Geography | పాంథాల్సా నుంచి పంచ మహా సముద్రాల వరకు
మహాసముద్రాలు
జలభాగం
- భూమిపై విశాలమైన ఉప్పునీటి భాగాలను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. ఇవి వివిధ ఆకృతుల్లో, పరిమాణాల్లో ఉంటాయి.
- మహాసముద్రాలు ఐదు – పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికా
- మహాసముద్రాల్లో పెద్దది – పసిఫిక్ ; చిన్నది – ఆర్కిటిక్ మహాసముద్రం
- అన్నివైపులా నీటితో ఆవరించిన చిన్న భూభాగాలను ద్వీపాలు అంటారు.
ఉదా : గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్ - మూడువైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగంతో కలిసి ఉన్నదాన్ని ద్వీపకల్పం అంటారు.
- సముద్రమట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొద్దీ 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
- భూమిపై భూభాగం కంటే జలభాగమే ఎక్కువ. సుమారు 71 శాతం భూ ఉపరితలం జలంతో కప్పి ఉంది.
- సూర్యకిరణాల్లో వేడి వల్ల సముద్రనీరు ఆవిరి అవుతుంది. ఇలా ఆవిరైన నీరు ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారుతాయి.
- మేఘాలు మరింత చల్లబడి వర్షం కురుస్తుంది. ఇలా నిరంతరం జరిగే ప్రక్రియనే ‘నీటి చక్రం’ అంటారు.
- మహాసముద్రాల్లో కొన్ని ప్రదేశాల్లో లోతైన గుంతలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని ప్రాంతాలే 10,000 మీటర్ల కంటే
లోతైనవి. హిమాలయాలు కూడా సముద్రాల్లో మునిగిపోయేంత గుంతలు ఉన్నాయి. - మహాసముద్రాల లోపల ఎత్తయిన పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ పర్వతశాఖలు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ
మహాసముద్రాల్లో వ్యాపించి ఉన్నాయి. - ఈ పర్వత శ్రేణుల మొత్తం పొడవు 65,000 కి.మీ. ఇవి భూమిపై అత్యంత పొడవైన పర్వత శ్రేణులు, కొన్ని పర్వతశిఖరాలు సముద్రం ఉపరితలంపైకి వ్యాపించి దీవులుగా ఏర్పడ్డాయి.
- మహాసముద్ర జలం అనేక లవణాల మిశ్రమం. సముద్రాల్లో అత్యధికంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. సాధారణంగా సముద్ర జలంలో 96 శాతం నీరు ఉంటే 4 శాతం లవణాలు, ఇతర కరగని ఘన పదార్థాలుంటాయి.
- నదుల్లో నీరు కంటే సముద్రనీరు ఎక్కువ సాంద్రతతో ఉంటుంది.
- భూమిపై సుమారు 71 శాతం భూ ఉపరితలం సముద్రాలు, మహాసముద్రాలతో నిండి ఉంది.
- భూగ్రహంపై గల మొత్తం నీటిలో మానవులకు ఉపయోగపడే విధంగా ఉన్న నీటి శాతం 1 శాతం.
- భూగోళంపై ఉన్న మొత్తం నీటిలో మహాసముద్రాల్లో 97.25 శాతం ఉప్పు నీరుగా ఉంది. 2.75 శాతం మాత్రమే మంచినీరు.
- భూమి మీద గల మంచి నీటిలో ఆర్కిటిక్, అంటార్కిటిక్ పర్వతాల్లో శాశ్వత మంచుగడ్డలుగా ఉన్న నీరు 69.56 శాతం. మంచినీరు భూగర్భజల శాతం 30.1 శాతం.
- భూమి మీద గల మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉన్న మంచినీరు 0.34 శాతం
మహా సముద్రాలు
- కోట్లాది సంవత్సరాల క్రితం ఈ మహాసముద్రాలన్నీ ఒకే మహాసముద్రంగా ఉండేవి. దాన్ని ‘పాంథాల్సా’ అన్నారు.
- బ్రిటిష్ ఓడ చాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం ప్రారంభమయ్యింది.
- మహాసముద్రాల ఉపరితలం నాలుగు భాగాలుగా విభజించారు.
మహాసముద్ర ఉపరితలం : ఖండతీరపు అంచు లోతు – 200 మీ. వరకు
సముద్రభూతలంలోవిస్తీర్ణం – 7.6 శాతం
ప్రత్యేకతలు : భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం. అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. దీని వెడల్పు 1500 కి.మీ. ఖండపు అంచు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 1. ఇక్కడ మత్స్య సంపద చాలా ఎక్కువ 2. ఇక్కడ ముడిచమురు, సహజ వాయువులు దొరుకుతాయి. 3. ఇక్కడ ఓడరేవులను నిర్మించవచ్చు.
మహాసముద్ర ఉపరితలం : ఖండతీరపు వాలు
లోతు – 200 మీ. – 3000 మీ.
సముద్రభూతలంలో విస్తీర్ణం – 15 శాతం
ప్రత్యేకతలు : ఖండతీరపు వాలు సరిహద్దు ఖండాలను సూచిస్తుంది. హిమానీనదాలు, నీటి కోతతో ఏర్పడిన కాన్యాన్లు ఈ ప్రాంతంలో ఉంటాయి.
మహాసముద్ర ఉపరితలం : మహాసముద్ర మైదానాలు
లోతు – 3000 మీ. – 6000 మీ.
సముద్రభూతలంలోవిస్తీర్ణం – 76.2 శాతం
ప్రత్యేకతలు : ఇవి చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ప్రపంచలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే
ప్రాంతమిది. భూమి ఉపరితలంపై ఉన్న అనేక స్వరూపాలు దీనిపై ఉంటాయి.
మహాసముద్ర ఉపరితలం : మహాసముద్ర అగాధాలు
లోతు – 6000 మీ. వరకు
ప్రత్యేకతలు : ఇవి సముద్రపు మధ్య లేదా ఖండాలకు సమీపంలో ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ఇప్పటివరకు 57 అగాధాలను అధ్యయనం చేశారు. - ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతలను సమలోతు గీతలు (ఐసోబాత్స్) అంటారు.
- అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో పొడవైన పర్వత శ్రేణులున్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కి.మీ.
- మహాసముద్రాలు సాధారణంగా 3 నుంచి 6 కి.మీ. లోతులో ఉంటాయి.
- అన్ని వైపులా నీటితో ఆవరించిన భూభాగాలను ద్వీపాలు అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్బ్రిటన్, మూడువైపులా నీరు ఉండి, ఒక వైపు భూభాగం కలిసి ఉన్న దాన్ని ద్వీపకల్పం అంటారు.
సముద్రాల లవణీయత
- సముద్రాల్లో అధికశాతం ఉప్పు నేల నుంచి వచ్చింది.
- మహాసముద్రాల నీటిలోకి ఉప్పు కింది విధాలుగా వస్తుంది. 1. సోడియం క్లోరైడ్ ఉన్న కొండలపై నుంచి వర్షం, వాగులు, నదులు ప్రవహించి సముద్రంలో కలవడం వల్ల 2. అగ్ని పర్వతాల నుంచి 3. జల – ఉష్ణదారుల నుంచి వస్తుంది
- సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాలు పరిమాణాన్ని లవణీయత అంటారు.
- లవణీయత 1000 గ్రాముల నీటిలో ఎంత ఉప్పు కరిగి ఉందో ఇది సూచిస్తుంది. దీన్ని సాధారణంగా ‘వెయ్యిలో ఎంత మోతాదు’ parts per thousand – PPT (%)గా వ్యక్తపరుస్తారు.
- సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35 శాతం సముద్రపు నీటిలో కరిగి ఉన్న మొత్తం ఖనిజాల్లో ఉప్పు శాతం – 77.8 శాతం
లవణీయత ఆధారంగా నీరు రకాలు
నీరు : అధిక లవణీయత నీరు
లవణీయత : 30-50 శాతం
సముద్రం/జలాశయం : సముద్రపునీరు, ఉప్పునీటి సరస్సు
నీరు : ఉప్పు నీరు
లవణీయత : 5-30 శాతం
సముద్రం/జలాశయం : నదీముఖ ద్వారం, చిత్తడి భూములు, మడ అడవులు
నీరు : స్వచ్ఛమైన నీరు
లవణీయత : 0.5 శాతం
సముద్రం/జలాశయం : చెరువులు, సరస్సులు, నదులు
Previous article
Indian Polity | సమర్థులతో కమిటీలు.. పరిపాలనలో పర్యవేక్షణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు