Constitutional History of J&K | జమ్మూకశ్మీర్ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు రద్దయింది?
జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు (Article 370)
1. జమ్మూకశ్మీర్ గురించి సరికానిది?
1) 370వ ప్రకరణ ప్రకారం జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది
2) జమ్మూకశ్మీర్ గురించి భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉంది
3) ప్రకరణ 1 ప్రకారం జమ్మూ కశ్మీర్ భారత భూభాగంలో అంతర్భాగమే
4) మొదటి షెడ్యూల్లో జమ్మూకశ్మీర్‌ను 18వ రాష్ట్రంగా చేర్చారు
2. జమ్మూకశ్మీర్ గురించి సరైనది?
1) జమ్మూకశ్మీర్ మౌలిక రాజ్యాంగంలో పార్ట్-బి కేటగిరి రాష్ట్రంగా ఉండేది
2) మొదటి షెడ్యూల్లో జమ్మూ కశ్మీర్‌ను 15వ రాష్ట్రంగా చేర్చారు
3) రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1956, 7వ సవరణ ద్వారా పార్ట్-బి రాష్ర్టాల విధానాన్ని రద్దు చేయడం వల్ల కశ్మీర్ భారతదేశంలో ఇతర రాష్ర్టాలతో సమానంగా గుర్తించబడింది
4) పై వాక్యాలన్నీ సరైనవే
3. కిందివాక్యాల్లో సరైనది?
1) జమ్మూకశ్మీర్ చారిత్రక నేపథ్యం ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 370వ ప్రకరణ ద్వారా తాత్కాలిక ప్రత్యేకహోదాను కల్పించారు
2) 6వ భాగం అన్ని రాష్ర్టాలకు వర్తిస్తుంది. కాని జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి 6వ భాగం వర్తించదు
3) 1947కు ముందు జమ్మూకశ్మీర్‌ను రాజా హరిసింగ్ పాలించేవాడు
4) పై వాక్యాలన్నీ సరైనవే
4. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి సరికానిది?
1) మహారాజా హరిసింగ్ ఒప్పంద పత్రంపై సంతకం చేసేనాటికి 1/3వంతు ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది
2) దీన్నే ఆజాద్ కశ్మీర్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటారు
3) ఇప్పటివరకు దానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండేది కాదు
4) భారత రాష్ట్రపతి జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి శాసనాలను చేసుకునే అవకాశం కల్పించారు
5. ఇందిరాగాంధీ, షేక్ అబ్దుల్లాలు ఒక ఒప్పందం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ఎపప్పడు ప్రత్యేక పతిపత్తిని కల్పించడానికి అంగీకరించారు?
1) 1975 2) 1978
3) 1980 4) 1981
6. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం గురించి సరైనది?
1) 1931 అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది
2) జమ్మూకశ్మీర్ రాజ్యాంగం 1936, నవంబర్ 17న ఆమోదించారు
3) జమ్మూకశ్మీర్ రాజ్యాంగం 1937 జనవరి 26న అమల్లోకి వచ్చింది
4) పైవన్నీ సరైనవే
7. జమ్మూకశ్మీర్ రాజ్యాంగంలో సరికానిది?
1) జమ్మూకశ్మీర్ రాజ్యాంగాన్ని 1984లో సవరించారు
2) ఈ రాజ్యాంగంలో 158 ప్రకరణలు, 13 భాగాలు, 7 షెడ్యూల్లు ఉండేవి
3) 370వ ప్రకరణ ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక పతిపత్తిని కల్పించారు
4) 1959 వరకు మహారాజా హరిసింగ్ జమ్మూకశ్మీర్‌ను పాలించాడు
8. కిందివాటిలో సరికానిది?
1) జమ్మూకశ్మీర్ రాజ్యాంగ పరిషత్ 1957లో రద్దయ్యింది
2) 367 ప్రకరణ ప్రకారం రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో పేర్కొన్నారు
3) రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్‌లో సవరించాలంటే 1/4వంతు మెజారిటీతో ఆమోదించాలి
4) 2019లో జమ్మూకశ్మీర్ శాసనసభ రద్దు అయింది.
9. ప్రకరణ 370 ప్రకారం రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో పేర్కొన్నారు
1) జమ్మూకశ్మీర్‌కు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది
2) రక్షణ విదేశీ వ్యవహారాలు, ఆర్థిక సమాచార రంగాల్లో ఇతర రాష్ర్టాల అంగీకారం ఉండాలి
3) 35A ప్రకారం జమ్మూకశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్రంలో నివాసం ఉన్నవారికి ప్రత్యేక హక్కులు, సదుపాయాలు కల్పించవచ్చు
4) పైవన్నీ
10. కిందివాటిలో సరికానిది?
1) 370(1) అధికరణం ప్రకారం ఏ అంశాలు జమ్మూకశ్మీర్‌కు వర్తిస్తాయో రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా తెలపాలి
2) 370(3) నిబంధన ప్రకారం జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి ప్రత్యేక రక్షణను రాష్ట్రపతి ఉప సంహరించవచ్చు
3) 370(3) నిబంధనను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది
4) 370(4) నిబంధనను కూడా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది
11. ప్రకరణ 370 రద్దు వివాదాల్లో సరైనది?
1) జమ్మూకశ్మీర్ రాజ్యాంగ పరిషత్ 1957లో రద్దయింది
2) 367వ ప్రకరణ రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అన్వయించాలో పేర్కొన్నది
3) 2019 నాటికి జమ్మూకశ్మీర్ శాసనసభ రద్దు కావడం వల్ల రాష్ట్రపతి పాలన ఎలా అన్వయించుకోవాలో వివాదం అయింది
4) పైవన్నీ సరైనవే
12. జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో ముఖ్యాంశం కానిది?
1) ఈ చట్టాన్ని 2019 ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోదించారు
2) జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే పరిగణిస్తారు
3) కార్గిల్, లే జిల్లాలతో కలిపి లఢక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు
4) జమ్మూకశ్మీర్, లఢక్‌లకు ప్రత్యేకంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లను జారీ చేశారు
13. కిందివాటిలో సరికానిది?
1) జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక విధాన సభ ఉంటుంది
2) దీనిలో 108 మంది సభ్యులుంటారు
3) పాక్ ఆక్యుఫైడ్ కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు ఉన్నందున 24 స్థానాలు ఖాళీగా ఉంటాయి
4) అందువల్ల ప్రస్తుతం 83 మంది మాత్రమే సభ్యులుగా ఉంటారు
14. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం గురించి సరికానిది?
1) 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంత సభ్యులను నిర్ణయించారు
2) 2026వరకు ఈ ప్రాంత సభ్యుల సంఖ్య మారదు
3) ఈ కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు
4) 1/10వ వంతు కోరం సభ్యులు ఉండాలి.
15. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి సరైనది
1) జమ్మూకశ్మీర్ విధాన పరిషత్ రద్దు చేశారు
2) జమ్మూకశ్మీర్‌లో ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఉంటుంది
3) జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నియమిస్తాడు
4) పైవన్నీ సరైనవే
సమాధానాలు
1-4 2-4 3-4 4-3
5-1 6-4 7-4 8-3
9-4 10-4 11-4 12-2
13-2 14-3 15-4
రాజ్యాంగ ప్రకరణలు (Constitutional Articles)
1. కిందివాటిలో సరైనవి?
1) 262వ నిబంధన – అంతర్రాష్ట్ర నదీజలాల పరిష్కారం
2) 263వ నిబంధన – అంతర్రాష్ట్ర మండలి
3) 267వ నిబంధన – అగంతుక నిధి
4) పైవన్నీ సరైనవే
2. కింది వాటిలో సరికానిది?
1) 280వ నిబంధన -ఆర్థిక సంఘం
2) 279వ నిబంధన – జీఎస్టీ కౌన్సిల్
3) 283వ నిబంధన-ప్రభుత్వ నిధులపై నియంత్రణ
4) 300Aవ నిబంధన ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు
3. కిందివాటిలో సరైనది?
1) 285వ నిబంధన కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులను విధించరాదు
2) 290వ నిబంధన కొన్ని దేవస్థానాలకు చెల్లింపులను చెల్లించుట
3) 299వ నిబంధన – ఒప్పందాలను చేసుకోవడం
4) పైవన్నీ సరైనవే
4. కిందివాటిలో సరికానిది?
1) 301వ నిబంధన – స్వేచ్ఛావాణిజ్యం
2) 302వ నిబంధన – స్వేచ్ఛావాణిజ్యాలపై పార్లమెంటు ఆంక్షలను విధించరాదు
3) 307వ నిబంధన -వ్యాపారంపై రాష్ర్టాల గుత్తాధిపత్యం తెలుపుతుంది
4) 312వ నిబంధన అఖిల భారత సర్వీసులను తెలుపుతుంది
5. కిందివాటిలో సరైనది?
1) 315వ నిబంధన – కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు
2) 316వ నిబంధన – సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం
3) 320వ నిబంధన – పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులు 4) పైవన్నీ సరైనవే
6 కిందివాటిలోసరైనది.
1) 323A వ నిబంధన – పరిపాలన న్యాయస్థానాల ఏర్పాటు
2) 323Bవ నిబంధన – ఇతర ట్రిబ్యునల్స్ ఏర్పాటు
3) 324వ నిబంధన – ఎన్నికల కమిషన్ అధికారాలు
4) పైవన్నీ సరైనవే
7. కిందివాటిలో సరైనది?
1) 325వ నిబంధన – ఓటర్ల జాబితాలో అందరికీ కుల, మత వివక్ష పాటించరాదు
2) 326వ నిబంధన న్యాయస్థానాల జోక్యంపై ఆంక్షలు విధించుట
3) 330వ నిబంధన – షెడ్యూల్డ్ కులాల, తెగలకు లోక్‌సభలో రిజర్వేషన్
4) పైవన్నీ సరైనవే
8. కిందివాటిలో సరైనది?
1) 331వ నిబంధన -ఆంగ్లో ఇండియన్లకు లోక్‌సభలో రిజర్వేషన్లు
2) 332వ నిబంధన – రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
3) 333వ నిబంధన – ఆంగ్లో ఇండియన్లకు రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల రిజర్వేషన్ల గురించి
4) పైవన్నీ సరైనవే
9. కిందివాటిలో సరైనది?
1) 338 bవ నిబంధన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్మాణం, విధులు
2) 340వ నిబంధన వెనుకబడిన తరగతుల పరిస్థితుల అధ్యయనానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడం
3) 341వ నిబంధన షెడ్యూల్డ్ కులాల నిర్వచనం
4) పైవన్నీ సరైనవే
10. కిందివాటిలో సరైనది?
1) 343వ నిబంధన- కేంద్ర ప్రభుత్వ అధికార సభ
2) 350Aవ నిబంధన -ప్రాథమిక స్థాయిలో మైనారిటీలకు మాతృభాషలోనే విద్యాబోధన చేయలి
3) 351వ నిబంధన – హిందీ భాషాభివృద్ధికి సూచనలివ్వడం
4) పైవన్నీ
11. కిందివాటిలో సరికానిది?
1) 352వ నిబంధన- అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటించుట
2) 355వ నిబంధన- రాష్ర్టాల సంరక్షణ బాధ్యత కేంద్రానిది
3) 360వ నిబంధన- రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితులను విధించుట
4) 350B నిబంధన-ఆర్డినెన్స్‌ల జారీ
12. కిందివాటిలో సరైనది?
1) 361వ నిబంధన రాష్ట్రపతి, గవర్నర్లు చట్టానికి అతీతులు
2) 18వ నిబంధన బిరుదుల రద్దు
3) 41వ నిబంధన పనిహక్కు గురించి తెలుపుతుంది 4) పైవన్నీ
13. కిందివాటిలో సరైనవి?
1) 68వ నిబంధన రాష్ట్రపతి పదవికి అర్హతలు
2) 10వ నిబంధన -పౌరసత్వ హక్కుల గురించి తెలుపుతుంది
3) 26వ నిబంధన పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం
4) పైవన్నీ సరైనవే
14. ఏ నిబంధన ప్రకారం విద్యాలయాల్లో మతబోధన చేయకూడదు?
1) 27వ ప్రకరణ 2) 28వ ప్రకరణ
3) 29వ ప్రకరణ 4) 30వ ప్రకరణ
15. కిందివాటిలో సరైనది
1) 39A నిబంధన- ఉచిత న్యాయ సహాయం అందించడం
2) 93వ నిబంధన – కార్మికులకు జీవిత వేతనాలను కల్పించడం
3) 45వ నిబంధన – బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ
4) పైవన్నీ సరైనవే
16. కిందివాటిలో సరైనది?
1) 60వ నిబంధన – రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం
2) 70వ నిబంధన – ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికారాలు, విధుల నిర్వహణ
3) 72వ నిబంధన – రాష్ట్రపతి శిక్షల రద్దు, క్షమాభిక్ష ప్రసాదించడం
4) పైవన్నీ సరైనవే
17. కిందివాటిలో సరైనది?
1) 82వ నిబంధన – నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ గురించి తెలుపుతుంది
2) 83వ నిబంధన – లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కాల పరిమితిని తెలుపుతుంది
3) 84వ నిబంధన-పార్లమెంట్ సభ్యుల అర్హతలు
4) పైవన్నీ సరైనవే
సమాధానాలు
1-4 2-2 3-4 4-3
5-4 6-4 7-4 8-4
9-4 10-4 11-4 12-4
13-4 14-2 15-4 16-4
17-4
ఆంజనేయులు
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు