Current Affairs | క్రీడలు
గోపీచంద్
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు శ్రీసత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ (కర్ణాటక) గౌరవ డాక్టరేట్‌ను జూలై 3న ప్రదానం చేసింది. బ్యాడ్మింటన్ రంగంలో ఆటగాడిగా, కోచ్‌గా చేసిన కృషికి ఈ డాక్టరేట్ దక్కింది. ఈ డాక్టరేట్‌ను గోపీచంద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.
లాలియాన్జువాలా
ఏఐఎఫ్ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) ర్యాంకులను జూలై 4న విడుదల చేశారు. దీనిలో మిడ్‌ఫీల్డర్ లాలియన్జువాలా చాంగ్టే పురుషుల ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ 2022-23గా ఎంపికయ్యాడు. అలాగే మహిళల్లో మనీషా కల్యాణ్ ఎంపికయ్యింది. పురుషుల ఎమర్జింగ్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా, మహిళల్లో షిల్జీ షాజీ నిలిచాడు. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే.
భారత్‌దే శాఫ్ టైటిల్
శాఫ్ ఫుట్‌బాల్ టోర్నీని భారత జట్టు గెలుచుకుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియడంలో జూలై 4న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు కువైట్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో ఫెయిర్ ప్లే అవార్డు నేపాల్ జట్టు, బెస్ట్ గోల్‌కీపర్ అవార్డు అనిసుర్ రహమాన్ జికో (బంగ్లాదేశ్)లకు లభించాయి. సునీల్ ఛెత్రి హయ్యెస్ట్ గోల్ స్కోరర్ (6 గోల్స్)గా, మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ)గా నిలిచాడు. భారత్ ఈ టోర్నీని గెలవడం ఇది తొమ్మిదోసారి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు