PM’s Visits – TSPSC Special | ప్రధానుల పర్యటన.. ఒప్పందాలపై ప్రకటన
ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన
- ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ (Prime Minister of Australia) 2023, మార్చి 8-11 వరకు భారత్‌లో పర్యటించారు. ప్రధాని అయిన తర్వాత ఇదే తొలి భారత పర్యటన.
- మార్చి 8న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. మోదీ (Prime Minister of India) ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడికి వచ్చారు.
- అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి గాంధీకి నివాళులర్పించారు. గాంధీ నివసించిన గది ‘హృదయ్ కుంజ్’ను సందర్శించారు.
- గాంధీ దండియాత్రపై ఆస్ట్రేలియాకు చెందిన రచయిత థామస్ వెబర్ రాసిన పుస్తకం ‘On the Salt March’ను 1915 నుంచి 1930 వరకు అహ్మదాబాద్‌లో నివసించినప్పుడు ఆయన జీవిత విశేషాలతో పాల్ జాన్, రాబిన్ డేవిడ్‌లు రాసిన మరొక పుస్తకం ‘Gandhis Ahmedabad-The City that shaped Indias Soul’ ను రాట్నం నమూనాను ఆశ్రమ నిర్వాహకులు అల్బనీస్‌కు బహూకరించారు.
- గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
- మార్చి 9న ప్రధాని మోదీ, అల్బనీస్‌లు ప్రపంచంలో అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
- ఈ పర్యటన భారత్, ఆస్ట్రేలియాల మధ్య 75 సంవత్సరాల స్నేహ సంబంధంలో భాగంగా జరిగింది.
- మార్చి 9న ముంబయిలో అల్బనీస్ భారత తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. భారతీయ నావికాదళం నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు.
- ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన తొలి విదేశీ ప్రధాని ఆంథోని అల్బనీస్
- మార్చి 8న ఆస్ట్రేలియా-భారత్ ప్రభుత్వాలు ‘ఆస్ట్రేలియా-భారత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజం’ను ఆమోదించాయి. దీని ప్రకారం భారత విద్యా సంస్థల్లోని డిగ్రీలు ఆస్ట్రేలియాలో కూడా గుర్తింపు కలిగి ఉంటాయి.
- ఈ మెకానిజంలో ఇంజినీరింగ్, మెడిసిన్, లా డిగ్రీలను చేర్చలేదు.
- గుజరాత్లో గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన గీలాంగ్కు సంబంధించి ‘డీకిన్ విశ్వవిద్యాలయం’ క్యాంపస్‌ను ప్రారంభించారు.
- భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో 4 సంవత్సరాల వరకు చదువుకోవడానికి ‘మైత్రి’ అనే స్కాలర్షిప్ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించనుంది.
- భారత్, ఆస్ట్రేలియా దేశాల ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా మోదీ, అల్బనీస్‌తో ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను
ప్రస్తావించారు. - ఆస్ట్రేలియా-భారత్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని 2023 చివరి నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు.
- ఆస్ట్రేలియా, భారత్‌లు మార్చి 10న నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
1. క్రీడలపై సహకారం
2. దృశ్య, శ్రవణ ఉత్పత్తులు- సహకారం
3. భారత్-ఆస్ట్రేలియా సోలార్ విద్యుత్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
4. భారత అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఆస్ట్రేలియా కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ (నూతన ఆవిష్కరణల కోసం) - 2021లో భారత్, ఆస్ట్రేలియాలు ECTA (Economic Cooperation and Trade Agreement) ప్రారంభించాయి. దీని ప్రకారం ఆస్ట్రేలియా భారత్‌కు ఎగుమతి చేసే వస్తువులపై 85% టారిఫ్ లేకుండా వస్తున్నాయి.
- ఆస్ట్రేలియా సైన్యానికి చెందిన 15 మంది బృందం (నలుగురు అధికారులు సహా) ఆగ్రాలోని శత్రుజీత్ బ్రిగేడ్‌ను సందర్శించింది.
ఇటలీ ప్రధాని పర్యటన
- ఇటలీ ప్రధాని జార్జియో మెలోని 2023, మార్చి 2, 3 తేదీల్లో భారత్‌లో పర్యటించారు.
- 2023తో భారత్-ఇటలీ దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తయ్యాయి.
- జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ పై భారత్ ముఖ్యమైన సమావేశం అయిన 8వ రైసీనా డైలాగ్‌లో మెలోని ముఖ్య అతిథి, వక్తగా పాల్గొంటారు.
- ప్రధాని మోదీ జార్జియో మెలోనిని స్వాగతించారు. త్రివిధ దళాల గార్డ్ ఆఫ్ హానర్ మెలోని అందుకున్నారు.
- రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా మెలోని రాష్ట్రపతి భవన్లో కలిశారు.
- భారత్-ఇటలీ సాయుధ బలగాల మధ్య ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు.
- భారత్, ఇటలీ మధ్య ‘స్టార్టప్ బ్రిడ్జి’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
- రెండు దేశాలు రక్షణ సంబంధాలపై చర్చించారు. (అంకురాలను ప్రోత్సహించడం)
- ఇటలీ నుంచి ఒక ప్రధాని భారత పర్యటనకు రావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2018లో ఇటలీ ప్రధాని గిసెప్పె కాంటే భారత్‌ను సందర్శించారు.
- యూరోపియన్ యూనియన్‌లో ఇటలీ, భారత్‌కు ఐదో పెద్ద వాణిజ్య భాగస్వామి.
- జార్జియో మెలోని ఇటలీ ప్రధాని అయిన తర్వాత ఆమె తన తొలి పర్యటనగా భారత్‌కే వచ్చారు. ఈమె ఇటలీ తొలి మహిళా ప్రధాని.
- మెలోని ‘బద్రర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీకి చెందినవారు. 2022, అక్టోబర్ 22న ప్రమాణం చేశారు.
సూడాన్‌లో హింస
- సైనిక నాయకత్వంలోని ఆధిపత్య పోరాటం ఫలితంగా సూడాన్ రాజధాని ఖర్టూమ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది.
- పారా మిలిటరీ ఫోర్స్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) సభ్యులు, సూడాన్ ఆర్మీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
వివాదం ఎవరెవరి మధ్య ఎలా మొదలైంది? - 2021, అక్టోబర్ తిరుగుబాటు నుంచి కౌన్సిల్ ఆఫ్ జనరల్స్ పాలనలో ఉన్న సూడాన్‌లో ఇద్దరు మిలిటరీ నేతల మధ్య వివాదం మొదలైంది. వారు..
1. అబ్దుల్ ఫతా బుర్హాన్ (ప్రస్తుత సూడాన్ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్)
2. మహ్మద్ హమ్దాన్ డగాలో (డిప్యూటీ ప్రెసిడెంట్, RSF చీఫ్ జనరల్) - మహ్మద్ హమ్దాన్ డగాలోను హెమెడ్తీ అని పిలుస్తారు.
- సూడాన్‌లో ప్రజా ప్రభుత్వ ఏర్పాటు ప్రతి పాదనలతో పై ఇద్దరూ విభేదించారు.
- లక్షమందితో బలంగా ఉన్న RSFను సూడాన్ సైన్యంలో విలీనం చేయాలనే ప్రతిపాదన, ఆ తర్వాత సైన్యాధ్యక్షుడిగా ఎవరు ఉండాలో కూడా పెద్ద సమస్య ఏర్పడింది.
హింస ఎందుకు చెలరేగింది? - RSF దేశ వ్యాప్తంగా మోహరించడం, దాన్ని సూడాన్ ఆర్మీ ప్రమాదంగా భావించడంతో రెండింటి మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి హింస చెలరేగింది.
- ఈ హింస 2023, ఏప్రిల్ 15న మొదలైంది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందనుకొన్నారు. కానీ అలా జరగలేదు.
RSF అంటే? - ఇది 2013లో ఏర్పాటైంది. దీన్ని డగాలో శక్తిమంతమైన ఫోర్స్‌గా మార్చారు.
- సూడాన్ ప్రధాన ఆదాయ వనరు అయిన బంగారు గనులపై ఆధిపత్యం కూడా RSF సాధించింది.
- మానవ హక్కుల ఉల్లంఘనలకు కూడా పాల్పడుతుందన్న ఆరోపణలున్నాయి.
సైన్యం రంగంలోకి దిగడానికి కారణం - సూడాన్‌కు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పని చేసిన ఒమర్ అల్ బషీర్ పదవిని కోల్పోయిన తర్వాత దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను, ఈ ఘర్షణలు అమాంతం పెంచాయి.
- ఒమర్ అల్ బషీర్ సూడాన్‌కు ఏడో అధ్యక్షుడిగా 1989, జూన్ 30 నుంచి 2019, ఏప్రిల్ 11 వరకు పని చేశారు.
- అల్ బషీర్ సుదీర్ఘ పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. ఆయన్ను పదవి నుంచి దించేందుకు సైన్యం తిరుగుబాటు చేసింది.
- అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగాలని సూడాన్ ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అప్పట్లో మిలటరీ-ప్రజలు సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడింది.
- ఈ ప్రభుత్వాన్ని ‘పరివర్తన సార్వభౌమాధికార మండలి’ ద్వారా నడిపారు. అయితే ఇది 2021 అక్టోబర్‌లో వచ్చిన తిరుగుబాటుతో కుప్పకూలింది.
- 2021, అక్టోబర్ 25న జనరల్ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ నేతృత్వంలోని సూడాన్ మిలిటరీ సైనిక తిరుగుబాటుతో ప్రభుత్వాన్ని నియంత్రించింది. సూడాన్ పౌర ప్రధానమంత్రి అబ్దుల్లా హమ్డోక్ తిరుగుబాటుకు మద్దతు ప్రకటించడానికి నిరాకరించారు.
- ప్రజాప్రతిఘటనకు పిలుపునిచ్చారు. దీంతో జరిగిన పరిణామాలతో బుర్హాన్, డగాలో మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుంది.
- సూడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను 2022 డిసెంబర్లో చేపట్టారు. కానీ చివరి దశలో అవి
విఫలమయ్యాయి. - ఈ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే దేశంలో పరిస్థితులు మరింత దిగజారి రాజకీయ అనిశ్చితికి దారి తీసే అవకాశం ఉంది.
- 2023, ఏప్రిల్ 20 నాటికి ఈ ఘర్షణల్లో సుమారు 330 మంది మరణించగా సుమారు 3200 మంది గాయపడ్డారు.
- ఈ సంక్షోభంలో ఉన్న భారతీయుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, ఎవరూ కంగారు పడొద్దని సూచించింది.
- ఈ అంతర్యుద్ధానికి కారణం బంగారం కావొచ్చనే అభిప్రాయం ఉంది.
- తూర్పు ఆఫ్రికా దేశమైన సూడాన్, ఆఫ్రికా ఖండంలో భారీ బంగారం నిల్వలున్న దేశం.
- 2022లో సూడాన్ ప్రభుత్వం 2.5 మిలియన్ డాలర్ల బంగారాన్ని (41.8 టన్నులు) విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ బంగారు గనులే సూడాన్ ప్రధాన ఆదాయ వనరు.
- దేశంలోని బంగారు గనుల్లో కొన్ని RSF చేతిలో ఉన్నాయి. RSF ప్రధాన ఆదాయ వనరు కూడా బంగారమే.
- బ్రిటిష్ పాలన నుంచి సూడాన్‌కు 1956లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత సూడాన్‌కు చమురు తవ్వకం ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది.
- 1980 తర్వాత సూడాన్ దక్షిణ ప్రాంతాల్లో స్వాతంత్య్రం కోసం ఉద్యమం మొదలై తీవ్రరూపం దాల్చింది. దీంతో 2011లో రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్ ఏర్పడింది.
- సౌత్ సూడాన్ ఏర్పాటుతో చమురు తవ్వకాల ప్రాంతాలు ఆ దేశానికి వెళ్లాయి. దాంతో సూడాన్ మూడింట రెండొంతుల ఆదాయాన్ని కోల్పోయింది.
- ఉత్తర సూడాన్‌లో జేచెల్ అమీర్‌గా పిలిచే ప్రాంతంలో బంగారు నిల్వలు ఉన్నట్లు 2012లో గుర్తించారు.
- ఈ గనులే సూడాన్ ఆదాయ వనరు. అయితే దీనివల్ల భిన్న సంస్థలు, మిలీషియాలు ఘర్షణలకు దిగాయి.
- ఈ గనుల్లో బంగారం వల్ల చాలా మంది ధనవంతులవగా కొందరు పైకప్పులు కూలి మరణించారు. మరికొందరు మెర్క్యురీ, ఆర్సెక్ల కాలుష్యంతో చనిపోయారు.
హక్కి-పిక్కి గిరిజనులు - సూడాన్ ఘర్షణల్లో సుమారు 3000 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఇందులో ‘హక్కి-పిక్కి’ తెగకు చెందినవారు సుమారు 100 మంది ఉన్నారు.
- హక్కి-పిక్కి కర్ణాటకకు చెందిన ఒక సంచార తెగ.
- మూలికా ఔషధాలు వాటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీరు సూడాన్ వెళ్లారు.
- కన్నడలో హక్కి-పిక్కి అంటే పక్షి వేటగాళ్లు అని అర్థం.
- హక్కి-పిక్కి తెగ ‘వాగరి’ అనే భాష మాట్లాడుతారు.
- వాగరిలో కొన్ని పదాలకు గుజరాతీ మూలం కనిపిస్తుంది.
ఆపరేషన్ కావేరి
- సూడాన్ దేశంలో తలెత్తిన హింస వల్ల సూడాన్ నుంచి భారతీయులను, విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలతో చేపట్టిన సహాయక చర్య పేరు ఇది.
- దీన్ని కేంద్ర విదేశాంగ శాఖ నిర్వహించింది.
- ఈ తరలింపు కార్యక్రమంలో భారత వైమానిక దళానికి చెందిన C-130J రవాణా విమానం, గరుడ ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి.
- భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ మొదటగా 2023, ఏప్రిల్ 25న 278 మంది భారతీయులను పోర్ట్ సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించింది.
- మొత్తం 3,862 మందిని ఈ ఆపరేషన్‌లో తరలించారు.
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Previous article
AIIMS Jodhpur Recruitment 2023 | ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 303 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు