Telangana History & Culture | పురుషులే పత్రికలు నడపగలరన్న అపోహను చెరిపేసిన మహిళ?
జూన్ 14వ తేదీ తరువాయి..
406. కింది వివరాలను పరిశీలించండి.
1. హైదరాబాద్ రాజ్యంలో 1871లో తొలిసారిగా బొగ్గు నిల్వలు బయల్పడ్డాయి
2. జీఎఫ్ హీనన్ పర్యవేక్షణలో నిజాం ప్రభుత్వం బొగ్గు గనుల విభాగాన్ని ఏర్పాటు చేసింది పై వివరాల్లో సరికానిది?
a) 1 b) 2
c) 1, 2 సరైనవి d) 1, 2 సరైనవి కావు
జవాబు: (c)
407. హైదరాబాద్‌లో చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి ఏర్పాటైన పత్రిక ఏది?
a) హైదరాబాద్ ఇండస్ట్రీస్
b) ముల్కీ ఇండస్ట్రీస్
c) దక్కన్ ఇండస్ట్రీస్
d) నైజాం ఇండస్ట్రీస్ జవాబు: (b)
408. హైదరాబాద్ రాజ్యంలో ‘నిజాం రాజ్య రోడ్డు రవాణా సంస్థ’ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
a) 1931 b) 1933
c) 1932 d) 1934
జవాబు: (c)
వివరణ: 1932లో 27 బస్సులు, 166 మంది కార్మికులు, ప్రతి జిల్లా కేంద్రంలో బస్సు డిపోలతో నిజం రాజ్య రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది.
409. మీర్ మహబూబ్ అలీఖాన్ 1884లో హైదరాబాద్ రాజ్యంలో విద్యాభివృద్ధి కోసం ఎవరిని అధికారిగా నియమించారు?
a) సాలార్ జంగ్ 1
b) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
c) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
d) సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి
జవాబు: (d)
వివరణ: విద్యా సౌకర్యాల అభివృద్ధికి ఏడాదికి 2 లక్షల రూపాయలను కేటాయించారు.
410. హైదరాబాద్‌లో భారతీయ భాషలో (ముఖ్యంగా ఉర్దూలో) విద్యను అందించడానికి ఒక విశ్వవిద్యాలయం అవసరమని భావించిన పండితులు ఎవరు?
a) జంగ్, జమాలుద్దీన్ అఫ్గానీ
b) సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్
c) సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, అక్బర్ హైదరీ
d) మహమ్మద్ ఆసిఫ్ ఇక్బాల్, రవీంద్రనాథ్ ఠాగూర్ జవాబు: (a)
411. హైదరాబాద్‌లో ఒక మహమ్మదీయ విశ్వవిద్యాలయం ఉండాలని మీర్ మహబూబ్ అలీఖాన్‌కు నివేదిక ఇచ్చింది ఎవరు?
a) హంటర్ b) బ్లాంట్
c) హార్టోగ్ d) ర్యాలీ
జవాబు: (b)
వివరణ: ఈ సలహాను మీర్ మహబూబ్ అలీఖాన్ స్వాగతించాడు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా విశ్వవిద్యాలయ స్థాపన కార్యరూపం దాల్చలేదు.
412. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్లు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ సంవత్సరంలో ఫర్మానా జారీచేశారు?
a) 1917 b) 1918
c) 1919 d) 1916
జవాబు: (a)
వివరణ: ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలుత అబిడ్స్‌లో ఒక అద్దె భవనంలో ప్రారంభమైంది.
413. అడిక్‌మెట్ ప్రాంతంలో ఉస్మానియా ఏర్పాటు చేయవచ్చని సర్వే నిర్వహించి తెలిపింది ఎవరు?
a) ప్రొఫెసర్ సర్ పాట్రిక్ గేడిస్
b) నవాబ్ జైన్ యార్ జంగ్
c) సయ్యద్ అలీ రజా d) బ్లాంట్
జవాబు: (a)
414. అడిక్‌మెట్‌లో ఉస్మానియాను ఏర్పాటు చేసిన 1400 ఎకరాల జాగీరు ఎవరిది?
a) మైదా బీబీ b) బసాలత్ ఖాన్
c) మహాలఖాబాయి చందా
d) భాగీరథి బాయి జవాబు: (c)
415. మహాలఖాబాయి చందా ఏ నిజాం రాజు సమకాలీనురాలు?
a) మొదటి నిజాం అసఫ్‌జా
b) నాసిరుద్దౌలా c) మహబూబ్ అలీఖాన్
d) నిజాం అలీఖాన్ జవాబు: (d)
416. సికింద్రాబాద్ కేంద్రంగా మలేరియా వ్యాధి కారకాలపై పరిశోధనలు సాగించి, తన కృషికి నోబెల్ బహుమతి పొందిన బ్రిటిష్ వైద్యుడు ఎవరు?
a) లూయీ పాశ్చర్ b) ఎడ్వర్డ్ జెన్నర్
c) సర్ రోనాల్డ్ రాస్ d) విలియం కాంబెల్
జవాబు: (c)
417. జమీందార్ల ఇళ్లలో ఆడపిల్లకు వివాహం అనంతరం ఒక మహిళను ఆ అమ్మాయి వెంట వెట్టిబానిసగా పంపించే పద్ధతిని ఏమని పిలుస్తారు?
a) బసివి b) దేవదాసి
c) జోగిని d) ఆడపాప
జవాబు: (d)
418. జాగీర్దారీ భూముల్లో రైతులు పన్నులు చెల్లించకపోతే వారి భూములను స్వాధీనం చేసుకొని, వారినే కూలీలుగా మార్చిన విధానానికి ఏమని పేరు?
a) వెట్టి b) బాగేలా
c) బేగారి d) కట్టుబానిసత్వం
జవాబు: (b)
419. తెలంగాణ సమాజానికి సంబంధించి ‘తవాయిఫ్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) తమ ఆటపాటలతో సంగీత ప్రియులను అలరించే స్త్రీలు
b) రాజులు, జమీందార్ల జనానాలో పనిచేసే స్త్రీలు
c) రాజుల ఆస్థానంలో మహిళలు పాడే పాటలు
d) రాణిని ఎప్పుడూ అంటిపెట్టుకుని సేవలు చేసే చెలికత్తెలు జవాబు: (a)
420. హైదరాబాద్‌లో ఏ పత్రికతో జర్నలిజానికి బీజాలు పడ్డాయని భావిస్తారు?
a) దక్కన్ క్రానికల్ b) తెనుగు పత్రిక
c) నీలగిరి d) రిసాలా తిబ్బి
జవాబు: (d)
వివరణ: ‘రిసాలా తిబ్బి’ వైద్య పత్రిక. ఇది 1859 లో ప్రారంభమైంది.
421. హైదరాబాద్‌లో ఉర్దూ జర్నలిజానికి రూపశిల్పుల్లో ఒకరిగా ఎవరిని పరిగణిస్తారు?
a) షబ్నవీసు నరసింహారావు
b) ఒద్దిరాజు రాఘవరంగారావు
c) మౌల్వీ మొహిబ్ హుస్సేన్
d) గులాం మహమ్మద్ కలకత్తావాలా
జవాబు: (c)
వివరణ: మౌల్వీ మొహిబ్ హుస్సేన్ ‘మౌలిమ్ ఎ నిస్వాన్’ అనే పత్రికను స్థాపించాడు.
422. హైదరాబాద్‌లో వెలువడిన తొలి తెలుగు వార్తాపత్రికగా ఏది గుర్తింపు పొందింది?
a) హితబోధిని b) శేద్యచంద్రిక
c) ఆంధ్రమాత d) సువార్తామణి
జవాబు: (b)
వివరణ: ఇది ఉర్దూలో వచ్చిన ‘ఫునూన్’ అనే పత్రికకు అనువాదం. ఇందులో వ్యవసాయ సంబంధ అంశాలకు ప్రాధాన్యం ఉండేది.
423. ఆంగ్ల భాషలో ‘ద పంచమ’ అనే పత్రికను ఎవరు స్థాపించారు?
a) జేఎస్ ముత్తయ్య b) భాగ్యరెడ్డి వర్మ
c) బీఎస్ వెంకటరావు
d) అరిగె రామస్వామి జవాబు: (a)
వివరణ: జేఎస్ ముత్తయ్య మన్య సంఘం కార్యదర్శి. ‘ద పంచమ’ (1918) పత్రిక దళితుల అభివృద్ధి కోసం కృషి చేసింది.
424. ప్రగతిశీల భావాలు కలిగి, రజాకార్ల అరాచకాలను ప్రశ్నించిన ‘పయాం’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడేది?
a) షోయబుల్లా ఖాన్
b) మౌల్వీ మొహిబ్ హుస్సేన్
c) ఖాజీ అబ్దుల్ గఫార్
d) మందుముల నరసింగరావు
జవాబు: (c)
425. కింది వివరాలను పరిశీలించండి:
1. ‘నేడు’ అనే పత్రికకు సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించారు
2. 1925లో ప్రారంభమైన నేడు పత్రిక తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో వెలువడేది
పై వాటిల్లో సరైన వాటిని గుర్తించండి?
a) 1 b) 2 c) 1, 2 సరైనవే
d) 1, 2 సరైనవి కావు జవాబు: (d)
వివరణ: నేడు పత్రిక 1925లో భాస్కర్ సంపాదకత్వంలో వెలువడింది. ఇది తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రచురితమయ్యేది.
426. హైదరాబాద్ సంస్థాన విద్యార్థుల కోసం ‘సంస్థాన విద్యార్థి’ మాసపత్రికను ఎవరు ప్రారంభించారు?
a) మాడపాటి హనుమంతరావు
b) భీమా గౌడ్
c) మాదిరి భాగ్యరెడ్డి వర్మ
d) వట్టికోట ఆళ్వారుస్వామి
జవాబు: (b)
427. ‘తెలుగుతల్లి’ మాసపత్రికకు ఎవరు సంపాదకత్వం వహించారు?
a) వట్టికోట ఆళ్వారుస్వామి
b) సూర్యదేవర రాజ్యలక్ష్మి
c) రాచమళ్ల సత్యవతిదేవి
d) అబ్బూరి ఛాయాదేవి జవాబు: (c)
వివరణ: రాచమళ్ల సత్యవతిదేవి 1939లో ‘తెలుగుతల్లి’ మాసపత్రికను సొంత సంపాదకత్వంలో ప్రారంభించారు. అలా అప్పటివరకు పురుషులే పత్రికలు నడపగలరన్న అపోహను చెరిపేశారు.
428. ఆధునిక హైదరాబాద్ పత్రికా రంగానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి:
1. ‘తెలుగుదేశం’ అనే పత్రిక 1948లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది
2. ఈ పత్రిక అబ్బూరి ఛాయాదేవి ఆధ్వర్యంలో వెలువడింది
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2 సరైనవే
d) 1, 2 సరైనవి కావు జవాబు: (a)
వివరణ: ‘తెలుగుదేశం’ పత్రిక 1948లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. దీన్ని సూర్యదేవర రాజ్యలక్ష్మి స్థాపించారు. తర్వాతి కాలంలో ఇది హైదరాబాద్ నుంచి వెలువడింది. రాజకీయ ప్రధానమైన పత్రిక అయినప్పటికీ, మహిళాలోకం, మనదేశం, ప్రపంచగతి తదితర శీర్షికలను ఈ పత్రికలో నిర్వహించారు.
429. కవితలు, కథానికలు, స్త్రీ సంబంధ విషయాలే ప్రధానంగా ‘కవిత’ అనే పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది?
a) సూర్యదేవర రాజ్యలక్ష్మి
b) మాలతీ చందూర్
c) ఇల్లిందల సరస్వతీదేవి
d) అబ్బూరి ఛాయాదేవి జవాబు: (d)
430. ఏకవ్యక్తి పాలనకు స్వస్తి పలుకుతూ నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1919 చివర్లో ఎవరి అధ్యక్షతన కార్యనిర్వాహక సమితిని ఏర్పాటు చేశాడు?
a) అక్బర్ హైదరీ
b) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
c) సర్ అలీ ఇమాం
d) మోయిన్ నవాజ్ జంగ్ జవాబు: (c)
వివరణ: సర్ అలీ ఇమాం బీహార్, ఒరిస్సా కార్యనిర్వాహక సమితిలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. అయితే హైదరాబాద్‌లో ప్రబలంగా ఉన్న యుక్తులు, కుయుక్తుల కారణంగా ఆయన రెండేండ్లకే తన పదవికి రాజీనామా చేశాడు.
431. 1915లో హైదరాబాద్‌లో జరిగిన మొదటి విద్యా సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
a) అఘోరనాథ ఛటోపాధ్యాయ
b) మీర్ అక్బర్ అలీ
c) సరోజినీ నాయుడు
d) మూడో సాలార్జంగ్ జవాబు: (b)
వివరణ: మీర్ అక్బర్ అలీ ఉర్దూ దినపత్రిక ‘సాహిఫా’ సంపాదకుడు. ఈ సమావేశంలోనే హైదరాబాద్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించారు.
432. హైదరాబాద్‌లో 1906లో ‘వివేకవర్ధిని’ పాఠశాలను ఎవరు ఏర్పాటుచేశారు?
a) జమలాపురం కేశవరావు
b) అఘోరనాథ ఛటోపాధ్యాయ
c) సోమసుందరం మొదలియార్
d) కేశవరావు కోరాట్కర్ జవాబు: (d)
వివరణ: వివేకవర్ధిని పాఠశాల స్థాపనలో కోరాట్కర్కు వామనరావు నాయక్, గణపతిరావు హార్టికర్ సహకరించారు. నిజాం పాలనలోనే కేశవరావు కోరాట్కర్ హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆయన ఆర్యసమాజం కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు.
433. హైదరాబాద్‌ను సందర్శించి 20 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం పొందిన పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఎవరు?
a) గులాం మహమ్మద్
b) లియాఖత్ అలీఖాన్
c) జుల్ఫికర్ అలీభుట్టో
d) షానవాజ్ భుట్టో జవాబు: (a)
434. భారత ప్రభుత్వానికి, నిజాం నవాబుకు మధ్య యథాతథ ఒడంబడిక ఏ రోజున కుదిరింది?
a) 1947 ఆగస్టు 15
b) 1947 నవంబరు 29
c) 1947 అక్టోబరు 29
d) 1947 నవంబరు 1 జవాబు: (b)
వివరణ: ఈ ఒప్పందం ప్రకారం దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు మాత్రం భారత ప్రభుత్వం అధీనంలో ఉంటాయి.
435. యథాతథ ఒప్పందం తర్వాత హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
a) సర్ అక్బర్ హైదరీ b) చట్టారీ నవాబు
c) మీర్ లాయక్ అలీ d) ఖాసిం రజ్వీ
జవాబు: (c)
436. హైదరాబాద్, భారత ప్రభుత్వం మధ్య నెలకొన్న సమస్యను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి విన్నవించడానికి వెళ్లిన బృందానికి నాయకుడు ఎవరు?
a) మీర్ లాయక్ అలీ
b) అక్బర్ హైదరీ
c) పింగళి వెంకటరామారెడ్డి
d) మొయిన్ నవాజ్ జంగ్ జవాబు: (d)
437. జాయిన్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి:
1. తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం నాగపూర్‌లో ఏర్పాటయ్యింది
2. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాల కార్యాలయాల్ని సమన్వయం చేసుకోవడానికి కేంద్ర కార్యాలయం విజయవాడలో ఏర్పాట య్యింది
పై వివరాల్లో సరైనవి గుర్తించండి?
a) 1 b) 2 c) 1, 2 సరైనవే
d) 1, 2 సరైనవి కావె జవాబు: (d)
వివరణ: తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో ఏర్పాటయ్యింది. కేంద్ర కార్యాలయం బొంబాయిలో ఏర్పాటు చేశారు.
438. యథాతథ స్థితి ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన ప్రతినిధి బృందం సభ్యులను గుర్తించండి?
a) వాల్టేర్ మాంక్టన్, చత్తారీ నవాబు, సుల్తాన్ అహ్మద్
b) మొయిన్ నవాజ్ జంగ్, అబ్దుల్ రహీం, పింగళి వెంకటరామారెడ్డి
c) వాల్టేర్ మాంక్టన్, అబ్దుల్ రహీం, వెంకటరామారెడ్డి
d) చత్తారీ నవాబు, వాల్టేర్ మాంక్టన్, వెంకటరామారెడ్డి జవాబు: (b)
వివరణ: మొదటి విడత చర్చలకు మాత్రం వాల్టేర్ మాంక్టన్, చత్తారీ నవాబు, సుల్తాన్ అహ్మద్ సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్లింది. 1947 అక్టోబర్ 27న తొలుత యథాతథ ఒప్పందం కుదిరింది. అయితే దానికి రజాకార్లు ఒప్పుకోకపోవడంతో మొయిన్ నవాజ్ జంగ్, అబ్దుల్ రహీం, వెంకటరామారెడ్డి ప్రతినిధులుగా మరో బృందం చర్చలకు ఢిల్లీ వెళ్లింది. అలా 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వం, హైదరాబాద్ నిజాం మధ్య యథాతథ ఒప్పందం కుదిరింది.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు