General Studies | 1911లో ఏర్పాటు చేసిన ‘మన్యసంఘం’ లక్ష్యం?
1. భారత ప్రభుత్వ చట్టం 1935కు సబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) అవశిష్ట అధికారాలు గవర్నర్ జనరల్‌కు సంక్రమిస్తాయి
బి) ఈ చట్టంలో 22 భాగాలు ఉన్నాయి
సి) ఈచట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి
డి) ఈ చట్టంలో 10 షెడ్యూళ్లు ఉన్నాయి.
1) ఎ, బి, సి 2) ఎ, సి, బి
3) ఎ, బి, సి, డి 4) సి, బి, ఎ
2. కింద పేర్కొన్న వివిధ రంగాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
ఎ) ఆగస్టు ప్రతిపాదనలు 1) 1945
బి) క్రిప్స్ రాయబారం 2) 1940
సి) సీఆర్ ఫార్ములా 3) 1944
డి) వేవెల్ ప్రణాళిక 4) 1942
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1
3. డా.బి,ఆర్ అంబేద్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహునిగా ఎవరు అభివర్ణించారు?
1) ఎం.వి. ఫైలీ 2) ఎం.ఆర్.జయకర్
3) కె. ఎం. మున్షీ 4) గాంధీ
4. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం ‘ఆపరేషన్ పోలో’ అనే సైనిక చర్య ఎప్పుడు జరిగింది?
1) 1948 సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు
2) 1948, సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు
3) 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు
4) 1948 సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు
5. భారత పౌరసత్వ చట్టం 1955 ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోయే మార్గాల్లో లేని దాన్ని గుర్తించండి?
1) స్వచ్ఛందంగా వదులుకోవడం
2) అంతమొందించటం
3. అనివార్యమైన రద్దు
4) సంపూర్ణ రద్దు
6. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, వాటి వివరణకు సంబంధించిన ఆర్టికల్స్‌లో సరైన జవాబును గుర్తించండి?
ఎ. స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు 1. ఆర్టికల్స్ 23 నుంచి 24 వరకు
బి) పీడనాన్ని నిరోధించే హక్కు 2. ఆర్టికల్ 32
సి) రాజ్యాంగ పరిహారపు హక్కు 3. ఆర్టికల్స్ 19 నుంచి 22 వరకు
డి) సమానత్వపు హక్కు 4. ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-1, సి-3, డి-4
7. స్త్రీలు, బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 22 2) ఆర్టికల్ 23
3) ఆర్టికల్ 24 4) ఆర్టికల్ 25
8. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 38(ఎ) 2) ఆర్టికల్ 39(ఎ)
3) ఆర్టికల్ 41(బి) 4) ఆర్టికల్ 42(ఎ)
9. ఎవరి నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు?
1) జేఎస్ వర్మ కమిటీ
2) సర్దార్ స్వరూప్‌సింగ్ కమిటీ
3) రంగనాథ్ మిశ్రా కమిటీ
4) నానాపాల్కీ వాలా కమిటీ
10. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకాలతో చట్టాలుగా మారుతాయి?
1) ఆర్టికల్ 110 2) ఆర్టికల్ 111
3) ఆర్టికల్ 113 4) ఆర్టికల్ 114
11. ‘రెఫరెండం’కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతిలో అంతర్భాగం
2) ప్రపంచంలో తొలిసారిగా నెపోలియన్ ‘రెఫరెండం’ను నిర్వహించాడు
3) అమెరికాలో అనేక రాష్ర్టాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు
4) దీన్ని స్విట్జర్లాండ్‌లో విరివిగా వినియోగిస్తున్నారు
12. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం ప్రస్తుత సుప్రీంకోర్టు ఢిల్లీ కేంద్రంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1952 జనవరి 26
2) 1950 జనవరి 27
3) 1950 జనవరి 28
4) 1950 జనవరి 29
13. లోక్‌సభలో వివిధ రాష్ర్టాలకు కేటాయించిన స్థానాల సీట్ల సంఖ్యకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) గుజరాత్ 1) 28
బి) కర్ణాటక 2) 2
సి) త్రిపుర 3) 26
డి) ఉత్తరప్రదేశ్ 4) 80
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
14. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయ స్థానాలకు గల ‘న్యాయ సమీక్షాధికారం’పై పరిమితులు విధించింది?
1) 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1969
2) 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
4) 49వ రాజ్యాంగ సవరణ చట్టం 1982
15. ముఖ్యమంత్రి పదవిని 3సార్లు నిర్వహించిన మహిళలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) జయలలిత, సుస్మా స్వరాజ్, షీలాదీక్షిత్
2) మాయావతి, జయలలిత నందినీశతపతి
3) షీలాదీక్షిత్, మాయావతి, జయలలిత
4) మాయావతి, షీలాదీక్షిత్, జానకీ రామచంద్రన్
16. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్పీకర్‌గా ఎవరు వ్యవహరించారు?
1. అయ్యదేవర కాళేశ్వరరావు
2. కల్లూరి సుబ్బారావు
3. కొండా లక్ష్మణ్ బాపూజీ
4) కోటిరెడ్డి
17. మూడంచెల పంచాయతీరాజ్ విధానానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) 1959 అక్టోబర్ 2న రాజస్థాన్‌లో తొలిసారి ప్రారంభించారు
2) ఈ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
3) ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో 1959 నవంబర్‌లో1న ప్రారంభించారు
4) ఈ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉత్తరప్రదేశ్
18. వికలాంగుల సంరక్షణ, సంక్షేమానికి సంబంధించిన ప్రకరణ?
1) 40 2) 43 3) 45 4) 41
19. రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్రబడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?
1) రాష్ట్రపతి 2) గవర్నర్
3) పార్లమెంటు 4) అసెంబ్లీ
20. జీరో అవర్ కాలపరిమితి?
1) 1 గంట 2) అరగంట
3) 45 నిమిషాలు
4) నిర్ణీత సమయం ఉండదు
21. కింది ఏ శాసన ప్రక్రియలో ప్రభుత్వంపై విమర్శ ఉండదు?
1) పాయింట్ ఆఫ్ ఆర్డర్
2) అభిశంసన తీర్మానం
3) జీరో అవర్ 4) పైవన్నీ
22. కింది ఎన్ని రాష్ర్టాలు విధానసభ సభ్యుల సంఖ్య సమానంగా ఉంది?
1) 5 2) 6 3) 7 4) 8
23. విద్యుచ్ఛక్తి ఏ జాబితాలో ఉంది?
1) కేంద్ర జాబితా 2) రాష్ట్ర జాబితా
3) ఉమ్మడి జాబితా 4) అవశిష్ట జాబితా
24. అటార్నీ జనరల్ ఆ పదవిలో ఎంత కాలానికి నియమించబడతారు?
1) 4 సంవత్సరాలు 2) 6 సంవత్సరాలు
3) 7 సంవత్సరాలు
4) రాష్ట్రపతి విశ్వాసం మేరకు
25. మూడంచెల గల పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొనలేదు?
1) 3వ భాగం 2) 21వ భాగం
3) 9వ భాగం 4) 8వ భాగం
26. దేశంలో ఉన్న కంటోన్మెంటు బోర్డులెన్ని?
1) 60 2) 61 3) 62 4) 63
27. కింది వాటిలో సరైనది?
1) మాగ్నకార్టా-1215
2) ఇంగ్లిష్ బిల్ ఆఫ్ రైట్స్-1689
3) అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్-1781
4) పైవన్నీ సరైనవే
28. కేంద్ర సమాచార కమిషన్ సభ్యులను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) రాష్ట్రపతి 2) పార్లమెంటు
3) కేంద్ర ప్రభుత్వం 4) సుప్రీంకోర్టు
29. ప్రస్తుతం ఎన్ని రాష్ర్టాల్లో సమాచార హక్కు చట్టం అమల్లో ఉంది?
1) 12 2) 15 3) 16 4) 18
30. కిందివాటిలో ఏది సరైనది?
1) వికలాంగుల హక్కుల చట్టం-1995
2) మానసిక ఆరోగ్య చట్టం -1987
3) బాల కార్మిక నిషేధ నియంత్రిత చట్టం -1986
4) పైవన్నీ సరైనవే
31. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కింది ఏ పార్టీ నాయకత్వంలో జరిగింది?
1) కమ్యూనిస్టు పార్టీ 2) కాంగ్రెస్ పార్టీ
3) జనసంఘ్ 4) సోషలిస్ట్ పార్టీ
32. కిందివాటిని జతపరచండి?
1. బేగం బజార్ కుట్ర కేసు ఎ) 1862
2) రాంజీగోండు తిరుగుబాటు బి) 1860
3) నయాపూల్ నిర్మాణం సి) 1859
4) నిజాం సంస్థానంలో పోస్టాఫీసులు డి) 1862
33. కిందివాటిని జతపరచండి?
1) వరంగల్ జిల్లా ప్రసిద్ధి నృత్యం ఎ) బేతాళనృత్యం
2) నిజామాబాద్ జిల్లాలో పుట్టిన కళ బి) గుస్సాడి
3) దీపావళికి ప్రదర్శించే నృత్యం సి) చిందు భాగవతం
4) దసరాలో ప్రదర్శించే నృత్యం డి) పేరిణి శివతాండవం
1) 1-డి. 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
34. 1911లో ఏర్పాటు చేసిన ‘మన్యసంఘం’ లక్ష్యం?
1) బాల్య వివాహాలను వ్యతిరేకించడం
2) జోగిని, మురిడి, బసివి వ్యవస్థల నిర్మూలన
3) దళిత పిల్లల్లో విద్యావ్యాప్తి
4) పైవన్నీ
35. తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని ‘తెలంగాణ సిద్ధాంత కర్త’గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు?
1) కేసీఆర్ 2) కేశవరావు
3) జయశంకర్
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
36. ఆంధ్రోద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 01న ఏ ఫార్ములాను అమలు పరిచింది?
1) ఆరుసూత్రాల ఫార్ములా
2) ఐదు సూత్రాల ఫార్ములా
3) ఎనిమిది సూత్రాల ఫార్ములా
4) ఏదీకాదు
37. ప్రజలను చైతన్య పరచడానికి ‘గ్రామాలకు తరలిరండి’ కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థి సంఘం?
1) అఖిల భారత విద్యార్థి పరిషత్
2) రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ)
3) ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ 4) ఏదీకాదు
38. కింది వాటిని జతపరచండి?
1) మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎ) మారిషస్
2) రెండో ప్రపంచ తెలుగు మహాసభలు బి) తిరుపతి
3) మూడో ప్రపంచ తెలుగు మహాసభలు సి) హైదరాబాద్
4) నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు డి) కౌలాలంపూర్
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
39. ఆర్థిక సంస్కరణల కారణంగా తెలంగాణలో ప్రధానంగా దెబ్బతిన్న రంగాలు ఏవి?
1) వ్యవసాయం, చేనేత రంగాలు
2) రియల్ ఎస్టేట్ రంగం
3) విద్యా రంగం
4) హోటల్ పరిశ్రమ
40. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సమైక్య సభ జరుగుతుండగా ‘జై తెలంగాణ’ అని నినదించిన కానిస్టేబుల్ పేరు?
1) ఏడు కొండలు
2) వెంకటేశ్వరరావు
3) శ్రీనివాస్ 4) దస్తగిరి
41. మొక్క వయస్సు దేని ద్వారా కనుగొంటారు?
1) మొక్క పొడవు
2) ఫలాలు, పుష్పాలు
3) వార్షిక వలయాలను లెక్కించుట ద్వారా
4) మొక్క పొడవు లేదా వైశాల్యం
42. తెగిన భాగాల పునరుత్పత్తికి, అంటు కట్టడానికి ఉపయోగపడే కణ విభజన?
1) సమ విభజన
2) క్షయకరణ విభజన-1
3) క్షయకరణ విభజన-2
4) 2, 3
43. ద్వినామీకరణ అంటే ఏమిటి?
1) ఒక జీవికి రెండుసార్లు పేరు పెట్టడం
2) జాతినామం, ప్రజాతి నామం ఉండటం
3) శాస్త్రీయ, అశాస్త్రీయ నామలుండటం
4) జీవి యొక్క రెండు దశలను వివరించడం
44. కొబ్బరిలో తినదగిన భాగం ఏది?
1) ఫలకవచం 2) అంకురచ్ఛదం
3) పుష్పాసనం 4) మధ్య ఫలకవచం
45. పైత్యరస వర్ణకాలు ఏ విధంగా ఏర్పడతాయి?
1) ఎర్ర రక్తకణాల విచ్ఛిత్తిలో
2) తెల్ల రక్తకణాల విచ్ఛిత్తిలో
3) తెల్ల రక్తకణాలు ఏర్పడటంలో
4) ఎర్ర రక్తకణాలు ఏర్పడటంలో
46. క్షీరదాల ఎర్రరక్త కణాలు ఏవిధంగా ఉంటాయి?
1) కేంద్రకం కలిగి, ద్వికుంభాకారం
2) కేంద్రం కలిగి, ద్వి పుటాకారం
3) కేంద్రకం లేకుండా, ద్వికుంభాకారం
4) కేంద్రకం లేకుండా, ద్విపుటాకారం
47. డయాస్టీమ్ అంటే ఏమిటి?
1) రదనికలు లోపించగా ఏర్పడిన ఖాళీ ప్రదేశం
2) కుంతకాలు లోపించగా ఏర్పడిన ఖాళీ ప్రదేశం
3) చర్వణకాలు లోపించగా ఏర్పడిన ఖాళీ ప్రదేశం
4) అగ్ర చర్వణకాలు లోపించగా ఏర్పడిన ఖాళీ ప్రదేశం
48. శిలీంధ్రం నుంచి లభించే ఎర్గాట్ అనే ఆల్కలాయిడ్ ఏ విధంగా ఉపయోగించవచ్చు?
1) అధిక రక్తపోటును తగ్గించే ఔషధంగా
2) శిశు జననంలో రక్త స్రావాన్ని అరికట్టే ఔషధంగా
3) గొప్ప నివారణ ఔషధంగా
4) మధుమేహ నివారణ ఔషధంగా
సమాధానాలు
1-2 2-2 3-1 4-3 5-4
6-1 7-2 8-2 9-2 10-2
11-1 12-3 13-1 14-3 15-3
16-1 17-4 18-4 19-3 20-4
21-1 22-4 23-3 24-4 25-3
26-3 27-4 28-1 29-1 30-4
31-1 32-1 33-1 34-2 35-3
36-1 37-2 38-1 39-1 40-3
41-3 42-1 43-2 44-2 45-1
46-4 47-1 48-2
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు