Current Affairs July | జాతీయం
స్టార్టప్ 20
జీ20 భారత అధ్యక్షత ఆధ్వర్యంలో స్టార్టప్ 20 శిఖరాగ్ర సమావేశాన్ని జూలై 3, 4 తేదీల్లో గురుగ్రామ్ (హర్యానా)లో నిర్వహించారు. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఆవిష్కరణలు, జ్ఞానాన్ని పంచుకోవడం కోసం దీన్ని ఈ సమావేశం చేపట్టారు. స్టార్టప్ 20ను ప్రోత్సహించడానికి మొదటి దేశంగా సౌదీ అరేబియా రాజు తరఫున హెచ్ఆర్హెచ్ (హిజ్ రాయల్ హైనెస్) ప్రిన్స్ ఫహద్ బిన్ మన్సూర్ ఒక ట్రిలియన్ అమెరికా డాలర్ల సహాయాన్ని ప్రకటించారు. తదుపరి జీ20 ప్రెసిడెన్సీ దేశమైన బ్రెజిల్‌కు అధికారిక టార్చ్‌ను భారత్ అందజేసింది.
జిమెక్స్-23
జపాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్-2023 జూలై 5 నుంచి 10 వరకు విశాఖపట్నంలో నిర్వహించారు. ఇది 7వ ఎడిషన్. నిషియానా తకహిరో నేతృత్వంలో జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), గుర్చరణ్ సింగ్ నేతృత్వంలో ఇండియన్ నేవీ ఈ వ్యాయామం చేపట్టాయి. ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ కమోర్ట, ఐఎన్ఎస్ శక్తి, పీ81 హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ జిమెక్స్ను 2012లో ప్రారంభించారు.
గ్రీన్ హైడ్రోజన్
గ్రీన్ హైడ్రోజన్‌పై అంతర్జాతీయ సమావేశం (ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్- ఐసీజీహెచ్-2023) న్యూఢిల్లీలో జూలై 5 నుంచి 7 వరకు నిర్వహించారు. ఇంధన పరివర్తనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలనేదానిపై సమావేశంలో చర్చించారు. డీకార్బనైజేషన్ కోసం దేశ, అంతర్జాతీయ విద్య, పారిశ్రామిక రంగాలకు చెందిన నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం ఈ సదస్సు లక్ష్యం.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ 9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు