
- మానవ వనరులపై చేసే పెట్టుబడి (విద్య, ఆరోగ్యం, నైపుణ్యం)ని మానవ పెట్టుబడి లేదా మానవ మూలధనం అంటారు.
- భూమిపై పుట్టే ప్రతి బిడ్డా ఆర్థిక నరకాన్ని పెంపొందించినవాడవుతాఢని టీఆర్ మాల్థస్, భూమిపై పుట్టే ప్రతి బిడ్డా అభివృద్ధి కారకుడవుతాఢని ఎడ్విన్ కానన్ పేర్కొన్నారు.
- జనన, మరణ రేట్లకు, ఆర్థికాభివృద్ధి మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే ‘జనాభా పరిణామ సిద్ధాంతం’.
- జనాభా పరిణామం అంటే అధిక జనన, మరణ రేట్ల నుంచి అల్ప జనన, మరణ రేట్లకు మారడమే.
- మాక్స్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా విభజించారు.
1వ దశ: అధిక జనన, మరణ రేట్లు, తక్కువ జనాభా వృద్ధి రేటు.
2వ దశ: అధిక, నిలకడ జనన రేటు, వేగంగా తగ్గే మరణ రేటు, సత్వర జనాభా వృద్ధి.
3వ దశ: తగ్గుతున్న జనన రేటు, తక్కువ నిలకడ మరణ రేటు, వేగంగా పెరిగే జనాభా.
4వ దశ: తక్కువ జనన, మరణ రేట్లు, అల్ప స్థాయిలో నిలకడ జనాభా.
ప్రపంచ జనాభా స్వరూపం - ప్రపంచ జనాభా మొదటి బిలియన్ 1830 దశకంలో, రెండో బిలియన్ 1930 దశకంలో, మూడో బిలియన్ 1960 దశకంలో చేరింది. నాలుగో బిలియన్ 1975 నాటికి, ఐదో బిలియన్ 1987, జూలై 11 నాటికి చేరింది. కేవలం 12 సంవత్సరాల్లో ఒక బిలియన్ జనాభా పెరిగింది. 1987, జూలై 11 నాటికి జనాభా 5 బిలియన్లకు చేరడంతో జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించారు.
- 1999, అక్టోబర్ 12 నాటికి 6 బిలియన్లకు చేరడంతో అక్టోబర్ 12ను ‘Day of 6th Billion’గా పిలుస్తారు. 2011 అక్టోబర్ 31 నాటికి 7 బిలియన్లకు చేరింది.
- ప్రపంచ విస్తీర్ణంలో 2.4 శాతం వాటాను కలిగిన భారతదేశం ప్రపంచ జనాభాలో 2001 నాటికి 16.7 శాతం వాటాను కలిగి ఉంది. అంటే ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా ప్రపంచంలో 17.5 శాతం వాటా కలిగి ప్రతి 78లో ఒకరి కంటే కొంచెం ఎక్కువగా భారతీయులే ఉన్నారు.
- ఒక బిలియన్ జనాభా దాటిన దేశాల్లో చైనా తర్వాత భారతదేశం రెండోదిగా ఉంది. జనాభాలో 3వ పెద్ద దేశమైన అమెరికా జనాభా కంటే భారతదేశ జనాభా నాలుగు రెట్లు అధికం. విస్తీర్ణంలో అతిపెద్ద దేశమైన రష్యా జనాభా కంటే భారతదేశంలో ఒక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభా అధికంగా ఉంటుంది.
- యూఎన్వో అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1.23 శాతం ఉండగా.. చైనా జనాభా వృద్ధి రేటు 0.53 శాతం, భారతదేశ వృద్ధి రేటు 1.64 శాతంగా ఉంది.
- ‘పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో’ అంచనా ప్రకారం 2030 నాటికి చైనా జనాభాను భారతదేశ జనాభా అధిగమిస్తుంది.
- ‘అమెరికన్ పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో’ అంచనా ప్రకారం 2025 నాటికి భారతదేశం చైనా జనాభాను అధిగమించగలదు.
- దేశంలో తొలిసారి లార్డ్ మేయో కాలంలో 1872లో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమయ్యింది. పూర్తిస్థాయి జనాభా లెక్కలు ‘సిరీస్ ఆఫ్ సెన్సస్’ మాత్రం 1881 లార్డ్ రిప్పన్ కాలంలో ప్రారంభమయ్యింది.
- దేశంలో జనాభా పెరుగుదలను నాలుగు దశలుగా విభజించారు.
1వ దశ (1891-1921) - ఈ 30 సంవత్సరాల్లో దేశ జనాభా 1.5 కోట్లు మాత్రమే పెరిగింది.
- 1901- 23.6 కోట్లు
- 1911- 25.2 కోట్లు l 1921- 25.1 కోట్లు
- ఈ కాలంలో వార్షిక వృద్ధిరేటు 0.19 శాతం మాత్రమే. జనన, మరణ రేట్లు రెండూ అధికంగా ఉండటం వల్ల జనాభా పెద్దగా పెరగలేదు. అందువల్ల ఈ దశను స్తబ్దతతో కూడిన జనాభా (Stagnant Population Period) అంటారు.
- 1911తో పోలిస్తే 1921లో జనాభా తగ్గింది. అంటే 1921లో రుణాత్మక వృద్ధి నమోదైంది. 1918లో ఇన్‌ఫ్లూయెంజా వల్ల జనాభా తగ్గింది.
- 1921కి పూర్వం జనాభా పెరుగుదలలోని ఒడిదొడుకులు అంతమై 1921 తర్వాత జనాభా నిరంతరం పెరుగుతూ వచ్చింది. అందుకే 1921ను ‘గ్రేట్ డివైడ్ ఇయర్’ అంటారు.
2వ దశ (1921-51) - ఈ 30 సంవత్సరాల్లో జనాభా 11 కోట్లు పెరిగింది.
- 1931- 27.9 కోట్లు l 1941- 31.9 కోట్లు
- 1951- 36.1 కోట్లు
- ఈ కాలంలో వార్షిక వృద్ధి రేటు 1.22 శాతం. ఈ దశలో జనాభా నెమ్మదిగా పెరగడంతో దీన్ని క్రమవృద్ధి (స్టడీ గ్రోత్) అంటారు.
- జనాభా పరిణామ సిద్ధాంతంలో దేశం 2వ దశలోకి ప్రవేశించింది.
3వ దశ (1951-81) - ఈ 30 సంవత్సరాల్లో జనాభా 32.2 కోట్లు పెరిగింది.
- 1961- 43.9 కోట్లు l 1971- 54.8 కోట్లు
- 1981- 68.3 కోట్లు
- ఈ కాలంలో వార్షిక వృద్ధి రేటు 2.14 శాతం. జనన రేటులోని తగ్గుదల కంటే మరణాల రేటు తగ్గుదల అధికంగా ఉండటంతో జనాభా పెరిగింది. అంటే జనాభా విస్ఫోటనం (Population Explosion) సంభవించింది.
- జనాభా వేగంగా పెరిగే ఈ దశను సత్వర అధిక వృద్ధి (Rapid High Growth) అంటారు.
- 1951 నుంచి జనాభా దశాబ్ద పెరుగుదల రేటు 20 శాతం పైన నమోదవడంతో 1951ను ‘Small Divide Year’ అని, 1981 నుంచి జనాభా పెరుగుదల రేటు తగ్గడంతో 1981ను ‘Divide Year’ అని అంటారు.
4వ దశ (1981-2011) - ఈ 30 సంవత్సరాల్లో దేశ జనాభా 52.8 కోట్లు పెరిగింది. వార్షికవృద్ధి 1.84 శాతంగా నమోదైంది.
- 1991- 84.6 కోట్లు, అంటే 1981-91 మధ్య జనాభా 16 కోట్లు పెరిగింది. వార్షిక వృద్ధి రేటు 2.11 శాతంగా నమోదైంది.
- 2001- 102.9 కోట్లు, అంటే 1991-2001 మధ్య జనాభా 18.3 కోట్లు పెరిగింది. వార్షిక వృద్ధి రేటు 1.9 శాతంగా నమోదైంది.
- 2011- 121.09 కోట్లు. అంటే 2001-11 మధ్య జనాభా 18.1 కోట్లు పెరిగింది. వార్షిక వృద్ధి రేటు 1.64 శాతంగా నమోదైంది.
- ఈ దశలో జనాభా పెరుగుదల ఉన్నప్పటికీ జనాభా పెరుగుదల రేటు తగ్గింది. అందుకే ఈ దశను ‘తగ్గుతుందనే సంకేతాలతో కూడిన అధిక వృద్ధి (High Growth Definite Signals of Slowing Down)’ అని అంటారు.
2011 జనాభా లెక్కలు (ఫైనల్) - 1865-72 మధ్య దేశంలో మొదటి జనాభా లెక్కలు నిర్వహించారు. వీటిని ఏకకాలంలో నిర్వహించలేదు.
- ఏక కాలంలో జనాభా లెక్కలు 1881 నుంచి నిర్వహిస్తున్నారు.
- స్వాతంత్య్రం తర్వాత ‘సెన్సస్ యాక్ట్ 1948’ను పార్లమెంట్ ఆమోదించింది. దీనిలో సెన్సస్ కమిషనర్ పోస్టును రూపొందించారు.
- జనాభా లెక్కలు కేంద్ర జాబితా (ఆర్టికల్ 246)లో ఉంది.
- కాబట్టి ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ (వోఆర్జీసీసీవో) అనేది హోంమంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది.
- 2011 జనాభా లెక్కల్లో వోఆర్జీసీసీవోగా డా. సీ చంద్రమౌళి ఉన్నారు. ప్రస్తుతం వివేక్ జోషి పని చేస్తున్నారు.
- స్వాతంత్య్ర భారతదేశ మొదటి జనాభా లెక్కలు 1951లో నిర్వహించారు. అందువల్ల 1872 నుంచి చూస్తే 2011 జనాభా లెక్కలు 15వది. కాగా స్వాతంత్య్రం తర్వాత 7వది.
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రమం తప్పకుండా 10 సంవత్సరాలకు ఒకసారి చొప్పున 15 సార్లు జనాభా లెక్కలు నిర్వహించిన దేశం ఇండియా ఒక్కటే.
- 2011 జనాభా లెక్కలు రెండు దశలుగా జరిగాయి. 2010 ఏప్రిల్‌లో హౌసింగ్ సెన్సస్ ప్రారంభించగా, 2011 ఫిబ్రవరి 9 నుంచి 28 మధ్య జనాభా లెక్కల సేకరణ (Population Enumeration) జరిగాయి. దీనికి రిఫరెన్స్ పీరియడ్- సమయం 00.00 మార్చి 1, 2011.
- ప్రపంచంలో అధిక జనాభా కలిగిన మొదటి పది దేశాల జనాభా (కోట్లలో) కింది విధంగా ఉంది.
1) చైనా- 134.01 2) భారత్- 121.09
3) అమెరికా- 30.87 4) ఇండోనేషియా- 23.76
5) బ్రెజిల్- 19.07 6) పాకిస్థాన్- 18.48
7) బంగ్లాదేశ్- 16.44 8) నైజీరియా- 15.83
9) రష్యా- 14.04 10) జపాన్- 12.81 - ప్రపంచ జనాభాలో అతిపెద్ద దేశం చైనా కాగా, అతిచిన్న దేశం వాటికన్ సిటీ.
- మొదటి 10 దేశాల్లో అధిక జనసాంద్రత కలిగింది బంగ్లాదేశ్, అధిక జనాభా వృద్ధిరేటు నైజీరియాలో (26.8 శాతం) నమోదైంది. అల్ప జనాభా వృద్ధి రేటు రష్యా (-4.29 శాతం)
- 2001-2011 మధ్య దేశంలో అదనంగా పెరిగిన జనాభా 18.19 కోట్లు (ఇది బ్రెజిల్ జనాభా కంటే కొంచెం తక్కువ).
- 1950లో ప్రపంచ జనాభాలో చైనా జనాభా వాటా 22 శాతం. భారతదేశ జనాభా వాటా 14.2 శాతంగా ఉంది.
- ప్రస్తుతం చైనా 18.5 శాతం, భారతదేశం 17.5 శాతం వాటాగా ఉన్నాయి. అంటే చైనా, భారతదేశాల మధ్య జనాభా అంతరం తగ్గుతుండగా భారత్-అమెరికాల మధ్య జనాభా అంతరం పెరుగుతుంది.
జనాభా (Size of Population) - 2011 మార్చి 1, సమయం 00.00.00 గంటలకు భారతదేశ జనాభా- 121,08,54,977 (1.21 బిలియన్లు). జనాభా పరిమాణంలో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానంలో ఉంది.
- 121.09 కోట్లతో అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ల జనాభా (121.43 కోట్లు)కు ఇంచుమించు సమానంగా ఉంది. దీన్నిబట్టి దేశ భూభాగంపై అధిక జనాభా ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తుంది.
- ప్రపంచ ఆదాయంలో భారత ఆదాయం 1.2 శాతం కంటే తక్కువగా ఉండగా జనాభాలో మాత్రం 17.5 శాతం ఉంది. అందుకే భారత్‌లో పేదరికం ఎక్కువగా ఉంది. 2019 నాటికి భారతదేశ జనాభా 134 కోట్లు.
- 1901లో 23.8 కోట్ల జనాభా ఉన్న భారతదేశం 2011 నాటికి 121.09 కోట్లకు చేరింది. అంటే 110 సంవత్సరాల్లో 97 కోట్ల జనాభా కంటే ఎక్కువగా పెరిగింది.
- పురుషులు 62,32,70,258 (51.47 శాతం), స్త్రీలు 58,75,84,719 (48.53 శాతం) అంటే పురుష జనాభా కంటే స్త్రీ జనాభా సుమారు 1.5 శాతం తక్కువగా ఉంది.
- 2001-11 మధ్య దేశంలో అదనంగా పెరిగిన జనాభా 18.19 కోట్లు. పురుషుల్లో 9.097 కోట్లు, స్త్రీలలో 9.099 కోట్లు అదనంగా పెరిగింది. అంటే అదనంగా పెరిగిన జనాభా పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంది.
- 2001-11 మధ్య భారత్‌లో అదనంగా పెరిగిన జనాభా ప్రపంచ జనాభాలో 5వ పెద్ద దేశమైన బ్రెజిల్ దేశ జనాభాకు సమానం.
అధిక జనాభా రాష్ర్టాలు
1) ఉత్తరప్రదేశ్- 19.98 కోట్లు (16.49 శాతం)
2) మహారాష్ట్ర- 11.24 కోట్లు (9.29 శాతం)
3) బీహార్- 10.41 కోట్లు (8.58 శాతం)
4) పశ్చిమబెంగాల్- 9.13 కోట్లు (7.55 శాతం)
5) ఆంధ్రప్రదేశ్ (ఏపీ+టీఎస్)- 8.4 కోట్లు (7 శాతం)
6) మధ్యప్రదేశ్- 7.26 కోట్లు (6 శాతం)
7) తమిళనాడు- 7.21 కోట్లు (5.96 శాతం)
తక్కవ జనాభా రాష్ర్టాలు
1) సిక్కిం- 6.11 లక్షలు (0.05 శాతం)
2) మిజోరం- 10.97 లక్షలు
3) అరుణాచల్‌ప్రదేశ్- 13.83 లక్షలు
4) గోవా- 14.58 లక్షలు
5) నాగాలాండ్- 19.78 లక్షలు
- ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ జనాభా కంటే ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల జనాభా, జనాభాలో 3వ పెద్ద దేశమైన అమెరికా కంటే ఎక్కువ.
అధిక జనాభా కేంద్రపాలిత ప్రాంతాలు
1) ఢిల్లీ- 1.68 కోట్లు
2) పుదుచ్చేరి- 12.47 లక్షలు
3) చండీగఢ్- 10.55 లక్షలు
4) అండమాన్ నికోబార్- 3.80 లక్షలు
అల్ప జనాభా కేంద్రపాలిత ప్రాంతాలు
1) లక్షద్వీప్- 64,473 (0.01 శాతం)
2) డామన్ డయ్యూ- 2.4 లక్షలు (0.02 శాతం)
3) దాద్రా నగర్ హవేలి- 3.43 లక్షలు (0.03 శాతం)
- అధిక జనాభా గల జిల్లా థానె (ముంబై)- 1.10 కోట్లు
- అల్ప జనాభా గల జిల్లా దిబంగ్ వ్యాలీ (అరుణాచల్‌ప్రదేశ్)- 7,900
- 2001లో దేశంలోని జిల్లాలు 593 కాగా, 2011 నాటికి 640కి పెరిగాయి. ప్రస్తుతం మొత్తం జిల్లాలు 739.
- 1991-2001 మధ్య దశాబ్దంలో పెరిగిన జనాభా 18.23 కోట్లు కాగా 2001-11 మధ్య దశాబ్దంలో పెరిగిన జనాభా 18.19 కోట్లు. ఇక్కడ అదనంగా పెరిగిన జనాభా తక్కువగా ఉంది (-0.4 శాతం)
- 700 కోట్ల బేబి 2011, అక్టోబర్ 31న లక్నోలో పుట్టింది. పేరు నర్గిస్.
- 1991-2001 వృద్ధి రేటు- 21.54 శాతం
- 2001-11 వృద్ధి రేటు- 17.6 శాతం.
1.64 శాతం తగ్గింది.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు