Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?.. అప్లికేషన్లకు రేపే చివరితేదీ
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (PGIMER), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో (జూలై 13)తో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో జూనియర్ సైంటిఫిక్, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు
UPSC Recruitment 2023 | భారత ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో.. ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్ (AVO), ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, లైవ్‌స్టాక్ ఆఫీసర్ (LO), జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రన్స్లేషన్ ఆఫీసర్ (JTO), అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్ (ASO), సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 261
పోస్టులు : ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, లైవ్‌స్టాక్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రన్స్లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్, సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్ ఆఫీసర్.
అర్హతలు : పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : రూ. 56100 నుంచి రూ.208700 వరకు (పోస్టులను బట్టి)
దరఖాస్తు ఫీజు: రూ.25
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 13
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
2.Chandigarh PGIMER Recruitment | చండీగఢ్ పీజీఐఎంఈఆర్‌లో 206 పోస్టులు
Chandigarh PGIMER Recruitment 2023 | అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్, ట్యూటర్ టెక్నీషియన్, రిసెర్చ్ అసోసియేట్, స్టోర్ కీపర్, జూనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ ఓటీ తదితర గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీబీటీ, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. రఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 13 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 206
పోస్టులు : అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్, ట్యూటర్ టెక్నీషియన్, రిసెర్చ్ అసోసియేట్, స్టోర్ కీపర్, జూనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ ఓటీ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : సీబీటీ, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.800.)
చివరి తేదీ: జూలై 13
వెబ్సైట్ : https://pgimer.edu.in/
3.BECIL | న్యూఢిల్లీ బేసిల్- ఏఐఐఏలో మేనేజర్ పోస్టులు
BECIL AIIA Delhi Recruitment 2023 | న్యూఢిల్లీ( AIIA Delhi) లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) కార్యాలయాల్లో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్.
అర్హతలు : పోస్టులను బట్టి పీజీ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత.
ఎంపిక : స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ద్వారా.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.50000 నుంచి రూ.75000 వరకు
చివరి తేదీ: జూలై 13
వెబ్సైట్ : https://www.becil.com/
Union Public Service Commision, UPSC, TSPSC, PGIMER, BECIL, AIIA
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు