Indian History | కాకతీయుల పాలనను అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్?
చరిత్ర
1. ఎల్లోరాలోని 15వ నంబర్ గుహలోని నరసింహచిత్రం ఏ రాజుల కాలం నాటిది?
ఎ) పల్లవులు
బి) పశ్చిమ చాళుక్యులు
సి) గుప్తులు డి) రాష్ట్ర కూటులు
2. రాష్ట్ర కూటులు మొదట ఎవరికి సామంతులు?
ఎ) చోళులు బి) చాళుక్యులు
సి) గుప్తులు డి) పల్లవులు
3. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు?
ఎ) మొదటి కృష్ణుడు బి) దంతిదుర్గ
సి) అమోఘవర్ష డి) నాగభట్టు
4. పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టినప్పుడు చేసే సంస్కారం?
ఎ) అశ్వమేథ బి) రాజసూయ
సి) హిరణ్యగర్భ డి) వాజపేయ
5. గూర్జర ప్రతీహార హరిశ్చంద్రుడు ఏ వర్ణానికి చెందినవారు?
ఎ) బ్రాహ్మణ బి) క్షత్రియ
సి) వైశ్య డి) శూద్ర
6. కదంబ మయూర శర్మ ఏ ప్రాంతాన్ని పాలించాడు?
ఎ) రాజస్థాన్ బి) కర్ణాటక
సి) ఆంధ్రప్రదేశ్ డి) మహారాష్ట్ర
7. ప్రతీహార రాజు నాగభట్టు ప్రశస్థి ఎక్కడ లభిస్తుంది?
ఎ) భోపాల్ బి) గ్వాలియర్
సి) కనోజ్ డి) విదర్భ
8. ప్రతిహార నాగభట్టు ఓడించిన కనోజ్ పాలకుడు ఎవరు?
ఎ) హలాయుధుడు బి) చక్రాయుధుడు
సి) ఇంద్రాయుధుడు డి) భోజుడు
9. కశ్మీర్ రాజుల గురించి పెద్ద సంస్కృత పద్యం రచించింది?
ఎ) కల్హణుడు బి) బిల్హణుడు
సి) నహపాణుడు డి) నాగభట్టు
10. రాజులు తరచూ భూదానాలు ఎవరికి చేసేవారు?
ఎ) రైతులకు బి) బ్రాహ్మణులకు
సి) చేతివృత్తుల వారికి డి) వ్యాపారులకు
11. ‘త్రైపాక్షిక పోరాటం’ ఏ ప్రాంతం కోసం జరిగింది?
ఎ) మగధ బి) కనోజ్
సి) ఇంద్రప్రస్థ డి) పానిపట్టు
12. కనోజ్‌పై నియంత్రణకు తీవ్ర పోరాటం చేసిన రాజులు?
ఎ) పాల వంశీయులు బి) ప్రతిహారులు
సి) రాష్ట్ర కూటులు డి) పైవారందరు
13. సోమనాథ దేవాలయం ఎక్కడ ఉంది?
ఎ) మహారాష్ట్ర బి) మధ్యప్రదేశ్
సి) రాజస్థాన్ డి) గుజరాత్
14. క్రీ.శ 997-1030 మధ్య కాలంలో మధ్య ఆసియా నుంచి భారతదేశంపై దాడులు చేసిన ముస్లిం పాలకుడు?
ఎ) మహ్మద్ ఘోరీ బి) మహ్మద్ గజినీ
సి) మహ్మద్ బీన్ ఖాసిం
డి) మహ్మద్ బీన్ తుగ్లక్
15. కితాబ్ ఉల్ హింద్ అరబిక్ గ్రంథాన్ని రచించింది?
ఎ) అల్బెరూనీ బి) ఫిరదౌసీ
సి) అబుల్ ఫజల్ డి) అమీర్ ఖుస్రూ
16. చౌహాన్లు పరిపాలించిన ప్రాంతం?
ఎ) పంజాబ్ బి) బెంగాల్
సి) ఢిల్లీ, అజ్మీర్ డి) బుందేల్ ఖండ్
17. 1192లో పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించింది?
ఎ) మహ్మద్ గజనీ బి) మహ్మద్ ఘోరీ
సి) మహ్మద్ బీన్ తుగ్లక్
డి) మహ్మద్ బీన్ ఖాసిం
18. చోళుల కాలంలో ఏ విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందింది?
ఎ) కాంస్యం బి) వెండి
సి) బంగారం డి) ఇనుము
19. చోళరాజ్య స్థాపకుడు?
ఎ) రాజరాజు
బి) కులోత్తుంగ చోళుడు
సి) రాజేంద్రచోళ
డి) విజయాలయుడు
20. గంగైకొండ చోళపురం దేవాలయం నిర్మించింది?
ఎ) రాజరాజు బి) కులోత్తుంగ చోళుడు
సి) రాజేంద్రచోళ
డి) విజయాలయుడు
21. చోళుల కాలంనాటి గ్రామీణ పాలనను తెలిపే శాసనం?
ఎ) ఉత్తర మేరూర్ బి) తంజావూర్
సి) ఐహోలు డి) నాసిక్
22. చోళులు బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి గల పేరు?
ఎ) శాలభోగ బి) వెల్లన్ వాగై
సి) బ్రహ్మధేయ డి) దేవదాన
23. కింది పాలకులు వారు పరిపాలన చేసిన ప్రాంతాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి.
ఎ) గాంగులు – ఒడిశా
బి) చేర – కేరళ
సి) రాష్ట్ర కూటులు – తమిళనాడు
డి) పాండ్యులు – తమిళనాడు
24. కింది వారిలో ‘హిరణ్యగర్భ’ అనే సంస్కారం చేసింది?
ఎ) విజయాలయ చోళ బి) దంతిదుర్గ
సి) ప్రతీహార నాగభట్టు
డి) పృథ్వీరాజ్ చౌహాన్
25. ప్రతీహార నాగభట్టును ఓడించిన అనర్త అనే ప్రాంతం ఎక్కడ ఉంది?
ఎ) మహారాష్ట్ర బి) మధ్యప్రదేశ్
సి) గుజరాత్ డి) తెలంగాణ
26. కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతులు?
ఎ) చోళులు బి) ముత్తరాయర్లు
సి) రాష్ట్రకూటులు డి) పాండ్యులు
27. చోళుల కాలం నాటికి చెందిన ‘నగరం’ అంటే?
ఎ) సైనిక శిబిరం బి) వర్తక సంఘం
సి) పట్టణం డి) విద్యాసంస్థ
28. ఉత్తర మేరూర్ శాసనం ప్రకారం గ్రామ సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు?
ఎ) 21 సంవత్సరాలు
బి) 25 సంవత్సరాలు
సి) 30 సంవత్సరాలు
డి) 35 సంవత్సరాలు
29. పెరియ పురాణం ఏ కాలానికి చెందింది?
ఎ) 9వ శతాబ్దం బి) 10వ శతాబ్దం
సి) 11వ శతాబ్దం డి) 12వ శతాబ్దం
జవాబులు
1.డి 2.డి 3.బి 4.సి
5.ఎ 6.బి 7.బి 8.బి
9.ఎ 10.బి 11.బి 12.డి
13.డి 14.బి 15.ఎ 16.సి
17.ఎ 18.ఎ 19.డి 20.సి
21.ఎ 22.సి 23.సి 24.బి
25.సి 26.బి 27.బి 28.డి
29.డి
30. క్రీ.శ 1000 నుంచి క్రీ.శ1350 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన కథను గురించండి.
ఎ) పల్నాటి వీరుల కథ
బి) కాటమరాజు కథ
సి) సమ్మక్క సారలమ్మ కథ
డి) పైవన్నీ
31. మొదటి తెలుగు పద్యకావ్యం?
ఎ) శ్రీమదాంద్ర మహాభారతం
బి) మహాభాగవతం
సి) రామాయణం
డి) ఆముక్తమాల్యద
32. ప్రతాపరుద్ర చరిత్రను రచించింది?
ఎ) వల్లభరాయుడు
బి) ఏకామ్రనాథుడు
సి) రావిపాటి త్రిపురాంతకుడు
డి) విద్యానాథుడు
33. కాకతీయ రాజులను ఏమని పిలిచేవారు?
ఎ) కన్నడ ప్రభువులు
బి) ఆంధ్ర రాజులు
సి) సంస్కృత చక్రవర్తులు
డి) ప్రాకృత ప్రభువులు
34. కాకతీయుల రాజధానిని ఓరుగల్లుకు మార్చింది?
ఎ) రుద్రదేవుడు బి) రుద్రమదేవి
సి) గణపతిదేవుడు డి) ప్రతాపరుద్రుడు
35. వేయి స్తంభాల ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) వరంగల్ బి) హనుమకొండ
సి) పాలంపేట డి) పాకాల
36. రుద్రమదేవి పాలనా కాలం?
ఎ) 1116 – 1157
బి) 1199 – 1262
సి) 1158 – 1195
డి) 1262 – 1289
37. రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు?
ఎ) నికోలో కాంటే బి) మార్కోపోలో
సి) పేయిజ్ డి) అబ్దుల్ రజాక్
38. ఢిల్లీని పరిపాలించిన మహిళా రాణి?
ఎ) లక్ష్మీబాయి
బి) రాణి దుర్గావతి
సి) రుద్రమదేవి
డి) గణపతి దేవుడు
39. చివరి కాకతీయ పాలకుడు?
ఎ) ప్రతాపరుద్రుడు బి) రుద్రదేవుడు
సి) రుద్రమదేవి డి) గణపతి దేవుడు
40. నాయంకర విధానం అనేది?
ఎ) న్యాయ విచారణ విధానం
బి) యుద్ధ విధానం
సి) సైనిక విధానం
డి) గుడి నిర్మాణ విధానం
41. మోటుపల్లి అభయ శాసనం జారీ చేసింది?
ఎ) రుద్రదేవుడు బి) గణపతి దేవుడు
సి) రుద్రమదేవి డి) ప్రతాపరుద్రుడు
42. కాకతీయుల పాలనను అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్?
ఎ) మహ్మద్ బీన్ తుగ్లక్
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ఫిరోజ్‌షా తుగ్లక్
డి) బాల్బన్
43. కాకతీయ రాజ్యం అంతమైన సంవత్సరం?
ఎ) 1223 బి) 1323
సి) 1332 డి) 1232
44. 14వ శతాబ్దంతో పల్నాటి వీరుల చరిత్ర రచించింది?
ఎ) బాలచంద్రుడు బి) పోతన
సి) శ్రీనాథుడు డి) ఎర్రన
45. మోటుపల్లి రేవు సందర్శించిన విదేశీ యాత్రికుడు?
ఎ) ఫాహియాన్ బి) ఇత్సింగ్
సి) నికోలోకాంటే డి) మార్కోపోలో
46. ఎవరి పతనం తరువాత కాకతీయులు సర్వ స్వతంత్రులయ్యారు?
ఎ) విజయనగర రాజులు
బి) ఢిల్లీ సుల్తాన్లు
సి) పశ్చిమ చాళుక్యులు
డి) చోళులు
47. కాకతీయులు ఆదరించిన భాష?
ఎ) కన్నడం బి) ప్రాకృతం
సి) ద్రావిడం డి) తెలుగు
48. శ్రీ అహిత గజకేసరి అనేది?
ఎ) వర్తక సంఘం బి) చెరువు
సి) నాణెం డి) అధికార హోదా
49. కింది వాటిలో కాకతీయుల పతనం తరువాత ఏర్పడిన రాజ్యం?
ఎ) ఢిల్లీ సుల్తాన్లు
బి) బహమనీ రాజ్యం
సి) రాష్ట్ర కూట రాజ్యం
డి) తూర్పు చాళుక్యులు
50. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో విశేషంగా కీర్తించిన భారతీయ ఉత్పత్తి?
ఎ) పట్టు వస్ర్తాలు
బి) నూలు వస్ర్తాలు
సి) ఉన్ని వస్ర్తాలు డి) రసాయన వస్ర్తాలు
51. రుద్రమ దేవి మరణంతో సంబంధం కలిగిన ప్రదేశం?
ఎ) ఓరుగల్లు బి) చందుపట్ల
సి) నర్మదానది డి) నేలకొండ పల్లి
జవాబులు
30.డి 31.ఎ 32.బి 33.బి
34.ఎ 35.బి 36.డి 37.బి
38.డి 39.ఎ 40.సి 41.బి
42.ఎ 43.బి 44.సి 45.డి
46.సి 47.డి 48.సి 49.బి
50.బి 51.బి
52. విజయనగరాన్ని పాలించిన వంశాల సరైన క్రమాన్ని గుర్తించండి.
1. సంగమ 2. సాళువ
3. అరవీటి 4. తుళువ
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4, 3
సి) 2, 1, 4, 3 డి) 2, 1, 3, 4
53. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న విజయనగర రాజు?
ఎ) మొదటి దేవరాయలు
బి) రెండో దేవరాయలు
సి) శ్రీకృష్ణదేవరాయలు
డి) అళియ రామరాయలు
54. విజయనగర రాజుల కాలానికి చెందిన ఏ దేవాలయంలో రాతిరథం ఉంది?
ఎ) విరూపాక్షాలయం
బి) లేపాక్షి ఆలయం
సి) హజరారామాలయం
డి) ఏకాంబరేశ్వరాలయం
55. ఆండాళ్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన గ్రంథం?
ఎ) ఆముక్తమాల్యద బి) ముద్రరాక్షసం
సి) మృచ్ఛకటికం డి) సుశ్రుత సంహిత
56. రాక్షస తంగడి యుద్ధానంతరం విజయనగర రాజులు ఎక్కడి నుంచి పాలించారు?
ఎ) మధుర బి) దేవగిరి
సి) చంద్రగిరి డి) దేవర కొండ
57. కింది వాటిలో వెలమ రాజ్యాన్ని గుర్తించండి.
ఎ) కొండవీడు బి) దేవరకొండ
సి) నేలకొండపల్లి డి) గోల్కొండ
58. విజయనగరం ఏ నదీ తీరాన ఉంది?
ఎ) కృష్ణా బి) తుంగభద్ర
సి) గోదావరి డి) పెన్నా
59. విజయనగర రాజుల ఇష్టదైవం?
ఎ) విరూపాక్ష దేవుడు బి) శివుడు
సి) విష్ణువు డి) కృష్ణుడు
60. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం?
ఎ) 1333 బి) 1336
సి) 1343 డి) 1347
61. విజయనగర రాజ్య స్థాపనలో పాల్గొన్నది?
ఎ) హరిహరరాయలు
బి) బుక్కరాయలు
సి) విద్యారణ్యస్వామి డి) ఎ, బి, సి
62. విజయనగర రాజ్యాన్ని పాలించిన వంశాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
63. విజయనగరాన్ని పాలించిన మొదటి వంశం?
ఎ) సంగమ బి) సాళువ
సి) తుళువ డి) అరవీటి
64. విజయనగర రాజుల్లో చివరి వంశం?
ఎ) సంగమ బి) సాళువ
సి) తుళువ డి) అరవీటి
65. బహమనీ రాజ్య రాజధాని?
ఎ) రాయచూర్ బి) బీజాపూర్
సి) గుల్బర్గా డి) అహ్మదాబాద్
66. బహమనీ రాజ్యం ఐదురాజ్యాలుగా విడిపోయిన కాలం?
ఎ) 1480 – 1520 బి) 1489 – 1520
సి) 1500 – 1530 డి) 1490 – 1520
67. కింది వాటిలో విజయనగరాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు?
ఎ) మార్కోపోలో బి) అబ్దుల్ రజాక్
సి) న్యూనిజ్ డి) నికోలో కాంటే
జవాబులు
52.బి 53.బి 54.సి 55.ఎ
56.సి 57.బి 58.బి 59.ఎ
60.బి 61.డి 62.సి 63.ఎ
64.డి 65.సి 66.బి 67.డి
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు