TSPSC Group 4 Model Paper | తెలంగాణలో రైతు బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
జూన్ 21వ తేదీ తరువాయి
64. ఆర్థిక సర్వేకు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పరిస్థితి పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే
2. బడ్జెట్ కన్నా ముందే ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది
3. ఏటా ఆర్థిక సర్వేను నీతి ఆయోగ్ రూపొందిస్తుంది
4. మొదటిసారి ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు
ఎ. 1, 2 బి. 2
సి. 3 డి. 2, 4
65. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. 2023లో జీ-20 దేశాలన్నిటిలోకి భారతదేశమే అధిక వృద్ధి రేటు సాధించనున్నదని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సంస్థ ఇటీవల స్పష్టం చేసింది
2. పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, దేశం ఆర్థికంగా పుంజుకోవడం వల్లనే భారత్‌లో ఈ వృద్ధి రేటు సాధ్యమవుతుందని మూడిస్ అభిప్రాయపడింది
3. 2023, మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు ఏడు శాతమని జాతీయ గణాంక సంస్థ తెలిపింది
ఎ. 1 బి. 2 సి. 1, 3 డి. 1, 2, 3
66. కింది ప్రాజెక్టుల మారుపేర్లను సరిగా జత చేయండి.
1. జూరాల ప్రాజెక్టు ఎ. ప్రియదర్శిని
2. కడెం ప్రాజెక్టు బి. నారాయణరెడ్డి
3. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సి. పోచంపాడు
4. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డి. నందికొండ
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
67. టీఎస్-ఐపాస్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ. 2014, డిసెంబర్ 4
బి. 2015, డిసెంబర్ 4
సి. 2016, డిసెంబర్ 4
డి. 2017, డిసెంబర్ 4
68. 2023-24 తెలంగాన బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి?
1. తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదించింది
2. ఇది గతేడాది (2021-22) బడ్జెట్ కంటే 13.2 శాతం ఎక్కువ
3.మున్సిపల్ పాలసీ, పట్టణాభివృద్ధికి రూ.11,372 కోట్లు కేటాయించింది
4.వైద్య, ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు కేటాయించింది
ఎ. 1, 4 బి. 2, 3, 4
సి. 1, 2, 3 డి. 1, 2, 3, 4
69. తెలంగాణ బడ్జెట్ (2023-24) కేటాయింపులను సరిగా జత చేయండి.
1. పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి ఎ. రూ.3,001 కోట్లు
2. రోడ్లు, భవనాలు బి. రూ.3,117 కోట్లు
3. ఆహారం,పౌర సరఫరాలు సి. రూ.22,260 కోట్లు
4. ఉన్నత విద్య డి. రూ.31,426 కోట్లు
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
70. యాసంగి 2021-22లో రైతుబంధు పథకం కింద సుమారు 63 లక్షల మంది రైతులు పెట్టుబడి మద్దతు పొందారు. గ్రహీతల సంఖ్య ఆధారంగా కింది లబ్ధిదారులను అత్యల్ప నుంచి అత్యధిక వరకు అమర్చండి.
1. వెనుకబడిన తరగతుల భూ యజమానులు
2. షెడ్యూల్డు కులాల భూ యజమానులు
3. షెడ్యూల్డు తెగల భూ యజమానులు
4. ఇతర భూ యజమానులు
ఎ. 2, 3, 4, 1 బి. 2, 3, 1, 4
సి. 3, 2, 4, 1 డి. 2, 1, 3, 4
71. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది దేనికి సంబంధించిన నినాదం?
ఎ. తెలంగాణ ఐటీ విధానం
బి. తెలంగాణ అటవీ విధానం
సి. తెలంగాణ వ్యవసాయ విధానం
డి. తెలంగాణ పారిశ్రామిక విధానం
72. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్), భూ సేకరణ (ల్యాండ్ ఎక్విజిషన్) మధ్య గల భేదం ఏంటి?
ఎ. భూ సమీకరణ స్వచ్ఛందం, భూ సేకరణ స్వచ్ఛందమైనది కాదు
బి. భూ సమీకరణ స్వచ్ఛందమైనది కాదు, భూ సేకరణ స్వచ్ఛందమైనది
సి. భూ సమీకరణ, భూ సేకరణ రెండు స్వచ్ఛందమైనవే
డి. భూ సమీకరణ, భూ సేకరణ రెండే స్వచ్ఛందమైనవి కావు
73. తెలంగాణలో రైతు బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ. 2016, జూలై 15
బి. 2017, జూన్ 15
సి. 2019, ఆగస్టు 15
డి. 2018, ఆగస్టు 15
74. 2021-22లో తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్ వినియోగం ఎంత?
ఎ. 57,454 మిలియన్ యూనిట్లు
బి. 58,515 మిలియన్ యూనిట్లు
సి. 57,007 మిలియన్ యూనిట్లు
డి. 61,267 మిలియన్ యూనిట్లు
75. కింది వాటిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కాల్వను గుర్తించండి.
ఎ. లక్ష్మీ కాల్వ బి. ఎన్టీఆర్ కాల్వ
సి. కాకతీయ కాల్వ డి. సరస్వతి కాల్వ
76. కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. 1773-1858 వరకు భారతదేశం ఈస్ట్ ఇండియా పాలన కింద ఉండేది. ఈ కాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు
2. 1858 నుంచి భారత్‌లో బ్రిటిష్ రాణి నేరుగా అధికారం చేపట్టడం వల్ల ఆ తర్వాత చేసిన రాజ్యాంగ సంస్కరణలను చట్లాల్లో చివరిదైన 1853 చార్టర్ చట్టం అంతవరకు భారత్‌లో అనుసరిస్తున్న ద్వంద్వ పాలనను రద్దు చేసింది
ఎ. 1 బి. 2 సి. 1, 2 డి. 3
77. కింది అంశాలను సరిగా జతపరచండి.
1. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎ. 1861
2. ఇండియన్ పీనల్ కోడ్ బి. 1866
3. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సి. 1859
4. అలహాబాద్ హైకోర్టు డి. 1860
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
78. ప్రతిపాదన ఎ: 1909 భారత కౌన్సిల్ చట్టం (మింటో మార్లే సంస్కరణలు) భారతదేశంలో మతతత్వానికి చట్టబద్ధత కల్పించింది.
కారణం ఆర్: ఈ చట్టం మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. మహమ్మదీయులకు ఈ చట్టం వారి జనాభాకు మించిన ప్రాధాన్యం కల్పించింది. ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునే వీలు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక మత నియోజకవర్గాలు (కమ్యూనల్ ఎలక్టోరేట్స్) ఏర్పాటు చేశారు.
ఎ. ఎ, ఆర్ రెండూ సరైనవే, ఆర్ ఎ కు సరైన వివరణ
బి. ఎ, ఆర్ రెండూ సరైనవే, ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి. ఎ సరైనది, ఆర్ తప్పు
డి. ఎ తప్పు, ఆర్ సరైనది
79. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడానికి మింటో మార్లే సంస్కరణలు ప్రవేశపెట్టారు
2. మింటో మార్లే సంస్కరణలే భారత విభజనకు దారి తీశాయని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు
3. 1919 భారత ప్రభుత్వ చట్టం (మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు) ద్వారా దేశంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేశారు
4. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వంద్వ పాలనను రద్దు చేసింది
ఎ. 1 బి. 1, 2 సి. 1, 2, 3 డి. 4
80. ప్రతిపాదన ఎ: భారత జాతీయ కాంగ్రెస్ 1928, మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించింది.
కారణం ఆర్: బ్రిటన్‌లోని భారత వ్యవహారాల మంత్రి లార్డ్ బిర్కెన్ హెడ్ 1927లో బ్రిటిష్ ఎగువ సభలో మాట్లాడుతూ భారతీయులు అన్ని వర్గాలకు అమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా అని భారతీయులపై సవాలు విసిరాడు.
ఎ. ఎ, ఆర్ సరైనవే, ఆర్ ఎ కు సరైన వివరణ
బి. ఎ, ఆర్ సరైనవే, కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి. ఎ సరైనది, ఆర్ తప్పు
డి. ఎ తప్పు, ఆర్ సరైనది
81. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన కొందరు ప్రముఖులు వారి పార్టీలు/ప్రాతినిథ్యాలు సరిగా జత చేయండి.
1. అఖిల భారత హిందూ మహాసభ ఎ. హెచ్.సి. ముఖర్జీ
2. అఖిల భారత కార్మిక వర్గం బి. హెచ్.పి. మోదీ
3. మైనార్టీలు సి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఎం.ఆర్.జయకర్
4. పార్శీలు డి. బాబూ జగ్జీవన్‌రామ్
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
82. రాజ్యాంగ పరిషత్‌లో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు/నాయకురాలు ఎవరు?
ఎ. సుచేతా కృపలాని
బి. టంగుటూరి ప్రకాశం
సి. గాంధీజీ డి. దుర్గాబాయి దేశ్‌ముఖ్
83. రాజ్యాంగ సభ నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి కింది అంశాలను సరిగా జత చేయండి.
1. కామన్వెల్త్లో భారత్ సభ్యత్వ ధ్రువీకరణ ఎ. 1947, జనవరి 22
2. జాతీయ జెండా ఆమోదం బి. 1950, జనవరి 24
3. జాతీయ గీతం ఆమోదం సి. 1947, జూలై 22
4. ఆశయాల తీర్మానం ఏకగ్రీవ ఆమోదం డి. 1949, మే
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
84. ప్రతిపాదన ఎ: భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి దేశ తాత్కాలిక పార్లమెంటుగా మారింది.
కారణం ఆర్: 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించాల్సి వచ్చింది.
ఎ. ఎ, ఆర్ సరైనవే, ఆర్ ఎ కు సరైన వివరణ
బి. ఎ, ఆర్ సరైనవే, కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి. ఎ సరైనది, ఆర్ తప్పు
డి. ఎ తప్పు, ఆర్ సరైనది
85. ‘రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించొద్దు. అమలు పరిచేవారిని నిందించాలి’ అని అన్నది ఎవరు?
ఎ. మహాత్మా గాంధీ
బి. జవహర్లాల్ నెహ్రూ
సి. డా.బీఆర్ అంబేద్కర్
డి. వల్లభాయ్ పటేల్
86. కింది వాటిలో ఏది పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం?
ఎ. కార్యనిర్వాహక వర్గం న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది
బి. కార్యనిర్వాహక వర్గం శాసనసభకు బాధ్యత వహిస్తుంది
సి. న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహిస్తుంది
డి. శాసన సభ, కార్యనిర్వాహక వర్గానికి బాధ్యత వహిస్తుంది
87. సుప్రీంకోర్టు మౌలిక అధికార పరిధికి సంబంధించి సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. భారత ప్రభుత్వానికి ఒకటి లేదా అంతకు మించి రాష్ర్టాలకు మధ్య వివాదం
2. పార్లమెంటు ఉభయసభల్లో దేని ఎన్నికలకైనా లేదా రాష్ట్ర శాసన వ్యవస్థ ఎన్నికలకు సంబంధించిన వివాదం
3. భారత ప్రభుత్వానికి కేంద్రపాలిత ప్రాంతానికి మధ్య వివాదం
4. రెండు లేదా అంతకు మించిన రాష్ర్టాల మధ్య వివాదం
ఎ. 1, 2 బి. 2, 3
సి. 1, 4 డి. 3, 4
88. భారత రాజ్యాంగంలో కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య అధికారాల పంపిణీకి కింది ఏ చట్టంలోని పథకం ప్రాతిపదిక అయింది?
ఎ. మింటో మార్లే సంస్కరణలు-1909
బి. మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ చట్టం-1919
సి. భారత ప్రభుత్వ చట్టం -1935
డి. భారత స్వాతంత్య్ర చట్టం- 1947
89. భారత సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని కాపాడే నిబంధనలకు సంబంధించి సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?
1. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తొలగించగలడు
3. న్యాయమూర్తుల వేతనాలను, శాసన వ్యవస్థ ఆమోదం అవసరం లేని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు
4. భారత సుప్రీంకోర్టు అధికారాలు, సిబ్బంది నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాతే ప్రభుత్వం చేపడుతుంది
ఎ. 1, 3 బి. 3, 4
సి. 4 డి. 1, 2, 3, 4
సమాధానాలు
64. సి 65. డి 66. సి 67. ఎ
68. డి 69. బి 70. సి 71. డి
72. ఎ 73. డి 74. డి 75. బి
76. సి 77. ఎ 78. ఎ 79. సి
80. ఎ 81. ఎ 82. సి 83. బి
84. ఎ 85. సి 86. ఎ 87. సి
88. సి 89. ఎ
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్,
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?