General Studies | హివారే బజార్ అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
జూన్ 25 తరువాయి
103. 2011లో తెలంగాణ స్త్రీ, పురుష నిష్పత్తి?
1) 987 2) 992
3) 988 4) 982
104. దేశంలో స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి కింది జతల్లో సరికానిది గుర్తించండి.
1) 1951లో 1000 మంది పురుషులకు గల స్త్రీలు 946
2) 1991లో 1000 మంది పురుషులకు గల స్త్రీలు 929
3) 2001లో 1000 మంది పురుషులకు గల స్త్రీలు 939
4) 2011లో 1000 మంది పురుషులకు గల స్త్రీలు 943
105. కింది రాష్ర్టాల్లో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ర్టాన్ని గుర్తించండి.
1) హర్యానా 2) పంజాబ్
3) తెలంగాణ 4) బీహార్
106. 2011 జనాభా గణన ప్రకారం భారతదేశ కార్మికుల్లో వ్యవసాయ కూలీల శాతం?
1) 20 2) 25
3) 30 4) 35
107. 2011లో భారతదేశ అక్షరాస్యతకు సంబంధించి అసత్యమైనది?
1) 2011లో దేశ అక్షరాస్యత 75.3 శాతం
2) 2011లో స్త్రీ అక్షరాస్యత 64.6 శాతం
3) 2011లో పురుషుల అక్షరాస్యత 80.9 శాతం
4) 1947లో అక్షరాస్యత 12 శాతం
108. 2011 జనాభా గణన ప్రకారం భారతదేశ కార్మికుల్లో వివిధ వర్గాల వాటాను సరిగా జతపరచండి.
1. రైతులు ఎ. 41 శాతం
2. పరిశ్రమల్లో పనిచేసే కూలీలు బి. 25 శాతం
3. ఇతర పనులు చేసేవారు సి. 04 శాతం
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి
109. ఆఫ్రికాలోని వృక్షజాలానికి సంబంధించి సరికానిది గుర్తించండి.
1) సవన్నాల్లో ఏనుగు కనిపించనంత ఎత్తులో గడ్డి దట్టంగా పెరుగుతుంది
2) భూమధ్యరేఖా ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి
3) సహారా ఎడారి ప్రాంతంలో ముళ్లపొదలు, చిన్నచిన్న గడ్డిమొక్కలు పెరుగుతాయి
4) ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో కోనిఫెరస్ అడవులు ఉన్నాయి
110. ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలో అత్యంత శుష్కతను ఏ విధంగా వ్యవహరిస్తారు?
1) కలహారి ఎడారి 2) సహారా ఎడారి
3) సవన్నాలు 4) సెల్వాలు
111. ఆఫ్రికాలో వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కింది జతల్లో సరికానిది గుర్తించండి.
1) జంతువుల వేట, పశుపోషణ- భూమధ్యరేఖ ప్రాంతం, ఎడారి ప్రాంతం
2) పశుపోషణ – ఎత్తయిన పీఠభూమిలో గల సవన్నా గడ్డిభూములు
3) వ్యవసాయం – నదీతీర ప్రాంతంలో అటవీభాగం అంచులు
4) వ్యాపారం – సరస్సులు తీరప్రాంతాలు
112. జతపరచండి.
1. నైలు నది ఎ. అట్లాంటిక్ మహా సముద్రం
2. కాంగోనది బి. హిందూ మహాసముద్రం
3. జాంబేజీ నది సి. మధ్యధరా సముద్రం
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి
113. ఆఫ్రికాలోని కింది నదులు ప్రధానంగా ప్రవహించే దేశాలతో జతపరచండి.
1. నైలు నది ఎ. జాంబియా
2. నైగర్ బి. కామెరూన్
3. జాంబేజీ సి. ఈజిప్ట్
4. కాంగో డి. నైజీరియా
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
114. వాస్కోడిగామా కంటే పూర్వం యూరోపియన్ వర్తకులు అట్లాంటిక్ మహాసముద్రంలోని ఏ దీవుల వరకు మాత్రమే ప్రయాణించేవారు?
1) మడగాస్కర్
2) saint madeira, అజోర్స్
3) సెయింట్ మేరీస్
4) సెయింట్ హెలీనా
115. ఆఫ్రికాలోని బానిస వ్యాపారానికి సంబంధించి సరికానిది గుర్తించండి.
1) 16, 17 శతాబ్దంలో యూరోపియన్లు ఆఫ్రికా ప్రజలను బంధించి బానిసలుగా మార్చి వ్యాపారం చేసేవారు
2) గినియా తీరం, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోనున్న ఆఫ్రికన్లు బంధించి బానిసలుగా మార్చేవారు
3) ఈ బానిసలను ఐరోపాలో కర్మాగారాలు, వ్యవసాయ భూముల్లో పనులకు ఉపయోగించేవారు
4) ఈ వర్తకం 19వ శతాబ్దం వరకు కొనసాగింది
116. ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ఏ దేశంలో ఉంది?
1) సోమాలియా 2) ఈజిప్ట్
3) దక్షిణాఫ్రికా 4) జింబాంబ్వే
117. ఆఫ్రికాలో వలస పాలనకు గురికాకుండా స్వతంత్రంగా ఉన్న దేశాన్ని గుర్తించండి.
1) దక్షిణాఫ్రికా 2) సూడాన్
3) నైజీరియా 4) ఇథియోపియా
118. ఆఫ్రికాలోని ఏ ప్రాంతంలో బంగారం, వజ్రాల గనులు నేటికి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి?
1) ఉత్తర ప్రాంతం 2) దక్షిణ ప్రాంతం
3) తూర్పు ప్రాంతం 4) పశ్చిమ ప్రాంతం
119. కోకో పంటతో తయారు చేసే ఆహార పదార్థం?
1) చాక్లెట్ 2) పిజ్జా
3) సాస్ 4) వంటనూనెలు
120. నైజీరియాలో పామ్ ఆయిల్ తోటలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి?
1) నైగర్ నదికి అవతల
2) విక్టోరియా సరస్సు సమీపంలో
3) అట్లాంటిక్ తీర ప్రాంతంలో
4) కాంగోనది తీరంలో
121. శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకొనేది?
1) గవర్నర్ 2) మంత్రి మండలి
3) శాసనసభ సభ్యులు
4) శాసనసభ, శాసనమండలి సభ్యులు
122. సంబంధిత శాఖ మంత్రి ఒక బిల్లు సభలో పెట్టినప్పుడు దానికి సభ్యులు చేసిన మార్పులు చేర్పులను బిల్లులో చేర్చాలనుకుంటే ఆమోదించవలసిన వారు?
1) శాసనసభ స్పీకర్ 2) గవర్నర్
3) ముఖ్యమంత్రి 4) మంత్రిమండలి
123. రాష్ట్రంలో బిల్లు చట్టంగా మారే ప్రక్రియలో ప్రభుత్వ గెజిట్‌లో ముద్రించే దశ?
1) సభల్లో ప్రవేశపెట్టగానే
2) క్యాబినెట్ బిల్లును ఆమోదించగానే
3) సభల్లో బిల్లు ఆమోదించగానే
4) బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత
124. శాసనమండలి కాల పరిమితి?
1) 5 సంవత్సరాలు 2) 6 సంవత్సరాలు
3) శాశ్వతం 4) 4 సంవత్సరాలు
125. కింది వాటిలో శాసనమండలి సభ్యుల పదవీ కాలానికి సంబంధించి సరికానిది గుర్తించండి.
1) శాసనమండలి సభ్యుల కాలపరిమితి 6 సంవత్సరాలు
2) వీరిలో 1/3వ వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు
3) వీరిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు
4) శాసనమండలి సభ్యులను ఎంఎల్సీ అంటారు
126. జిల్లాలో వివిధ శాఖల కార్యకలాపాలు సమన్వయం చేసేవారు?
1) జిల్లా పరిషత్ అధికారి
2) జిల్లా కలెక్టర్
3) జిల్లా పరిషత్ చైర్మన్
4) జిల్లా రెవెన్యూ అధికారి
127. గ్రామస్థాయిలో భూసంబంధిత రికార్డులు ఎవరి ఆధీనంలో ఉంటాయి?
1) పంచాయతీ సెక్రటరీ
2) విలేజ్ రెవెన్యూ అధికారి
3) గ్రామ పరిపాలనాధికారి
4) విలేజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
128. తహసీల్దార్ వివిధ రకాల భూధ్రువ పత్రాలు జారీ చేయడానికి ప్రవేశపెట్టినది?
1) ఈసేవ 2) మీసేవ
3) ఆన్లైన్ సేవ 4) భూసేవ
129. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య?
1) 2 2) 12
3) 15 4) 18
130. WALTA అంటే?
1) waste land and trees authority
2) water layer and trailer authority
3) water land and trees protetion authority
4) water land and tribal authority
131. వైద్య సిబ్బందిని ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించే వాహనం?
1) 108 2) 100
3) 101 4) 104
132. గ్రామ పంచాయతీ పన్నుల ద్వారా లభించే ఆదాయంలో 1/3వ వంతు ఆదాయం వీటి ద్వారా లభిస్తుంది?
1) వృత్తిపన్ను, అమ్మకం
2) ఇంటిపన్ను, ఖాళీస్థలాలపై భూమి పన్ను
3) ప్రకటన పన్నులపై పన్ను, వస్తువులపై పన్ను
4) వాహనాలపై పన్ను, స్టాంప్‌డ్యూటీ
133. గ్రామపంచాయతీలు నిధులు అధికంగా వీటి ద్వారా పొందుతాయి?
1) పన్నుల ద్వారా
2) కేంద్ర రాష్ట్ర పథకాల ద్వారా
3) అప్పుల ద్వారా
4) విరాళాల ద్వారా
134. గ్రామ పంచాయతీల ద్వారా అమలయ్యే పథకాల్లో ముఖ్యమైనది?
1) స్వచ్ఛభారత్
2) ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా పథకం
3) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
4) పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ‘శ్రమయేవ జయతే యోజన’
135. రాష్ట్రంలో గల గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థలను గుర్తించండి.
1) గ్రామ పంచాయతీ, తాలూకా సమితి, జిల్లా పరిషత్
2) నగర పంచాయతీ, మండలపరిషత్, జిల్లా ప్రజాపరిషత్
3) గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్
4) గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పరిషత్
136. పంచాయతీ వ్యవస్థల్లో ఎంపీటీసీ అంటే?
1) మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం
2) మండల పరిషత్ మొత్తం ప్రదేశం
3) మండల పరిషత్ పన్ను వసూలు
4) మండల పరిషత్ ఉపాధ్యాయుడు
137. రాజ్యాంగసభ సభ్యులు భారత రాజ్యాంగంపై సంతకాలు చేసిన రోజు?
1) 1949 నవంబర్ 26
2) 1950 జనవరి 24
3) 1950 జనవరి 26
4) 1950 ఆగస్టు 15
138. నిర్మల్ గ్రామ్ పురస్కార్‌ను ఎవరు బహూకరిస్తారు?
1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి
3) ప్రధాని 4) రాష్ట్రపతి
139. నిర్మల్ గ్రామ్ పురస్కార్ పొందాలంటే ఆ గ్రామాలకు?
1) మురుగు కాలువలు కలిగి ఉండాలి
2) గ్రామంలో చెత్తను రోడ్డుమీద వేయకూడదు
3) గ్రామంలో ప్రతి ఇంటికి, కార్యాలయానికి మరుగుదొడ్లు ఉండి బహిర్భూమికి వెళ్లని గ్రామాలు
4) తడి చెత్త నుంచి పొడి చెత్తను వేరుచేసే గ్రామాలు
140. 2008లో నిర్మల్ గ్రామ్ పురస్కార్‌ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న హాజీపల్ల్లి సర్పంచ్ పేరు?
1) సరోజినీదేవి
2) దేవదీవెన కుమారి
3) జంగమ్మ 4) ముత్యాలదేవి
141. గ్రామపంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్న కింది గ్రామాలను ఆయా జిల్లాలతో జతపరచండి.
1. రామచంద్రాపురం ఎ. కరీంనగర్
2. అంకాపూర్ బి. అహ్మద్‌నగర్
3. హివారేబజార్ సి. నిజామాబాద్
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-ఎ, 2-సి, 3-బి
4) 1-సి, 2-బి, 3-ఎ
142. హివారే బజార్ అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక
3) మహారాష్ట్ర 4) ఒడిశా
143. గంగదేవిపల్లి గ్రామసభ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీల సంఖ్య?
1) 11 2) 15
3) 18 4) 21
144. గ్రామ రెవెన్యూ కార్యదర్శి రైతుల పంట వివరాలను ఏ రికార్డ్ ఆధారంగా నమోదు చేస్తారు?
1) క్రాప్ రిజిస్టర్
2) పహణీ (అడంగల్)
3) రిజిస్ట్రార్ ఆఫీస్ రికార్డ్
4) గ్రామకరణం రిజిస్టర్
145. రేషన్‌కార్డ్ జారీ చేసేటప్పుడు ఏం చేస్తారు?
1) వేలిముద్రలు తీసుకుంటారు
2) ఐరిస్ ఫొటో తీసుకుంటారు
3) పుట్టుమచ్చలు, గుర్తులు రాసుకుంటారు
4) పైవన్నీ
146. కింది వాటిలో తహసీల్దార్ కార్యాలయం నిర్వర్తించని విధి?
1) భూవివాదాలు పరిష్కరించడం
2) వెట్టిచాకిరి నుంచి ప్రజలను విముక్తి చేయడం
3) ప్రాథమిక విద్యను అందించడం
4) భూమిశిస్తు వసూలు చేయడం
147. కింది వాటిలో మండల పరిషత్ విధి కానిది?
1) వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం అభివృద్ధి
2) మండలంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ
3) ఆరోగ్యం, శిశుసంక్షేమం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ
4) మండల పరిధిలోని రైతులకు రుణాలు ఇవ్వడం
జవాబులు
103.3 104.3 105.1 106.3
107.1 108.3 109.4 110.2
111.4 112.2 113.1 114.2
115.3 116.3 117.4 118.2
119.1 120.1 121.3 122.4
123.4 124.3 125.3 126.2
127.2 128.2 129.2 130.3
131.4 132.2 133.2 134.3
135.3 136.1 137.2 138.4
139.3 140.3 141.3 142.3
143.3 144.2 145.2 146.3
147.4
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు