Polity | ఏ నిబంధన ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను ఎన్నుకుంటారు?
1. ఎన్నికల ప్రక్రియలో సరికానిది?
1) గ్రామ పంచాయతీ స్థాయిలో బహుళ ప్రయోజక పౌరసత్వ గుర్తింపు కార్డులు జారీ చేయాలి
2) హత్య, హత్యాచారం, దోపిడీ, స్మగ్లింగ్ వంటి ఘాతుకాలకు పాల్పడినవారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు
3) రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల కమిషన్‌కు చూపించాలి
4) స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేసేలా ప్రోత్సహించరాదు
2. రాజకీయ పార్టీలకు సంబంధించి సరైనది?
1) రాజ్యాంగం పట్ల విధేయతతో ఉంటామని ప్రకటించాలి
2) మహిళలకు 30 శాతం రిజర్వేషన్ స్థానాలను కేటాయించాలి
3) వ్యయం ఆదాయాల అకౌంట్లను నిర్వహించాలి.
4) పైవన్నీ సరైనవే
3. రాజకీయ పార్టీలకు సంబంధించి సరికానిది?
1) ఉమ్మడి చిహ్నం పొందేందుకు జాతీయ పార్టీ హోదా పొంది ఉండాలి
2) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే సభలో 20 మంది సభ్యుల మద్దతు ఉండాలి
3) ప్రత్యామ్నాయ నాయకుడి పేరును సూచించనవసరం లేదు
4) రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ సూచనలను పాటించాలి
4. కార్యనిర్వాహక శాఖకు, పరిపాలనకు సంబంధించి సరికానిది?
1) అభివృద్ధి ప్రణాళికలో జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించాలి
2) పటిష్టమైన సహకార సంబంధాలు ప్రభుత్వ సంస్థల మధ్య ఉండాలి.
3) కేంద్ర నిఘా కమిషన్ బిల్లును చట్టంగా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి
4) బదిలీ పదోన్నతి అంశాలను రాజ్యాంగంలో చేర్చలేదు
5. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సరైనది?
1) అంతర్రాష్ట్ర మండలి రాష్ర్టాలతో సంప్రదింపులు జరపాలి
2) 256, 257, 355 అధికరణలను చివరి పరిష్కారంగా ఉపయోగించాలి
3) అత్యంత చివరిగా 356 అధికరణను వినియోగించాలి
4) పైవన్నీ
6. ప్రణాళికా సంఘం దేని ద్వారా స్థాపించారు?
1) రాజ్యాంగం
2) పార్లమెంటు చట్టం
3) కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు
4) సుప్రీంకోర్టు ఉత్తర్వు
7. జాతీయాభివృద్ధి మండలి….
1) 1952లో ఏర్పాటు
2) అత్యున్నతమైన విధాన నిర్ణయాత్మక మండలి
3) ప్రధానమంత్రి హోదారీత్యా అధ్యక్షుడిగా ఉంటారు
4) పైవన్నీ
8. జాతీయ సమగ్రత మండలి…?
1) 1962లో ఏర్పాటు చేశారు
2) 1990లో పునర్వ్యవస్థీకరించారు
3) ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు
4) పైవన్నీ సరైనవే
9. జాతీయ సలహా మండలి…?
1) 2004లో ఏర్పాటు
2) సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు
3) ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని ప్రతిపాదన చేసింది
4) పైవన్నీ
10. నీతి ఆయోగ్‌కు సంబంధించి సరైనది?
1) ప్రణాళికా సంఘం స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు
2) 2015, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది
3) ఒక డిప్యూటీ చైర్మన్, ఇతర సభ్యులు ఉంటారు
4) పైవన్నీ
11. నీతి ఆయోగ్ అంటే?
1) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
2) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పరెంట్ ఇండియా
3) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నలాజికల్ ఇండియా
4) పైవన్నీ
12. నీతి ఆయోగ్‌కు గల మరొక పేరు?
1) విధాన రూపకల్పన సంఘం
2) మేధో కేంద్రం
3) సహకార సమాఖ్య
4) టీమ్ ఇండియా హబ్
13. నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2015 ఏప్రిల్ 1
2) 2015 జనవరి 1
3) 2014 ఏప్రిల్ 1
4) 2015 ఆగస్టు 15
14. కింది వాటిలో సరైనది?
1) కేంద్ర సమాచార కమిషన్ చట్టబద్ద సంస్థ
2) కేంద్ర సమాచార కమిషన్ రాజ్యాంగ సంస్థ
3) కేంద్ర సమాచార కమిషన్ రాజ్యాంగేతర చట్టేతర సంస్థ
4) పైవేవీ కావు
15. సమాచార హక్కు?
1) రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ప్రస్తావించింది
2) పరోక్షంగా ప్రస్తావించింది
3) సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఆపాదించింది
4) 2, 3
16. రాష్ట్ర సమాచార కమిషన్‌కు సంబంధించి సరైనది?
1) 2005లో ఏర్పాటు
2) 10 మంది ఇతర కమిషనర్లు ఉంటారు
3) వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు
4) పైవన్నీ
17. కేంద్ర సమాచార కమిషన్ ఏ మంత్రిత్వశాఖ కిందకు వస్తుంది?
1) న్యాయ మంత్రిత్వ శాఖ
2) హోం మంత్రిత్వ శాఖ
3) సిబ్బంది మంత్రిత్వ శాఖ
4) సమాచార మంత్రిత్వ శాఖ
18. కింది రాజ్యాంగ ప్రకరణలో సరైనది?
1) మొదటి ప్రకరణ దేశం పేరు భూభాగాన్ని తెలుపుతుంది
2) మూడో ప్రకరణ నూతన రాష్ర్టాల ఏర్పాటు రాష్ట్ర సరిహద్దుల సవరణ
3) ఐదో ప్రకరణ నుంచి 11వ ప్రకరణ వరకు పౌరసత్వం గురించి తెలుపుతుంది
4) పై వాక్యాలన్నీ సరైనవే
19. కింది వాటిలో సరైనది?
1) 12వ ప్రకరణ రాజ్యం నిర్వచనం
2) 14వ ప్రకరణ చట్టం ముందు అందరూ సమానులే
3) 15వ ప్రకరణ కుల, మత, లింగ, వర్గ వివక్ష నిషేధం
4) పై వాక్యాలన్నీ సరైనవే
20. కింది నిబంధనల్లో సరైనది?
1) 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు
2) 16వ నిబంధన ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికి సమాన ఉద్యోగ అవకాశాలను కల్పించడం
3) 17వ నిబంధన అంటరానితనం నిషేధం
4) పైవన్నీ సరైనవే
21. కింది ప్రకరణల్లో సరికానిది?
1) 21వ ప్రకరణ వ్యక్తికి స్వేచ్ఛ, జీవించే హక్కును కల్పించడం
2) 21(A) ప్రకరణ-విద్యా హక్కును తెలుపుతుంది
3) 23వ ప్రకరణ నిర్బంధం నుంచి విముక్తి
4) 24వ ప్రకరణ- 14 సంవత్సరాల్లోపు పిల్లలను ఎలాంటి పనిలో వినియోగించరాదు
22. కింది వాటిలో సరికానిది?
1) 25వ నిబంధన నుంచి 28వ నిబంధన వరకు మత స్వేచ్ఛ గురించి పేర్కొన్నారు
2) 29వ నిబంధన అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ
3) 30వ నిబంధన విద్యాలయాలను స్థాపించి అల్పసంఖ్యాక వర్గాల సంరక్షణ
4) 32వ నిబంధన ఆస్తిహక్కు
23. కింది వాటిలో సరైనది?
1) 36-51వ నిబంధన వరకు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పేర్కొన్నారు
2) 40వ నిబంధన గ్రామ పంచాయతీల ఏర్పాటు
3) 44వ నిబంధన పౌరులందరికి ఉమ్మడి పౌరస్మృతి
4) పైవన్నీ సరైనవే
24. కింది వాటిలో సరికానిది?
1) 51వ నిబంధన అంతర్జాతీయ శాంతి సంరక్షణ
2) 48 B నిబంధన సహకార సంఘాల ఏర్పాటు
3) 48వ నిబంధన – బలహీన వర్గాల వారికోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం
4) పైవన్నీ సరైనవే
25. కింది వాటిలో సరైనది?
1) 55వ నిబంధన రాష్ట్రపతి ఎన్నిక విధానం
2) 58వ నిబంధన రాష్ట్రపతి పదవికి అర్హతలు
3) 61వ నిబంధన రాష్ట్రపతిని తొలగించే విధానం అయిన మహాభియోగ నిష్క్రమణ
4) పైవన్నీ సరైనవే
26. కింది ప్రకరణల్లో సరైనది.
1) 63వ నిబంధన ఉపరాష్ట్రపతి ఎన్నిక
2) 70వ నిబంధన ప్రత్యేక పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను నిర్వహించుట
3) 74వ నిబంధన కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం
4) పైవన్నీ సరైనవే
27. ఏ నిబంధన ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను ఎన్నుకుంటారు?
1) ప్రకరణ 76 2) ప్రకరణ 78
3) ప్రకరణ 125 4) ప్రకరణ 126
28. కింది వాటిలో సరైనది?
1) 78వ నిబంధన-రాష్ట్రపతికి అన్ని విషయాలను తెలియజేయుట ప్రధానమంత్రి బాధ్యత
2) 79వ నిబంధన పార్లమెంట్ గురించి తెలుపుతుంది
3) 80వ నిబంధన రాజ్యసభ నిర్మాణం గురించి తెలుపుతుంది
4) పైవన్నీ సరైనవే
29. కింది వాటిలో సరికానిది?
1) 81వ నిబంధన లోక్‌సభ నిర్మాణం
2) 87వ నిబంధన ఉపరాష్ట్రపతి ప్రసంగం
3)89వ నిబంధన రాజ్యసభ అధ్యక్ష, ఉపాధ్యక్షుల గురించి తెలుపుతుంది.
4) 95వ నిబంధన ఉపసభాధిపతిగా వ్యవహరించే సందర్భం తెలుపుతుంది.
30. లోక్‌సభ, రాజ్యసభ కోరం, ఓటింగ్ విధానాన్ని తెలిపే నిబంధన?
1) 100వ ప్రకరణ
2) 102వ ప్రకరణ
3) 108వ ప్రకరణ
4) 104వ ప్రకరణ
31. 74. కింది వాటిలో సరైనది?
1) 103వ నిబంధన పార్లమెంటు సభ్యుల అనర్హతలు
2) 105వ నిబంధన పార్లమెంటు, పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ కమిటీల హక్కులు, అధికారాలను తెలుపుతుంది.
3) 111 నిబంధన బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
4) పైవన్నీ సరైనవే
32. కింది వాటిలో సరైనది.
1) 109వ నిబంధన ద్రవ్యబిల్లు ఆమోదంలో లోక్‌సభదే అంతిమ నిర్ణయం
2) 110వ నిబంధన ద్రవ్య బిల్లులను గురించి తెలుపుతుంది
3) 113వ నిబంధన వార్షిక ఆర్థిక నివేధిక
4) పైవన్నీ
33. కింది వాటిలో సరికానిది?
1) 117వ నిబంధన ద్రవ్యబిల్లులకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనల గురించి తెలుపును
2) 123వ నిబంధన రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లను జారీ చేస్తుంది
3) 129వ నిబంధన – సుప్రీంకోర్టు నిర్మాణం
4) 129వ నిబంధన – సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా పనిచేయడం
34. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలిపే ప్రకరణ
1) 146వ ప్రకరణ
2) 148వ ప్రకరణ
3) 143వ ప్రకరణ
4) 141వ ప్రకరణ
35. కింది వాటిలో సరైనది ఏది?
1) 153వ నిబంధన రాష్ట్ర గవర్నర్ల నియామకం
2) 165వ నిబంధన రాష్ట్ర అత్యున్నత న్యాయ అధికారి అయిన అడ్వకేట్
జనరల్ నియామకం
3) 178వ నిబంధన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి తెలుపుతుంది
4) పైవన్నీ సరైనవే
36. కింది వాటిలో సరైనది?
1. 182వ నిబంధన -శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
2) 190వ నిబంధన -రాష్ట్ర శాసనసభల్లో ఖాళీలు
3) 191వ నిబంధన శాసనసభ సభ్యత్వం కోల్పోవుట
4) పైవన్నీ సరైనవే
37. కింది వాటిలో సరైనది?
1) 213వ నిబంధన గవర్నర్‌కు ఆర్డినెన్స్‌లను జారీ చేసే అధికారం ఉంటుంది
2) 214వ నిబంధన హైకోర్టుల ఏర్పాటు గురించి తెలుపుతుంది
3) 215వ నిబంధన హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా పనిచేస్తుంది
4) పైవన్నీ సరైనవే
38. ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు న్యాయమూర్తులను బదిలీచేసే విధానాన్ని గురించి తెలిపే నిబంధన?
1) 220వ ప్రకరణ
2) 222వ ప్రకరణ
3) 221వ ప్రకరణ
4) 225వ ప్రకరణ
39. కింది ప్రకరణల్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి సరైనది?
1) 239వ ప్రకరణ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనను గురించి తెలుపుతుంది
2) 239AAవ ప్రకరణ ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తిని తెలుపుతుంది.
3) 239Aవ ప్రకరణ పాండిచ్చేరి కేంద్రపాలిత శాసనసభ
4) పైవన్నీ సరైనవే
సమాధానాలు
1- 2 2-4 3-3 4-4
5-4 6-3 7-4 8-4
9-4 10-4 11-1 12-1
13-2 14-1 15-4 16-4
17-3 18-4 19-4 20-4
21-3 22-4 23-4 24-3
25-4 26-4 27-1 28-4
29-2 30-1 31-4 32-4
33-3 34-2 35-4 36-4
37-4 38-2 39-4
ఆంజనేయులు
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు