NCET Notification 2023 | ఇంటర్‌తోనే.. బీఈడీలో ప్రవేశాలు
NCET 2023 Notification | దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో టీచర్ ట్రెయినింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ)ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఎన్ఈపీ 2020 అనుగుణంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఐటీ, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీతో సహా ఇతర విద్యాసంస్థల్లో నాలుగేండ్ల టీచర్ ట్రెయినింగ్ కోర్సును కొత్తగా ప్రవేశపెట్టారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎన్సీఈటీ-2023 ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
- ఎన్సీఈటీ-2023
ఇంటర్‌తో నాలుగేండ్ల బీఈడీ కోర్సు - ఐఐటీ, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో కోర్సు
ఎన్సీఈటీ - నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్ని జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) తరఫున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
ఐటీఈపీ - ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్.
- ఇది నాలుగేండ్ల బీఈడీ డ్యూయల్-మేజర్ హోలిస్టిక్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్‌తో పాటు స్పెషలైజ్డ్ సబ్జెక్టులతో (మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకానమీ, ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు) దీన్ని అందిస్తారు.
కోర్సు ప్రత్యేకతలు
- ఎడ్యుకేషన్ ఇన్ మల్టీడిసిప్లినరీ ఎన్విరాన్మెంట్
- ఇంటర్ తర్వాత నాలుగేండ్ల కోర్సు
- యూజీసీ పేర్కొన్న క్రెడిట్ సిస్టమ్ ప్రకారం కోర్సు
- 21వ శతాబ్ద నైపుణ్యాలపై దృష్టితోపాటు ప్రతి విద్యార్థి కింద పేర్కొన్న పాఠశాల దశల్లో ఒకదానిలో నైపుణ్యం సాధిస్తారు. ఆ దశ (గ్రేడ్)కు ఉపాధ్యాయులుగా మారడానికి అర్హత లభిస్తుంది. అవి…
- ఫౌండేషనల్ స్టేజ్ స్పెషలైజేషన్ (ప్రీ స్కూల్ నుంచి గ్రేడ్ 2 వరకు)
- ప్రిపరేటర్ స్టేజ్ స్పెషలైజేషన్ (గ్రేడ్ 3 – గ్రేడ్ 5 వరకు)
- మిడిల్ స్టేజ్ స్పెషలైజేషన్ (గ్రేడ్ 6- గ్రేడ్ 8 వరకు)
- సెకండరీ స్టేజ్ స్పెషలైజేషన్ (గ్రేడ్ 9 – గ్రేడ్ 12 వరకు)
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా
- పరీక్షను ఇంగ్లిష్‌తోపాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.
- తెలుగు రాష్ర్టాల్లో ఇంగ్లిష్, తెలుగు భాషలో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం
- మొత్తం నాలుగు సెక్షన్లలో పరీక్ష ఉంటుంది
- సెక్షన్-1లో రెండు లాంగ్వేజ్‌లు ఉంటాయి. సెక్షన్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు
- సెక్షన్-3 జనరల్ టెస్ట్,
- సెక్షన్-4 టీచింగ్ ఆప్టిట్యూడ్
- మల్టిపుల్ చాయిస్ విధానంలో 160 ప్రశ్నలు ఇస్తారు
నోట్: అభ్యర్థి ఎంచుకోవడానికి 26 డొమైన్ సబ్జెక్టులు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా.. అకౌంటెన్సీ/బుక్ కీపింగ్, అగ్రికల్చర్, ఆంత్రోపాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, హిస్టరీ, ఫైన్ ఆర్ట్స్, లీగల్ స్టడీస్, మ్యాథ్స్, మాస్ మీడియా/మాస్ కమ్యూనికేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సంస్కృతం తదితరాలు ఉన్నాయి. - పరీక్ష కాలవ్యవధి 180 నిమిషాలు
ఎవరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయవచ్చు ?
- ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు లేదా 2023లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు గరిష్ఠ వయోపరిమితి లేదు
నోట్: పరీక్ష రాయడానికి ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేనప్పటికీ ప్రవేశాలు కల్పించే ఆయా విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థల వారి నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు - దేశవ్యాప్తంగా 42 సంస్థలు/ యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
- వీటిలో ఈ ఏడాది 3950 సీట్లు ఉన్నాయి.
- రాష్ట్రంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఎన్ఐటీ వరంగల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంచిర్యాల
ఈ కోర్సును అందిస్తున్నాయి. - ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ భువనేశ్వర్, ఇగ్నో, ఎన్ఐటీ కాలికట్, ఎన్ఐటీ త్రిపుర, పుదుచ్చేరి, తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం, ఆర్ఐటీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీ తదితర సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 19
వెబ్సైట్: https://ncet.samarth.ac.in
కేశవపంతుల వేంకటేశ్వర శర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు