Polity | పరిపాలనపై నియంత్రణ.. ప్రభుత్వానికి ప్రాతినిథ్యం
పట్టణ స్థానిక సంస్థలు, నిర్మాణం
- 1992లో 74వ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
1. మొదటి అంచె- నగర పంచాయతీ
2. రెండో అంచె- పురపాలక సంస్థలు
3. మూడో అంచె- నగరపాలక సంస్థలు నగర పంచాయతీలు - గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణీకరణ దిశగా మారుతున్న సుమారు 20,000 నుంచి 40,000 వరకు జనాభాగల చిన్న పట్టణ ప్రాంతాలకు నగర పంచాయతీ హోదాను కల్పిస్తారు.
- నగర పంచాయతీని జనాభా మేరకు వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఓటర్లచేత నేరుగా ఎన్నుకోబడతాడు.
- నగర పంచాయతీలో గరిష్ఠంగా 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు.
- నగర పంచాయతీలో నివాసమున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోదారీత్యా సభ్యులుగా ఉంటారు.
- నగర పంచాయతీ సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఉపసర్పంచి వలె వీరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.
పురపాలక సంస్థలు - 1965లో సమగ్ర పురపాలక సంస్థల చట్టం ప్రకారం మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం 1994లో కొత్త చట్టాన్ని రూపొందించింది.
గమనిక: తెలంగాణ ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టాన్ని 2019లో ప్రత్యేకంగా రూపొందించింది. పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండొద్దనే పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 2021లో రద్దు చేసింది. - 40,000 నుంచి 3,00,000 జనాభా ఉన్న పట్టణాల్లో పురపాలక సంస్థలు ఏర్పాటు చేస్తారు. పురపాలక సంస్థల వార్షిక ఆదాయం, పరిమాణం ఆధారంగా వీటిని ఐదు రకాలుగా వర్గీకరించారు.
1. సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం – వార్షిక ఆదాయం ఎనిమిది కోట్ల రూపాయలపైబడి ఉన్నవి.
2. స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘం- వార్షిక ఆదాయం ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల మధ్య ఉన్నవి.
3. గ్రేడ్-1 పురపాలక సంఘం- వార్షిక ఆదాయం నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయల మధ్య ఉన్నవి.
4. గ్రేడ్-2 పురపాలక సంఘం- వార్షిక ఆదాయం రెండు నుంచి నాలుగు కోట్ల మధ్య ఉన్నవి.
5. గ్రేడ్-3 పురపాలక సంఘం- వార్షిక ఆదాయం ఒకటి నుంచి రెండు కోట్ల రూపాయల లోపు ఉన్నవి.
సూచన: పై వర్గీకరణను ప్రభుత్వం కాలానుగుణంగా మార్చవచ్చు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మార్పులు ప్రతిపాదించాయి.
నిర్మాణం - గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు.
- చిన్న పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.
- పెద్ద పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు.
- ఒక ప్రాంతం పరివర్తన చెందుతున్న ప్రాంతం అని, చిన్న పట్టణం, పెద్ద పట్టణం గురించి రాష్ట్ర గవర్నర్ సరైన అర్థ వివరణ ఇస్తారు.
- ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి.
పురపాలక మండలి
- పురపాలక సంస్థ చర్చా వేదికే పురపాలక మండలి. దీనిలో ఎన్నికైన సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు.
మున్సిపల్ కౌన్సిలర్లు - ఎన్నికయ్యే సభ్యులను రిజిస్టర్డు ఓటర్లు వార్డు ప్రాతిపదికన ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్లు అంటారు. జనాభాను బట్టి వీరి సంఖ్య నిర్ణయిస్తారు.
- 40 వేల వరకు జనాభా ఉంటే 21 మంది కౌన్సిలర్లు
- 40 వేల నుంచి లక్ష వరకు ఉంటే 21 మంది సభ్యులు, ప్రతి 10 వేల జనాభాకు ఒక సభ్యుడు అదనంగా ఉంటాడు.
- లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటే 27 మంది సభ్యులు, ప్రతి 15 వేల అదనపు జనాభాకు ఒక సభ్యుడు ఉంటాడు.
- రెండు లక్షల పైబడి ఉంటే 33 మంది సభ్యులు, ప్రతి 20 వేల అదనపు జనాభాకు ఒక అదనపు సభ్యుడు ఉండవచ్చు. అయితే గరిష్ఠంగా 45 మంది సభ్యులకు మించొద్దు.
కో ఆప్టెడ్ సభ్యులు - పట్టణ స్థానిక సంస్థల్లో విశిష్ట అనుభవం ఉన్న వ్యక్తులను, అలాగే మైనారిటీ వర్గానికి చెందిన సభ్యులను కో ఆప్టెడ్ సభ్యులుగా నియమిస్తారు.
హోదారీత్యా సభ్యులు - ఎక్స్ అఫీషియో సభ్యులుగా జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, పురపాలక సంస్థ పరిధిలోని లోక్‌సభ, విధానసభ సభ్యులు తమ అధికార హోదాలో భాగంగా సభ్యులుగా కొనసాగుతారు.
- మండలి సాధారణంగా నెలకొకసారి సమావేశమవుతుంది.
- మండలి సమావేశ ఎజెండాను మున్సిపల్ చైర్మన్‌తో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ రూపొందిస్తారు.
- పురపాలక మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయి.
మున్సిపల్ చైర్మన్
- మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో పరోక్షంగా ఎన్నిక అవుతున్నారు.
- వీరు పార్టీ ప్రాతిపదికపైన ఎన్నికవుతారు.
- పురపాలక సంస్థ ప్రథమ పౌరుడు
- ఇతను మండలిలోని కొన్ని స్థాయీ సంఘాలకు అధ్యక్షత వహిస్తారు.
- వైస్ చైర్మన్ కూడా పరోక్షంగా ఎన్నికవుతారు.
మున్సిపల్ కమిషనర్
- పురపాలక సంస్థ పరిపాలనాధిపతే మున్సిపల్ కమిషనర్.
- పురపాలక మండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.
- సమావేశాల అజెండాను చైర్మన్‌తో సంప్రదించి రూపొందిస్తాడు.
- మండలి సమావేశాలకు ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో పాల్గొంటాడు.
- మండలి తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలు చేస్తాడు.
- మండలి తీర్మానాలను మూడు రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టర్‌కు, పురపాలక పాలన ప్రాంతీయ డైరెక్టర్‌కు పంపిస్తాడు.
- వార్షిక బడ్జెన్‌ను రూపొందిస్తాడు.
- సంస్థకు సంబంధించిన పన్నులను వసూలు చేసి, రికార్డులను నిర్వహిస్తాడు.
- సంస్థకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, కార్యకలాపాలపై నియంత్రణ చేస్తాడు.
స్థాయీ సంఘాలు - ప్రతి పురపాలక సంస్థలో కొన్ని స్థాయీ సంఘాలుంటాయి. అవి..
1. విత్తం, 2. పనులు, 3. ఆరోగ్యం, 4. విద్య, 5. మహిళా సంక్షేమం, 6. వెనుకబడిన వర్గాల సంక్షేమం
పురపాలక సంస్థ విధులు - పురపాలక సంస్థ విధులు రెండు రకాలు
1. ఆవశ్యక విధులు - జనన, మరణ రిజిస్టర్లను నిర్వహించటం
- ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ పాఠశాలలను నిర్వహించడం
- పౌరులకు పరిశుభ్రమైన నీరు, వీధి దీపాలను ఏర్పాటు చేయడం
- ప్రజారోగ్యం, పరిశుభ్రతలను నిర్వహించడం
- రహదారులు, భవనాలను నిర్వహించడం
- సంస్థ ఆస్తులను సంరక్షించడం
2. వివేచనాత్మక విధులు - అనారోగ్య, అపరిశుభ్ర ప్రదేశాలను బాగుచేసి నిర్వహించడం
- పార్కులు, మ్యూజియంలు, విశ్రాంతి గృహాలు, లైబ్రరీలను నిర్వహించడం
- మాతా, శిశు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం
- ప్రసూతి కేంద్రాలను నిర్వహించడం ఆదాయ మార్గాలు
- పన్నులు, ఫీజులు, డ్యూటీలు
- మార్కెట్లు, భవనాల నిర్వహణ ద్వారా సమకూరే ఆదాయం
- బహిరంగ రుణాలు, ప్రజలు అందించే విరాళాలు
నగర పాలక సంస్థ
- పట్టణ జనాభా 3 లక్షలకు మించి ఉండి, ఆదాయం కోటి రూపాయల కంటే ఎక్కువగా ఉంటే నగర పాలక సంస్థను ఏర్పాటు చేస్తారు. దేశంలో మొదటిసారిగా 1687లో మద్రాస్ నగరానికి కార్పొరేషన్ హోదాను కల్పించారు.
- 1950లో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల చట్టం ప్రకారం హైదరాబాద్ నగరానికి, సికింద్రాబాద్ నగరానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
- 1955లో చట్టం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లను ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేశారు. అది 1960 నుంచి అమల్లోకి వచ్చింది.
నగరపాలక సంస్థలో కింది విభాగాలుంటాయి
1. నగర పాలక మండలి
2. మేయర్, డిప్యూటీ మేయర్
3. కమిషనర్
4. స్థాయీ సంఘాలు
నగరపాలక మండలి-కార్పొరేటర్లు
- నగర పాలక సంస్థ చర్చా సంబంధమైన అంగమే నగర పాలక మండలి. ఇందులో కార్పొరేషన్లను వార్డుల ప్రాతిపదికపైన, నగర పాలక పరిధిలో రిజిస్టరైన ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు.
హోదా రీత్యా సభ్యులు - నగరపాలక పరిధిలోని శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు తమ పదవీ రీత్యా నగర పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు.
- నగర పాలక మండలికి మేయర్ అధ్యక్షత వహిస్తాడు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పరోక్షంగా జరిగితే ఆ ఎన్నికలో హోదారీత్యా సభ్యులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పాల్గొనవచ్చు.
మేయర్, డిప్యూటీ మేయర్ - నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడే మేయర్. నగర పాలక సంస్థకు ఇతడు రాజకీయ అధిపతి. ప్రస్తుతం తెలంగాణలో, ఏపీలో మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్షంగా ఎన్నికవుతారు. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపైన జరుగుతాయి.
- వీరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు లేదా అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశం ద్వారా కూడా తొలగించవచ్చు.
కమిషనర్ - నగర పాలక సంస్థ పరిపాలన అధిపతే కమిషనర్. ఇతడు ఐఏఎస్ క్యాడర్‌కు చెంది ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.
- నగర పాలక వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహిస్తాడు. నగర పాలక సంస్థకు సంబంధించి సిబ్బంది, ఆస్తులు, కార్యకలాపాలపైన పరిపాలనా నియంత్రణ అధికారాన్ని చెలాయిస్తాడు.
స్థాయీ సంఘాలు - స్థాయీ సంఘాలు నగర పాలక సంస్థకు సలహా సంస్థలుగా వ్యవహరిస్తాయి. నగర పాలక సంస్థ దైనందిన కార్యకలాపాలతో స్థాయీ సంఘాలకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.
ఆదాయ వనరులు
- ఇవి నగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్‌ను పరిశీలిస్తాయి. నగర పాలక సంస్థ సమర్థంగా పని చేసేందుకు విలువైన సలహాలు ఇస్తాయి.
- 12వ షెడ్యూల్లో పేర్కొన్న విధులను నిర్వర్తిస్తాయి.
- స్థానిక పన్నులు ముఖ్యంగా ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వినోద పన్ను, ప్రకటనల పన్ను ఇతర ఫీజులు, రుసుములు వసూలు చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక గ్రాంట్లు కూడా అందిస్తాయి. మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీ ప్రకరణ 243ZE
- దీనికి రాజ్యాంగబద్ధత ఉంది. ప్రతి మెట్రోపాలిటన్ ప్రాంతాలకు ఒక మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయాలి.
- ఇది మెట్రో పాలిటన్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి అవసరమైన ముసాయిదా ప్రణాళికలను రూపొందిస్తుంది.
- రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ప్రకారం దీని నిర్మాణానికి సంబంధించిన అంశాలను రూపొందిస్తుంది.
నిర్మాణం
- ప్రణాళిక కమిటీ మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులను, మెట్రో పాలిటన్ ప్రాంత పరిధిలో ఎన్నికైన మున్సిపాలిటీ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో మొత్తం 24 మంది సభ్యులు ఉంటారు.
- నగర కార్పొరేషన్ మేయర్ చైర్మన్‌గా, మున్సిపల్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులను నియమిస్తుంది.
- నగర పరిధిలోని కార్పొరేటర్లు 18 మంది సభ్యులను ఎన్నుకుంటారు.
- ఈ కమిటీ రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను మెట్రోపాలిటన్ కమిటీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాడు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు