Government Jobs 2023 | ఇంకా 2 రోజులే గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), దక్షిణ మధ్య రైల్వే (SCR), రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. NHAI Recruitment | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 50 మేనేజర్ పోస్టులు
NHAI Recruitment 2023 | టెక్నికల్ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రకటన విడుదల చేసింది. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో యూసీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 ఇంటర్వ్యూకు ఎంపిక అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 50
పోస్టులు : డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
అర్హతలు : సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో యూసీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 ఇంటర్వ్యూకు ఎంపిక అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: నెలకు రూ.39100
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 30
వెబ్సైట్ : https://nhai.gov.in/
2.TS WDCW Recruitment | తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
TS WDCW Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ డబ్ల్యూసీడీ విభాగంలో హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ సూపర్వైజర్, కాల్ ఆపరేటర్, మల్టీ-పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ సూపర్వైజర్, కాల్ ఆపరేటర్, మల్టీ-పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 25 – 35 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను కమిషనర్ కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, H. No.8-3-222, వెంగళ్రావు నగర్, సారధి స్టూడియోస్ దగ్గర, అమీర్‌పేట్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://wdcw.tg.nic.in/
3. CSIR-CEERI Recruitment 2023 | సీఎస్ఐఆర్ – సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్ పోస్టులు
CSIR-CEERI Recruitment 2023 | కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి రాజస్థాన్‌లోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఈఈఆర్ఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : సైంటిస్ట్
విభాగాలు: కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయసు: 32 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.98394
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : డైరెక్టర్, సీఎస్ఐఆర్ -సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CEERI), పిలానీ, జిల్లా – జుంఝును -333031 (రాజస్థాన్).
దరఖాస్తు చివరి తేది: 30.06.2023.
వెబ్సైట్ : https://www.ceeri.res.in
4. C-DOT Recruitment | సీడాట్‌లో 252 ఇంజినీర్ పోస్టులు
C-DOT Recruitment 2023 | సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆర్ఎఫ్ ఇంజినీర్, డెవలప్మెంట్ ఇంజినీర్, సీనియర్ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెలిమాటిక్స్ సీడాట్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 252
పోస్టులు : సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆర్ఎఫ్ ఇంజినీర్, డెవలప్మెంట్ ఇంజినీర్, సీనియర్ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్, హార్డ్‌వేర్ డిజైన్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000.
ఎంపిక : విద్యార్హతలు, వయస్సు, అకడమిక్ స్కోర్, పని అనుభవం ఇతర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://cdotrecruitment.cdot.in/
5.RITES Recruitment | రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
RITES Recruitment 2023 | సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 అర్హత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగ.. జూన్ 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ
అర్హతలు : సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 అర్హత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.40000 నుంచి రూ.1.4లక్షల వరకు
ఎంపిక : గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 30
వెబ్సైట్: https://www.rites.com/
6.SCR JTA Recruitment 2023 | దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
South Central Railway JTA Recruitment 2023 | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్/డ్రాయింగ్) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. పర్సనాలిటీ టెస్ట్, పని అనుభవం, అకాడమిక్ మార్కుల ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 35
పోస్టులు : జూనియర్ టెక్నికల్ అసోసియేట్
విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్
అర్హతలు : డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : పర్సనాలిటీ టెస్ట్, పని అనుభవం, అకాడమిక్ మార్కుల ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ & సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ పర్సనల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, సిబ్బంది విభాగం, రైలు నిలయం, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్, పిన్ – 500025.) అడ్రస్‌కు పంపించాలి.
చివరితేది: జూన్ 30
వెబ్సైట్ : https://scr.indianrailways.gov.in
7. NHPC JE Notification 2023 | ఫరీదాబాద్ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో జేఈ పోస్టులు
NHPC JE Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్ (JE), సూపర్వైజర్, సీనియర్ అకౌంటెంట్ (Senior Accountant), హిందీ ట్రాన్స్‌లేటర్ (Hindi translator), డ్రాప్ట్స్‌మ్యాన్ (Draftsman) పోస్టుల భర్తీకి హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 388
పోస్టులు : జూనియర్ ఇంజినీర్, సూపర్వైజర్, సీనియర్ అకౌంటెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, డ్రాప్ట్స్‌మ్యాన్
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : జూన్ 30 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్ (CBT) ద్వారా
పరీక్ష కేంద్రం : హైదరాబాద్.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.295.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : http://www.nhpcindia.com
8.APSFC Recruitment | ఏపీఎస్ఎఫ్సీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
APSFC Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
ఎలిజిబిలిటీ : సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.35,000.
దరఖాస్తు ఫీజు: రూ.590. (ఎస్సీ, ఎస్టీలకు రూ.354).
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://esfc.ap.gov.in/
9.RBI JE Recruitment | ఆర్బీఐలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు
RBI Recruitment 2023 | సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన (Recruitment) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 35
పోస్టులు : జూనియర్ ఇంజినీర్
విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
అర్హతలు : కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వయస్సు: 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.33,900 నుంచి రూ.71,032.
చివరి తేదీ : జూన్ 30
ఆన్లైన్ పరీక్ష తేదీ : జూలై 15
దరఖాస్తు ఫీజు : రూ.450.
వెబ్సైట్ : https://www.rbi.org.in
10.WII Recruitment | వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ పోస్టులు
Wildlife Institute of India Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు. రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 15
పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు
దరఖాస్తు : వెబ్సైట్లో
చివరితేదీ : జూన్ 30
వెబ్సైట్ : https://wii.gov.in/
12.OFK Recruitment | ఖమారియా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 200 పోస్టులు
Ordnance Factory Khamaria Recruitment 2023 | డేంజర్ బిల్డింగ్ వర్కర్ పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలోని ఖమారియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏఓసీపీ ట్రేడులో ఎస్‌సీటీవీటీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 200
పోస్టులు : డేంజర్ బిల్డింగ్ వర్కర్
అర్హతలు : ఏఓసీపీ ట్రేడులో ఎస్‌సీటీవీటీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : రూ.19,900
వయస్సు : 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (ఆఫ్‌లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా, జబల్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ అడ్రస్‌కు పంపించాలి).
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://ddpdoo.gov.in/units/OFK
13. AIIMS Jodhpur Recruitment | ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 92 పోస్టులు
AIIMS Jodhpur Recruitment 2023 | మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, వొకేషనల్ కౌన్సెలర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 92
పోస్టులు : మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, వొకేషనల్ కౌన్సెలర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 40 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.35400 నుంచి రూ.142400 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.3000
ఎంపిక : మెరిట్ లిస్ట్, రాతపరీక్ష ద్వారా
ఇంటర్వ్యూ తేది: జూన్ 30
వెబ్సైట్ : https://www.aiimsjodhpur.edu.in
14. GGH Kakinada Recruitment | కాకినాడ దవాఖానలో స్టాఫ్ నర్స్ పోస్టులు
GGH Recruitment 2023 | కాకినాడ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital)లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి కాకినాడలోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జీఎన్ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూన్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 97
పోస్టులు : స్టాఫ్ నర్స్
అర్హతలు: జీఎన్ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
వయస్సు : 42 ఏండ్లు మించకుడదు
ఎంపిక : అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా
దరఖాస్తు విధానం : దరఖాస్తులను పోస్టు ద్వారా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001 అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://eastgodavari.ap.gov.in/
16. Southern railway recruitment | దక్షిణ రైల్వేలో సీనియర్ టెక్నికల్ పోస్టులు
Southern railway recruitment | సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి చెన్నైలోని దక్షిణ రైల్వే, కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 15 పోస్టులు
పోస్టులు : సీనియర్ టెక్నికల్ అసోసియేట్
అర్హతలు : సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 20 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : గేట్ స్కోర్ ఆధారంగా.
జీతం : నెలకు రూ.32,000 నుంచి రూ.37,000.
దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://sr.indianrailways.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు